తెలుగు స్థానంలో సంస్కృతం సమంజసమా?

కాంపోజిట్‌ కోర్సులో భాగంగా సంస్కృతం ప్రారంభమై, ఇంటర్‌లోకి వచ్చేసరికి తెలుగు పూర్తిగా తొలగించి దానిస్థానంలో సంస్కృతం వందమార్కులకు ప్రారంభమవ్ఞతుంది. ఇంకో విచిత్రమైన విషయమేమిటంటే కాంపోజిట్‌ కోర్సుతో సంబంధం లేకుండా కేవలం తెలుగు మాతృభాషగా చదివిన విద్యార్థులను సైతం ఇంటర్‌లో సంస్కృతం తీసుకొనేలా కృత్రిమ పరిస్థితులు కల్పిస్తున్నారు. కేవలం మార్కుల కోసం తెలుగుకు బదులు సంస్కృతం తీసుకొనేలా రాష్ట్రంలోని కార్పొరేట్‌ ఇంటర్‌ కళాశాలలు విద్యార్థులను మభ్యపెట్టడం, మాతృభాషా ద్రోహంగా భావించాలి. తెలుగులో అత్తెసరు మార్కులతో ఉత్తీర్ణత సాధించినవారు, సంస్కృతం వాసనే లేనివారు ఇంటర్‌లో సంస్కృతం చదివి వందశాతం మార్కులతో ఉత్తీర్ణులవడం ఆశ్చర్యం కలిగించే విషయం. కార్పొరేట్‌ ఇంటర్‌ కళాశాలలో ఎంత మంది యం.ఎ సంస్కృతం చదువ్ఞకొన్నవారు పాఠాలు బోధిస్తున్నారు? అసలు సంస్కృతం పిరియడ్‌ ఉంటుందా అనేదే అనుమానం.

సం స్కృతం గొప్ప భాషే.ఆ భాష అధ్యయనానికి ప్రత్యేక విధానం ఉంటే ఆ భాషపై నైపుణ్యం వస్తుంది. తెలుగు రాష్ట్రాలలో ఒకటోవ తరగతి నుండి పదోవ తర గతివరకు త్రిభాషా సూత్రం ప్రకారం ప్రథమ భాషగా తెలుగు లేదా వారి మాతృభాషలు, ద్వితీయ భాషగా హిందీ, తృతీయ భాషగా ఆంగ్లం చదువ్ఞతారు. ఇంటర్‌లో ప్రథమ భాషగా ఆంగ్లం, ద్వితీయభాషగా వారి మాతృభాషలను చదివే అవకాశం సాధారణంగా ఉంది. ఇందుకు భిన్నంగా బాల్యం నుండి మాతృ భాషల్లో చదివిన విద్యార్థులను ఇంటర్‌లో ప్రశ్నించగానే ఒక్క సారిగా సంస్కృతం అధ్యయనం చేయించడం అశాస్త్రీయమైన విషయం. విద్యార్థుల భాషా అధ్యయన ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమైన ఇలాంటి పద్ధతుల వల్ల సంస్కృతభాష గౌరవాన్ని తగ్గించిన వారే అవ్ఞతారు. ఇంటర్‌ బోర్డు వారు మాతృభాషల స్థానంలో సంస్కృతం, అరబిక్‌, ఫ్రెంచ్‌వంటి భాషలను ప్రత్యా మ్నాయంగా ఎంపిక చేసుకొనే అవకాశం ఏ ప్రాతిపదికన ఇస్తారో అర్థం కాదు. రాష్ట్రంలోని ఉన్నత పాఠశాల స్థాయిలలో ఓరియం టల్‌, గురుకుల, కేంద్రీయ పాఠశాలలు, అనేక ప్రైవేట్‌ పాఠశాల లో కాంపోజిట్‌ కోర్సుగా సంస్కృతానికి ప్రాధాన్యత ఇస్తూ నడు స్తున్నాయి. ఈ పాఠశాలలో మాతృభాషగా తెలుగును ఒక అంశంగా డెబ్భైమార్కులకు చదువ్ఞతారు. సంస్కృతం