తవుడు నూనె పై వినియోగదార్ల మక్కువ

                తవుడు నూనె పై వినియోగదార్ల మక్కువ

rice bran oil
rice bran oil

ధాన్యం నుంచి వచ్చే తవ్ఞడు పశువ్ఞల దాణాగా విని యోగిస్తుండడం అందరికీ తెలిసిందే కానీ ఈ తవ్ఞ డు నుంచి తయారయ్యే వంటనూనెకు ఆరోగ్యప్రదమైన ఎన్నో లక్ష ణాలు ఉండడంతో ఇప్పుడు ప్రపంచం మొత్తం ఈ తవ్ఞడు నూనె వాడకంపై మొగ్గు చూపడం రానురాను ఎక్కువవ్ఞతోంది. ప్రధాన ఆహారధాన్యాల ఉత్పత్తిలో మిగులు స్థానంలో ఉన్న భారతదేశం వంట నూనెల విషయానికి వచ్చేటప్పటికి పూర్తిగా దిగుమతులపై ఆధారపడి పోయింది. ఇప్పటికి 60 శాతానికి పైబడి వంటనూనె లను దిగుమతి చేసుకోవలసి వస్తుంది. దీని విలువ 60వేల కోట్ల రూపాయలు పైమాటే. ఈ తరుణంలో రైస్‌బ్రాన్‌ (తవ్ఞడు నుండి తీసిననూనె) వంటనూనె ఉత్పత్తివిషయంలో మనదేశానిదే అగ్ర స్థానం కావటం కాస్త సంతోషానిచ్చే అంశం. మూడు దశాబ్దాల కిం దట పశువ్ఞల దాణాకు ఉపయోగించే తవ్ఞడు నుండి వంటనూనె తీయటమా అని ఆశ్చర్యపోయిన వారు ఇప్పుడు ఈ నూనె విని యోగస్థాయిని చూసివిస్తుపోతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ముఖ్యం గా ఆసియాఖండానికి చెందిన పలుదేశాలు తవ్ఞడు నూనె ఉత్పత్తి విషయంలో ప్రతిఏటా ప్రగతిని సాధిస్తున్నాయి.అయినా అగ్రస్థానా న్ని భారతదేశం నిలబెట్టుకుంటూ వస్తోంది.ప్రపంచ రైస్‌బ్రాన్‌ వంట నూనె ఉత్పత్తిలో సింహభాగం 36శాతం మనదేకావటం గమనా ర్హం.అయితే ఇప్పటికీ మనదేశంలో పెద్దఎత్తునగల తవ్ఞడు నూనె మిల్లులకు సరిపడా ముడి పదార్థం దొరకటం లేదు. ఈ కారణంగా తవ్ఞడు నూనె మిల్లులు తమ సామర్థ్యంలో 65 శాతానికి మించి పనిచేయడం లేదు. విదేశాల
నుండి తవ్ఞడు దిగుమతి చేసుకొనే అవకాశం ఉన్నా 15 శాతం దిగుమతి సుంకం కారణంగా మిల్లులు దిగుమతికి వెనుకంజ వేస్తున్నాయి.ఈ కారణంగా వ్యవసాయ వాణి జ్యరంగ నిపుణులు ప్రభు త్వంపై ఒత్తిడి తెచ్చి 15 శాతం తవ్ఞడు దిగుమతి సుంకాన్ని రద్దుకు ఒప్పించాయి. ఫలితంగా మలేషియా, బంగ్లాదేశ్‌, మయన్మార్‌ దేశాల నుండి తవ్ఞడు దిగుమతి చేసుకోవ టానికి అవకాశం లభించింది.

