నగరమా? నరకమా?

TRAFFFIC

నగరమా? నరకమా?

దేశంలో ప్రస్తుతం ఐదు మెగా నగరాలున్నాయి. ఐదే ళ్లలో హైదరాబాద్‌ ఈ జాబితాలో చోటు దక్కించు కోబోతోందని ఐక్యరాజ్యసమితి విశ్లేషించింది. ప్రస్తు తం హైదరాబాద్‌ జనాభా 92.18 లక్షలు కాగా 2030 నాటికి ఇది 1.27 కోట్లవ్ఞతుందని పేర్కొంది. ప్రపంచంలో మెగా నగరాల జాబితాలో హైదరాబాద్‌ చేరనుండం సంతోషకరమే అయినా నగరజీవన స్వరూపం మాత్రం చాలా రద్దీగా సామాన్యులు ఎటూ కదలలేని విధంగా పెరుగుతుండడం నరకయాతన కలిగిస్తోంది. ముఖ్యంగా మెగానగరానికి కావలసిన అర్హత కేవలం జనాభాతో సరిపెడితే చాలదు. నగరంలో ప్రజాజీవితం సజావ్ఞగా సాగడానికి కావలసిన సౌకర్యాలు ఎంతవరకు అభివృద్ధి చెందాయో పరిశీలించ వలసి ఉంది. హైదరాబాద్‌ను ముఖ్యంగా పట్టిపీడిస్తున్న సమస్యల్లో ట్రాఫిక్‌ సమస్య ప్రధానమైనది. ఎక్కడికైనా వెళ్లి రావాలంటే స్వల్ప దూరమైనా సరే కొన్నిగంటలు ట్రాఫిక్‌ జామ్‌లోనే గడపవలసి వస్తోంది. మరో ప్రధాన సమస్య రోడ్ల పరిస్థితి. ఎప్పుడో పురాతన కాలం నాటి భవనాలు, రోడ్లు తప్ప విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వం చెప్పుకొంటున్నట్టు ఆ మేరకు రోడ్ల నిర్మాణం జరగడం లేదు.అలాగే రోడ్ల వైశాల్యంకానీ విస్తరణ కానీభవిష్యత్తు అంచనాలతో చేపట్టడం లేదు. వర్షం వచ్చిందంటే రోడ్లన్నీ అనకొండలై ఎప్పుడు ఎవరిని, ఎక్కడ, ఎలా కాటేస్తాయో చెప్పలేం.ఇటీవల మ్యాన్‌హోల్స్‌లో పడి నలుగురు కార్మికులు అక్కడిక్కడే మృతిచెందడం నగర పాలకుల నిర్వహణ సామర్థ్యాన్ని చాటిచెప్తుతోంది. రోడ్లమరమ్మతుల పేరుతో ఎక్కడైతే కంతలు తవ్వుతున్నారో అక్కడే మళ్లీ మళ్లీ తవ్వడం తిరిగి వాటిని సరిగ్గా పూడ్చకపోవడం ప్రమాదాలకు దారితీస్తుంది.
ఒక శాఖకు మరో శాఖకు సమన్వయం లేక రోడ్లన్నీ చిధ్రమవ్ఞతున్నాయి. ఇవ న్నీ ఒకకొలిక్కి వచ్చి నగరాన్ని సుందరంగా,ఆధునికంగా తీర్చిదిద్దితే తప్ప మెగా నగరంగా భాగ్యనగరం రాణించలేదు. హైదరాబాద్‌ జనాభా గత 15 సంవత్సరాల్లో 37.55 లక్షలు పెరిగింది.2000వ సంవత్సరంలో 54.45లక్షల జనాభా ఉండగా 2016కు 92.18 లక్షలకు పెరిగింది. భాగ్యనగరంలో జనాభా పెరుగుదల రేటు 2.3శాతం. ఏటా రెండు నుంచి రెండున్నర లక్షలు చొప్పున జనాభా పెరిగి ఐదేళ్లలోనే కోటికి చేరుతుందని ఐరాస విశ్లేషించింది. ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద నగరంగా ప్రస్తుతం విశాఖపట్నం ఉంది. తర్వాతస్థానం విజయవాడది. 2000లో బెజ వాడ జనాభా 9.99 లక్షలు కాగా 2016కు ఇది 18.22 లక్షలకు పెరిగింది.అంటే పదిహేనేళ్లలో దాదాపు రెట్టింపుఅయింది. 2030 నాటికి 26.14లక్షలు అవ్ఞతుందని పేర్కొంది.పట్టణీకరణ నేప థ్యంలో ప్రపంచవ్యాప్తంగా పట్టణాలు,నగరాల్లో జనాభా విపరీతం గా పెరిగిపోతోంది. ఇందుకు భిన్నంగా 55 నగరాల్లో 2000వ సంవత్సరం నుంచి జనాభా తగ్గుతోందని ఐరాస విశ్లేషించింది. దీనికి ప్రధాన కారణం ప్రకృతి వైపరీత్యాలే. ఆర్థిక సంక్షోభం, పరిశ్రమలు తగ్గిపోవడం, ఉద్యోగాలు లేకపోవడం, ఐరోపాదేశాల్లో సంతానోత్పత్తి రేటు తగ్గుతుండడం కూడా కారణాలేనని విశ్లేషిం చింది. జనాభాపరంగా ప్రపంచంలోనే అతిపెద్ద నగరం టోక్యో. 2030 నాటికి జనాభా 10 లక్షలు తగ్గినా కూడా టోక్యోనే అగ్ర స్థానంలో కొనసాగనుంది. ఢిల్లీ రెండో స్థానంలో ఉంది. 2016 నుంచి 2030 మధ్యకాలంలో ఢిల్లీ జనాభా కోటి పెరగనుందని అంచనా. అప్పుడు కూడా రెండోస్థానంలోనే ఉంటుంది.
