తెలుగు నాట విప్లవాగ్ని రగిలించిన ‘అల్లూరి’

Alluri-Sitarama-Raju

తెల్లదొరల దోపిడీ విధానాలపై తిరుగుబాటు చేసి మన్యం ప్రజల్లో చైతన్యం పురిగొల్పి విప్లవ పంధాలో పోరాటం సాగించి విద్రోహుల తూటాలకు నేల కొరిగిన అసమాన సాహస స్ఫూర్తి అల్లూరి సీతారామరాజు చరిత్ర తెలియని తెలుగువారు ఉండరు. 1897 జూలై 4న విశాఖజిల్లా పాండ్రంకి గ్రామంలో జన్మించిన అల్లూరి రామరాజు ప్రాథమిక విద్యాభ్యాసం పశ్చిమగోదావరి జిల్లా మోగల్లులో సాగింది. ఆరవ తరగతి చదువుతుండగానే తండ్రి వెంకటరామరాజు కలరాసోకి అర్థంతరంగా చనిపోయారు.దాంతో కుటుంబందిక్కులేనిదయింది. రామరాజు పినతండ్రి ఈ కుటుంబాన్ని చేరదీసి నరసాపురం తీసుకువెళ్లారు. రామరాజుతో తమ్ముడు సత్యనారాయణరాజు, చెల్లెలు సీతమ్మ వీరంతా పినతండ్రి పెంపకంలోనే ఉండేవారు. 1910 నుంచి 1912 వరకు కాకినాడ, విశాఖ పట్నంలో హైస్కూ లు చదువులు చదివినా సరిగ్గా సాగలేదు. చదువుపై శ్రద్ధ మంద గించి ధ్యానంలో ఎక్కువగా గడిపేవాడు. 1917లో విశాఖ జిల్లా గొలుగొండ తాలూకా పెదభైరవిభూపతి అగ్రహారంలో మహా పండి తుడు సూరి సుబ్బయ్య శాస్త్రి వద్ద సంస్కృతం అభ్యసించాడు. అనేక కార్యాలను చదవడంతోపాటు మంత్రశాస్త్రాన్ని, ఇంద్రజా లాన్నినేర్చుకుని మూలికావైద్యాన్నినేర్చుకున్నాడు.ప్రాణాయామం, యోగసాధన చేసేవారు. మొత్తం మీద రామరాజు బాల్యం అంతా తెగిన గాలిపటంలో నిలకడ లేకుండా సాగింది. ఉద్యోగం సంపాది స్తానని చెప్పి తల్లి వద్ద డబ్బు తీసుకొని 1916లో కోల్‌కతా వెళ్లా రు.అక్కడ నరేంద్రనాధ బెనర్జీతో పరిచయం ఏర్పడింది. 18ఏళ్లప్రా యంలోనే వందల మైళ్లు నడిచి బ్రహ్మకపాలం వెళ్లి చివరకు 1917 జూలై 24న విశాఖ జిల్లా కృష్ణదేవి పేట  చేరుకున్నాడు. సవిూ పాన గల ధారా కొండ వద్ద తపస్సు చేసి బాలయోగిగా మారాడు. అయినా ఏదో సాధించాలన్న తపనతోపాటు అసంతృప్తి ఆయనను వెంటాడేది. 1917లోఅమృత్‌సర్‌ వద్ద జలియన్‌వాలా బాగ్‌ దుర్ఘట నకు తీవ్రంగా కలత చెందాడు. స్వాతంత్య్ర పోరాటం సాగుతున్న రోజులవి. రామరాజు కూడా మన్య ప్రజల సమస్యల పరిష్కారా నికి ఏదోఒక సాహసం చేయాలన్న  అభిప్రాయం కలిగింది.

