కాగితాల్లోనే ముస్లింల సంక్షేమం

muslim-women-

కాగితాల్లోనే ముస్లింల సంక్షేమం

ప్రజాస్వామ్య, లౌకికదేశమైన స్వతంత్ర భారతావని లో ఒక పెద్ద మానవ సమూహం అన్యాయానికి, అణచివేతకు, వివక్షకు గురికావడం చరిత్ర క్షమించ ని నేరం కాకూడదంటే, ప్రభుత్వాలు వెంటనే స్పందించాలి. రాజ్యాంగబద్ధమైన వారి హక్కులకు భంగం కలగకుండా నిర్దిష్ట మైనచర్యలు తీసుకోవాలి. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి ఆరు న్నర దశాబ్దాలు గడిచిపోయాయి. అయినా ముస్లింల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న సామెతను తలపిస్తోంది. స్వాతంత్య్రానంతర ఈ సుదర్ఘీ ప్రస్తానంలో దేశం అనేక రంగా ల్లో అభివృద్ధిని సాధించింది. కానీ స్వాతంత్య్ర ఫలాలు ముస్లిం సముదాయానికి అందని ద్రాక్షగానే మిగిలిపోయాయి. స్వా తం త్య్రానికి పూర్వం ముస్లిం సమాజ స్థితిగతులు ఎలా ఉన్నాయో స్వాతంత్య్రానంతరం ఈనాటికీ అలాగే ఉన్నాయంటే అతిశయో క్తికాదు. వారి జీవన ప్రమాణాల్లో చెప్పుకోదగిన మార్పులేవీ అంతగా సంభవించలేదు.

ఈనాటికీ అత్యధిక శాతం ముస్లింలు చిన్న చిన్న వృత్తులు నిర్వహిస్తూనే జీవనం వెళ్లబుచ్చుతున్నారు. సైకిళ్లకు పంక్చర్లు వేసుకోవడం, బిందెలకు మాట్లు వేయడం, గొడుగులు,తాళాలు బాగుచేయడం, రిక్షాలాగడం, సైకిళ్లపై తిరు గుతూ చిన్న చిన్న వ్యాపారాలు చేయడం, హమాలీ పనిచేయ డం, ఇంకా ఇలాంటి చిల్లమల్లర వృత్తుల్లోనే దుర్భరమైన జీవనం గడుపుతున్నారు. సొంత వ్యవసాయాలు లేవ్ఞ.మురికివాడల్లో చిన్న చిన్న గుడిసెల్లోనే నివాసముంటున్నారు. అత్యధిక శాతం మందికి ఆ సొంత గుడిసెలు కూడా లేవ్ఞ. విద్యా, ఉద్యోగ రంగాల్లో వారికి ప్రభుత్వాలుఅమలు చేస్తున్న ఏ సంక్షేమ పథకాలు కూడా వారికి అందడం లేదు. విద్య, ఉద్యోగ, ఆర్థికరంగాల్లో మిగతా వెనుకబడిన వర్గాలకంటే ముస్లిం లు ఏవిధంగానూ మెరుగ్గా లేరని అనేక సర్వేలు వెల్లడించాయి. దేశ ముస్లిం జనాభాలో 63.7 శాతం మంది ఇంకా దారిద్య్రరేఖ కు దిగువనే జీవనం గడుపుతున్నారంటే పరిస్థితిని అర్థం చేసు కోవచ్చు.ఏ దేశ ప్రగతి వికాసాలైనా, అభివృద్ధి ఫలాలైనా ప్రాథమి కంగా అన్నివర్గాల ప్రజలకు నిష్పక్షపాతంగా, సమానంగా అందా లి. అల్పసంఖ్యాక సముదాయాలపట్ల వివక్ష, అసమానత, అన్యా యపూరితమైన వైఖరి నాగరిక సమాజానికి, అందునా భారత్‌ వంటి లౌకిక ప్రజాస్వామ్య దేశానికి ఎంత మాత్రం శోభించదు. దేశంలోని అతిపెద్ద రెండవ మెజారిటీ సముదాయ ప్రజలు ఇంత టి దుస్థితిలో ఉంటే, దేశ స్వాతంత్య్రానికి, దేశ ప్రగతి వికాసాలకు అర్థం పరమార్థం లేకుండాపోతుంది. భారత్‌ లాంటి లౌకిక దేశా నికిఇదిమాయనిమచ్చగా మిగిలిపోతుంది.

