జనాభా సరే, తగిన సదుపాయాలేవి?

                   జనాభా సరే, తగిన సదుపాయాలేవి?

POPULATION
POPULATION

దేశంలో జనాభా ఒక విస్పోటంలా పెరుగుతుంది. ఈ పెరుగుదల కారణంగా అనేక సమస్యలు ఎదుర వ్ఞతున్నాయి. దేశంలో జనాభా పెరుగుతుందని పాలకు లు సమావేశాలు, చర్చలు జరుపుతూనే ఉంటారు. కానీ ఎవరికీ ఈ జనాభా పెరుగుదలపై సరైన అవగాహన ఉండడం లేదు. పెరుగుతున్న జనాభా అనేక అనర్థాలకు మూలకారణంగా నిలు స్తుంది. నికర తలసరి ఆదాయం తగ్గడం, పనిచేసే వారికంటే ఆధారపడే వారి శాతం పెరుగుతుంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒక బిలియన్‌ జనాభా మన భూమిపై కొత్తగా వచ్చి చేరుతున్నారు. దీనికి ముఖ్య కారణం అభివృద్ధి చెందిన దేశాలలో జననాల రేటు కన్నా మరణాల రేటు తక్కువగా ఉండటమే. జననాల రేటులో పెరుగుదల,ఆర్థికాభివృద్ధి వంటి కారణాల వల్ల ఆసియా ఖండంలో గత 50 సంవత్సరాలలో ఎన్నడూ లేనంత ఎదుగుదల నమోద వ్ఞతోంది.

ముఖ్యంగా చైనా, భారతదేశాలు పోటాపోటీగా జనాభాను పెంచుకుంటూ పోతున్నాయి. ప్రస్తుతం మనదేశం 1.32 బిలియన్ల జనాభాతో ప్రపంచ జనాభాలో 7% కలిగి ఉంది. కాని మనదేశంలోని భూభాగం ప్రపంచ భూభాగంలో 2.5% మాత్రమే. భారతీయ జనాభా సంస్థ లెక్కల ప్రకారం ప్రస్తుత ప్రపంచంలో రెండవ స్థానంలో వ్ఞన్న మనదేశం 2025 నాటికి మొదటి స్థానం చేరుకుంటుందని ఒక అంచనా. నిజానికి 2011వరకు అత్యంత వేగంగా పెరిగిన మనదేశ జనాభా (17.77 వృద్ధి)2012 నుండి వృద్ధిరేటు తగ్గుతూ వస్తోంది. అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం 2050 నాటికి మన దేశ జనాభా 1.7బిII చేరుకుని అక్కడనుంచి తగ్గుముఖం పడుతుంది. ఇప్పు డున్న యువ జనాభా అంతా 2050 నాటికి వృద్ధులవటం, జననాల రేటు తగ్గటం, వివిధ రోగాల వల్ల మరణాలు పెరగటం వంటివి దీనికి కారణం.

ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న జనాభా విస్ఫోటనానికి ముఖ్యకారణం శాస్త్ర సాంకేతికరంగాలలో వచ్చిన మార్పుల కారణంగా ఎన్నో మొండి వ్యాధులకు ఔషధాలను కనుగొనటం, అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలలో జీవన ప్రమాణాలు పెరగటం, నాణ్యమైన జీవనం వైపు ప్రజలు మొగ్గు చూపటం కూడా ఒక కారణం. ఎప్పుడైతే జీవన ప్రమాణాలు పెరుగుతాయో, పుట్టే పిల్లలందరూ దేశ ఆర్థిక సంపద కింద లెక్కించబడతారు తప్ప సమాజానికి భారంగా పరిణమించరు. భారత్‌ వంటి అభివృద్ధి చెందుతున్న దేశం రహదారులు, కమ్యూనికేషన్స్‌, రైల్వేలు వంటి మౌలిక వసతులపై అదనపు నిధులు కేటాయించాలంటే కొంత మేరకు జనాభా పెరుగుదలను నియంత్రించాల్సిన అవసరం ఉంది.

