కల్తీ సామ్రాజ్యానికి అధికారులే కాపలాదారులా?

Duplicate Oil tiins
Duplicate Oil tiins

కల్తీ సామ్రాజ్యానికి అధికారులే కాపలాదారులా?

కల్తీ, కల్తీ, కల్తీ ఎటు చూసినా కల్తీ. తినే పప్పులో కల్తీ, తాగేనీటిలో కల్తీ, ఉప్పులో కల్తీ, నూనెలో కల్తీ, కారంకల్తీ, విత్తనాల్లో కల్తీ, చివరకు ప్రాణాపాయస్థితి నుండి కాపాడే అత్యసవర మందుల్లో కల్తీ. అదీ ఇది అని తేడా లేకుండా ఎక్కడ వీలైతే అక్కడ కల్తీసామ్రాట్లు విజృంభించిపోతు న్నారు. మొన్న హైదరాబాద్‌లో ఏకంగా పశువ్ఞల కొవ్ఞ్వతో తయా రుచేసిన నెయ్యిని విక్రయిస్తూ పట్టుబడ్డారు.ఎన్నోఎళ్లుగా ఈ వ్యా పారం చేస్తున్నారు. దర్యాప్తుల్లో తేలిన విషయాలు విస్తుపోతున్నా యి.

అలాగే అంతకుముందు ఖమ్మం జిల్లాలో లారీల కొద్దీ కల్తీ కారం బయటపడింది. విజయవాడ ప్రాంతంలో కొబ్బరినూనె భారీ ఎత్తునకల్తీ చేసిప్యాకింగ్‌ చేసే మిషన్లతోసహా పట్టుబడ్డాయి. పెట్రో లు కల్తీ నిరాటంకంగా జరుగుతూనే ఉంది. కేసులు పెడుతూనే ఉన్నారు.అయినా యధాతథంగా కొనసాగుతూనే ఉంది.ఇక మందు ల కల్తీ గురించి చెప్పాల్సిన పనిలేదు. తరచూ పట్టుబడుతూనే ఉన్నాయి. కేసులు పెడుతూనే ఉన్నారు. జైళ్లకు వెళ్లి వచ్చి తిరిగి అదే వ్యాపారం చేస్తున్నారు. అన్నిటికంటే మించి పాలల్లో కల్తీ చిన్నాపెద్దా అని తేడాలేకుండా అందరి ఆరో గ్యంపై దాడి చేస్తున్నది. లక్షలాది మంది తీవ్ర అనారోగ్యానికి గురైఆస్పత్రుల పాలవ్ఞతుండగా అందులో కొందరు శాశ్వత రోగపీడితులు అవ్ఞ తున్నారు.మరికొందరి ప్రాణాలు ఈ కల్తీకి బలై పోతున్నాయి.

ఈసమస్య ఇంత తీవ్రంగా ప్రజారోగ్యంపై దాడిచేస్తున్నా కల్తీ విలయతాం డవం చేస్తున్నా పాలకులు నియంత్రించే విష యంలో శ్రద్ధతీసుకోలేక పోతున్నారేమోననిపి స్తున్నది. అప్పుడప్పుడు జనం కన్నీరు తుడవడానికి ఉనికిని గుర్తు చేయడానికి మొక్కుబడిగా దాడులు చేస్తున్నారేతప్ప ప్రజల్లో ప్రాణా లతో ఆటలాడుకుంటున్న ఈ కల్తీని నిరోధించడానికి నిర్మాణాత్మక చర్యలు చేపట్టలేకపోతున్నారు. ఈ కల్తీ ఎక్కడో మూడోకంటికి తెలి యకుండా ప్రజల్లో చేరుకుంటుందంటే అదీ లేదు. ఇందులో రహ స్యం ఏమీలేదు. శ్రమించి మాటువేసి పట్టుకోవాల్సిన పని అంత కంటేలేదు. కల్తీ అమ్మకాలు రహస్యంగా జరగడం లేదు.

