గాడి తప్పుతున్న విద్యావ్యవస్థ

         గాడి తప్పుతున్న విద్యావ్యవస్థ

education system
education system

దేశ భవిష్యత్‌ తరగతి గదిలో నిర్మితమవ్ఞతుందంటారు. నేటి పౌరులే రేపటి భావిభారత పౌరులంటారు. కానీ నేటి విద్యావ్యవస్థను చూసినా, విద్యార్థుల మనుగడ చూసినా, ఆశ్చర్యపోయే విషయాలెన్నో వెల్లడవ్ఞతాయి. వీటన్నింటిని చూస్తుంటే భవిష్యత్‌తరాలను తలుచుకుంటేనే బాధేస్తుంది. భయమేస్తుందనడంలో ఎలాంటి ఆశ్చర్యం అక్కర్లేదు. ఒకప్పుడు మన అభివృద్ధికి అక్షరాస్యత ఆటంకమని తలిచారు. కానీ క్రమంగా అక్షరాస్యత అభివృద్ధిచెందుతున్నా జరుగుతున్న పరిణామాల తీరు ఒకింత బాధకు గురి చేస్తున్నదనడంలో ఆశ్చర్యం అక్కర్లేదు.

గతంలో పాఠశాల విద్య పూర్తి చేస్తేనే ఎన్నో ఉపాధి అవకాశాలు, ఎంతో క్రమశిక్షణతో కూడిన జ్ఞానం వెలువడేది. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. గతంలో కేవలం ప్రభుత్వ పాఠశాలలున్న సమయంలో అరకొర ప్రైవేట్‌ పాఠశాలలో చదువ్ఞకున్న విద్యార్థులకు ఉపాధ్యాయుడంటే అమితమైన గౌరవం భయం ఉండేది. ఉపాధ్యాయులను చూస్తే విద్యార్థులు ఆ రకంగా భయపడేవారు. చూస్తేనే భయపడి దాక్కునే పరిస్థితి ఉండేది. అసలు కారణం దండన. వారిచ్చే దండన ఆ రకంగా ఉండేది. కానీ పరిస్థితులన్నీ మారాయి.అన్ని తిరోగమన మార్గంలో పయనిస్తున్నాయి.

నేడు ప్రభుత్వపాఠశాలల్లో చదివే విద్యార్థులు తగ్గారు అంటే దీనికో కారణం ఉంది. అదేమిటంటే ప్రస్తుత వ్యవస్థలో ఎన్నో, మరెన్నో విద్యాసంస్థలు పుట్టగొడుగుల్లా వెలిసాయి. ప్రభుత్వ ఉపాధ్యాయులతో సహా, అన్ని తరహా ఉద్యోగస్తుల పిల్లలు సైతం ప్రైవేట్‌ విద్యాసంస్థలలో ప్రవేశిస్తున్నారు. వారిని చూసి దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలు సైతం వారి పిల్లలను ప్రైవేట్‌ పాఠశాలల్లో చేర్పించడానికే ఎక్కువ మక్కువ చూపి, అష్టకష్టాలు పడుతూ చదివించడం జరుగుతుంది. కానీ విషయమేమిటో అర్థంక కావడం లేదు. పిల్లలపై గల ప్రేమ కారణమా?

ప్రభుత్వ ఉద్యోగులు తగిన సమయం కేటాయించక, తగిన న్యాయం చేయలేమని తలచి వారి పిల్లలను ప్రైవేట్‌కు పంపిస్తున్నామనే వార్త సమాజానికి ఇస్తున్నట్లే కదా? గతంలో ప్రైవేట్‌ విద్యాసంస్థలలో సైతం వాటి జీవన మనుగడకే ప్రభుత్వ విద్యాసంస్థలతో పోటీపడి నాణ్యమైన విద్యనిచ్చి, విద్యార్థులకు జ్ఞానం అందించి, వారి బతుకుతెరువ్ఞకు సుమార్గాలు అందించాయి. కానీ నేటి తరంలో కేవలం వ్యాపార సంస్థలుగా మారాయనడంలో ఎలాంటి సంశయం అక్కర్లేదు. దీనికి గల కారణాలెన్నో అందరికీ తెలిసిదే.

నేడు ప్రైవేట్‌ విద్యాసంస్థలో చదివే విద్యార్థులు ఏనాడో క్రమశిక్షణ తప్పారని, వారిని చూస్తేనే ఉపాధ్యాయులు భయపడే స్థితికి చేరుకున్నారన్నది జగమెరిగిన సత్యం. కారణమేమిటంటే సరైన ఉద్యోగ అవకాశాలు లేక తమ కుటుంబ పోషణ నిమిత్తం ప్రైవేట్‌లలో పనిచేస్తూ చెప్పుకోలేని బాధలకు గురవ్ఞతున్నారనేది సత్యం. ఇక్కడ విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యనందించాలనుకుంటే ఒకవైపు యాజమాన్యం నుండి, మరోవైపు తల్లిదండ్రుల నుండి ఒత్తిడులు ఎదుర్కోవలసిన పరిస్థితి నెలకొంటుంది.

అందుకోసం ప్రైవేట్‌ ఉపాధ్యాయులు సైతం కేవలం ఉద్యోగం చేస్తున్నారే తప్పా విద్యార్థిని సక్రమైన మార్గంలో నిలుపుతూ నాణ్యమైన విద్యనందించలేని పరిస్థితి. ఎన్నో కష్టాలు అనుభవించి జ్ఞానం పొంది ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు పొంది, రేపటి భావి భారత పౌరులను తీర్చిదిద్దే ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎందుకు వారి పిల్లలను మరుస్తున్నారనేది జవాబులేని ప్రశ్నగా మిగిలిపోయింది.

ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయలుగా పనిచేసేవారు తమ పిల్లలను కూడా అదే పాఠశాలల్లో చేర్పిస్తే మధ్యతరగతి కుటుంబాలకు చెందిన పిల్లలు సైతం ధైర్యంతో పాఠశాలకు వస్తారు. అప్పుడు పాఠశాలలు మూతపడే పరిస్థితి ఉండదు. అలాగే మరికొన్ని ఉపాధి అవకాశాలు వస్తాయి. ఆ తర్వాత ప్రతి ప్రభుత్వ ఉద్యోగి సైతం తమ పిల్లలను ఇక్కడే చదివించాలనే ఒత్తిడిని తీసుకురావడానికి అవకాశం ఉంటుంది.

విద్యావ్యవస్థ ప్రక్షొళనకై ప్రభుత్వం ఒక కమిటీని వేసి అన్ని తరహా పాఠశాలలో పరిశోధించి తగిన సమస్యలకు పరిష్కార మార్గాలను చూపుతూ నిర్ణయం తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వపాఠశాలలో సైతం కొంత మంది ఉపాధ్యాయులు నిస్వార్థంతో మేలు చేయాలనే తపనతో పనిచేస్తున్నారు. కానీ వారిని మనుగడలోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారనేది వాస్తవం.
– పోలం సైదులు