అడవులే తమ బతుకు తెరువుగా బతుకుతున్న మన్య ప్రజలపై బ్రిటిష్‌ వారి ఆగడాలు రానురాను ఎక్కువయ్యాయి. గిరిజనులు పోడు వ్యవసాయం చేయరాదని, విప్పసారా తయారు చేయరా దని, కట్టెలు కొట్టరాదని తదితర ఆంక్షలు విధిస్తూ బ్రిటిష్‌ ప్రభు త్వం శాసనం విధించింది. తాము పుట్టి పెరిగిన అడవిలోనే పరా యి వారుగా బతకడం మన్య ప్రజలకు మింగుడు పడలేదు. సీతా రామరాజు కర్మయోగిలా గడుపుతున్నా తెల్లదొరలపై పోరాటానికి బాణాలను ఆయుధాలుగా చేసుకుని రంగంలోకి దిగాడు. ఆ సమయంలోనే గాముగంటన్న దొర, అతని సోదరుడు గాముమల్లన్న దొర, తదితర పోరాట వీరుల సహకారంతో తెల్లదొర లపై తిరుగుబాటుకు రంగంసిద్ధమైంది. ధనుర్విద్యతోపాటు తుపాకీ కాల్చడంలో రామరాజు నేర్పు సాధించాడు. 1922లో చింత పల్లి ఏజెన్సీ పోలీస్‌ స్టేషన్‌పై 300 మంది అనుచరులతో మొట్టమొదటిసారి దాడిచేసి11 తు పాకులు,1390 తుటాలు,11 బాయె నెట్లు స్వాధీనం చేసుకున్నాడు. ఇవ న్నీ ఆ పోలీస్‌స్టేషన్‌ పుస్తకంలోరాసి అలూరి సీతారామరాజు అని సంతకం కూడా పెట్టాడు. అక్కడి నుంచి రామరాజుపై బ్రిటిష్‌ వారి నిఘాపెరిగింది.తరువాత కృష్ణ దేవి పేట పోలీస్‌ స్టేషన్‌ను ముట్టడించాడు. ఈ ముట్టడులు ఆంధ్ర దేశంలో సంచలనం కలిగించాయి.ఈ విప్లవ వీరులంతా రాజ వొమ్మంగి పోలీస్‌ స్టేషన్‌పై దాడిచేసి ఆయుధాలను లూటీ చేయడంతో పాటు జైలునుంచి వీరయ్య దొరను తప్పించగలిగారు. 26 తుపాకులు,2500 తూటాలను అక్కడ స్వాధీనం చేసుకోగలిగారు. ఆ తరువాత నర్సీపట్నం పోలీస్‌స్టేషన్‌పై దాడిజరిగింది.రామరాజు సారధ్యంలో మన్య ప్రజలు సాగిస్తున్న విప్లవ ఉద్యమాన్ని అణచి వేయడానికి హైటర్‌,స్కాట్‌కవర్డు, చాద్‌లిక్‌, షర్బీస్‌, హూమ్‌, ట్రై మన్‌ హౌర్‌, డాసన్‌ తదితర దొరలంతా సిద్ధమయ్యారు. ఒంజేరి ప్రాంతంలో ట్రైమన్‌హౌర్‌ తెల్లదొరలతో రామరాజు బృందం పోరాడి ఒక సిపాయిని చంపివేసింది. పోలీస్‌ స్టేషన్‌పై వరుసగా దాడులు చేసి విజయం సాధించడంతో రామరాజు దేవీపూజ ఉత్స వాలు నిర్వహించాలని ప్రయత్నిస్తుండగా దాన్ని భగ్నం చేయాలని దొరల మూకతలపెట్టింది. 1922 సెప్టెంబర్‌ 24న కవర్డు, హైటర్‌ దొరలపై కెడిపేట దగ్గర రామరాజు బృందం దాడి జరిపింది. కవరు,్డ హైటర్‌ దొరలు మృతి చెందారు.బ్రిటిష్‌ ప్రభుత్వం విధిలేక 500 రూపాయల జరిమానా విప్ల వవీరులకు చెల్లించి కవర్డు, హైటర్‌ శవాలను తీసుకెళ్లి నర్సీపట్నం శివారులో ఖననంచేశారు. విప్లవవీరులు విజృంభిస్తుండడంతో బ్రిటిష్‌ ప్రభుత్వం450 మంది సాయుధ రిజర్వు సైనికులను యుధ్ధ నిపుణులను, అధికారులను మన్యానికి పంపించింది. చెన్నైనుంచి యుద్ధసామాగ్రి, కేరళ నుంచి ప్రత్యేక పోలీస్‌ బలగాలు మన్యం చేరుకున్నాయి.మన్యం వీరుల విప్లవాన్ని అణచివేయడానికి ఏజెన్సీలో వైర్‌లెస్‌ స్టేషన్‌ను నర్సీ పట్నంలో వైద్యశాలను,విశాఖలో ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేశారు. విప్లవకారుల జాబితా తయారు చేసి ప్రజలు వారికి సహకరించరాదని గ్రామాల్లో ప్రచారంచేశారు. సీతారామరాజును పట్టి అప్పగిస్తే వెయ్యి రూపాయలు బహుమానం ఇస్తామని ప్రక టించారు. సీతారామరాజుకు గాము గంటందొర,మల్లుదొర, ఎండు పడాల్‌,నోకిరి ఎర్రేను, అగ్గిరాజు వంటి యోధులు అండగా నిలిచి పోరాటాన్ని మరింత ముమ్మరం చేశారు.1922అక్టోబర్‌ 15న అడ్డ తీగల పోలీస్‌స్టేషన్‌పై దాడిచేశారు. దాడిచేస్తున్నట్టు మిరపకాయ టపా ద్వాకా ముందుగా తెలియచేశారు. రామరాజు వస్తున్నాడన్న భయంతో పోలీస్‌లు స్టేషన్‌ వదలి వెళ్లిపోయారు. అడ్డతీగలకు 20 మైళ్ల దూరంలో రామవరం ప్రాంతంలో రామరాజు బృందానికి పోలీసులకు మధ్య ఎదురెదురు కాల్పులు జరిగాయి.ఈ సంఘటన లో నలుగురు విప్ల వకారులు నేల కొరిగారు. ఆ తరువాత 1922 అక్టోబర్‌19న రంప చోడవరం పోలీస్‌ స్టేషన్‌పైదాడిచేసి రామరాజుబృందం ఆయుధా లను సమకూర్చుకుంది. రామరాజు సాగించిన దాడులన్నీ ప్రజలు గొప్పగా చెప్పుకునేవారు.