ముప్ఫై మార్కులకు చదువ్ఞతారు. కాంపోజిట్‌ సబ్జెక్టుగా కొనసాగే ఈ కోర్సులో ప్రతి సంవత్సరం పదవ తరగతిలో దాదాపు తొంభై ఐదువేల మంది చదువ్ఞతున్నారు. అంటే ఇరవై అయిదుశాతం మందికి ఈ పద్ధతిలో సంస్కృతం పరిచయం చేస్తున్నారు. తెలుగుస్థానంలో ఇలా సంస్కృతం ప్రవేశపెట్టడం, సంస్కృతం చదువ్ఞకోవడం గౌరవంగా భావింపచేయడం పాఠశాలస్థాయిలో మొదలవ్ఞతోంది. ఇలా కాంపోజిట్‌ కోర్సులో భాగంగా సంస్కృతం ప్రారంభమై, ఇంటర్‌లోకి వచ్చేసరికి తెలుగు పూర్తిగా తొలగించి దానిస్థానంలో సంస్కృతం వంద మార్కులకు ప్రారంభమవ్ఞతుంది. ఇంకో విచిత్రమైన విషయమేమిటంటే కాంపోజిట్‌ కోర్సుతో సంబంధం లేకుండా కేవలం తెలుగు మాతృభాషగా చదివిన విద్యార్థులను సైతం ఇంటర్‌లో సంస్కృతం తీసుకొనేలా కృత్రిమ పరిస్థితులు కల్పిస్తున్నారు. కేవలం మార్కుల కోసం తెలుగు బదులు సంస్కృతం తీసుకొనేలా రాష్ట్రంలోని కార్పొరేట్‌ ఇంటర్‌ కళాశాలలు విద్యా ర్థులను మభ్యపెట్టడం, మాతృభాషా ద్రోహంగా భావించాలి. తెలుగులో అత్తెసరు మార్కులతో ఉత్తీర్ణత సాధించినవారు, సంస్కృతి వాసనే లేనివారు ఇంటర్‌లో సంస్కృతం చదివి వందశాతం మార్కులతో ఉత్తీర్ణులవడం ఆశ్చర్యం కలిగించే విషయం. కార్పొరేట్‌ ఇంటర్‌ కళాశాలలో ఎంత మంది యం.ఎ సంస్కృతం చదువ్ఞకొన్నవారు పాఠాలు బోధిస్తున్నారు? అసలు సంస్కృతం పిరియడ్‌ ఉంటుందా అనేదే అనుమానం. ఏవో కొన్ని ప్రశ్నలు ఇచ్చి వాటిని దేవనాగరి లిపిలో కాకుండా తెలుగు, హిందీల భాషలో సమాధానాలు రాయించి, అడిగేవారు లేరని అధిక శాతం మార్కులు ఇవ్వడం సరైన పద్ధతికాదు. 2018-19 సంవత్సరం పదవ తరగతి 6,30,000 మంది పరీక్షలు రాశారు. వీరిలో దాదాపు ఆరు లక్షల మంది తెలుగు ప్రథమ భాష చదివిన వారే ఉంటారు. అదే విద్యాసంవత్సరం ఇంటర్‌ మొదటి సంవత్సరం 5,10,000 మంది పరీక్షలు రాశారు. అంటే పదవ తరగతి అనంతరం దాదాపు లక్ష మంది విద్యార్థులు ఐటిఐ, పాలిటెక్నిక్‌, ఇంటర్‌ వృత్తి విద్య అలా చేరిపోతున్నారు. కొంత మంది చదువ్ఞ మానుకొని కూడా ఉండవచ్చు. ఇక్కడ పేర్కొన్న లక్షమంది విద్యార్థులుతెలుగు సబ్జెక్టు చదవరు. ఇంటర్‌ వృత్తివిద్య సిలబస్‌లలో కూడా తెలుగుకు స్థానం లేదు. ఇలాంటి కోర్సులలోను తెలుగు ఒక సబ్జెక్టుగా ఉండేలా విద్యాశాఖ చర్యలు తీసుకోవాలి. ఇంటర్‌లో చేరే దాదాపు ఐదు లక్షల మంది విద్యార్థులలో తాము పాఠశాల స్థాయిలో చదువ్ఞకొన్న తెలుగును కాకుండా సంస్కృతం చదివే వారి సంఖ్య సగంపైనే ఉంటున్నారు. 