ఈ పరిణామం పట్లభారత తవ్ఞడు నూనె మిల్లుల సమాఖ్య (ఎస్‌.ఇ.ఎ) హర్షం ప్రకటించింది. ధాన్యాన్ని మర అడినప్పుడు సుమారుగా 63 నుండి 65 శాతం బియ్యం, 23నుండి 25 శాతం ఊక, 8 నుండి 10 శాతం తవ్ఞడు వస్తాయి. భారతదేశంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి తవ్ఞడు దోహద పడింది. పశువ్ఞల దాణాలో తవ్ఞడుకే అగ్రస్థానం. పాల అధిక దిగు బడికి,పాలల్లో వెన్న శాతాల పెరుగుదలకు తవ్ఞడును ప్రధాన పశు వ్ఞలదాణాగా వినియోగిస్తారు. అయితే సుమారు 30 సంవత్సరాల కిందట తెలుగు వాడైన సర్దేశాయి తిరుమలరావ్ఞ తవ్ఞడు నుండి నూనె తీసే ప్రక్రియను కనుగొని సంచలనం సృష్టించారు. అనంత పురంలోని తైల సాంకేతిక పరిశోధనా సంస్థలో ఈ విజయాన్ని సాధించారు.మొదట్లో తవ్ఞడు నూనెలను సబ్బుల తయారీకి, గ్రీజు, సౌందర్య ఉపకరణాలు, ఇతరరసాయనాల తయారీకి విని యోగించే వారు. దరిమిలా మరికొన్ని ప్రయోగాలు చేసి తవ్ఞడు నూనెలోని ఆక్సిడెంట్స్‌ను తొలగించి వంటనూనెగా వినియోగించ టం మొదలు పెట్టారు.

ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా బియ్యం వినియోగ దేశాల లో రైస్‌బ్రాన్‌ ఆయిల్‌ వినియోగం ఏటా రెండు నుండి మూడు శాతం వృద్ధిని నమోదు చేస్తోంది. ఆరోగ్యపరంగా తవ్ఞడు నూనెకు వైద్యుల మద్దతు లభించింది. తవ్ఞడు నూనెలో విలువైన పోషకాలు ఉన్నాయి. తక్కువ కొల ెస్ట్రాల్‌ గల నూనెగా ఇది పేరు పొందింది. విలువైన ‘ఇ విటమిన్‌కు ఇది ఖజానాగా మారింది. వంటనూనెలలో
పేరు పొందిన ఆలివ్‌ ఆయిల్‌ను సైతం సవాల్‌ చేసే విశిష్ట అంశాలు ఈ నూనెలో ఉండ టం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఈ నూనె వాడకం ఊపు అందుకుంది. వంటనూనెల్లో వందలరకాలున్నా అందులో పేరుపొందిన మొదటి పదిరకాల్లో తవ్ఞడు నూనెస్థానం సంపాదించింది.ఇందులో యాంటి ఆక్సిడెంట్స్‌ ఎక్కువగా ఉన్నాయి. జపాన్‌ అయితే ఏకంగా ఈ నూనెను ‘హృదయరక్షణ నూనెగా పేర్కొంది. థా§్‌ులాండ్‌కు చెందిన కింగ్‌ బ్రాండ్‌ ఆయిల్‌కి విశ్వవ్యాప్తంగా పేరు ఉంది.