ఇందులో దొంగచాటు అసలే లేదు. పబ్లిక్‌గా ప్రదర్శించి మరీ అమ్ముతున్నా రు. ఇది ఎక్కడో మారుమూల గ్రామాల్లో జరగడం లేదు. ఇక్కడా అక్కడా అని తేడా లేకుండా దేశవ్యాప్తంగా అన్ని పట్టణాల్లో, నగరా ల్లో నిరాటంకంగా జరుగుతున్నది. అమాయక ప్రజలు నిలువ్ఞదోపి డీకి గురవ్ఞతున్నారు.ఆర్థికపరంగా నష్టపోతేపోయారు.కానీ ఆరోగ్యా న్ని కోల్పోతున్నారు.క్షయ,క్యాన్సర్‌, కాలేయ వ్యాధులు, ఒకటేమిటి రకరకాల రోగాలకు గురై కోలుకోలేక ఏళ్లతరబడి మంచానికి అంకి తమై కృంగి కృశించిపోతున్నారు. నిరుపేదలు నుండి కోటీశ్వరులు నిత్యం వాడే కాఫీ, టీ పొడిలో కల్తీ అంతకంతకు పెరిగిపోతున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.

దేశవ్యాప్తంగా టీ పొడి ఏటా దాదాపు నలభైకోట్ల కిలోలకుపైగా వాడుతుండగా రెండు తెలుగు రాష్ట్రాల్లోసుమారు మూడున్నరకోట్ల కిలోలవరకు వినియోగిస్తున్నట్లు అధికారవర్గాలే అంచనా వేస్తున్నాయి. ఇందులో భారీఎత్తున కల్తీ జరుగుతున్నది. జీడిమామిడికాయల పైపొరతోపాటు ఆకులు ఎండ బెట్టి పొడిచేసి కలుపుతున్నారు. జీడిమామిడి తోటలు విస్తారంగా ఉండే ఉత్తరకోస్తా ప్రాంతంలో ఈ కల్తీ కార్యక్రమం ఒక కుటీర పరిశ్రమగా వర్ధిల్లుతున్నది.దీనికితోడు ఇనుపరజనుకూడా కలుపుతు న్నారు. ఇందువల్ల తూకం పెరిగే అవకాశం ఉంది. ఇక అస్సాం తదితర ప్రాంతాల నుండి వచ్చే టీపొడిలో క్యాష్యూహస్క్‌ కలుపుతు న్నారు.

ఇక కొన్ని ప్రాంతాల్లో హోటళ్లలో వాడేసిన టీ పొడిని సేక రించి అందులో ఐదోవంతు కొత్త టీపొడిని కలిపి అమ్ముకుంటున్నా రు. ఇవేవి కొత్తవిషయాలు కాదు.అప్పుడప్పుడు అధికారులు చేసే దాడుల్లో బయటపడుతూనే ఉన్నాయి. ఇలాంటి టీపొడులు వాడితే తొలిదశలో అజీర్ణ సమస్యతో ప్రారంభమై అల్సర్‌గా మారి తుది దశలో క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉందని డాక్టర్లు చెప్తున్నారు. అలాగే ప్రజలు నిత్యం వాడే కారం, పసుపు, నూనెల్లో కూడా కల్తీ అదుపులేకుండాపోతున్నది.

కారంపొడిలో రంపపు పొట్టు, కంది పొట్టుపొడి కలుపుతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభుత్వం తరపున విద్యార్థులకు వసతిగృహాలకు సరఫరా చేసే సరుకుల్లో ఈ కల్తీ భారీ ఎత్తున ఉన్నట్లు సమాచారం. గతంలో కూడా ఎసిబి అధి కారులుజరిపిన దాడుల్లో ఇలాంటివి బయటపడ్డాయి. కేసులు నమో దు చేశారు. మందుల విషయంలో వేరే చెప్పక్కర్లేదు. ఇష్టానుసా రంగా కల్తీ చేస్తున్నారు. ప్రాణభిక్షపెట్టే మందులు అటూ ఇటూ అయినా ప్రాణాలుకబళిస్తాయి.ఈ విషయం తెలియందికాదు. అయి నా వీటి విషయంలో నిర్దిష్టమైన చర్యలు తీసుకొని కల్తీ మందులు ఏరివేసి అందుకు బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవడంలేదు.

