కెటలోనియా రిపబ్లిక్‌ అవతరించేనా?

City
City

కెటలోనియా రిపబ్లిక్‌ అవతరించేనా?

స్పెయిన్‌ ఈశాన్య ప్రాంతమైన కెటలోనియాను ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలని కోరుతూ ఆ ప్రాంతం లో ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. మీరు స్వతంత్ర కెటలోనియా రిపబ్లిక్‌ను కోరుకుంటున్నారా? అనే ప్రశ్నకు ఆ ప్రాంతంలో నివసి స్తున్న 7.5 మిలియన్ల జనాభాలో అధిక సంఖ్యాకులు ‘అవ్ఞను అని ఓటు వేస్తే వెనువెంటనే యూరప్‌లో కొత్త దేశంగా కెటలోనియా అవతరిస్తుంది. ఆరు నూరైనా రెఫరెండం నిర్వహించి తీరుతామని వేర్పాటు వాదపార్టీలు చెబుతుండగా ఎట్టి పరిస్థితుల్లో కూడా రెఫ రెండం జరగనివ్వబోమని స్పెయిన్‌ ప్రధాని మారియానో రాజో§్‌ు ప్రకటించారు. కెటలోనియాలో అత్యవసర పరిస్థితిని ప్రకటించి 10 మిలియన్ల బ్యాలెట్లను సీజ్‌ చేసిన కేంద్ర ప్రభుత్వం రెఫరెండం జరిపే అధికారిక వెబ్‌సైట్‌ను నిషేధించింది. ఏబీరియన్‌ ద్వీపకల్పంలో భాగమైన కెటలోనియా ఒకప్పుడు ‘గోధులునివసించిన ప్రాంతం. గోత్‌లాండ్‌-కోత్‌లాండ్‌- కేటలాండ్‌- కెటలోనియాగా రూపాంతరం చెందింది. పైరనీస్‌ పర్వతాలు, బీచ్‌రిసార్ట్‌లకు ప్రసిద్ధిగాంచిన కెటలోనియా స్వతంత్ర ప్రతిపత్తి గల ప్రాంతం. బార్సిలోనా రాజధానిగా గల ఈ ప్రాంతంలో బార్సిలో నా,గిరోనా, లైడా,తర్రగోనా అనే నాలుగు రాష్ట్రాలున్నాయి.

1932 నుండి రాజ్యాంగ బద్ధ రాజరిక పాలనలో గల ఈ ప్రాంతం విస్తీర్ణం 32,108 చ.కి.మీ కాగా జనాభా 7.5 మిలియన్లు అనగా స్విట్జ ర్లాండ్‌ దేశ జనాభాకు సమానం. అధిక సంఖ్యాక ప్రజలు కేటలాన్‌ భాషనుమాట్లాడుతుండగా మరికొందరు స్పానిష్‌, ఒస్పిటాన్‌ మాట్లాడుతారు. 1939-1975 వరకు స్పెయిన్‌ను పాలించిన జనర ల్‌ ప్రాంకో నియంతృత్వంలో కేటలోనియా స్వతంత్ర ప్రతిపత్తికి భంగం వాటిల్లింది. ప్రాంకేశకం ముగిసాక 1978లో కెటలోనియా ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని స్వీకరించింది.1979లో స్వతంత్ర ప్రతి పత్తిని పొందింది. 2006లో జరిగిన రెఫరెండం ద్వారా పార్లమెంట్‌ ఏర్పాటుతోపాటు ప్రత్యేకార్థికాధికారాలను ఈ ప్రాంతం పొందింది.

