నిరుపేదలకు వైద్యం అందని ద్రాక్షేనా?

  నిరుపేదలకు వైద్యం అందని ద్రాక్షేనా?

health services
health services

నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారిలో 70 శాతం మందికి సరైన వైద్యసదుపాయాలు అందుబాటులో లేక ప్రాణాంతక వ్యాధుల వల్ల మరణిస్తున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. ప్రభుత్వ వైద్యశాలల్లో కాని, ప్రైవేట్‌ ఆస్పత్రు ల్లో కాని గ్రామీణ ప్రజలకు లభిస్తున్న సేవలు అత్యంత అధమ స్థాయిలో ఉన్నాయని చెప్పవచ్చు. సరైన పోషకాహారం, పారి శుద్ధ్యం, వ్యాధినిరోధకం, టీకామందులు, ప్రాథమిక వైద్య సహా యం వంటి కనీస ఆరోగ్య అవసరాలను కూడా కల్పించలేక ప్రభు త్వాలు నిస్సహాయంగా మిగిలిపోతున్నాయి.

గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యపరిరక్షణ పట్ల అవగాహన చాలా తక్కువ. అశాస్త్రీయ పద్ధతులలో తమకు అందుబాటులోఉన్న నాటువైద్యా నికే ఎక్కువ మొగ్గుచూపుతుంటారు. దీనికి కారణం గ్రామాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, మందుల సదుపాయాలు లేకపోబట్టే. అంతర్జాల యుగంలో కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నేటికీ వైద్యులు ఉండటానికి వసతి, రక్షితనీరు, విద్యుత్‌ వంటి సదుపా యాలు కల్పించలేకపోవడం, ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిలువటద్దం.

మౌలిక వసతులు లేక అనేక ప్రాథమిక కేంద్రాలు పశువ్ఞల కొట్టా లుగా మారుతున్నాయి. దీనితో ఎక్కువ శాతం గ్రామీణ ప్రజలు ఏ చదువ్ఞలేని నాటు వైద్యులు, ఆర్‌.ఎమ్‌.పిలమని చెప్పుకునే నకిలీ డాక్టర్లను ఆశ్రయిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రమాణాల ప్రకా రం ప్రతి వెయ్యి మందికి ఒక డాక్టరు ఉండాలి. కాని మన దేశంలో ప్రతి 11వేల మందికి ఒక డాక్టరున్నాడు. గ్రామీణ ప్రాం తాల్లో ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంది.

ఈ నకిలీ డాక్టర్‌ ప్రభా వం వల్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆశ్రయించేవారి సంఖ్య కూడా రోజురోజుకూ తగ్గుతోంది. ప్రాథమిక కేంద్రాల్లో అర్హతగల వైద్యులు లేకపోవడం, ఉన్నా ఒకరిద్దరూ విధులకు గైర్హాజరవటం, నర్సులు, కాంపౌండర్ల వంటి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించ డం, మందులు, మౌలిక వసతులు లేకపోవడం వంటి అనేక సమస్యలతో సతమతమవ్ఞతు న్నాయి. ఇదే అదనుగా చేసుకుని నకిలీ వైద్యులు మిడిమిడిజ్ఞానం తో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.

ఉత్తుత్తి ఇంజక్షన్లు, నకిలీ మందులు, అవసరం లేకున్నా శస్త్రచికిత్సలు వంటి వాటితో అనైతిక వ్యాపారం కొనసాగి స్తున్నారు. వీరి ఆగడాలను అరికట్టడానికి వైద్యవిధాన మండలి వంటి నియంత్రణా సంస్థలు ఏమాత్రం చర్యలు చేపట్టడం లేదు. చట్టాలు కూడా వీరి అనైతిక వ్యాపారానికి అడ్డుకట్ట వేయలేకపో తుంది. కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఖరీదైన వైద్యాన్ని భరించలేని గ్రామీణ ప్రజల నిస్సహాయత వీరికి వరంగా మారుతోంది. 1946లో నియమింపబడిన భోర్‌ కమిటీ నివేదిక ప్రకారం వ్యాధి నిరోధక, నివారణ సేవలను సమ్మిళితం చేసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పటిష్టం చేయాలని తెలిపింది.

కాని ఈ దిశగా ఏ అభివృద్ధి జరగలేదనే చెప్పవచ్చు. 2017లో జాతీయ ఆరోగ్య విధానం ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యపరిరక్షణ కోసం పెట్టే ఖర్చు నానాటికీ పెరుగుతోందని తెలిపింది. ప్రజారోగ్య పరిరక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించింది. కేవలం ప్రణాళికలన్నీ కాగితాలకే పరిమితమవ్ఞతున్నాయి.కాని ఆచరణలో మాత్రం శూన్యం. అభివృద్ధి చెందిన దేశాలలో ప్రజారోగ్యంపై పెద్ద ఎత్తున నిధులు ఖర్చుపెడుతున్నాయి. అమెరికా తన జిడిపిలో 17శాతం నిధులు ప్రజారోగ్యంపై ఖర్చుపెడుతున్నాయి. మనదేశం కేవలం జిడిపిలో మూడు శాతం నిధులు మాత్రమే ఖర్చుచేస్తోంది.

కనీసం ఐదు శాతం నిధులు కేటాయిస్తే తప్ప ప్రభుత్వ వైద్యశాలల్లో మౌలికసదుపాయాలను కల్పించలేం. ఇప్పటికే ఎన్నో ప్రభుత్వవైద్యశాలల్లో రోగులకు మంచాలు లేక, ఒకే మంచాన్ని ఇద్దరు, ముగ్గురు రోగులు పంచుకుంటున్నారు. ఈ మధ్యమంచం మీద నుండి కిందపడి ఒక బాలింత మరణించిన ఉదంతం అందరికీ గుర్తుండే ఉంటుంది. వైద్యశాలలో వరండాల్లో ఎంతో మంది రోగులు ఆశ్రయం పొందుతున్నారు. సరైన అంబులెన్స్‌, స్ట్రెచర్లు, వీల్‌చైర్లు లేక రోగులు ఇబ్బందులకు లోనవ్ఞతున్నారు.

