/ఉద్యోగాల కల్పనపై అంకెల గారడీ

                     ఉద్యోగాల కల్పనపై అంకెల గారడీ

employment
employment

టీవలనే ఒక నివేదిక వెలుగులోకి వచ్చింది. ఈ నివేదిక ప్రధాన అంశం దేశంలో ఎంత మంది సరైన ఉద్యోగాలు పొందుతున్నారో ఆ వ్యవస్థను ప్రముఖంగా చూపించడం, ఇదిలా వెల్లడించడం న్యాయం, అవస రం. కానీ ఇందులో చాలా అసాధారణ విషయాలు కనిపిస్తున్నాయి. దేశంలో ఏటా కొత్తగా 55లక్షల ఉద్యోగాలు కల్పిస్తున్నట్టు ఈ నివే దికలో పేర్కొనడమయింది. దీనికి ప్రధాని ఏవిూ ఆశ్యర్చపడలేదు. చక్కగా ఉద్యోగాలు కల్పించడం ఎలాసాధ్యమో ఆయన పట్టించుకో లేదు. కానీ 55 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించినట్టు పదేపదే ప్రస్తా విస్తున్నారు. ఒక ఇంటర్వ్యూలో కొత్తగా ఉద్యోగాలు కల్పించడంలో తమ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తున్నట్టు కితాబు ఇచ్చారు. దురదృష్టవశాత్తు ఇది అకస్మాత్తుగా పుట్టుకొచ్చిన గణాంకవివరాలు. విశ్లేషణలో లోపాలు కొత్తగా 55 లక్షల ఉద్యోగాలు కల్పించినట్టు ఎలా ఈ నివేదిక వెలువడింది? ఇది ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (ఇపిఎఫ్‌ఒ) నుంచి వివరాలు తీసుకొంది. సంఘటిత రంగంలో ప్రావిడెంట్‌ ఫండ్‌ లబ్ధిదారులకు సంబంధించిన గణాంకా లు.

దీన్ని బట్టి 2017 నవంబర్‌ నాటికి 18-25 సంవత్సరాల వయస్సు కలిగిన కొత్త సభ్యులు 36.8 లక్షలమంది ఇపిఎఫ్‌ఒలో నమోదు చేసుకుని ఉన్నారు. అలాగే అంతకుముందు సంవత్సరం కూడా 18-25 సంవత్సరాలు కలిగిన ఏ అభ్యర్థి అయినా ఇపిఎఫ్‌ ఒలో నమోదు చేసుకున్నట్లయితే అతడు లేదా ఆమె సంఘటిత రంగంలో ఉద్యోగం పొందినట్టే భావిస్తుంటారు. 2017 నవంబర్‌ వివరాలు 2018 ఆర్థిక సంవత్సరం వివరాలతో కలిపి నిబ్బరంగా 2018 ఆర్థిక సంవత్సరానికి 55.2 లక్షల ఉద్యోగాలు కల్పించినట్టు వెల్లడించారు. ఈ విశ్లేషణలో లోపాలు వాస్తవంగా భావించరాదు. 18-25 సంవత్సరాల వయస్సుగల ఇపిఎఫ్‌ఒ కొత్త సభ్యులు ఒక్క సారి అకస్మాత్తుగా ఉద్యోగాలు సంపాదించారని అనుకోడానికి వీల్లే దు. ఇపిఎఫ్‌ఒలో సభ్యత్వంతో అసంఘటిత రంగ ఉద్యోగం సంఘ టిత రంగ ఉద్యోగంగా మారిపోతుంది. అంతేకాని కొత్తగా ఉద్యోగం వచ్చినట్టు అనుకోరాదు.ఇపిఎఫ్‌ఒ డేటా పాయింట్‌, డిమోనిటైజేషన్‌ (పెద్దనోట్ట రద్దు) తరువాత, జిఎస్‌టి గడువ్ఞ విధింపులు ఇవన్నీ తప్పుదారి పట్టించాయి.

