ఉపాధి కల్పనతోనే అభివృద్ధి సాధ్యం

             ఉపాధి కల్పనతోనే అభివృద్ధి సాధ్యం

EMPLOYMENT
EMPLOYMENT

దేశం అభివృద్ధిపథంలో పురోగమించడానికి ఎన్నో ప్రభుత్వ పథకాలను రూపొందిస్తున్నారు. ఆ పథకాలను సేవలను ప్రజలకు చేరువచేయడంలో ఉద్యోగులపాత్ర మరువరానిది. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉపాధి కల్పన జరిగినట్లయితే వాటికి ఎంత ఖర్చు అయినా ప్రజలు భరించగలరు. ప్రతి ఉద్యోగానికి ఒక విలువ ఉంటుంది. సమాజంలోని ప్రజలకు దాని అవసరానికి అను గుణంగా దాని విలువ పెరుగుతుంది. ఆ ఉద్యోగం చేసే వ్యక్తి సామర్థ్యంపై కూడా ఈ విలువ మారుతూ ఉంటుంది.

ఏ దేశంలోనైనా ప్రభుత్వ పథకాలు, సేవలు అన్ని వర్గాల ప్రజలకు చేరువయితే ఆ దేశంలోని ప్రజలు సుఖ సంతోషాలతో మనుగడ సాగిస్తారు. అటువంటి దేశం అభివృద్ధిపథంలో సాగుతుందనటంలో సందేహంలేదు. అయితే ఈ పథకాలు, సేవలను ప్రజలకు చేరువ చేయడంలో ఉద్యోగులపాత్ర మరువరానిది. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉద్యోగ కల్పన జరిగినట్లయితే వాటికి ఎంత ఖర్చు అయినా ప్రజలు భరించగలరు. ప్రతి ఉద్యోగానికి ఒక విలువ ఉంటుంది. సమాజంలోని ప్రజలకు దాని అవసరానికి అను గుణంగా దాని విలువ పెరుగుతుంది. ఆ ఉద్యోగం చేసే వ్యక్తి సామర్థ్యంపై కూడా ఈ విలువ మారుతూ ఉంటుంది.

ఉదాహరణకు మనం మన బంధువ్ఞలను రైలు ఎక్కించడానికి రైల్వేస్టేషన్‌కు వెళ్లినప్పుడు, మనం కూడా ఫ్లాట్‌ఫారం టిక్కెట్టు కొనాలి. కాని చాలా మంది ఫ్లాట్‌ఫాం టిక్కెట్‌ కొనకుం డానే తమ పనులు పూర్తి చేసేస్తున్నారు. దీనికి కారణం. అక్కడ ఉన్న రైల్వే టిక్కెట్‌ కలెక్టర్‌ ఉదాసీన వైఖరి. అదే టి.సి గట్టిగా అందరి దగ్గర టిక్కెట్లు ఉన్నాయో లేదో తనిఖీ చేసినట్లయితే ప్రతి ఒక్కరూ ఫ్లాట్‌ఫారం టిక్కెట్టు కొంటారు. తద్వారా రైల్వేల ఆదాయం పెరుగుతుంది. ఆ ఆదాయంలో మరిన్ని మెరుగైన సేవలు ప్రజల కందించే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఉద్యోగ కల్పన చేసేట ప్పుడు వాటిని నిర్వచించేటప్పుడు సామాజిక, ఆర్థిక, సాంకేతిక అంశాలన్నీ పరిగణనలోకి తీసుకున్నట్లయితే తప్పనిసరిగా వాటి విలువ పెరుగుతుంది.

మనదేశంలో ఇప్పటికీ దేశాభివృద్ధికి ఉపకరించే అనేక సేవలకు విపరీతమైన పోటీ నెలకొని ఉన్నది. ప్రభుత్వ పథకాలు, సేవలు సమాజంలో అన్ని వర్గాలకు అందు బాటులో లేకపోవడం వల్ల కొంతఖర్చుతోకూడుకున్నవైనా చట్ట విరుద్ధమైనవైనా ప్రైవేటు సేవలవైపు ప్రజలు మొగ్గు చూపుతు న్నారు. నేటికీ మనదేశంలో చాలా గ్రామాలకు సరైన రవాణా వ్యవస్థలేదు. గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలందరూ స్థానికంగా లభ్యమయ్యే ఆటోల మీద ఆధారపడుతుంటారు. నిజానికి వీటిలో ముగ్గురు లేక నలుగురు మాత్రమే ప్రయాణించే వీలుంటుంది. కాని వీటిలో పది మంది దాకా ప్రయాణిస్తుంటారు. సరైనరవాణా వ్యవస్థ లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాల కొనుగోళ్లు ఎక్కువయ్యాయి.

