ఏజెన్సీలో రియల్‌ మాఫియా

                           ఏజెన్సీలో రియల్‌ మాఫియా

TRIBES
TRIBES

ఆదిలాబాద్‌ నుండి శ్రీకాకు ళం వరకు ఉన్న ఐదవ షెడ్యూల్‌ ఆదివాసీ భూభా గంలో 1/70 చట్టం అమలు ఉన్నప్పటికీ ఆ చట్టాన్ని ఉల్లం ఘించి రియల్‌ మాఫియాను నడి పిస్తున్నారు. ఆదివాసీల అమా యకత్వాన్ని నిరక్షరాస్యతను, ఆర్థిక అసమానతలనూ ఆసరగా చేసుకొని వారి భూములను కారుచౌకగా కొని రియల్‌ ఎస్టేట్‌గా మార్చి గిరిజనేతులు కోట్లు సంపాదిస్తున్నారు. ఇంత జరుగు తున్నా అధికార యంత్రాంగం, రాజకీయ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. 1/70 చట్టం ప్రకారం ఆదివాసీల భూములు గిరిజనేతరులు అమ్మినా కొనినా చట్ట విరుద్ధం. తిరిగి అక్కడ ఉన్న ఆదివాసీలకే ఆ భూములు చెందుతాయి. కాని 1/70 చట్టానికి విరుద్ధంగా భూములు కొని పట్టాలు కూడా గిరిజనేతరులు చేయించుకుంటున్నారు.

ఆ భూమి పట్టాలు బ్యాంకుల్లో పెట్టి బ్యాంకు రుణాలు తీసుకుంటున్నారు. ఇది కూడా 1/70 చట్టానికి విరుద్ధంగా జరుగుతుంది. ఏజెన్సీలో ఆదివాసీ భూముల్లో రియల్‌ ఎస్టేట్‌ నడిపించడం మూలంగా గిరిజనేతరులు భారీగా వలసలు వచ్చి ఆదివాసీల అస్థిత్వానికే ప్రమాదకరంగా తయారవ్ఞతున్నారు. ఆదివాసీల ఉనికి దెబ్బతింటుంది. ఏజెన్సీలో గిరిజనేతరుల దోపిడీ తీవ్రంగా అవ్ఞతుంది. 1/70 చట్టానికి విరుద్ధంగా ఏజెన్సీలో బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపడుతున్నారు. ఏజెన్సీలోని ఆదివాసీల భూములు లక్షలు, కోట్లు పలుకుతుండటమే దీనికి కారణం.అధికారులు గిరిజనేతరులకు లంచాలకు మంచాలు వేసి ఆదివాసీలను ఆగం చేస్తున్నారు. ఆదివాసీలకు కేటాయించిన భూములను ఆదివాసీలకే దక్కే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆదివాసీ భూముల్లో ప్రైవేట్‌ వ్యక్తులకు చోటు దొరకకుండా ఆదివాసీలు కూడా ఒకటై పోరాటం చేయాలి.

ఆదివాసీలకు విద్య, ఆరోగ్యం అందుబాటులో లేకపోయినా వారు బతుకుతున్నారు. ఉన్న భూములను నమ్ముకొని వారు బతుకు వెళ్లదీస్తున్నారు. భూమిపై ఆధారపడి జీవించే ఆధివాసీల మనుగడకు హాని కలిగించకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. భారత రాజ్యాంగంలో ఉన్న ఆదివాసీల చట్టాలు అమలు చేయాలని, ఏజెన్సీలో రియల్‌ మాఫియాను అరికట్టాలని, 1/70 చట్టాన్ని ఏజెన్సీలో అమలు చేయాలని, ఆదివాసీల హక్కులు కాపాడాలని ఆదివాసీలు కోరుతున్నారు. ఏజెన్సీలో రియల్‌ ఎస్టేట్‌ను నిర్మూలించి 1/70 చట్టం అమలు చేసే కమిటీని ప్రభుత్వమే నియమించాలి. 1/70 చట్టంతోనే ఆదివాసీల భూములకు రక్షణ ఉంటుంది.
– వూకె రామకృష్ణదొర