తీసుకుంటున్నారనే నమ్మకాలు కూడా సన్నగిల్లుతున్నాయి. ఇక ఎరువ్ఞలు, క్రిమిసంహారక మందుల్లో కల్తీ తారాస్థాయిలో ఉందని చెప్పొచ్చు. వీటితో మోసపోయి దేశంలో ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇక మద్యం విషయం ప్రస్తావిస్తే అదొక ప్రత్యేక సామ్రాజ్యం. అధికా రికంగా సారా నిషేధం అమలులో ఉన్నా నాటుసారాకు అదుపు లేదు. దీనికితోడు చీప్‌ లిక్కర్‌ను ప్రవేశపెట్టారు. చీప్‌ లిక్కర్‌, కల్తీ గుండబా ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్నాయి.

అసలు సారా ను నిషేధించే కంటే సడలిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని కూడా చీప్‌ లిక్కర్‌ తీసుకువస్తున్నది. కల్తీ కల్లు గురించి చెప్పక్కర్లేదు. బాహాటంగానే అమ్మకాలు జరుగుతున్నాయి. ఎంతో మంది నిరుపే దలు బలైపోతున్నారు. ఇవన్నీ ప్రభుత్వానికి అధికారులకు తెలియం దికాదు.కల్తీ జరగకుండా చూసేందుకు వేలాది రూపాయలు జీతభ త్యాలు తీసుకుంటున్న అధికారులు కల్తీ సామ్రాజ్యానికి కాపలాదా రులుగా వ్యవహరించడం దురదృష్టకరం. కల్తీ కల్లు, లిక్కర్‌ తాగు తున్న పేదవర్గాల ద్వారా కోట్లకుకోట్లు పెరుగుతున్న ఆదాయాన్ని తమ ఖజానాల్లో నింపుకుంటున్న ప్రభుత్వం దాని వెనక ఎన్ని లక్షల కుటుంబాల కన్నీళ్లు ప్రవహిస్తున్నాయో, ఎందరి పేదల రక్తం మాంసాలు నీరై ఏరులై పారుతున్నదో ఆలోచించే పరిస్థితిలో లేదు.

మద్యాదాయమే మహాప్రసాదంగా భావిస్తున్న పాలకులకు ఈ గోడు వినిపించదు.ఇక అభంశుభంతెలియని చిన్నారులు ఇష్టపడే చాక్లెట్లు, బిస్కెట్లు, ఐస్క్రీమ్‌లు వంటి తినుబండారాలలో రకరకాల రంగులు, రసాయనిక పదార్థాలుకలిపి వారి అనారోగ్యానికి కారకులవ్ఞతున్నా రు. గతంలో హైదరాబాద్‌లో ఒక పేరు మోసిన స్వీట్‌స్టాల్‌పై అధి కారుల చేసిన దాడుల్లో విస్మయాన్ని కలిగించే విషయాలు వెలుగు చూశాయి.అమ్ముడుపోకుండా పాతబడిన స్వీట్లనురంగులు, రసాయ నికాలు కలిపి మళ్లీ కొత్తగా తాజాగా కన్పించే విధంగా తయారు చేసి ప్రజలకు అంటకడుతున్న విషయం బయటపడింది.

