తెలంగాణ టిడిపికి షాక్‌

మొదట్లో తెలంగాణ టిడిపిలో 15మంది ఎమ్మెల్యేలు ఉండగా, అందులో నుంచి ఇప్పటి వరకు ఏడుగురు టిఆర్‌ఎస్‌లో చేరిపోయారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో టిడిపి ఘోరంగా విఫలమైన నేపథ్యంలో ఇప్పటికే టిడిపి ఎమ్మెల్యే వివేకానంద టిఆర్‌ఎస్‌లో చేరారు. ఇప్పుడు తాజాగా ఎర్రబెల్లి, ప్రకాశ్‌గౌడ్‌ చేరేందుకు సంసిద్దు లయ్యారు. మిగిలిన ఆరుగురిలో సండ్ర వెంకట వీరయ్య ఓటు నోటు కేసులో ఇబ్బంది పడుతున్నారు. ఆయన కొంత కాలంగా టిడిపికి దూరంగా ఉంటున్నారు. ఆర్‌. కృష్ణయ్య ఎమ్మెల్యేగా గెలిచిన మొదట్లోనే తాను టిడిపి వాదిని కాదు, బిసి వాదినంటూ ప్రకటించేశారు. మాటి మాటికి సిఎం కెసిఆర్‌పై విరుచుకుపడే రేవంత్‌రెడ్డి, హైదరాబాద్‌ నగర టిడిపి అధ్యక్షుడు మాగంటి గోపినాధ్‌ తప్ప మిగతా ఇద్దరు అరికెపూడి గాంధీ, రాజేందర్‌రెడ్డి) ఎమ్మెల్యేలు టిఆర్‌ఎస్‌లో చేరేందుకు మార్గాలను చూసుకుంటున్నారు. హరీష్‌తో అంతర్గతంతా మంతనాలు సాగిస్తున్నారని తెలిసింది. మొత్తంగా తెలంగాణ టిడిపి ఎమ్మెల్యేల్లో మిగిలేది ఎంత మంది? అంటే ఇద్దరే, టిఆర్‌ఎస్‌లో చేరకుండా ఆలా ఒకరో, ఇద్దరో టిడిపి ఎమ్మెల్యేలు మిగిలితే, వారు ఏ పార్టీలోకి వెడుతారనేది ప్రశ్న,అంతిమంగా తెలంగాణలో టిడిపి కనుమరుగవుతోంది. దాదాపు ఆ పార్టీ ఖాళీ అవుతుంది. జిహెచ్‌ఎంసి ఎన్నికల సమయంలో టిఆర్‌ఎస్‌ నేత, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సెట్లర్ల కాలనీల్లో తిరు గుతూ ఏపిలో టిడిపి, తెలంగాణలో టిఆర్‌ఎస్‌ ఉండేలా ప్రజలు తీర్పు ఇచ్చారని, తెలంగాణలో టిడిపి బ్రతికే పరిస్థితి ఉండదని,దానిపై ఆశలు వదలుకోవాలని చెప్పడం జరిగింది. జిహెచ్‌ఎంసి ఫలితాలు కూడా అదే విధంగా వచ్చాయి. టిడిపి ఒక్క డివిజన్‌కే పరిమితం కావడంతో తెలంగాణ టిడిపి శ్రేణుల్లో నిరుత్సాహం ఏర్ప డింది. ఆ నిరుత్సాహం నేతలను కకలా వికలం చేసింది. నేతలు కూడా కార్యకర్తల మనోగతం మేరకు అధికార టిఆర్‌ఎస్‌లోకి దూకేస్తున్నారు. టిడిపిలో రేవంత్‌రెడ్డికి చంద్రబాబునాయుడు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం ఎర్రబెల్లి దయాకర్‌రావుకు రుచించడం లేదు. డిప్యూటీ సిఎం కడియం శ్రీహరితో ఎర్రబెల్లి దయాకర్‌రావు తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. అయితే వారిద్దరి మధ్య రహస్య సమావేశాలు జరిగనట్లు, ఇద్దరు కూడా చేతులు కలిపినట్లు చెబుతున్నారు. ప్రకాశ్‌గౌడ్‌ కూడా టిఆర్‌ఎస్‌లోకి వస్తే మెజారిటీ టిడిపి శాసనసభా పక్షం చీలినట్లు అవుతుంది. అయితే మరో ఎమ్మెల్యే చేరితే శాసనసభా సభ్యత్వాలకు వారు రాజీ నామా చేయాల్సిన అవసరం ఉండదు. పార్టీని టిఆర్‌ఎస్‌లో విలీనం చేస్తే సరిపోతుంది.సిఎంను కెసిఆర్‌ సమక్షంలో టిఆర్‌ఎస్‌లో, ఎర్రబెల్లి, ప్రకాశ్‌గౌడ్‌ చేరిపోయారు.టిడిపి తరఫున గెలిచి టిఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలు తమ శాసనసభా సభ్యత్వాలకు రాజీనామా చేయాల్సిన అవసరం లేకుండా టిఆర్‌ఎస్‌లో విలీనం చేయడానికి మరో సభ్యుడి చేరిక కూడా పూర్తయింది. ఓటు నోటు కేసులో టిడిపి నగర అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపినాధ్‌కు ఉచ్చు బిగుస్తుందని, ఓటు నోటు కేసులో ఆయన పాత్ర కూడా ఉందని పోలీసులు సేకరించిన సమాచారంలో తేలిం దని అంటున్నారు. రెండు, మూడు రోజుల్లో అరెస్ట్‌ కూడా కావచ్చని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
– వై.నాగేశ్వరరావు