దేశ ఆర్థిక వ్యవస్థపై 2017 ఆర్థిక సంవ త్సరంలో నోట్ల రద్దు 2018 ఆర్థికసంవత్సరంలో జిఎస్‌టి విపరీత ప్రభావాన్ని చూపించాయి. పెద్దనోట్ల రద్దు కారణంగా అసంఘటిత రంగంలోని కార్మికులకు నగదు చెల్లించలేక భారీ ఎత్తున వారిని ఉద్యోగాల ఉంచి వేలాది మంది యజమానులు తొలగించివేసినట్టు అనేక సర్వేల ద్వారా బయటపడిన సంగతి మనకు తెలిసిందే. తొల గించగా మిగిలిన వారికే ప్రావిడెంట్‌ ఫండ్‌ వంటి ప్రయోజనాలు కల్పించడానికి వారిని సంఘటిత కార్మికులుగా నమోదు చేయించుకుంటున్నారు. ఈ అల్లకల్లోలం ద్వారానే ఇపిఎఫ్‌ఒ డేటా లో నమోదయిన వారిని కొత్తగా ఉద్యోగాలు పొందినట్టు చూపించ డం పరిపాటి అయింది. కానీ వాస్తవానికి వీరందరికీ ఉద్యోగాలు కొత్తగా వచ్చినట్టు లెక్కచూపకూడదు. ఈ పరిణామాలను నివేదిక లో ఎక్కడా పొందుపరచలేదు. ఇదీ 2017 ఆర్థిక సంవత్సరంలో కొనసాగిన ప్రహసనం. 2018 ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టిన జిఎస్‌టిని పరిశీలిస్తే నెట్‌వర్క్‌ వ్యవస్థ ద్వారా వ్యాపార పన్నుల వసూలు చేపట్టి దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టపర్చడం.

అయితే ఏ వ్యాపారమయినా ప్రాధ మికంగా జిఎస్‌టి కింద నమోదుకావలసి ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థను క్రమబద్ధీకరించడానికే ఈ విధానాన్ని అమలులోకి తెచ్చారు. చిన్న,మధ్య తరహా వ్యాపారాలను బలవం తంగా దీని పరిధిలోకి తెచ్చారు. ఆయా సంస్థకు చెందిన కార్మిక బలగంలో కొంత భాగమైనా అసంఘటిత రంగం నుంచి సంఘటిత రంగంలోకి ఈ విధానంలో మార్పు చేయక తప్పదు.ఈ విధానాల మార్పుకు జరిగే వ్యయంలో చాలా వరకు చాలా సంస్థల్లో కోతప డడం కానీ లేదా ఆయాసంస్థలు మూసివేసే పరిస్థితి కానీ ఏర్పడు తోంది. ఈ మార్పుల్లో ఇపిఎఫ్‌ఒను ఎవరూ పాటించడం లేదు. కేవలం మొక్కుబడిగా కొత్త కార్మికులు ఎలాంటి ప్రయోజనాలు లేకుండా పనిచేయవలసి వస్తోంది. మరో విధంగా చెప్పాల్సి వస్తే ప్రతి అసంఘటిత అయిదు గురు ఉద్యోగుల్లో నలుగురు నోట్ల రద్దు జిఎస్‌టి ప్రభావం వల్లనే ఉద్యోగాలు కోల్పోవలసి వస్తోంది.

మిగి లిన ఆ ఒక్కరే సంఘటిత కార్మికునిగా నమోదవ్ఞతున్నారు. ఈ మేరకు అధ్యయనంలో ఒకరికి కొత్తగాఉద్యోగం కల్పించినట్టు భావిం చడమవ్ఞతోంది. ఇందులో సత్యం నలుగురికి ఉద్యోగాలు పోగా ఒక రికే ఉద్యోగం నిలబడిందని తెలుసుకోవచ్చు. అదీకూడా కొత్త ఉద్యో గ కల్పనకాదు.అసంఘటిత ఉద్యోగిని సంఘటిత ఉద్యోగిగా మార్చి నట్టు చెప్పక తప్పదు.కొత్త ఉద్యోగాలతో నిబంధనలు ఏం అమల యినట్టు? ఉద్యోగి తన ఉద్యోగాన్ని కోల్పోయినా లేదా పనిచేయడం మానేసినా ఇపిఎఫ్‌ఒలో ఆ ఉద్యోగి సభ్యత్వం వెంటనే తొలగించ డం జరగ దన్న సంగతి బాగా తెలిసిందే. అందువల్ల ఇపిఎఫ్‌ఒడేేటా కచ్చితంగా కొత్త సభ్యత్వాలను ప్రతిబింబిస్తుంది తప్ప తొలగింపుల ను చూపించదు. ఆర్థికంగా కొత్త ఉద్యోగాల గురించి మాట్లాడవలసి వస్తే సాధారణంగా పక్కా కొత్తఉద్యోగాలే ఉండాలి తప్ప లెక్కాజమ లేని అనామక ఉద్యోగాల గురించి కాదు. అందువల్ల ఆర్థిక వ్యవస్థ లో కొత్తగా 55లక్షల ఉద్యోగాలు కల్పించామని చెప్పడం తప్పుదారి పట్టిస్తున్నట్టే.

