గండం గడిచిందా!

                                  గండం గడిచిందా!

WHITE HOUSE
WHITE HOUSE

మెరికా గత వారం ఒక అనూహ్యమైన సంక్షో భాన్ని చవిచూసింది. మొత్తం ప్రభుత్వ కార్యకలాపాలు స్తం భించిపోయాయి. ఆర్థిక లావాదేవీలన్నీ నిలిచిపోయాయి. గతఐదేళ్లలో ఎప్పుడు ఎరుగనంతటి ఆర్థిక సంక్షోభం, దానికి ప్రధాన కారణం – ఫెడరల్‌ ప్రభుత్వ మనుగడకు అవసరమైన స్వల్పకాల వ్యయానికి వీలుకల్పించే బిల్లుకు సెనెట్‌ అనుమతి ఇవ్వకపోవడం. డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్ష పదవిని చేపట్టి సరిగ్గా ఒక ఏడాది పూర్తయిన సందర్భంలోనే ఈ పరిణామం సంభవించడంతో ఆయన ప్రభుత్వం కూడా తొలిసారి సంక్షోభంలో చిక్కుకొంది. ప్రతిపక్ష డెమొక్రాట్లతో కొందరు అధికార రిపబ్లికన్లు కుమ్మక్కవడమే దీనివెనుక జరిగిన రాజకీయ నాటకంగా భావిస్తున్నారు. రిపబ్లి కన్లకు అడుగడుగునా అడ్డుతగులుతూ ట్రంప్‌ ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తున్న డెమొక్రాట్లు ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం సమయంలో తమ ప్రతాపం చూపడంతో ట్రంప్‌ ప్రభుత్వానికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది.

రక్షణ శాఖకు, ఇతర ఫెడరల్‌ సంస్థలకు స్వల్పకాలిక సేవలు అందించడానికి ఉద్దేశించిన కీలక బిల్లును గత గురువారం (18, జనవరి) సెనెట్‌లో ప్రవేశపెట్టారు. ఇది ఆమోదానికి నోచుకొని ఉంటే దాదాపు ఫిబ్రవరి నెలాఖరుదాకా ప్రభుత్వానికి నిధుల కొరత ఏర్పడి ఉండేదికాదు. ఈ బిల్లును గట్టెక్కించడానికి చివరి నిము షంలో అటు డెమొక్రాట్లు, ఇటు రిపబ్లికన్లతో సమావే శాలు నిర్వహించినప్పటికి ప్రయోజనం లేకపోయింది. బిల్లు ఆమోదానికి అవసరమైన 60 ఓట్లు కూడా లభిం చని పరిస్థితి ఏర్పడడంతో ట్రంప్‌ ప్రభుత్వం గత పన్నెండు నెలల్లో మొదటిసారిగా పెను సంక్షోభంలోకి జారిపోయింది. అనుకూలంగా 48 ఓట్లు, వ్యతిరేకంగా 50ఓట్లు వచ్చాయి. ఈ అంశంలో డెమొక్రాట్లకు కొంద రు రిపబ్లికన్లు సహకరించడం వల్లనే బిల్లుకు వ్యతిరేక ఓట్లు పెరిగాయి. ఇక్కడ ఇంకో కారణం కూడా కనిపి స్తోంది.అమెరికా నుంచి గెంటివేత ముప్పును ఎదు ర్కొంటున్న అక్రమ వలసదారుల అంశంపై ట్రంప్‌ తమతో చర్చలకు వచ్చేలా చేయడానికి డెమొక్రాట్లు బిల్లును అడ్డుకొనడానికి మరో కారణమై ఉంటుందని కూడా భావిస్తున్నారు. అందుకే డెమొక్రాట్లు అలాంటి ఎత్తుగడ వేసి ఉంటారని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు.

పన్ను కోతలతో తాము సాధించిన అద్భుత విజయాలను ఓర్వలేకనే డెమొక్రాట్లు ఈ కుయుక్తులకు పాల్పడ్డారన్నది హిల్లరీ అనుచరుల అభిప్రాయం. ‘అధ్యక్షుడుగా ఏడాది పూర్తవ్ఞతున్న నాకు డెమొక్రాట్లు ఇవ్వాలనుకొన్న కానుక ఇది అంటూ ట్రంప్‌ చాలా నిర్వేదంగా భావించారంటే ఈ పరిణామంతో ఆయన ఎటువంటి కలత చెందారో అర్థమవ్ఞతుంది. ప్రభుత్వం స్తంభించిపో యిన నేపథ్యంలో దాదాపు ఆరు లక్షల మంది ఫెడరల్‌ ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులకు హాజరుకాలేని పరి స్థితిఏర్పడింది. ఈ ప్రతిష్టం భన సమయంలో వారికి వేతనం కూడా లభించని దుస్ధితి. అత్యవసర సర్వీసు లు మినహా మిగిలిన అన్ని రకాల సర్వీసులు స్తంభించిపోవడంతో వివిధ ప్రాంతా ల్లో వేల కోట్ల నష్టం వాటిల్లి తుదకు మార్కెట్లన్ని కూడా స్తంభించిపోయాయి. గత సోమవారం నుంచి ఈ ప్రతి కూల ప్రభావం ఎక్కువవడంతో అమెరికా ఆర్థిక వ్యవస్థ మొత్తంగా కుప్పకూలే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ కార్యకలాపాలు ఇలా స్తంభించిపోయిన ఘటన చివరిసారి 2013లో సంభవించింది. అప్పటితో పోల్చితే ఇప్పటి ప్రజలకు ఎక్కువ ఇబ్బందులు తలెత్త లేదనీ, సైనిక కార్యకలాపాలు యధావిధిగా కొనసాగా యనీ అంటున్నారు.