అయితే 2010లో స్పెయిన్‌ రాజ్యాంగ ధర్మాసనం ఈ ఆర్థికాధి కారాలకు కత్తెర వేయడంతో ప్రత్యేక దేశ వాదం హల్లి భగ్గుమంది. ప్రజలు వేలాదిగా వీధుల్లోకి వచ్చి ప్లకార్డులు చేతబట్టి ఆందోళనలు చేస్తూవచ్చారు. ప్రజాభిప్రాయం మేరకు 2015లో జరిగిన ఎన్నికల్లో తత్ఫలితంగా 9.11.2015న కేటలోనియా విధాన నిర్ణేతలు 2017 నాటికి ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేసే ప్రణాళికను ప్రకటించారు. సెప్టెంబరు 6,2017న కెటలోనియా పార్లమెంట్‌ తీర్మాణంచేస్తూ అక్టోబరు ఒకటిన రెఫరెండం చేయాలని ప్రకటించింది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే స్పెయిన్‌ రాజ్యాంగ ధర్మాసనం కెటలోనియా పార్లమెంట్‌ చట్టాన్ని కొట్టివేస్తూ ప్రాంతీయ ప్రభుత్వ అధికారాలను తొలగించింది.వేర్పాటు వాదులను పెద్దఎత్తున అరెస్టు చేయడంతోపాటు వారి ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టే చర్యలు చేప ట్టింది. నిద్రాణంగా ఉన్న కెటలోనియా సమస్యకు ఆర్థికపరమైన కారణాలతోపాటు కేంద్రం అణచివేత వైఖరి కారణంగా కనిపిస్తోంది. ఒకప్పుడు పికాసో శిక్షణ పొందిన బార్సిలోనా 1992 వేసవి ఒలిం పిక్స్‌కు ఆతిధ్యమిచ్చిన గొప్పనగరం.1000 సంవత్సరాల చరిత్రగల ఈ ప్రాంతంలో స్పెయిన్‌ మొత్తం జనాభాలో 16శాతం నివసిస్తుం డగా స్పెయిన్‌ జిడిపిలో 19 శాతం ఇక్కడి నుండే వస్తుంది. అంటే కెటలోనియా పొందే దానికంటే దేశానికి ఇచ్చేదే ఎక్కువ.

2003 బడ్జెట్‌లో 16శాతం నిధులను ఈ ప్రాంతానికి కేటాయించగా 2015 నాటికి ఇది 9.5 శాతానికి తగ్గిపోయింది. ఈ వివక్షతను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు.ప్రస్తుత రెఫరెండంకు ఎంత మంది మద్దతు పలు కుతారనేది అందరినీ ఆలోచింపచేస్తున్న ప్రశ్న. 2014లో నిర్వహిం చిన అనధికారిక రెఫరెండంలో మొత్తం 5.4 మిలియన్‌ ఓటర్లలో 2.2 మిలియన్‌ మాత్రమే అనుకూలంగా ఓటువేశారు. మరి ఈసారి వేర్పాటు వాదులు చెబుతున్నట్లుగా 80 శాతం మంది ‘అవ్ఞను అని ఓటు వేస్తారా అనేది సందేహమే.

గత జూలైలో చేసిన ఒక సర్వేలో 41 శాతం మందే అనుకూలమని తేలింది. 2014లో సెప్టెంబర్‌ 11న కేటలోనియాడే సందర్భంగా సమావే శానికి 1.8 మిలియన్‌ ప్రజలుహాజరుకాగా 2017సమావేశంలో 1 మిలియన్‌ ప్రజలే పాల్గొ న్నారు. అంటే ప్రజామోదం తగ్గుతుందనేది వాస్తవం.ఏదిఏమైనా 21వ శతాబ్దం వేర్పాటు వాద ఉద్యమాలకు ప్రసిద్ధి గాంచింది. 2017 నాటికి దాదాపు 50 ఉద్యమాలు జరుగగా చాలా ఉద్యమాలు విఫలమయ్యాయి. అనేక ఉద్యమాలలో హింస తలెత్తి లక్షలాది మంది సమిధలవ్ఞతున్నారు. న్యాయ సమ్మతమైన దక్షిణ సుడాన్‌ లాంటి స్వతంత్ర ఉద్యమాలకు ప్రపంచదేశాలు మద్దతు తెలియచేశాయి. కెటలోనియా రిపబ్లిక్‌ అవతరణకు తన స్వంత ప్రజల ఆమోదంతోపాటు అంతర్జాతీయ, జాతీయ మద్దతు సహకారం అవసరం.

-తండ ప్రభాకర్‌ గౌడ్‌