కార్పొరేట్‌ ‘వల’లో రోగులు విలవిల

రాష్ట్రంలో విజృంభిస్తున్న వ్యాధులు గత రెండు నెలలుగా వైద్యశాలల యాజమాన్యానికి కాసుల పంట పండిస్తుంటే సామాన్య ప్రజానీకానికి కునుకు లేకుండా, ఆర్థికపరమైన సమ స్యలతో అట్టుడుకేటట్లు, శారీరక, మానసిక క్షోభకు కారణమైంది. ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ఈ సంవత్సరం డెంగ్యూ వ్యాధి ప్రభావం ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేసిందన్నది వందకు వంద శాతం వాస్తవం. ప్రభుత్వం అన్ని సమకూర్చాం, అని సౌకర్యాలు కల్పించాం, ఎలాంటి బాధలు లేవని ప్రకటనలకు పరిమితమైంది. కానీ వాస్తవిక పరిస్థితులను చవిచూసిన వాడికే వాటి బాధ అర్థం అవ్ఞతుంది. ప్రభుత్వ సౌకర్యాలు కంటికి కనిపి స్తాయి. ఎప్పుడైతే ఈ వ్యాధి వైరల్‌గా మారి పసికూనల నుండి మొదలుకొని 15 సంవత్సరాల వయస్సున్న వారిపట్ల ఎలాంటి ప్రభావం చూపిందో, వాటిని ప్రైవేట్‌,కార్పొరేట్‌ ఆస్పత్రులు ఎలా ఆర్థికపరంగా వినియోగించుకుంటున్నారో ఆస్పత్రులకు తిరిగిన వారికే తెలుస్తుంది.సీజన్‌ మారింది. వైరల్‌ వ్యాధులు సోకుతు న్నాయి.వెంటనే తోచిన వైద్యశాలలో చికిత్సపొందితే సరిపోయేది. ఇదంతా గతం.కానీ ఈ సంవత్సరం పరిస్థితి తీవ్ర ఆందోళనక రంగా ఉన్నదనడంలోఎలాంటి అతిశయోక్తిలేదు. ఎప్పు డైతే ఈ వ్యాధి ప్రారంభమైందో కార్పొరేట్‌ వైద్యశాలలు, ప్రైవేట్‌ ఆస్పత్రు లు, ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు గ్రామాలలో ఉన్న ఆర్‌ఎంపి ఆస్పత్రులు సైతం జనాలతో కిక్కిరిసిపోయానడంలో ఎలాంటి అవాస్తవం లేదు. సామాన్య మానవ్ఞడు గతంలో వలె కాకుండా తమ పిల్లలను ఎంతో గారాభంగా పెంచుకుంటున్న తరుణంలో వారికేమైనయితే తట్టుకోలేని పరిస్థితి. ఇలాంటి సందర్భంలో వారి పిల్లలు ఎలాంటి అనారోగ్యానికి పాల్పడిన ముందుగా సంప్రదిం చేది దగ్గరలో ఉన్న గ్రామస్థాయి ఆర్‌ఎంపిని. అక్కడ తగ్గకపోతే దగ్గరలో ఉన్న చిన్నచిన్న పట్టణాలలో ఉన్న ప్రైవేట్‌ఆస్పత్రులకు వెళ్లడం.అక్కడ సైతం కిక్కిరిసి జనాలలో ఎన్నో రాజకీయాలు. ఏదోలా అన్నింటిని దాటుకుంటూ డాక్టర్లనుసంప్రదించడం,ఆయన విభిన్న పరీక్షలు చేయడం,రెండు మూడు రోజులు వైద్యం కల్పిం చి వేలకు వేలు ఫీజులాగి ఇప్పుడు వ్యాధి నిమిత్తం రక్తకణాలు తగ్గుతున్నాయి. ఎంత ప్రయత్నించినా అర్థంకావడం లేదు.మీరు ఎంతో తొందరగా పట్నం వెళ్లి చూయిం చుకుంటే అంత మంచి దని చెప్పడంతో ఎలాంటి మానవ్ఞడైనా అలాంటి మాటలు విన్న తర్వాత నిలకడలేకపోగా ఒకింత ఆందోళనకుగురై రక్తసంబంధాన్ని కాపాడుకోవడానికి తహతహలాడ టమనేది సర్వసాధారణం. కానీ పేదవారికి ఆర్థిక పరిస్థితులు అంతగా అనుకూలించకపోయినా మొండిధైర్యంతో ముందడుగు వేయకతప్పని పరిస్థితి.పట్టణాల్లోని ఆస్పత్రులకు వెళ్లితే రోగం నయమవ్ఞతుందేమోకానీ తల్లిదండ్రులు పలు అనారోగ్యాల బారిన పడటం ఖాయం. అక్కడి ప్రతి చిన్న పనికి సైతం డబ్బు వెచ్చిం చాల్సిందే. కార్పొరేట్‌ వైద్యశాలలో గదులను ఊడ్చే ఆయమ్మల నుంచి మొదలుకొని వైద్యాన్నందించే పెద్ద డాక్టర్ల వరకు రోగి కుటుంబ సభ్యుల అమాయకత్వాన్ని, సమస్యను ఆసరాగా చేసుకొని వారి నుంచి డబ్బును లాక్కోవడం జరుగుతుంది. ముందుగా ప్రవేశం పొందిన రోజే పదివేల నుండి ఆపైగా ఖర్చు పెట్టాల్సిందే. ఆ తర్వాత మందులని, వివిధ రకాల పరీక్షలని, బెడ్‌ఛార్జీలని దాదాపు నాలుగు నుండి వారం రోజుల పాటు అక్కడ ఉంచుకుంటారు. ప్రత్యేకంగా ఇప్పుడున్న అనారోగ్య పరిస్థితి రక్తకణాలు తగ్గడం. వైద్యనిపుణుల సమాచారం మేరకు తెల్లరక్తకణాలు అనేవి చిన్నజ్వరం వచ్చినా తగ్గడం, పెరగడం సాధారణం. దానికి ఆందోళన అక్కరలేదని సలహాలిస్తుంటారు. కానీ వైద్యశాలలో చేరినప్పటి నుండి పరిస్థితి మన నియంత్రణలో లేకుండా చేస్తారు. వారి రిపోర్టులు కూడా చూపించని పరిస్థితి. కారణాలు అడిగితే ఆందోళన చెందే విధంగా సమాధానాలివ్వడం జరుగుతుంది. డిశ్చార్జ్‌ అయ్యే రోజు వరకు వేసిన బిల్లును చూస్తే ఎంత చల్లని వాతావరణంలోనైనా సరే చెమటలు పట్టాల్సిందే. ప్రజల క్షేమం, సంక్షేమం, అభివృద్ధి కోసం పాలకులను ఎన్ను కుంటాం. వారు పేదప్రజల గురించి ఆలోచించి పలు పథకాలను చేపట్టి తండ్రిపాత్ర పోషించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. కానీ ఏవో ప్రకటనలు ఇచ్చుకొని, ఏమి జరగనట్లు ప్రవర్తిస్తూ లెక్కలకే పరిమితమై, తమ పదవ్ఞలను కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉండటం గమనించవచ్చు. ప్రభుత్వం తీరు మారాలి. వీలైతే రహస్యంగా ప్రభుత్వ, ప్రైవేట్‌, కార్పొరేట్‌ ఆస్పత్రులలో సర్వేలుచేయించో, ఆకస్మిక తనిఖీలు గా వించో వాస్తవిక పరిస్థితిని తెలుసుకొని చర్యలు తీసుకోవాలి.

  • పోలం సైదులు

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/