తెలుగు గుండెలకు నిండైన పండుగ

Telugu-1
Telugu

తెలుగు గుండెలకు నిండైన పండుగ

ఎన్నో సభలు, సాహిత్య చర్చలు, కళా ప్రదర్శనలు, సమాలోచనలు, తీర్మానాలు, పుస్తకావిష్కరణలు, సన్మానాలు గతంలో జరిగాయి. ఆ వైభవం పాల పొంగే! కొన్ని రోజులలోనే చల్లబడిపోయేది. మళ్లీ అంతా మా మూలే. ఎంత చేసినా అవేవీ తెలుగుపాలపులుగు రెక్కలార్చలేక పోయాయి. అవన్నీ కొంత మందికే పరిమితమయ్యాయేమో! నేడు తెలంగాణలో జరిగే ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహ సం రంభాలు ప్రముఖుల వ్యాఖ్యానాలు, తెలుగు భాషామోష స్పంద నలు పరికిస్తుంటే ఈ సభలు అపూర్వప్రభలు అని ముందుగానే పక్కా ఫలితాల్ని చూస్తున్నాయి. దానికి ప్రత్యక్ష సాక్ష్యం తెలుగు దనానికి మొలిచిన రెక్కలు. వాడవాడలా ఈ ఉత్సాహం ఉరకలే స్తోంది.

ఏనోటవిన్నా జరగబోయే తెలుగుపండగ మాటలే. ఇంతగా తెలుగువారిని కదిలించిన నేపథ్యం ఇంతకుముందు సంభవించ లేదు. దీనికి మూలం కేసీఆర్‌ సంకల్పబలం. దీనికోసం ఇన్ని కోట్లు ఖర్చు చేయాలా? అనే పొదుపుదారుల విమర్శలు తెలుగుకు చెవి మరుగైపోతున్నాయి. వెల్లువలెత్తే ఈ సాహితీ సాంస్కృతిక ఉత్సా హం గుమ్మరించే ఫలాలకు విలువకట్టలేం. ఈ తరానికే కాదు పాత తరాలవారికి చాలా మందికి తెలియని తెలంగాణ కవ్ఞల రచయితల గ్రంథరాజాలు ఇప్పుడు వెలుగుచూస్తున్నాయి. అవన్నీ తెలుగు వారి గుండెల్ని హత్తుకుంటాయంటే అంతకంటే ఇంకేం కావాలి? తెలుగువారైన వారు ప్రతి ఒక్కరూ చెవ్ఞలు పులకించేలా తెలుగు వినాలి.

నాలుకనర్తించేలా తెలుగు పలకాలి, కళ్లు మెరిసేలా తెలుగు చదవాలి, కలం నర్తించేలా తెలుగు రాయాలి అనేవి కోరి కల పరిధిలోనే ఉండిపోకుండా ఒక అడుగు ముందుకు పడాలనే చేతలకు జవసత్వాలు అందించే సత్తా ఇప్పుడు జరిగే ఈ సభలకు ఉంది. వీటికి ముగింపు ఉండదు. తెలుగు భాష నేటికీ జీవచైత న్యంతో తొణికిసలాడుతూ సంస్కృతి సంప్రదాయ క్షేత్రాలు తడి వారేలా ప్రవహిస్తోంది. దానికి వారూ వీరూ కల్పించేది సాహిత్య మే! దానికి ప్రాచీనమూ అర్వాచీనమూ అనే తేడా ఉండదు.