2016-17 సంవత్సరం వివరాల ప్రకారం రాష్ట్రంలో 1830 ప్రైవేట్‌ ఇంటర్‌ కళాశాలలు ఉండగా, 831 మాత్రమే ప్రభుత్వ ఇంటర్‌ కళాశాలలు ఉన్నా యి. అంటే రెండింతలు ప్రైవేట్‌ కళాశాలలున్నాయి. ప్రైవేట్‌ కార్పొరేట్‌ కళాశాలలో దాదాపుగా సంస్కృతమే చదివిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇంటర్‌లో దాదాపు మూడు లక్షల మంది మాతృభాషకు దూరం అవ్ఞతున్నారు. ప్రభుత్వ ఇంటర్‌ కళాశాల లో తెలుగు బోధించే ఉంటారు. తెలుగులో సరైన ప్రతిభ చూపిన వారికే పరీక్షలలో మార్కులు ఇస్తారు. కష్టపడిచదవ వలసి ఉంటుంది. అదే సంస్కృతం తీసుకొన్న కార్పొరేట్‌ కళాశాల విద్యార్థులకు ఈ పరిమితులు ఉండవ్ఞ. సంస్కృతం తీసుకున్న వారందరికీ పరీక్షలలో కూడా అపరిమితంగా మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ఉన్న అరకొర సంస్కృత అధ్యాపకులు లక్షల పరీక్షల సమాధాన పత్రాలు ఎలా మూల్యాం కనం చేస్తారో అంతుపట్టదు. తెలుగును కృత్రిమంగా లేకుండా చేసే ఈ చర్యలపై రాష్ట్రప్రభుత్వం దృష్టిసారించాలి. లక్షలమంది విద్యార్థులు తమకు ఇష్టం లేకున్నా కార్పొరేట్‌ కళాశాలల ఒత్తిడికి తలొగ్గి సంస్కృత కూపంలోకి నెట్టివేయబడుతున్నారు. ఇటు తెలుగు అందక, అటు సంస్కృతం రాక విద్యార్థులు మానసిక క్షోభ ఎదుర్కొనే పరిస్థితి కల్పిస్తున్నారు. తెలుగు యం.ఏ చదు వ్ఞకొన్న వేలమంది నిరుద్యోగులకు ఇంటర్‌ కార్పొరేట్‌ కళాశాల లలో తెలుగు బోధించే అవకాశం లేని పరిస్థితి కల్పిస్తున్నారు. పాఠశాల విద్యలో తెలుగు ప్రథమ భాషగా చదువ్ఞకొన్న విద్యార్థులకు ఇంటర్‌ విద్యలో తెలుగును తప్పనిసరి చేయాలి. పాఠశాల స్థాయిలో పూర్తిగా సంస్కృతం చదువ్ఞకొన్న వారికే ఇంటర్‌లో సంస్కృతం చదివే అవకాశం ఉండాలి. పాఠశాల స్థాయిలో కాంపోజిట్‌ కోర్సుపేరుతో తెలుగును తక్కువ చేయడం మానుకోవాలి. మార్కుల కోసం కాకుండా నిజంగా సంస్కృతం విద్యార్థులకు నేర్పించాలనే ఆసక్తి ఉంటే దానికి ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలి కానీ మాతృభాషగా ఉండే తెలుగును బలిచేయడం భావ్యంకాదు.

  • డా.అప్పిరెడ్డిహరినాథరెడ్డి
  • తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/