అందుకే భారత రాజ్యాం గ నిర్మాత డాక్టర్‌ అంబేద్కర్‌ దేశ విభజన తరువాత 1948 నవంబర్‌ నాలుగవ తేదీన కొత్తగా ఏర్పాటైన అసెంబ్లీలో మాట్లా డుతూ ప్రస్తుతం ఈ దేశంలో ముస్లింలు అల్పసంఖ్యాక వర్గంగా ఉన్నారు.ఒకవేళ అధికసంఖ్యాకులు అల్పసంఖ్యాకులకు వ్యతిరేకం గా విద్వేష వాతావరణాన్ని సృష్టించి వారి పట్ల మతపరమైన రాజకీయపరమైన వివక్షను ప్రదర్శిస్తే అల్పసంఖ్యాక వర్గం విస్ఫో టక పదార్థంలా భగ్గుమంటుందన్న విషయాన్ని గుర్తు చేసుకోవా లని సూచించారు. అధిక సంఖ్యాకులు అల్పసంఖ్యాకుల పట్ల వివక్ష పక్షపాత విధానాలను కొనసాగిస్తే అనేక త్యాగాలతో సాధించిన స్వతంత్ర భారత భవిష్యత్తు మసకబారిపోతుంది. డాక్టర్‌ అంబేద్కర్‌ ఈ సూచనలను గత ఆరున్నర దశాబ్దాలుగా ఏ పాలకవర్గమూ పట్టించుకోలేదు.

కనీసం ఆలోచించనైనా లేదు. దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్‌ పార్టీతో సహా, జనతాపార్టీ, నేషనల్‌ ఫ్రంట్‌, భారతీయ జనతాపార్టీలన్నీ ముస్లిం సముదాయాన్ని కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తాయి తప్ప వారి సంక్షేమానికి ఏమీ చేయలేదు. కేవలం ఎన్నికల సమయంలో తాత్కాలిక తాయిలాలను ప్రకటించి ముస్లింల ఓట్లను కొల్లగొట్టా యి. తాయిలాలకు లొంగకపోతే నయానా, భయానా తమ దారిలోకి తెచ్చుకోడానికి అవసమైతే ఏ విధానాన్ని అనుసరించడా నికైనా అవి వెనుకంజ వేయవు.

దేశంలో అతిపెద్ద రెండవ మెజారిటీ వర్గంగా ఉన్నముస్లిం సముదాయం పట్ల పాలకవర్గాలు అనుసరిస్తున్న తీరు ఇది. 1953లో నియమించిన కాలేెల్కర్‌ కమి షన్‌ దగ్గర నుండి 2004 రంగనాధమిశ్రా కమిషన్‌ల నివేదికలు అటకెక్కాయి. 2005 మార్చిలో జస్టిస్‌ రాజేందర్‌ సచార్‌ నేతృ త్వంలోఏర్పాటైన ఉన్నతస్థాయి కమిషన్‌ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి, లోతుగా అధ్యయనం చేసి, గత అరవై సంవత్సరాలుగా ముస్లిం సముదాయం ఎదుర్కొంటున్న సమస్యలు, నిరంతరా యంగా వారిపట్ల కొనసాగుతున్న వివక్ష, జరుగుతున్న అన్యాయా లను కళ్లకుకట్టింది. సామాజిక, ఆర్థిక, విద్య,ఉద్యోగ, ఉపాధి, రాజకీయ తదితర అన్నిరంగాల్లో ముస్లింల వెనుకబాటును స్పష్టం గా చిత్రీకరించింది. వారి సంక్షేమానికి చేపట్టవలసిన చర్యలనూ సిఫారసు చేసింది. కానీ పాలకవర్గాలు గత నివేదికలకు లాగానే జస్టిస్‌ సచార నివేదికనూ బుట్టదాఖలు చేశాయి. పాలకులకు ముస్లిం సంక్షేమం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదని, వారికి కావల సింది కేవలం ముస్లింల ఓట్లు మాత్రమేనని దీనిద్వారా మరోసారి రుజువైంది.