80 లక్షలకుపైగా జనాభా ఉన్న హైదరాబాద్‌ నగరంలో ఉద్యో గం, ఇతరత్రా పనుల కోసం నిత్యం ప్రయాణించే వారు 50 లక్షల వరకు ఉంటా రు. ఇతర ప్రాంతాల నుంచి నిత్యం వచ్చి వెళ్లే వారి సంఖ్య ఐదారు లక్షలు ఉంటుందని అంచనా. వీరిలో ప్రజారవాణా వ్యవస్థను వినియోగిస్తున్నది. కేవలం 35 లక్షల లోపే.33 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుండగా,ఎంఎంటీఎస్‌లో లక్ష మంది కిపైగా రాకపోకలు కొనసాగిస్తారు. అంటే మిగతా 17-20 లక్షల మంది వ్యక్తిగత, ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. సరైన ప్రజారవాణా వ్యవస్థ లేకపోవడంతోనే మెజార్టీ ప్రజలు ఇతర ప్రయాణసాధనాలను ఎంచుకుంటున్నారు. దీంతో రోడ్లపై వాహనాలరద్దీ పెరిగి ట్రాఫిక్‌ జామ్‌కు కారణమవ్ఞతోంది. నగరం లో వాహనాలు జనాభాతో పోటీపడుతున్నాయి.
సమగ్ర రవాణా వ్యవస్థపై అధ్యయనం చేసిన లీ అసోసియేట్స్‌ నివేదిక ప్రకారం 2001లో నగర జనాభాలో ప్రతి 1000 మందిలో 68 మంది ద్విచక్ర వాహనాలు, 8మంది కార్లు వినియోగించేవారు. 2011 నాటికి ద్విచక్ర వాహన వినియోగదారుల సంఖ్య 155కు పెరగగా కార్లను వినియోగిస్తున్న వారిసంఖ్య 23కు పెరిగింది.గత నాలు గేళ్లలో వ్యక్తిగత వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రతీ వెయ్యి మందిలో ద్విచక్ర వాహనాలు ఉన్నవారు 230 వరకు ఉంటారని కార్లు వాడేవారి సంఖ్య 40 వరకు ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. హైరార్కీ రోడ్‌ నెట్‌వర్క్‌ అందుబాటులోకి తీసుకొస్తే నగరంలో ట్రాఫిక్‌ సమస్యలకు చెక్‌పెట్టవచ్చని నిపుణులు అభిప్రాయపడుతు న్నారు. నిర్ధారిత వేగంలో వెళ్లేందుకు అనువ్ఞగా నిర్మించే ఈ విధానం అభివృద్ధి చెందిన దేశాల్లో అమల్లో ఉంది. వీధులను బస్తీ, కాలనీలోని అప్రోచ్‌ రోడ్‌కు దానిని ప్రధాన రహదారికి అనుసంధానించాలి. మెయిన్‌రోడ్‌ను ఔటర్‌ రింగ్‌రోడ్డు, ఎక్స్‌ప్రెస్‌ వేలు వంటి అత్యంత వేగంగా వెళ్లే మార్గాలకు కలపాలి. దీంతో లోకల్‌ రోడ్‌లలో యాక్సెస్‌ ఎక్కువగా వాహనవేగం తక్కువగా ప్రధాన రహదారుల్లో యాక్సెస్‌ తక్కువ వేగం ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ ఏరియాకు సంబంధించి సమగ్ర రవాణా అధ్యయన నివేదిక వెల్లడించింది.. ఢిల్లీ కువైట్‌, బీజింగ్‌, దుబా§్‌ులలో హైరార్కియల్‌ రోడ్‌విధానం అమల్లోఉంది. నగరం శరవేగంగా విస్తరిస్తోంది. అభివృద్ధితోపాటే ఇబ్బందులూ అధికమవ్ఞతున్నాయి. సిటీజనులు ఎదుర్కొనే ప్రధాన సమస్య ట్రాఫిక్‌. ఉదయం ఉద్యోగానికి బయలుదేరింది మొదలు సాయం త్రం ఇంటికి చేరుకునే వరకు రోడ్లపైనే కాలం వెల్లదీయాల్సిన దుస్థితి నెలకొంది. పీక్‌ అవర్స్‌లో 10 కిలోమీటర్ల ప్రయాణానికి కనీసం గంటపడుతోంది. అదే వర్షం, ఇతరత్రా కారణాలతో ట్రాఫి క్‌ నిలిచిపోతే మరో గంట నిరీక్షణ తప్పదు. 