దీని వల్ల సగటు వేతన జీవిమీద ఆధారపడే వారి సంఖ్య,తన సంపాదనలో కొంతైనా ఆదా చేయగలుగుతాడు. గ్రామీణ ప్రాంతాలతో పోల్చినప్పుడు పట్టణ ప్రాంతాల్లో అధిక జనాభా కలిగి వ్ఞండటం, గ్రామీణ ప్రాంతాల నుంచి నిరక్షరాస్య, నైపుణ్యరహిత జనాభా స్థిరంగా పట్టణ ప్రాంతాలకు తరలటం వల్ల అక్కడి వనరులపై తీవ్ర వత్తిడి ఏర్పడుతుంది.దీనివల్ల చాలా మందికి తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇంకొక పక్క గ్రామీణ ప్రాంతాల్లో అధిక సంతతిని దేవ్ఞడిచ్చిన వరంగా భావించటం, మూఢనమ్మకాలతో ఎటువంటి కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించలేకపోవటం వంటి కారణాలతో జనాభా ఇక్కడ కూడా పెరిగి సరైన ఆహార, నివాససదుపాయాలు దొరకక ఇబ్బందిపడే ప్రజలే ఎక్కువ.

ప్రపంచవ్యాప్తంగా 800 మిలియన్ల జనాభాకు సరైన తిండి దొరకడం లేదు. జనాభా అంటే కేవలం అంకెల గారడీ కాదు. జనాభా పెరుగుదలపై జరిగే పరిశోధనలు ముఖ్యం గా జనన, మరణాలు, వలసలు తదితర అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తాయి. ఈ మూడు అంశాలు మన భూగ్రహంపై జనాభా పెరుగుదల ప్రభావాన్ని ప్రభావితం చేస్తాయి. ఆఫ్రికా దేశాలలో సంతానోత్పత్తి అధికంగా ఉంది. సగటున ఈ ప్రాంతాల్లో మహిళ లు 4.6 పిల్లలను కంటున్నారు. ఇది ప్రపంచ సగటు 2.5 ఎక్కువ. ఈ దేశాలలో వృద్ధుల కన్నా యువ జనాభా ఎక్కువగా ఉండటంతో వీరికి సరైనా కూడు, గుడ్డ,నీరు గూడు, ఉపాధి వంటివి దొరకక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశ జనాభా సగం తగ్గేవరకు ప్రభుత్వం కఠినచర్యలు తీసుకోవాలి.

ఇది సంప న్నులకు, పేదలకు వర్తించేలా ఉండాలి. ప్రజలలో కూడా జనాభా నియంత్రణపై అవగాహన కల్పించాలి.మరోవైపు జనాభా పెరుగు దలను నియంత్రించగలిగితే సంపద పెరిగి, విద్యా,వైద్యం వంటి మౌలిక సదుపాయాలు ఎక్కువ మందికి అందుబాటులోకి వస్తాయి. అదే సమయంలో వనరుల వినియోగం కూడా పెరుగుతుంది. బొగ్గు, చమురు నూనె సహజవాయువ్ఞలు వంటి సహజ వనరు లు, పౌష్టిక ఆహారం అధునాతన గృహాలు,మోటారు వాహనాలు, విలా సవంతమైన వస్తువ్ఞల వినియోగం పెరుగుతుంది.

అయితే ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వసతులు, సదుపాయాల్లో మాత్రం మెరుగు కనిపించడం లేదు. ఏ దేశమైనా తమ జనాభాకు కావలసిన సదుపాయాలను, అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రూపొందింస్తుంది. వారి ఆరోగ్యం, విద్య, వైద్యం, రక్షణ ప్రధాన అంశాలు కానీ ఇవేవి మన దేశంలో పట్టించుకోవడం లేదు. స్వాతంత్య్రం వచ్చినప్పటి జనాభాతో పోలిస్తే ఇప్పుడు ఇంచుమించు రెండు రెట్లు ఎక్కువగా పెరిగింది. కానీ సదుపాయాలు మాత్రం ఎక్కడ వేసిక గొంగళి అక్కడే ఉన్న చందంగా మారింది.
– దామోదర్‌ రెడ్డి