అందుకని ముస్లిం సముదాయం జాగృతం కావల సిన అవసరం నేడు ఎంతైనా ఉంది. ఓటు బ్యాంకు రాజకీయా లకు వారు తమ సంక్షేమాన్ని పణంగా పెట్టవలసిన అవసరం ఎంత మాత్రం లేదు. రానున్న స్థానిక సంస్థల్లో గానీ, జరగబో యే ఎన్నికల్లో కానీ ముస్లింలు సామాజిక చైతన్యంతో నిర్దిష్టమైన రాజకీయ ప్రణాళికతో, సమైక్య రాజకీయ శక్తిగా రూపొంది, తమ హక్కుల్ని సాధించుకునే దిశగా వజ్రసంకల్పాలు కావాలి. తమను సరిగ్గా అర్థం చేసుకోగలిగే తమ న్యాయమైన వాటాను తమకు ఎలాంటి షరతుల్లేకుండా అంగీకరించే లౌకికవాదపార్టీలకు తమ సహకారాన్ని అందించి ప్రజాప్రాతినిధ్య చట్టాల్లో తమ వాటాను పొందడానికి ప్రయత్నించాలి.

రాజ్యాంగబద్ధమైన, మానవ హక్కు ల పునాదులపై ముస్లింలు తమ డిమాండ్లు కూడా విశదపరచాలి. రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక మౌలిక హక్కులుఎలాంటి వివక్ష లేకుండా ప్రజలందరికీ సమానంగా వర్తించాలి. జనాభా ప్రాతిపదికన సామాజిక,రాజకీయ,ఆర్థిక, ప్రైవేట్‌,పబ్లిక్‌ జీవన రం గాలన్నిటిలో అందరితోపాటు ముస్లింల ప్రాతినిధ్యానికి అవకాశం కల్పించాలి. ముస్లిం సంక్షేమం కోసం కనీసం పదివేల కోట్లతో ప్రత్యేక సబ్‌ప్లాన్‌ అమలు చేయాలి. ఎస్సీ,ఎస్టీ అత్యాచార నిరో ధక చట్టంలాగానే ముస్లింల కోసం మైనారిటీలపై అత్యాచార నిరో ధక చట్టాన్ని తీసుకురావాలి. ముస్లిం మైనారిటీల వ్యక్తిగత చట్టా ల పరిరక్షణకు పటిష్టమైన చర్యలుచేపట్టాలి.

మైనారిటీ ఎడ్యుకే షన్‌ బోర్డు, మైనారిటీ కార్పొరేషన్‌, వక్ఫ్‌బోర్డు, ఉర్దూ అకాడమీల పరిరక్షణకు ప్రత్యేకచర్యలు చేపట్టాలి. ఇప్పటికే అన్యాక్రాంతమైపో యిన వేల ఎకరాల వక్ఫ్‌ భూమిని, కోట్లాది రూపాయల ఇతరేతర ఆస్తుల్ని బాధ్యుల నుంచి తిరిగి రాబట్టాలి. ఇది కాని పక్షంలో నైతిక బాధ్యత వహిస్తూ ప్రభుత్వమే ముస్లింలకు నష్టపరిహారం చెల్లించాలి.వివిధ ప్రభుత్వ కంపెనీలు,సంస్థలు, బోర్డులు, యూని వర్శిటీల్లో మైనారిటీ సంస్థలకు, సభ్యులకు సముచిత ప్రాతి నిధ్యం కల్పించాలి.దయాదాక్షిణ్యాల హోదా కాకుండా చట్టబద్ధమై న గుర్తింపునివ్వాలి. సమాన హక్కుల కమిషన్‌ను ఏర్పాటు చేయాలి. విద్యా,ఉద్యోగ, ఉపాధి రంగాలతోపాటు పంచాయితీ మొదలు పార్లమెంటు వరకు ముస్లింలకు వారి జనాభా ప్రాతిపది కన రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి. ప్రధాని 15సూత్రాల కార్య క్రమాలకు చట్టబద్ధత కల్పించాలి. జాతీయ మైనారిటీ కమిషన్‌కు చట్టబద్ధత అధికారాలు కల్పించాలి. వక్ఫ్‌బోర్డు 1995 సెక్షన్‌ 20 ప్రకారం అన్ని రాష్ట్రాల్లో వక్ఫ్‌ కమిషనరేట్‌ ఏర్పాటుకు కేంద్రం ప్రత్యేక జి.ఓ.ను విడుదల చేయాలి. ఇంతపెద్ద ప్రజాస్వామ్య, లౌకిక దేశమైన స్వతంత్ర భారతావనిలో ఒక పెద్ద మానవ సమూహం అన్యాయానికి అణచివేతకు, వివక్షకు గురికావడం చరిత్ర క్షమించని నేరం కాకూడదంటే, ప్రభుత్వాలు వెంటనే స్పం దించాలి. రాజ్యాంగబద్ధమైన వారి హక్కులకు భంగం కలగకుండా నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలి.

– జలీల్‌ఖాన్‌