ప్రతి రాష్ట్రంలో ‘ఎయిమ్స్‌ అఖిలభారత వైద్యసంస్థలను నెలకొల్పాలని ప్రభుత్వం చూస్తోంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య కేంద్రాలను మాత్రం విస్మరిస్తోంది. 2019-20 బడ్జెట్లో ఎయిమ్స్‌ కోసం 3,599 కోట్లు కేటాయించగా, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌ కింద ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు 1350 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ పథకం కింద 2022 నాటికి దేశవ్యాప్తంగా 1.5 లక్షల ఉప ఆరోగ్య కేంద్రాలను, ఆరోగ్యం ఆనంద కేంద్రాలుగా తీర్చిదిద్దనున్నారు. జాతీయ ఆరోగ్య మిషన్‌ పథకానికి మరో 31,750 కోట్లు కేటాయించారు. బడ్జెట్లో అంకెలగారడీలు కనబడుతున్నాయి తప్ప ఆచరణలో ఒక్క అడుగుకూడా ముందుకు వెళ్లట్లేదు.

దేశంలోని ప్రతి ఒక్కరికి వర్తించేలా పెద్దఎత్తున ప్రారంభించిన పథకం ఆయుష్మాన్‌ భారత్‌. ఇప్పటిదాకా ఈ పథకం ద్వారా పదిలక్షల మంది లబ్ధిపొందారు. వీరి కోసం మూడువేల కోట్లు ఖర్చుపెట్టినట్లు లెక్కలు చెపుతున్నాయి. అంటే ఇప్పుడు బడ్జెట్లో కేటాయించిన ఆరువేల కోట్ల వల్ల కేవలం 20 లక్షల మందికే లబ్ధి చేకూరనున్నది. భారత్‌ నేటి పథకం కింద అనుసంధానించే 2.5 లక్షల గ్రామాల్లో కనీసం లక్ష గ్రామాలను, డిజిటల్‌ గ్రామాలుగా రూపొందిస్తామని చెప్తోంది కేంద్ర ప్రభుత్వం.

ఇదే నిజమైతే ఈ లక్ష గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అనుసంధానం చేసి రోగులకు సత్వర సేవలు అందించవచ్చు. ఈ డిజిటల్‌ గ్రామాల్లో కామన్‌ సర్వీస్‌ సెంటర్లను ప్రారంభించి, గ్రామీణులకు ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తెస్తాం అంటున్న ప్రభుత్వం ఈ లక్ష గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించడంలో మాత్రం అలక్ష్యం ప్రదర్శిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఎక్కువ మంది మహిళలు పోషకాహార లోపంతో, ప్రోటీన్లు, కాల్షియం వంటివి తగినంత తీసుకోకపోవడం వల్ల ఎనిమియాతో బాధపడుతున్నారు.

వ్యాధి నిరోధక శక్తిలేక 58 శాతం మంది పౌష్టికాహారం కరువై 45 శాతం మంది పిల్లలు బాధపడుతున్నారు.ఇప్పటికే 69 శాతం గ్రామీణ ప్రజలకు తాగునీరు అందుబాటులో లేదు. 99 శాతం మందికి కనీస పారిశుద్ధ్య సౌకర్యాలు లేక అంటువ్యాధుల బారినపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని 20 శాతం మంది మానసిక వ్యాధులతో బాధపడుతున్నారు. పెద్దపెద్ద పట్టణాల్లోని కార్పొరేట్‌ హాస్పిటల్‌ అత్యాధునిక వైద్యసదుపాయాలు, పేరొందిన వైద్యులు, రోగులకు కావలసిన అన్ని వసతులు లభిస్తున్నాయి.

కానీ ఈ సేవలన్నీ డబ్బున్న వారికేననేది అందరికీ తెలిసిందే. గ్రామీణ పేదలకు ఈ ఆస్పత్రులు అందని ద్రాక్షనే. ప్రమాదవశాత్తు గాయ పడితే కనీసం వీటి గడపకూడా తాకనివ్వని ఆరోగ్య శ్రీ వంటి పథకాలు ఉన్నా, సకాలంలో ప్రభుత్వాల నుండి నిధులు రాక ఇవి నిష్పయోజనంగా మిగిలిపోతున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లేని ప్రాంతాల్లో వైద్యసహాయం కోసం ప్రారంభించిన 104 అంబు లెన్సులకే జబ్బు చేసి పడకేశాయి.

108, 104 అంబులెన్సుల సిబ్బందికి జీతాల కోసం సమ్మెకు దిగటం పరిపాటిగా మారింది. ఇటువంటి ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేయకుండా అటు ఆరోగ్యశ్రీ వంటి పథకాలను నిర్వీర్యం చేస్తుంటే పేద ప్రజలు ఎవరి దగ్గరకెళ్తారో అర్థంకాక మృత్యువ్ఞకు బలవ్ఞతున్నారు. కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో జరిగే వైద్యం ఎంతో ఖరీదైందో అందరికీ తెలిసిందే. వాళ్లు చేసే పరీక్షలు చదువ్ఞకున్న వారికే అర్థంకావ్ఞ. ఇంకా గ్రామీణ నిరుపేదకేం అర్థమవ్ఞతాయి.
– అలేఖ్య