నల్లమల అచ్చంపేట ఇంకా నిశ్శబ్దమే!

           నల్లమల అచ్చంపేట ఇంకా నిశ్శబ్దమే!

nallamala forest
nallamala forest

తెలంగాణ చరిత్రలో మరో ‘జలియన్‌వాలా బాగ్‌గా నిలిచిన విషాదం నల్లమల అచ్చంపేట ఘటన. ఇది జరిగింది సరిగ్గా 1990 డిసెంబరు 20న. ఈ ఘటన రాష్ట్ర చరిత్రలో ఒక నెత్తుటి మరకగా నిలిచిపోయింది. దోపిడీ ఎదురొడ్డిన దీరత్వం నల్లమల అణచివేతకు వ్యతిరేకంగా బిగిసిన పిడికిలి నల్లమల సర్కార్‌ను నిలదీసిన గళం నల్లమల అచ్చంపేట ప్రజలది. ప్రజల విముక్తి బాటలో ఈ నేల చేసిన త్యాగాలు అంతులేనివి. నల్లమల అంటే త్యాగాలసాలు. నల్లమలలో కొనసాగిన నక్సల్బరీ ఉద్యమం కొద్దికాలంలోనే తాత్కాలిక వెనుకంజకు గురైంది. కానీ, అది భారత నూతన ప్రజాస్వామిక విప్లవ విజయాన్ని సాధించే దీర్ఘకాలిక ప్రజాయుద్ధానికి ఆరంభంగా నిలిచింది. నల్లమల అచ్చంపేట విషాద సంఘటన జరిగి నేటికీ 28 ఏళ్లు కావస్తుంది.
నల్లమల ఇది ఒక ఊరు కాదు. ఉద్యమాల ఊపిరి. భారతదేశ చరిత్రనే మలుపుతిప్పిన పేరు ఇది. ఎండిన డొక్కలు ఎముకల గూళ్ల లాంటి దేహాలతో దోపిడీపై తిరగబడ్డ నల్లమల ప్రాంత ప్రజల నెత్తుటి త్యాగాల చరిత్ర మరవజాలనిది. భూమి భుక్తి కోసమే కాకుండా పీడిత ప్రజల విముక్తి కోసం పశ్చిమబెంగాల్‌లోని డార్జిలింగ్‌ కొండల్లో రగిలిన ఆ నిప్పురవ్వ శ్రీకాకుళ అడవ్ఞల్ని అంటించింది. సబ్‌కాబరి నక్సల్బరీ అయి దేశంలోనే అన్ని ప్రాంతాల్లోకి విస్తరించింది. సరిగ్గా ఆ స్థితిలో నక్సల్బరీ మార్గమే పీడిత ప్రజల విముక్తికి ఏకైక మార్గమని నినాదించింది. ఆ నక్సల్బరీ కొనసాగింపుగానే దోపిడీపై దండెత్తి నెత్తురు చిందించిన నల్లమల రైతాంగ పోరాటాలన్నీ పచ్చనాకు సాక్షిగా జరిగినవే.

నల్లమలలోని ప్రతి అణువణువ్ఞ అవే పోరాట కథలను వినిపిస్తుంది. అదే చైతన్యాన్ని ప్రదర్శిస్తుంది. 1986 నుండి కూడా విప్లవ ఉద్యమానికి ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా బలమైన కేంద్రంగా ఉంది. అచ్చంపేట అనేది ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాలోనే ఉంది. సరిగ్గా 28 సంవత్సరాల క్రితం 1990 డిసెంబరు 20న నల్లమల ప్రాంతంలోని అచ్చంపేట కేంద్రంగా రైతు కూలీ సంఘం మహాసభలు ఏర్పాటు చేయాలని అప్పటి సిపిఐ (ఎంఎల్‌) పీపుల్స్‌వార్‌ పార్టీ నిర్ణయించింది. ఆ పిలుపు నందుకొని రైతుకూలీ మహాసభలు విజయవంతం చేయడానికి అనేకమంది రాడికల్‌ విద్యార్థి సంఘం ( ఆర్‌ఎస్‌యు) నాయకులు, సంఘ కార్యకర్తలు రెండు నెలలకుపైగా గ్రామగ్రామాన విస్తృతంగా క్యాంపియన్‌ నిర్వహించారు.