గతంలో 2013లో ఇలాంటి ఆర్థిక సంక్షోభం తలెత్తినపుడు దాదాపు 16 రోజులు ప్రభుత్వ కార్యకలాపాలన్ని స్తంభించిపోయాయి. దానితో పోల్చితే ఈసారి తీవ్రత ప్రభావం ఎక్కువే ఉన్నదనిపిస్తుంది. దానికంటె ముందు 1995-96లో కూడా ఇలాంటి పెనుసంక్షోభమే తలెత్తిందిగాని కొద్ది రోజుల్లోనే సమసి పోయింది. అయితే ఈసారి సంక్షోభ తీవ్రత అధికంగా ఉండడంతో నెల రోజులుపైనే ప్రజలు గడ్డుపరిస్థితు లను ఎదుర్కొనవలసి ఉంటుందని అనుకొన్నారు గాని మూడు రోజుల్లోనే తిరిగి అదుపులోకి వచ్చింది. డెమొక్రాట్లు పునరాలోచించుకొని బిల్లుకు మద్దతు తెలపడంతో సమస్య ప్రస్తుతానికి సద్దుమణిగింది. మొదట ససేమిరా అన్న డెమొక్రాట్లు చివరికి ఆ బిల్లును ఆమోదిస్తామని తెలుపడంతో సెనెట్‌81-18 ఓట్లు, ప్రతినిధుల సభలో 266-150 ఓట్లు వచ్చాయి. ఆకారణంగానే ట్రంప్‌ ప్రభుత్వం తిరిగి బతికిబట్టకట్ట గలిగింది. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు అమెరికాలోకి వలస వచ్చిన వేలాది మంది వలసదారుల భవిష్యత్తుపై డెమొక్రాట్లతో ఒక ఒప్పందానికి రావడానికి ట్రంప్‌ అంగీకరించడం వల్లనే అమెరికా ద్రవ్యసంక్షోభం నుంచి గట్టెక్కినట్లుగా తెలుస్తోంది.

ఫిబ్రవరి రెండో వారం వరకే సమస్య పరిష్కారమైందనీ, ఈలోగా ట్రంప్‌ ప్రభుత్వం తన మొండి వైఖరిని విడనాడి ప్రజా సమస్యలపై సరైన విధంగా స్పందించాలనీ డెమొక్రాట్లు అంటున్నారు. ట్రంప్‌ వైఖరి ఎలా ఉంటుందనే విష యంపైనే అమెరికన్ల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని కూడా తెలుస్తోంది. హఠాత్తుగా అమెరికా సంక్షోభంలో పడడంతో ట్రంప్‌ రాజీనామా చేస్తారనే ఊహాగానాలు కూడా వెల్లువెత్తా యి. అయితే మూడు రోజుల్లోనే ఆ సంక్షోభం పరిష్కా రమవడంతో ట్రంప్‌ ప్రస్తుతానికి గండం నుంచి బయట పడినట్లుగా భావిస్తున్నారు. ఇక్కడ గమనించవ లసిన విషయం ఒకటి ఉంది. ఏడాది క్రితం ఎన్నికల సమ యంలో కేవలం సాధారణ మెజారిటీతో ట్రంప్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది.కానీ ఏడాది పొడవ్ఞనా ఆయన తీసుకొన్న నిర్ణయాలన్నీ వివాదాస్పదమైనవే కావడంతో క్రమంగా సంక్షోభంవైపు ఒరిగిపోయింది.మరో మూడేళ్ల పాటు ట్రంప్‌ ప్రభుత్వం కొనసాగాలంటే మరోసారి సంక్షోభంరాకుండా జాగ్రత్తపడవలసి ఉంది. రూపాయి ఖర్చు చేస్తే నాలుగు రూపాయలు రావాలను కొనే వ్యాపారవేత్త ట్రంప్‌కు ఇది తెలియదనుకోగలమా!
– ఎ.వి.వి. ప్రసాద్‌