వాటి అవసరం నిమిత్తం పెట్రోలు బంకులను గ్రామీణ ప్రాంతాల్లో నెలకొల్పాల్సిన పరిస్థితులు తలె త్తాయి. పెట్రోలు వినియోగం పెరగటంతో ముడిచమురు దిగుమ తులు పెరిగి దేశ ఆర్థిక వ్యవస్థపై భారం పెరిగి ప్రజలపై పన్నులు కూడా పెరిగాయి. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. ఇతర రంగాలలో కూడా ఇటువంటి పరిణామాలే సంభవిస్తున్నాయి. విద్య,వైద్య, ఆరోగ్య, ఆహార తదితర రంగాలలో ప్రభుత్వ సేవ లకు విపరీతమైన డిమాండ్‌ ఉంది. మరి ఇంత డిమాండ్‌ ఉన్న ప్పుడు ఈ సేవలను ప్రజలకు చేరువ చేయడానికి ఆయా రంగా ల్లో ఉద్యోగ కల్పన ఎందుకు జరగడం లేదు.? ఈ ప్రశ్నకుమూడు ముఖ్యమై కారణాలు కనపడుతున్నాయి. ఆయా శాఖల్లో ఇప్పు డున్న ఉద్యోగాలు లేదా ఉద్యోగులకు ఎటువంటి విలువ లేక పోవడం.

వీరెవ్వరూ ఎప్పటికప్పుడు మారుతున్న కాలానికి అనుగు ణంగా తమ సామర్థ్యాన్ని పెంపొందించుకుంటున్న దాఖలాలులేవ్ఞ. ఎప్పటికప్పుడు నూతన సాంకేతికతను అందిపుచ్చుకుని ప్రజలకు మరింత నాణ్యమైన సేవలు అందించాలనే ఆలోచన లేదు. ప్రభు త్వంలో పనిచేసే చప్రాసీ నుండి జిల్లా కలెక్టరు వరకు తాము పనిచేసినా చేయకపోయినా అడిగే వారెవ్వరూ లేరన్నట్టు మొక్కు బడిగా తమ విధులు నిర్వహిస్తున్నారే కాని, తాము పనిచేసే సంస్థ పేరుప్రతిష్ఠలు ఇనుమడింప చేద్దాం అనే ఆలోచనలు చేయ కపోవడం దురదృష్టకరం. ఇటువంటి పాత పుస్తకాలు, కొత్త ఉద్యో గాలను సృష్టించడానికి, వాటికి విలువైన నిర్వచనం ఇవ్వడానికి ఏమాత్రం ఉపయోగించరు. కొత్త వారిని రానివ్వరు. గ్రామీణ ప్రాంతాల్లో అనేక సమస్యలున్నాయి.

వీటి మూలాలపై అవగాహన లేకపోవడం రెండవ కారణం. గ్రామాల్లో పెద్దఎత్తున మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టినప్పుడు, సరైన భూగర్భ డ్రైనేజీ సదుపాయాలు కూడా కల్పించాలి. గ్రామాల్లో మంచినీటి సరఫరా సదుపాయాలు కల్పించేటప్పుడు నీటి లభ్యత, నీటి ట్యాంకుల నిర్మాణం గురించి ఆలోచన చేయాలి. ఇటువంటిసమగ్రమైన విశ్లేషణ చేసినప్పుడు సమస్యకు మూలాలను కనుగొని పరిష్కారాలు సాధించడమే కాకా వాటికి అనుగుణంగా నూతన ఉద్యోగ కల్పన సాధ్యమవ్ఞతుంది. ప్రభుత్వ ఉద్యోగాలలో వచ్చే లాభాలను వదులుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేకపోవడం మూడవ కారణం. పారదర్శకత జవాబు దారీతనం, సేవల నాణ్యత వంటి వాటికి ఏనాడో తిలోదకాలిచ్చి ప్రతి సేవకు వెలకడుతూ ఒక వ్యాపారంగా మార్చిన వీరు నూతన ఉద్యోగ కల్పనను ఆహ్వానిస్తారనుకోవడం హాస్యాస్పదమే.

ఇప్పటికే మనదేశంలో అధికార వికేంద్రీకరణ జరగ లేదనే చెప్పవచ్చు. ఏ పథకమైనా, ప్రణాళికైనా వాటిని అమలు చేయాలంటే రాజకీయ నాయకుల చేతుల్లోనో, లేదా జిల్లా కలెక్టర్ల చేతిలోనో చిక్కుకుని ఉంటున్నాయి తప్ప గ్రామస్థాయి లేదా మండ లస్థాయి అధికారుల వరకు అవి రావట్లేదు. ప్రజలు ప్రభుత్వ సేవ లు పొందాలంటే లంచాలిచ్చి, దొడ్డిదారుల్లో రాజకీయ బ్రోకర్లను ప్రసన్నం చేసు కోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఇటువంటి స్వార్థ రాజకీయాల వల్ల నేటికీ మన ఆర్థిక వ్యవస్థ ఓ పెద్ద మురికి గుంటలా తయారైంది. విజ్ఞాన శాస్త్రం అనే విలువైన సాంస్కృతిక సంపదకు వారసులమనుకునే దేశంలోని పేరొందిన విద్యాసంస్థలు కేవలం దేశ యువతలో రెండు శాతం మందిని మాత్రమే అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దడానికి ఉపయోగపడుతున్నాయి తప్ప వాటి వల్ల మరే ఉపయోగం లేదు.