రైతు కూలీ సంఘం నాయకులు మహాసభలకు అనుమతిని కోరుతూ రాతపూర్వకంగా అప్పటి జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు ఇచ్చారు. పీపుల్స్‌వార్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మహాసభలు విజయవం తంగా పూర్తి అయినట్లు అయితే నల్లమలలో కొనసాగుతున్న ప్రజా ఉద్యమం విముక్తి మార్గంలో ప్రయాణిస్తుందని అనుకున్న పాలకులు చివరి క్షణంలో మహాసభలకు అనుమతి ఇవ్వకుండా నిరాకరించింది. కానీ ఎట్టి పరిస్థితుల్లోను మహాసభలు జరిపి తీరుతామని రైతుకూలీ సంఘం నాయకులు కామ్రేడ్‌ భాస్కర్‌, కామ్రేడ్‌ రమాకాంత్‌ అమరుడు కామ్రేడ్‌ గుడిపల్లి జైపాల్‌ ప్రకటించారు. 1989లో చారిత్రాత్మకమైన వరంగల్‌ రైతు కూలీ సంఘం మహాసభలు విప్లవోద్యమంలో ఓ మైలురాయి. జననాట్యమండలి మళ్లీ సాంస్కృతిక సైన్యంగా తనదైన కార్యాచరణతో ప్రజల్లో పనిచేయడం ప్రారంభించింది.

ఈ మహాసభలకు జననాట్యమండలి (జెఎన్‌ఎం) బాధ్యులు కామ్రేడ్‌ గద్దర్‌, కామ్రేడ్‌ సంజీవ్‌, కామ్రేడ్‌ దివాకర్‌ లాంటి ఎంతో మంది ప్రజాకళాకారులు అచ్చంపేటకు వస్తున్నారని తెలియడంతో వేలాది మంది ప్రజలు వారి ఆట పాటలను చూడటంతో పాటు ఆ సభలో వక్తలు మాట్లాడే అంశాలు కొన్ని వినాలనుకున్నారు. నల్లమల ప్రాంత మార్పుకోసం నిర్వహిస్తున్న ఈ సభలకు తమ భాగస్వామ్యం ఉండాలనే ఒక తపన ఆలోచనతో వందలాది మంది ప్రజలు సొంత ఖర్చులతో ఇంటి దగ్గరి ఎవరి భోజనాలు (సద్ది) వాళ్లు టిఫిన్‌ బాక్స్‌లో కట్టుకొని ఎటు మీ ప్రయాణం అంటే అచ్చంపేటే మా ప్రయాణమనే మాట తప్ప వేరే మాట వినపడలేదు.

మహాసభలను భగ్నం చేయాలని భావించిన పోలీసులు సభలకు ముందస్తుగా బయలుదేరిన జననాట్యమండలి (జెఎన్‌ఎం) బాధ్యులు, ప్రజాయుద్ధనౌక కామ్రేడ్‌ గద్దర్‌ను అచ్చంపేటలో అరెస్టు చేశారు. ఈ మహాసభలను విజయవంతం చేయడానికి జిల్లా నలుమూలల నుండి వేలాది మంది ప్రజలు కార్యకర్తలు నల్లమల అచ్చం పేటకు వచ్చారు. వచ్చిన వారిపైన పోలీసులు విచక్షణరహితంగా లాఠీచార్జీ చేశారు. లాఠీచార్జి జరిపిన లెక్క చేయకుండా ప్రజలు, కార్యకర్తలు తండోపతండాలుగా సభ ప్రాంగణం వైపునకు దూసుకురావడం గమనించిన పోలీసులు ఒక్కసారిగా తుపాకీ తూటాల వర్షం, అంతా పరుగులు, కేకలు, భయోత్పాతం. ఇళ్ల నుంచి తెచ్చుకొన్న సద్దిమూటల మీద పడిపోయిన వాళ్ల రక్తంతో సద్దిమూటలు ఎరుపెక్కాయి.