వాస్తవంగా జిఎస్‌టి, పెద్దనోట్ల రద్దు ప్రభావాలను వేర్వేరుగా చూస్తే అప్పుడు 2015,2016 ఆర్థిక సంవత్సరాల్లో ఇపి ఎఫ్‌ఒ సభ్యులు ఎంత మందో పోల్చి చూడాలి. అప్పుడు 2015లో ఇపిఎప్‌ఒ సభ్యులు ఏడు శాతం, 2016లో ఎనిమిది శాతం వరకు పెరిగారని చెప్పవచ్చు. కానీ పెద్దనోట్ల రద్దు తరువాత 2017 ఆర్థిక సంవత్సరంలో 20 శాతం,2017 డిసెంబర్‌ నాటికి23శాతం వరకు పెరిగిందని తెలుస్తోంది. దీన్నిబట్టి మోడీ ప్రభుత్వం మొదటి రెండే ళ్లలో తగిన విధంగా ఉద్యోగాలు కల్పించలేదని తేలుతోంది. కానీ విచిత్రంగా పెద్దనోట్ల రద్దు, జిఎస్‌టి అమలులోకి వచ్చిన తరువాత అదే ఇపిఎప్‌ఒ డేటా ప్రకారం ఉద్యోగాల జాతర వచ్చిందా? అదేం లేదు.అంతా అభూత కల్పనజరిగింది. గణాంకాల గారడీ జరిగింది.
బ్యాంకుల్లో అపార డిపాజిట్లు
బ్యాంకుల్లో అపారంగా డిపాజిట్లుపేరుకుపోవడం ఆర్థికంగా బాగా పటిష్టం కావడానికి సంకేతం అన్నది సాధారణంగా అంగీకరించవల సిందే. 2016 ఆర్థిక సంవత్సరం ఆఖరులో దేశంలోని అన్ని బ్యాంకుల్లో డిపాజిట్లు 6.22 లక్షల కోట్లకు చేరుకున్నాయి. 2017 ఆర్థికసంవత్సరం అంతానికి డిపాజిట్లు 76 శాతం అంటే 11 లక్షల కోట్ల వరకు పెరిగాయి. అంటే ఏడాదిలో 4.8 లక్షల కోట్ల వరకు పెరిగాయి. దీన్ని బట్టి 2017లో భారతీయులు ఆర్థికంగా బాగా ఎదిగారని చెప్పవచ్చా? మొత్తం మీద ఆర్థిక ప్రగతి ఇతోధికంగా పెరిగిందని భావించవచ్చా? పెద్దనోట్ల రద్దు ప్రజలను తమ కరెన్సీ నోట్లను భారీగా బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసేలా ఒత్తిడి తెచ్చింది. దీనికి బదులుగా కరెన్సీ నోట్ల విలువను, బ్యాంకు డిపాజిట్లు కలిపి విలువ లెక్క గట్టి పోల్చి చూస్తే 2017లో ఐదు శాతం క్షీణత తప్ప 76 శాతం పెరుగుదల కాదని కనుక్కోగలం. భారతదేశ ఉద్యోగాల పరిస్థితి చూస్తే కఠినమైన సవాల్లు ఎదుర్కోక తప్పదు. అందుకే దీనికి పరిష్కార మార్గాలను అన్వేషించాలి. మిలియన్ల మంది యువతకు ఉద్యోగాలు లేకపోవడం అనేది తప్పుడు లెక్కలు చూపించి మభ్యపెట్టవలసిన అగత్యం లేదు.