ఆర్థిక బలహీనతలో ‘వ్యర్థ’యత్నం

dump

ఆర్థిక బలహీనతలో ‘వ్యర్థ’యత్నం

దేశంలోని నగరాలు,పట్టణాల నుంచి రోజూ 1.7 లక్షల టన్నుల వ్యర్థాలు ఎలాంటి శుద్ధి లేకుండానే డంపింగ్‌ యార్డులకు చేరుకొంటున్నాయి.ఆయా పాలక వర్గాలు మొత్తం 81,000 మున్సిపల్‌ వార్డుల్లో 44,650 వార్డుల నుంచే వ్యర్థాలను సేకరించగలుగుతున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ అపే క్షించే స్వచ్ఛభారత్‌ కార్యక్రమం అమలు ఎలా ఉందో దీన్ని బట్టి తెలుస్తుంది. నగరాలు, పట్టణాల్లో ప్రతి ఇంటి నుంచి వ్యర్థాల సేక రణ, నిర్వహణ, తరలింపుల్లో తగిన శ్రద్ధ మున్సిపల్‌ యంత్రాం గం, చూపించకపోవడమే దీనికి కారణం. శ్రద్ధ లోపించడం వెనుక ప్రధాన కారణం ఆర్థిక బలహీనత. మున్సిపాలి టీలులేదా నగరపా లక సంస్థలు ఆర్థిక లేమితో కునారిల్లుతున్నాయి.
వ్యర్థాల నిర్మూలన శాస్త్రీయంగా సాంకేతికంగా జరగాలంటే ఖజానా నుంచి చాలా ఖర్చు పెట్టవలసి వస్తోంది.కేంద్రం దీనికోసం స్వల్పమొత్తంలో కేటా యిస్తుంది తప్ప పూర్తిగా భరించదు.మిగతా ఖర్చంతా స్థానిక పాల నాసంస్థలు భరించవలసిందే. నగర నవీకరణ కార్యక్రమం ‘అమృత్‌ వంటి పథకంతో స్వచ్ఛభారత్‌ కార్యక్రమానికి అనుసంధానం లేకపో వడమే ఈ దుస్థితికి దారితీస్తోంది. వ్యర్థాలు ఎక్కడయితే వెలువడు తున్నాయో అక్కడ వాటిని వేరు చేయడం కష్టతరమవ్ఞతోంది. గత మూడేళ్లలో పబ్లిక్‌, కమ్యూనిటీ మరుగుదొడ్లు 2.26 లక్షల వరకు నిర్మాణమయినా వాటిని ఒక క్రమపద్ధతిలో నిర్వహించే వ్యవస్థ లేదు. మరుగుదొడ్లను శుభ్రపరచి ఆ మలినాలను వేరే చోటికి సరిగ్గా తరలించడం లేదు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, మున్సిపా లిటీలు, ప్రైవేట్‌రంగం ఇవన్నీ కీలకమయిన సమస్యలుగా పేర్కొం టున్నాయి.

నగరాలు, పట్టణప్రాంతాల్లో నగరపాలక వర్గాలు, రాష్ట్ర ప్రభుత్వాలు పారిశుద్ధ్యం విషయంలో ఎక్కువ శ్రద్ధ వహిస్తే కానీ ఈ సమస్యలు పరిష్కారం కావ్ఞ. 2019 అక్టోబర్‌ నాటికి 65.82 లక్షల మరుగుదొడ్లు ఇళ్లవద్ద నిర్మించాలన్న లక్ష్యం పెట్టుకున్నప్పటికీ ఇంతవరకు 30.74 లక్షల మరుగుదొడ్లనే నిర్మించగలిగారు. నగర, పట్టణ సమస్యలు ఆయా రాష్ట్రాల పరిధిలోకి వస్తాయి. ఇందులో జయప్రదమయినా లేక విఫలమయినా ఆయా ప్రభుత్వాల బాధ్యతపైనే ఆధారపడి ఉం టుంది. ప్రజా భాగస్వామ్యం,రాజకీయ జోక్యం దీనిలో కీలక పాత్ర వహిస్తుంది.