పంట కాలువల వెంట పారిపోయే వారి రక్తంతో నీళ్లు ఎర్రగా మారాయి. కాల్పులు విచక్షణ కోల్పోయాయి. తూటాలు రైతు కూలీల గుండెల్లోకి దూసుకెళ్లాయి. ఇందులో ఆరు మంది మరణించగా, వందలాది మంది గాయాలపాలు అయ్యారు. ప్రజల చేతిలో ఆయుధాలు ఏమున్నాయి? రెండు చేతులు తప్ప! ఈ సభల కోసం అహర్నిశలు పనిచేసిన రాడికల్‌ విద్యార్థి సంఘం నాయకులు, సంఘ కార్యకర్తలను వందలాది మందిని అక్రమంగా అరెస్టు చేసి జైళ్లో నిర్బంధించారు. తెలంగాణ చరిత్రలో మరో ‘జలియన్‌వాలా బాగ్‌గా నిలిచిన విషాదం నల్లమల అచ్చంపేట ఘటన. ఇది జరిగింది సరిగ్గా 1990 డిసెంబరు 20న. ఈ ఘటన రాష్ట్ర చరిత్రలో ఒక నెత్తుటి మరకగా నిలిచిపోయింది.

దోపిడీ ఎదురొడ్డిన దీరత్వం నల్లమల అణచివేతకు వ్యతిరేకంగా బిగిసిన పిడికిలి నల్లమల సర్కార్‌ను నిలదీసిన గళం నల్లమల అచ్చంపేట ప్రజలది. ప్రజల విముక్తి బాటలో ఈ నేల చేసిన త్యాగాలు అంతులేనివి. నల్లమల అంటే త్యాగాలసాలు. నల్లమలలో కొనసాగిన నక్సల్బరీ ఉద్యమం కొద్దికాలంలోనే తాత్కాలిక వెనుకంజకు గురైంది. కానీ, అది భారత నూతన ప్రజాస్వామిక విప్లవ విజయాన్ని సాధించే దీర్ఘకాలిక ప్రజాయుద్ధానికి ఆరంభంగా నిలిచింది. నల్లమల అచ్చంపేట విషాద సంఘటన జరిగి నేటికీ 28 ఏళ్లు కావస్తుంది. విషాదం ఏమంటే ఇంకా యుద్ధం ముగిసి పోలేదు. ప్రచ్చన్నంగా శంఖారావాలు మోగుతూనే ఉన్నాయి. దశాబ్దాల తరబడి వారి మీద గత రాజ్యం కక్ష గట్టింది.

కాంగ్రెస్‌, తెలుగుదేశం ఇంకా ముగింపు కానరావడం లేదు. మొన్న నల్లమల అచ్చంపేటకు దగ్గరగా ఉన్న ఒక గ్రామానికి వెళ్లితే ఆశ్చర్యం! అది పేరుకే ఊరు, కాని అక్కడంతా భయం వీస్తున్నది. డిసెంబర్‌ మాసం కావడంతో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. కాని మనుషుల్లో పాతుకపోయిన భయం చూసి చెమటలు పట్టాయి. అర్థం అయింది. అది ఇంకా యుద్ధభూమేనని. గాయాలు తగిలిన వారిని పలకరిద్దామంటే ఇంట్లో ఉండి కూడా లేరని చెప్పించారు. మనుషులు మరణించిన తమ పెద్దల్ని తలచుకోవడానికి అంతటా కనపడని ఆంక్షలు. కొన్ని మానని గాయాలకు సలామ్‌ చేయకపోతే ఎలా, కలిసివచ్చే మానవతామూర్తులు వారికి అండగా ఉంటూ భరోసా కల్పిస్తారని నమ్మిక.