20-30కిలోమీటర్ల దూరం వెళ్లాలంటే ఒకరోజులో నాలుగైదు గంటలు కోల్పోవా ల్సిందే. ఉద్యోగం ఎనిమిది గంటలైతే ప్రయాణానికి అందులో సగం కంటే ఎక్కువ సమయం పడుతుండడం గమనార్హం. అభివృద్ధి చెందిన దేశాల్లో నగర విస్తీర్ణంలో రహదారుల వ్యవస్థ 20-25 శాతం వరకు ఉంటుంది. నగరంలో మాత్రం 9 శాతం మాత్రమే రోడ్‌ నెట్‌వర్క్‌ ఉంది.పెరుగుతోన్న వాహనాలకు అనుగు ణంగా రహదారుల వ్యవస్థ అభివృద్ధికాకపోవడంతో కాలగమనోం ఇబ్బందులు అధికమవ్ఞతున్నాయి. రోడ్లపై గంటల తరబడి ఉండా ల్సి రావడం ప్రజల ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతోంది. ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా 20ప్రాంతాల్లో బహుళమార్గాల వంతెనలు 100కుపైగా జంక్షన్ల అభివృద్ధి, 56 ప్రధాన రహదారుల్లో కారిడార్‌ ఇంప్రూవ్‌మెంట్‌, నాలుగు స్కైవేల నిర్మాణం ప్రతిపాదించారు. రూ.26వేల కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన ప్రణాళికలో భాగంగా మొదటి విడత పనుల ప్రారంభానికి టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసి నిర్మాణ సంస్థ ఎంపిక పూర్తయ్యింది. అయ్యప్ప సొసైటీ సమీపంలోని మైండ్‌ స్పేస్‌ మినహా మిగతా ఎక్కడా పనులు మొద లవ్వలేదు. కేబిఆర్‌ పార్క్‌చుట్టూ జంక్షన్లవద్ద నిర్మించ తలపెట్టిన మల్టీ లెవల్‌ ఫ్లైఓవర్ల నిర్మాణం నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) జోక్యంతో నిలిచిపోయింది.
మిగతాచోట్ల ఆస్తుల సేకరణ పూర్తికాక పోవడంతో జాప్యం జరుగుతోంది. నగరంలోని చాలా ఏరియాల్లో రోడ్ల విస్తరణ సాధ్యంకాదని జిహెచ్‌ఎంసి అధికారులే అంగీకరిస్తు న్నారు. రోడ్ల వెడల్పు, మెట్రోరైల్‌ కోసం ఇప్పటికే ప్రధాన రోడ్ల పక్కన ఉన్న ఆస్తులను భారీగా సేకరించారు. మళ్లీ సేకరణ అంటే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే ప్రమాదం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. వాస్తవంగా ఏ రహదారి అయినా జంక్షన్ల వద్ద విశాలంగా ఉండాలి. నగరంలో ఆ పరిస్థితి లేదు. ఆక్ర మణలు, అనధికారవ్యాపారాలతో చౌరస్తాలు కుచించుకుపోతున్నా యి. అసలే తక్కువగా ఉండే రోడ్ల విస్తీర్ణంలో ఏ రోడ్డు కనీసం ఓ ఐదు కిలోమీటర్లు సమాన వెడల్పుతో లేకపోవడం గమనార్హం. ప్రతీ కారిడార్‌లో బాటిల్‌నెక్స్‌ సర్వసాధారణమయ్యాయి. దీంతో జంక్షన్ల వద్ద ట్రాఫిక్‌ జామ్‌ తప్పడం లేదు.

-పెట్ల వెంకటేశం