సాహి తీ సృజనలన్నీ నవనవోన్మేషాలే! అందులో ప్రధానమైది తెలుగు భాగవతం. మందార మకరందాలు బమ్మెర వారి సొమ్ములు, తెలుగు పదభావాల లోతులు కళ్లకు కట్టినవాడు తిక్కన అయితే తెలుగు తేనెలు దోసిళ్ల కొద్దీ జుర్రుకోండి అని బానలు బానలు మనకు అందించిన వాడు పోతన.కాలినడకా, నోటినాలుకా తప్ప సామాన్యునికి వేరే ప్రయాణ ప్రసార సాధనాలు లేని రోజుల్లో పోతన్న గంటం నుంచి జాలువారే పద్యం తాళపత్రం మీదికి చేర డం పూర్తి అయిందోలేదో అది తక్షణమే తెలుగునేల నాలుగుచెర గులా ప్రతిధ్వనించింది. అంటే ఎంత అద్భుతం! పోతనామాత్యుడు కావ్యారంభంలో కరాంభోజాలు జోడించి ప్రార్థించిన నందాంగ నాడింభకుని మహిమ అది. నునులేత కాంతిని దర్శిస్తూ బాలభా నునికి నమస్కరించే వేళ పోతన మనమదిలో సాక్షాత్కరిస్తాడు.

‘రవిబింబం బుపమింపపాత్రమగు అనే పద్యం తళుక్కుమం టుంది. వామనుని విశ్వరూపం ‘ఇంతింతై వటుడింతయై మన కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. అది మొదలుకొని మనం చేసే ప్రతి పనిలోను పోతన మన హృదయ స్పందనలో స్పందనగా మారి పోతాడు. అక్షరాస్యులేకాదు నిరక్షరకుక్షుల్ని సైతం కవితా సుధతో నింపిన చిరంజీవి పోతనామాత్యుడు. ‘బాలరసాల సాలనవపల్లవ కోమల కావ్యకన్యకను పడుపు కూటి కోసంఅమ్మనుగాక అమ్మనని, నమ్మమని భారతి కాటుక కన్నీటిని తుడిచిన గాదిలికుమారుడు ఆ మహాకవి. కులమతాలకతీతంగా ‘ఎవ్హనిచేజనించు జగమెవ్వని లోపల నుండులీనమై అంటూ దేవదేవ్ఞని చెంతచేరి మనందరికీ తద్దర్శన భాగ్యం కల్పించాడు ఆపరభాగవతోత్తముడు. ‘అడిగెదనని కడు వడిజను అనే నాలుగు కందపాదాలలో తెలు గు పదాలతో నృత్యం చేయించి, సాక్షాత్తు లక్ష్మీదేవి తడబాటుకు రూపమిచ్చిన అక్షరశిల్పిపోతన. నల్లనివాడు పద్మనయనమ్ముల వాడు సుధారసమ్ముపై చల్లెడువాడు..

మీ పొదల మాటున ఉన్నా డేమో చెప్పరా! అంటూ మల్లెపొదలను వేడుకున్నా, ఇందుగల డందు లేడు సందేహమువలదు ఎందెందుకు వెదికిన అందందే గలడు చక్రి అని తన నమ్మకాన్ని మన నమ్మకంగా మార్చేసిన కవితా మూర్తిపోతన. కనకవస్తువాహనాదులను గడ్డిపరకతో సమా నంగా పరిగణించి కవిత్వపటుత్వ సంపదనే పోగేసుకుని తెలుగు వారికి పంచిపెట్టిన పోతరాజు కవ్ఞలకు రచయితలకు అందరికీ ఆదర్శం. ‘ఊరకరారు మహాత్ములు! వంటి పరిహాసోక్తులు, ‘కారేరా జులు రాజ్యముల్‌ గలుగవే… సిరిమూట గట్టుకొని పోవంజాలిరే! వంటివైరాగ్యచింతనలు,హెచ్చరికలు,.’లావొక్కింతయులేదు లాంటి దీనాలాపాలు, ‘వారిజాక్షులందు వైవాహికములందు.. బొంకవచ్చు అనే సమర్ధనలు మొదలుకొని ‘జోజో కమలదళేక్షణ జోలపాటల దాకా తెలుగు వారి మనసులు, మాటలు, చేతలు ప్రభావితం చేసి న కవనశిల్పి పోతన ధన్యుడు. అమ్మలగన్నయమ్మ ముద్దుబిడ్డ, తెలంగాణ గడ్డ గర్వంగా చెప్పుకునే దొడ్డకవి బమ్మెరపోతన్నను తలచుకునేవారు ధన్యులు.

– ఎర్రా ప్రగడరామమూర్తి