నాటి నల్లమల అచ్చంపేట సంఘటన పీడిత ప్రజలకు మిగిల్చిన గాయం నేటికి మానలేదు. 28ఏళ్ల విషాదం గడ్డకట్టుకుపోయింది. అది మంచుకాదు. శిల వలె ఘనీభవించింది. ప్రతిసారి వారం ముందు ఒక నక్సల్స్‌ వార్త! లేరని తెలిసినా రాష్ట్రవ్యాప్త వార్తవ్ఞతుంది. యంత్రాంగం పన్నిన మాయాజాలంలో గత ప్రభుత్వాలు మిన్నకుండి పోయాయంటే అర్థం ఉంది. కానీ సుదీర్ఘ పోరాటాల ఫలితంగా రాష్ట్రం వచ్చాక నిషేధాలు ఎత్తివేయి స్తామని అమరుల సాక్షిగా, పత్రిక వార్తల సాక్షిగా ప్రమాణం చేసిన పాలకులు ఇప్పుడు నిషేధాజ్ఞలను నిషేధిస్తున్నామని జమిలి ప్రకటన చేసింది. స్వపరిపాలన స్వేచ్ఛకోసం ఉద్యమాలు చేసి సాధించుకున్న రాష్ట్రంలో వాటిని ప్రజలకు కానుకగా ఇవ్వాలని కోట్లాది మంది ఆకాంక్ష.

కాని నేటికి ఆ ఆకాంక్ష అలాగే మిగిలిపోయింది. ప్రకృతి అందాలకు నెలవ్ఞగానే పరిచయమైన నల్లమల ఇప్పుడు …పచ్చని పల్లెలు వల్లకాడుగా దర్శనమివ్వ బోతుంది. తరతరాల నుండి ఆదివాసులైన చెంచులతోపాటు అణగారిన ప్రజలు అడవిలో తమకు తోచిన రీతిలో జీవిస్తున్నారు. ఆదివాసులు ప్రకృతి దగ్గరగా జీవించిన ప్రకృతితో ఘర్షణ కూడా ఉంటుంది. ఈ ప్రపంచంలో అందరి కంటే అత్యున్నత మానవతామూర్తులు వీరు. ఎదుటి ప్రాణికి హాని తలపెట్టని సహజ జీవ్ఞలు వాళ్లు. రాజ్యం అడవిలోకి వెళ్లదలిస్తే అక్కడి మనుషుల జీవితాలను వాళ్లు మరింత అందంగా, ఆనందంగా జీవించే పరిస్థితులను కల్పించడానికైతే వేరు కాని, వాళ్ల వనరుల కోసం వెళ్లి వాళ్ల కాళ్ల కింద భూమిని తొలగించేందుకు చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

నెత్తురొడ్డి సాధించిన హక్కులను కాలరాసిన పాలకులు వాళ్ల బతుకులను సామ్రాజ్యవాదులకు తాకట్టుపెట్టినారు. పాలకులు అతి విలువైన సహజవనరులు కలిగిన నల్లమల కొండలను డిబిర్స్‌ కంపెనీకి అమ్మివేసి అడవి నుండి వారిని తరమడానికి అర్థ సైనిక బలగాలను దించి గ్రామాలను ఖాళీ చేయాలని కుట్ర పన్నుతున్నారు. నల్లమలలో ఇకనుండైనా స్వేచ్ఛా వాయువ్ఞలు నింపకం చారిత్రక అవసరం. అది తెలంగాణ రాష్ట్రానికి గౌరవం, మర్యాద. యుద్ధం ఇంకా కొనసాగిస్తామా? అయితే ఎవరి మీద! ఇది చరిత్ర అడగబోయే ఒక చిన్న ప్రశ్న. ఈ ప్రాంత ప్రజలకు పోరాటాలు కొత్తేంకాదు.

గత చరిత్రను కలగంటూ మరో పోరాటానికి నాందిపలకాల్సిన అవసరం ఉంది. ప్రకృతి అందాలకు మారుపేరుగా విరసిల్లిన నల్లమలను వల్లకాడు చేయాలని కలలు కంటున్న హిందు మతోన్మాద సామ్రాజ్యవాదులను తరమడానికి ఆదివాసులు, విద్యార్థి యువతరమంతా కలిసి కొమ్మ రెమ్మ బువ్వ మాదని సైన్యం కట్టి పోరు చేసినప్పుడే నల్లమల పచ్చని అందాలను కాపాడుకోగలుగుతాం.
– చెవ్వ రఘుపతిరావు