అడ్డతీగల రంపచోడవరం పోలీస్‌ స్టేషన్‌పై రామరాజు దొంగ దాడి చేయలేదు.అప్పటి విశాఖజిల్లా కలెక్టర్‌గా ఉన్న రూథర్‌ఫర్డ్‌కు మిరపకాయ టపా పంపి దాడిపై ముందుగానే హెచ్చరించాడు. అయినా పోలీసులు అక్కడకు చేరుకోలేకపోయారు.1922 డిసెంబ ర్‌ 5న కొండదళాలు ధారకొండవైపు వెళ్లాయని తెలిసి జాన్‌,చార్‌స్లీ అనే బ్రిటిష్‌ అధికార్లు, మరో ముగ్గురు భారతీయ అధికార్లు, 58 మంది నాన్‌కమిషన్‌ సిబ్బంది ధారకొండలో వెత కడం ప్రారంభిం చారు. డిసెంబరు 6న స్వైనీ నాయకత్వంలో పెద్ద గడ్డపాలెంకు సమీపాన అడవిలో ఇరువర్గాల మధ్య జరిగినపోరులో మొత్తం 13 మంది విప్లవకారులు ప్రాణాలు కోల్పోయారు. బ్రిటిష్‌ పోలీసులు పైశాచిక ఆనందంతో 13 మంది విప్లవకారుల శవాలను ఊరేగించి ప్రజలను భయభ్రాంతులు చేశారు. 1923 ఏప్రిల్‌ 17న అన్నవరం కొండపై రామరాజు తన అనుచరులతో ప్రజలను కలు సుకుని బ్రిటిష్‌ ఆగడాలను తెలుసుకుని ఉద్యమాన్ని మరింత మురదుకు తీసుకెళ్లాడు. బ్రిటిష్‌పాలన కాదని పంచాయితీ పాలన ప్రవేశపెట్టా డు.1923 ఏప్రిల్‌23న రామరాజు అనుచరుల్లో అతి ముఖ్యమైన గాముమల్లుదొరను ఒకయువతి ఇంట్లో పోలీసులు పట్టు కోగలిగా రు.విచారణ అనంతరం మల్లుదొరకు 1924 మే12న ఉరిశిక్షపడ గా తరువాత దాన్ని రద్దుచేసి ఆజన్మ ద్వీపాంతరవాసంగా శిక్షను సవరించారు. మల్లుదొర, అగ్గిరాజులు దొరికిపోవడం మన్యం ప్రజల ను బాధించింది. ఈ పోరాటంలో మన్య ప్రజలు లేగదూడల్లా నలిగిపోయారు.1924మే7వ తేదీ ఉదయం మంపగ్రామం ఏటిఒడ్డున రామారాజు స్నానం చేస్తుండగా పోలీసులు పట్టుకోగలిగారు. మే జర్‌ గుడాల్‌ కొయ్యూరు శిబిరానికి సవిూపాన ఉన్న చింతచెట్టుకు రామరాజును కట్టి బంధించి పిస్టల్‌తో కాల్చి చంపాడు. అప్పటికి అల్లూరి వయసు 27 సంవత్సరాలు. రామరాజు మరణ వార్త తెలి సి మహాత్మాగాంధీ, నేతాజీ, నెహ్రూజీ కంట తడిపెట్టుకున్నారు. రామరాజు అస్తమించినా పోరాటంఆగలేదు.1924 జూన్‌లో గంటందొరను, అతని ఆరుగురు అనుచరులను పోలీసులు మట్టు పెట్టారు. దాంతో 1922 ఆగస్టు 22న ప్రారంభమైన అల్లూరి విప్ల వం 1924 జులై మొదటి వారానికి పరిసమాప్తమయింది.