అప్పట్లో అదిసంచలనం కలిగించినా ఆ తర్వాత ఆకేసు ఏమైందో తెలియదు. ఇక రోడ్లపై అమ్ముతున్న తినుబండారాల గూర్చి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదేమో. అందులో భారీ ఎత్తున కల్తీ అయిన నూనెను వినియోగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. రాజకీయ పార్టీల కు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడమే తప్ప సామాన్యు లకు కలిగిస్తున్న ఇలాంటి సమస్యలపై దృష్టిసారించే సమయం చాలడం లేదు. ఒకవేళ ప్రతిపక్షంలో ఉన్న నేత లు విమర్శనాస్త్రాలు సంధిస్తే అన్నేళ్ల పరిపాల నలోమీరు ఏమిచేశారనే అధికారంలో ఉన్నవా రు ప్రశ్నిస్తున్నారు తప్ప సమస్య పరిష్కారం వైపు అడుగులు వేసే ప్రయత్నం చేయలేకపోతు న్నారు. నిజానికి కల్తీఅనేది ఇప్పటికప్పుడు పుట్టిందికాదు.ఏదో ఒకరాష్ట్రానికి పరిమితమైంది కాదు. దేశవ్యాప్తంగా ప్రబలిపోతున్నది.

మరో కోణం నుండి చూస్తే ఈ కల్తీ సామ్రాట్‌లకు పరోక్షంగానో,ప్రత్యేక్షంగానో కొందరు రాజకీయనాయకులతో సంబం ధాలున్నాయి. వారి అండదండలున్నాయి. అందుకే ఇది రోజురోజు కు పెరిగిపోతూ ప్రజాజీవితాన్ని నరకప్రాయం చేస్తున్నా నిరోధించే ప్రయత్నం త్రికరణశుద్ధిగా జరగడం లేదు. ఫలితంగా కల్తీ బారిన పడి దేశవ్యాప్తంగా లక్షలాది మంది అమాయక ప్రజలు వివిధ రోగా లకు గురై ఆస్పత్రుల పాలవ్ఞతున్నారు. వైద్యం ఎంత ఖరీదైందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పోనీ ప్రైవేట్‌ వైద్యశాలలకు వెళ్లడానికి ఆర్థికస్థితి సహకరించదు. చికిత్స సంగతి అటుంచి రోగనిర్ధారణకు అవసరమయిన పరీక్షలకే వేలాది రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది.

అయితే పరిమితి లేని ఆదాయం గల నల్లధనస్వాములకు ఈ ఖర్చుల గురించి ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ కూలీ నాలీ చేసుకునేవారి రెక్కాడితేకాని డొక్కాడని వారు, నెల జీతంపై జీవనం సాగించే మధ్యతరగతి ప్రజల పరిస్థితి అయోమయంగా ఉంది. ఇంతటి విపత్కర పరిస్థితులకు దారితీస్తున్న ఈ కల్తీని నిరోధించ డంలో దశాబ్దాల తరబడి పాలకులు విఫలమవ్ఞతూనే ఉన్నారు. స్వచ్ఛందసంస్థలు అప్పుడప్పుడు ఏవో ప్రయత్నాలు చేస్తున్నా అవి నిరోధించే స్థాయిలో జరగడం లేదు. దీనిపై యుద్ధం చేయాలన్నా అంత సులువ్ఞ అయిన పనికాదు. ఇందుకు ఎంతో ఆత్మవిశ్వాసం, గుండెనిబ్బరం, చిత్తశుద్ధికావాలి.

ఒత్తిడిలను తట్టుకొనే ఓర్పు, బెది రింపులను లెక్కపెట్టని సాహసం ఉండాలి. ఎదురయ్యే అవమానా లను సహించే సమన్వయం సొంతపనులకు జరిగే నష్టాలను తట్టుకొనే త్యాగగుణం కావాలి. వీటన్నింటిని మించి అనుకున్న లక్ష్యాన్ని అంకిత భావంతో సాధించే నిజాయితీ ఉండాలి. అలాంటి వారు ముందుకువస్తే తప్ప ఈ కల్తీ భూతాన్ని తరిమికొట్టలేం.

– దామెర్ల సాయిబాబ