వీరు చెప్పే పాఠ్యాంశాల వల్ల మనుగడలో లేని అంతర్జాతీయ కంపెనీల్లో ఉద్యోగాలు పొందడానికి విద్యార్థులు ఆలోచిస్తున్నారు తప్ప సమాజంలో నెలకొన్న వాస్తవ సమస్యల వైపు వీరు దృష్టి సారించట్లేదు. ఇటీవల కేంద్ర విద్యాసంస్థ, ఎన్‌.సి.ఆర్‌.టి ప్రచురించిన భౌతిక శాస్త్రం పుస్తకంలో పరమాణవ్ఞపై 50 పేజీల పాఠ్యాంశం ఉండగా ప్రజలకవసరమైన నీటి అవశ్యకతపై ఒక్క పేజీ కూడా లేక పోవడమే ఇందుకు నిదర్శనం.700 పేజీల రసాయన శాస్త్రంలో ప్రజల దైనందిన జీవితంలోరసాయన శాస్త్ర ఉపయోగాలకు చోటు లేదు. యుజిసి ప్రతిపాదించిన పాఠ్యాంశాలలో స్థానిక సమస్య లను, అంశాలను ఎక్కడా ప్రస్తావించలేదు. ఇక సామాజికశాస్త్రాల గురించి విద్యార్థులు ఏనాడో మరిచి పోయారు. ఇటువంటి విద్యాసంస్థలు, విద్యావేత్తలు సమాజానికి కావల్సిన నూతన ఉద్యోగాలను సృష్టించడానికి ఏమాత్రం తమ సమయాన్ని వెచ్చిస్తారో తెలియనిదికాదు.

ఇవన్నీ తెలియని అమాయకమైన యువత తాము చదువ్ఞతున్న చదువ్ఞకు, మంచి విలువైన ఉపాధి దొరకబోతోందని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కొన్ని లక్షల మంది ఉపాధి కోసం రోడ్ల మీద ఎందుకు పనికిరాని పట్టాలు పుచ్చుకుని నిరీక్షిస్తున్నారు. వీరందరి ఆశలు, కలలు కల్లలయిన రోజున, దేశానికి వెన్నుముక అని గర్వపడే ఈ యువతే దేశానికి పీడకలగా మారే ప్రమాదముంది. అది ఎంతో దూరం కూడా లేదు. ఆ రోజులు దగ్గరపడకముందే సమాజంలోని అట్టడుగు వారికి అవసరమైన సేవలను గుర్తించి వాటికి అను గుణంగా కొత్త ఉద్యోగాలను సృష్టిస్తే తప్ప ఈ సమస్య తొలి గిపోదు.

సామాజిక స్పృహ లేని గొప్ప గొప్ప పాఠ్యాంశాలైన ఐఓటి, ఇండస్ట్రీ4..0 వంటి వాటిని మనం మన యువతకు నేర్పిస్తున్నాం కానీ సమాజంలోని 80 శాతం వెనుకబడిన వర్గాల అవసరాలను మాత్రం ఏ పాఠ్యాంశాలలోను ప్రస్తావించం.ఇప్ప టికీ రైతులకు 24 గంటలు విద్యుత్‌ ఎందుకు అందించలేకపోతు న్నాం. ఎన్నో జీవనదులున్న దేశంలో కరవ్ఞతో ఎన్నో గ్రామాలు కటకటలాడుతున్నాయెందుకు, ఇప్పటికీ ఎన్నో గ్రామాల్లో రక్షిత మంచినీరు దొరక్క ఎన్నో ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతు న్నారెందుకు, రైతులకెందుకు సరైన గిట్టుబాటుధరలు లభించవ్ఞ, ఇటువంటి అనేక సమస్యలు సమాజాన్ని పట్టికుదిపేస్తుంటే వీట న్నింటిని పరిష్కరించడానికి కావలసిన యంత్రాంగాన్ని, పరిష్కార మార్గాలను అటు పాలకులు, ఇటు అధికారులు, విద్యావేత్తలు ఎవ్వరూ అన్వేషించకపోవడం మన ప్రజలు చేసుకున్న దురదృష్టం.

ఎంతసేపు ఐ.టి.రంగంలో ఉద్యోగ కల్పనకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి తప్ప సమాజంలో సమస్యలు పరిష్కరించటానికి అవసరమయ్యే ఉపాధి కల్పన వైపు దృష్టి సారించడం లేదు. ఇకనైనా నూతన పాఠ్యాంశాలను రూపక ల్పన చేసేటప్పుడు నూతన ఉద్యోగాలు సృష్టించేటప్పుడు పై అంశాలన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతారని ఆశిద్దాం. అప్పుడే సమాజంలో నిజమైన విలువగల ఉద్యోగాలు ఏర్పడతాయి. 

– ఈదర శ్రీనివాసరెడ్డి (రచయిత: ప్రిన్సిపాల్‌)