అమె రికా లోని కాలిఫోర్నియాతోపాటు మరికొన్ని రాష్ట్రాలలో ఈ నూనె వాడకం గణనీయంగా పెరిగింది. చివరకు అమెరికా కూడా వాణిజ్య పరంగా తవ్ఞడు నూనెను ఉత్పత్తి చేసి అంతర్జాతీయ వంట నూనె ల రంగంలోకి కాలుపెట్టింది. ప్రపంచంలో వరి ఎక్కువగా ఉత్పత్తి అయ్యే చైనాను, ప్రపంచ వరి మార్కెట్‌ శాసిస్తున్న థా§్‌ులాండ్‌ను పక్కకు నెట్టి భారతదేశం తవ్ఞడు నూనె ఉత్పత్తి, వినియోగం ఎగు మతుల్లో దూసుకుపోతోంది.ప్రియాఫుడ్స్‌,రుచి, రైస్‌రిచ్‌ లాంటి పేరుపొందిన సంస్థలు రైస్‌బ్రాన్‌ ఆయిల్‌ను మార్కెట్‌ చేసే విధానం కూడా ఈ నూనె వినియోగశాతం పెరగడానికి దోహదపడింది. కాగా నూనె తీసిన తవ్ఞడుకు కూడా గిరాకీ ఎక్కువగానే ఉంది. ఈ రంగంలో కూడా భారతదేశం తన సత్తా చాటుతోంది. ఏటా నూనె తీసిన తవ్ఞడుదిగుమతి ద్వారా500కోట్ల రూపాయల
విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తోంది.ఈ తవ్ఞడు ఎక్కువగా కాకినాడ,విశాఖ పట్నం ఓడరేవ్ఞల నుండి ఎగుమతి అవ్ఞతోంది.

ఆంధ్రప్రదేశ్‌తో సహా దేశం లో వరి పండించే అన్ని రాష్ట్రాలలోనూ 400కిపైగా తవ్ఞడు నుండి నూనె తీసే మిల్లులు ఉన్నాయి. నూనె తీసిన తవ్ఞ డును ప్రధా నంగా బ్రిటన్‌,జర్మనీ,రష్యా,సింగపూర్‌లు దిగుమతి చేసుకుంటున్నా యి. ప్రస్తుతం మనదేశంలో 8.2 లక్షల టన్నుల తవ్ఞడు నూనె ఉత్పత్తి అవ్ఞతోంది. ముడి తవ్ఞడులో 15 నుండి 24 శాతంనూనె ఉంటుంది. తవ్ఞడు నూనె మిల్లులుఎక్కువగా ఉన్నచైనా,భారత్‌, థా§్‌ులాండ్‌, జపాన్‌ వియత్నం దేశాలు అనారోగ్యకర పోటీ నివా రణ కోసం ఒక సమాఖ్యగా ఏర్పడ్డాయి. ఇంటర్నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ రైస్‌బ్రాన్‌ ఆయిల్‌(ఐ.సి.ఆర్‌.బి.ఒ)పేరుతో ఈ సమాఖ్య 2013 లో థా§్‌ులాండ్‌లో సమావేశమైంది. వంటనూనెల వినియోగంలో తవ్ఞడు నూనె ప్రాధాన్యత గురించి విశ్వవ్యాప్త ప్రచారంచేయాలని సమాఖ్య కీలక నిర్ణయం తీసుకుంది.

తవ్ఞడు నూనె ఉత్పత్తి దేశా లను ప్రోత్సహించడం మరిన్ని పరిశోధనలు చేయడం అనే అంశా లపై కూడా చర్చించింది. పాకిస్థాన్‌, మయన్మార్‌, బంగ్లాదేశ్‌, దక్షిణ కొరియా,ఇండోనేషియా దేశాలను సమాఖ్యలో అనుబంధ సభ్యదేశా లుగా గుర్తించింది. కాగా అమెరికా, ఉరుగ్వే దేశాలు కూడా సభ్య త్వం కోసం ముందుకు రావడం శుభసూచకం. గుండెజబ్బుల నివా రణ కారకాంశాలతోపాటు తక్కువ కేలరీలు ఇతర నూనెల్లో లేని ‘ఇ విటమిన్‌20 శాతం తక్కువ నూనె వాడినా రుచులలో తేడా
లేకపో వడం మొదలైన సుగుణాలు తవ్ఞడు నూనెల్లో ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ కితాబు ఇచ్చింది. అయినా ఇప్పటికి ప్రపంచ వంట నూనెల రంగంలో 60 శాతం వాటాను పామాయిల్‌ సోయా చిక్కుడు నూనెలే ఆక్రమించడం కొసమెరుపు.
– పుట్టా సోమన్న చౌదరి