దక్షిణాది రాష్ట్రాల్లోని నగరాలు ఈ విషయంలో బాగా పనిచేశాయి. ఎందుకంటే ఏదైనా కలసి సమష్టిగా చేస్తారు. పరిశుభ్ర తకే స్థానిక నాయకులు ప్రాధాన్యం ఇస్తారు. ఈ విషయంలో ఇండో ర్‌ను ఉదాహరణగా చెప్పవచ్చు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాం గంతోపాటు మున్సిపాలిటీ యంత్రాంగం కూడా చేదోడు వాదోడై ఇదొకలక్ష్యంగా పనిచేశాయి. మున్సిపాలిటీలు సాధారణంగా వ్యర్థాల సేకరణ, రవాణా వ్యర్థాలను వేరు చేయడం వంటి పనులు చేయ లేవ్ఞ. ఎందుకంటే ఈ పనులు చేసే కూలీలకు వేతనాలు చెల్లించడం మున్సిపాలిటీలు సమస్యగా భావిస్తాయి. మున్సిపాలిటీల ఆర్థిక పరిస్థితి చాలా బలహీనం కావడంతో చిన్న మున్సిపాలిటీలకు వ్యర్థాల సేకరణ, నిర్వహణ, రవాణా కోసం ఖర్చుపెట్టే స్తోమత ఉండదు. ఘన వ్యర్థాల నిర్వహణ కోసం అయ్యే వ్యయంలో 35 శాతం మాత్రమే కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. మిగతా 65 శాతం ఆయా మున్సిపాలిటీలు రాష్ట్రాలు భరించవలసిందే. మహారాష్ట్ర వంటి ఆర్థికబలం గల పెద్ద రాష్ట్రాలు తప్ప మిగతా రాష్ట్రాలకు ఈ వ్యయం భరించడం తలకు మించిన భారమవ్ఞతుంది. చిన్నతరహా అర్బన్‌ ప్రాంతాలు వేగంగా అభివృద్ధిచెందుతున్న దిశలో ఈ ఖర్చు లు భరించడం సాధ్యంకాదు.

నగరాల అవతల ఖాళీ ప్రదేశాల్లో వ్యర్థాలను గుమ్మరిస్తున్నారు. వ్యర్థాల శుద్ధిని చేపట్టకుండా ఇలా చేస్తే స్వచ్ఛభారత్‌, లక్ష్యంనెరవేరదు. ఈ వ్యర్థాలు చాలా వరకు తడిచెత్తతో, జీవపదార్థాలతో ఉంటాయి. ఈ వ్యర్థాలను కంపోస్ట్‌గా మార్చి ఎరువ్ఞలుగా వినియోగించితే కొంతవరకు మేలు జరుగు తుంది.100 కిలోల వ్యర్థాన్ని 10గ్రాముల ఎరువ్ఞగా కుదించి సేద్యా నికి వినియోగించవచ్చు. ఏటా 620 లక్షల టన్నుల మున్సిపల్‌ వ్యర్థాలు ఉత్పన్నం అవ్ఞతున్నాయి. ఇందులో 50 శాతం తడి చెత్త, ఇతర వ్యర్థాలు ఉంటున్నాయి. దీన్ని కంపోస్టుగా తయారు చేయ వచ్చు. 25 శాతం అంటే 155 లక్షల టన్నులు మాత్రమే తిరిగి శుద్ధి చేస్తున్నారు. 80 శాతం అంటే 500 లక్షల టన్నుల వ్యర్థాలు తిరిగి ఏవిధంగా మార్చలేని ఎలక్ట్రానిక్‌ ప్లాస్టిక్‌ వంటి వ్యర్థాలు ఉంటున్నాయి. రెండు లక్షల టన్నులు కంపోస్టు తయారవ్ఞతోంది. ఇందులో 50 శాతం మాత్రమే అమ్ముడవ్ఞతోంది. వ్యర్థాల నుంచి కంపోస్టుగా మార్చే ప్లాంట్లుకొన్ని నిర్మాణంలో ఉన్నాయి.

అటువంటి ప్లాంట్ల ద్వారా ఏటా 15.2 లక్షల టన్నుల వరకు కంపోస్టు తయారు చేయవచ్చు. ఉదాహరణకు హైదరాబాద్‌ నగరంలో చెత్త తరలింపు యూనిట్లు 21 ఉన్నప్పటికీ వాటిని శాస్త్రీయంగా నిర్వహించడం లేదు. పేరుకున్న చెత్తను వేరు చేసి కంపోస్టింగ్‌ యూనిట్లకు కొంత, పొడి చెత్తగా వేరు చేసిన యూనిట్లకు కొంత చేర్చవలసి ఉంటుంది. కానీ అలాంటివేమీ సరిగ్గా జరగడం లేదు. అధికారిక వెబ్‌సైట్‌ ప్రకారం పొడిచెత్త సేకరణ కేంద్రాలుగా 10యూనిట్లు, కంపోస్ట్‌ యూనిట్లుగా మూడు ఉన్నాయి. తడి చెత్తను ఎక్కడా వేయకుండా నేరుగా కంపోస్ట్‌ కేంద్రాలకే పంపాల్సి ఉంటుందని జిహెచ్‌ఎంసి సీనియర్‌ అధికారి ఒకరు పేర్కొన్నారు.చెత్తను, వ్యర్థాలను రోడ్డుపై జారనీయ కుండా రవాణా యూనిట్లు చక్కగా పనిచేస్తున్నాయని అధికార యం త్రాంగం కితాబు ఇస్తోంది. వ్యర్థాలను బాగా నిర్వీర్యం చేయడం రవాణా ఖర్చులు 50 శాతం తగ్గించడానికి సహాయపడుతోందని చెబుతున్నారు. వ్యర్థాల రవాణా కోసం టన్ను ఒక్కింటికి రెండువేల రూపాయల వంతున జిహెచ్‌ఎంసి చెల్లించవలసి వస్తోంది.

హైదరాబాద్‌ నగరంలో రోజూ 5000 టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతుంటాయి. రవాణా యూనిట్లకు ఉదయం 6 నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు చెత్త,వ్యర్థాలు వచ్చి చేరుతుంటాయి. రాత్రి 8గంటల తరువాతనే ఈ వ్యర్థాలను వేరు చేయడం ప్రారంభిస్తారు. ఆ తరువాత జవహర్‌నగర్‌ డంప్‌ యార్డుకు తరలిస్తారు. అయితే వ్యర్థాలను నిర్వీర్యం చేసే వ్యవస్థ పూనె, హైదరాబాద్‌ నగరాల్లో మాత్రమే ఉంది. పొడి చెత్తను, వ్యర్థాలను వేరు చేసి తిరిగి వాటిని వినియోగంలోకి తెచ్చే రీసైక్లింగ్‌ ప్రక్రియ కొన్ని చోట్లే జరుగుతోంది. దేశంలోని వివిధ నగరాల్లో చెత్తను ఖాళీ ప్రదేశాల్లో చాలా వరకు వ్యవసాయభూములకు తరలిస్తున్నారు.లక్నోలో దుబగ్గా ప్రాంతంలో ని గోమతి నది పక్కనే భారీ ఎత్తున చెత్తకుప్పలునిల్వ చేస్తున్నారు. వారణాసి నగరానికి చెందిన చెత్తను వరుణ నది పక్కనే పారబో స్తున్నారు.ఆ వరుణనది గంగానదిలో కలిసి ప్రవహిస్తోంది.

ఈ నేప థ్యంలో స్వచ్ఛభారత్‌ సాధించాలంటే మౌలికంగా మార్పు రావాలి. కేవలం చీపురుపట్టుకుని ఊడ్చినంత మాత్రాన ఒక్కసారి పరిశుభ్రత రాదు. నిరంతరం పరిశుభ్రతే ప్రధాన లక్ష్యంగా ప్రతి ఒక్కరు చిత్త శుద్ధిగా ముందడుగేయాలి.మరుగుదొడ్డిని నిర్మించుకుంటే ఆ కుటుం బం ఆర్థికంగా చాలా వరకు ఆదా చేయవచ్చని యునిసెఫ్‌ సర్వే వెల్లడించింది. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో 10వేల కుటుంబాలపై ఈ మేరకు అధ్యయనం జరిగింది. ఈ మరుగుదొడ్ల నిర్మాణం వల్ల ఆయాకుటుంబాల ఆరోగ్యం బాగుంటుంది.వైద్యఖర్చు తగ్గుతుంది. మర ణాల శాతం తగ్గుతుంది. సమయం కూడా ఆదా అవ్ఞతుంది. ఈ సర్వే జరిగిన గ్రామాల్లో 85 శాతం కుటుంబాలు మరుగుదొడ్ల ను వినియోగిస్తున్నట్టు వెల్లడైంది. పారిశుద్ధ్యానికి ఒక రూపాయి ఖర్చు చేస్తే ఆ కుటుంబానికి రూ. 4.30 ఆదా అవ్ఞతున్నట్టు నిపు ణులు పేర్కొన్నారు.

దేశంలోని2.4లక్షల గ్రామాల్లో పూర్తిస్థాయిలో మరు గుదొడ్ల వినియోగం జరుగుతున్నట్టు స్పష్టమయింది. ఇదంతా స్వచ్ఛభారత్‌ మిషన్‌ కృషివల్లనే క్షేత్రస్థాయిలో మార్పులు వస్తున్నా యి.2014లో స్వచ్ఛభారత్‌ ప్రారంభమైంది. అప్పటితో పోలిస్తే పాతిక కోట్ల మంది అదనంగా పారిశుద్ధ్య సేవలు పొందుతున్నట్లు వెల్లడయింది. రెండు లక్షల 35వేల గ్రామాలు, 1300 నగరాలు, 200 జిల్లాలు, 5 రాష్ట్రాలు బహిరంగ మలవిసర్జన నుంచి విముక్తి పొందినట్టు ప్రభుత్వం చెబుతోంది. 2019 అక్టోబర్‌ రెండు మహా త్మాగాంధీ 150వ జయంతి నాటికి స్వచ్ఛభారత్‌ లక్ష్యాన్ని సంపూ ర్ణంగాసాధించాలన్న దీక్షతో స్వచ్చతా హే సేవా (స్వచ్ఛతేసేవ)పేరిట ప్రచారాన్ని ఉద్యమంలా చేపట్టడానికి సిద్ధమయింది.పేదరికాని నిర్మూలించాలన్నా స్థిరమైన అభివృద్ధి సాధించాలన్నా పారిశుద్ధ్య సేవలను కల్పించడం ఎంతో అవసరం.ఈ ఆశయంతోనే 2030 నాటికి ఇంటింటికీ మరు గుదొడ్డి నిర్మాణం జరిగితీరాలని లక్ష్యాన్ని ప్రతిపాదించింది. ఇంతే కాదు ప్రతి మనిషికీ పారిశుద్ధ్యం, నీటి వసతి కల్పించడం మౌలిక హక్కుగా స్పష్టం చేసింది.

– దొరయ్య