ఆర్థికమాంద్యానికి ఓలా, ఉబేర్‌లే కారణమా?

Indian Economic Status
Indian Economic Status

మొత్తానికి ఆర్థిక మాంద్యం విషయంలో కూడా ‘గుడ్‌ లీడ్‌ టు గుడ్‌ అనే సామెత నిజం అవ్ఞతుంది. అంటే ఒక రంగంలో ఉత్సాహం మరో రంగాన్ని కదిలిస్తుంది. ఈ విధంగా ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. ఆర్థిక వ్యవస్థను కాపాడుతుంది. కాబట్టి ప్రస్తుతం ఉన్న అనుకూల వర్షపాతం, రిజర్వాయర్ల నిండానీరు ఉన్న దృష్ట్యా వ్యవసాయరంగంపై బాగా దృష్టిపెడితే అక్కడ ఉన్న అనుకూలత ఇతర రంగాలలో అనుకూలత నింపడానికి తోడ్పడుతుంది.

ఆ ర్థిక మాంద్యం నిశ్శబ్ధంగా ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేస్తుంది. మహాయుద్ధాల కంటే భయంకరమైనది. ప్రకృతి వైపరీత్యాలు కూడా ఆ ప్రాంతానికే పరిమితం. కానీ ఆర్థిక మాంద్యం ఫలితం అపరిమితం. ఖండాంతరాలు దాటగలదు. కాబట్టి వీలైనంత త్వరగా మేలుకోవలసి ఉంది. ప్రజల కొనుగోలు శక్తి క్షీణిస్తూ రావడం, అదే కొనుగోలు శక్తి పతనస్థాయికి చేరడం ఆర్థిక మాంద్యం. విచిత్రమేమిటంటే దీని గురించి అర్థం తెలియని వారు కూడా దీని ఫలితాన్ని అనుభవించాల్సిందే. ఈ పరిస్థితు లలో ప్రజలు తమను తాము కాపాడుకోవాలనుకోవడం సహజం. ఇందుకు ప్రజలు దుబారా తగ్గించుకోవడం, సంపాదన మార్గాలు నిలుపుకోవడం, వీలైతే కొత్త సంపాదన మార్గాలు కూడా అన్వేషించడం, పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వాడటం మొదలైనవి చేయాలి.

కానీ ఇవి వ్యక్తిగతంగా మేలు చేస్తాయేమోకానీ, సమిష్టిగా ఆర్థిక వ్యవస్థకు మేలు చేయకపోవచ్చు. ప్రపంచంలో చాలా దేశాలు ఆర్థికమాంద్యంలోకి వెళుతున్న అనుభవాలు వింటున్నాం. అదృష్టం కొద్దీ కాస్త ఆలస్యంగా మనకు ఆ సెగలు మొదలవ్ఞతున్నాయి. అంటే మనం తిరోగమనంలోకి వెళ్తున్నాం అనుకోవచ్చు. ఇటీవల నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాన మంత్రి ఆర్థిక వ్యవస్థ 2024 నాటికి ఐదు ట్రిలియన్‌ డాలర్లకు చేరుకోవాలని లక్ష్యాన్ని నిర్దేశించా రు. కానీ కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) పార్లమెంటుకు సమర్పించిన తమ నివేదికలో ‘ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి పథంలో లేదని, మాంద్యం దిశగా ఉందని వెల్లడించింది.

ఈ స్థితిలో నియంత్రించకపోతే ఆర్థిక మాంద్యాన్ని ఆహ్వానించినట్టే. ఇప్పటికే ఆటోమొబైల్‌ పరిశ్రమలో ఆర్థికమాంద్యం ఛాయలు బయట పడ్డాయి. కానీ ఆర్థిక మంత్రి సమాధానాలు మరింత అభద్రతను కలిగించేవిగా ఉన్నాయి. దీనిపై కాంగ్రెస్‌ నేత ఒకరు వ్యంగ్యమైన సమాధానాన్ని ఆకర్షణీయంగా ఇస్తూ ‘ ప్రజలు ఉద్యోగాలు కోరుకోవడం వల్లే నిరుద్యోగం పెరిగిందని కూడా అంటారేమో అన్నారు. ఆర్థికమంత్రి అన్నట్లు ‘యువత కార్లు కొనుకపోవడానికి ఓలా, ఊబర్‌లు కారణం కాకపోవచ్చు. ట్రాఫిక్‌, ఇంధన ధరలు, పార్కింగ్‌ సమస్యలు వారిని నిరుత్సాహపరచి ఉండవచ్చు. చాలా మందికి కారు కొనడం సమస్య కాకపోవచ్చు. కానీ నిర్వహణ సమస్య కావచ్చు.

ఈ మధ్య అయితే రవాణా శాఖవారు రాయబోయే చలానాలు కూడా కారణం కావచ్చు. వాతావరణం దృష్టి రాబోయే ఎలక్ట్రిక్‌ వాహనాలు కారణం కావచ్చు. ఇలా ఆటోమొబైల్‌ పరిశ్రమతోపాటు స్థిరాస్తి, రవాణా, సమాచార, వ్యవసాయరంగాలు కూడా మాంద్యం దిశలోనే ఉన్నాయి. ఇంకొక విషయం ఏమిటంటే ప్రజలు వ్యక్తిగతంగా తీసుకున్న చర్యలు ఏవీ ఆర్థిక మాంద్యాన్ని తగ్గించలేవ్ఞ. ఈ పరిస్థితుల్లో రాజకీయాలతో సంబంధం లేకుండా చిత్తశుద్ధితో ప్రభుత్వం తీసుకున్న చర్యలు మాత్రమే దేశాన్ని ఆర్థిక మాంద్యపరిస్థితుల నుంచి కాపాడగలవ్ఞ. ఇందుకోసం ఉత్పత్తి కార్యకలాపాలు ప్రోత్సహిస్తూ ఉపాధిని కల్పించడం, అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని వీలైనంతగా స్థానిక ప్రజల భాగస్వామ్యాన్ని తీసుకుని తద్వారా ఉపాధి, ఆదాయ మార్గాలను పెంచడం, విద్యుత్‌ సరఫరా, నీటి సరఫరా, రవాణాలో సమస్యలు లేకుండా చూసుకోవడం ద్వారా ఉత్పత్తి కార్యకలాపాలు నిరంతరం కొనసాగిస్తూ ఉపాధి పడకుండా చూసుకోవడం, బ్యాంకింగ్‌ సేవలను విస్తరిస్తూ, బ్యాంకర్లతో మాట్లాడి రుణాలు పెంచడం, వడ్డీరేట్లను తగ్గించడం, కంతులు పెంచడం వంటివి చేయాలి. అలాగే ఉత్పాదక కార్యకలాపా లతోపాటు వినియోగ వ్యయానికి కూడా రుణాలు అందుబాటులో ఉంచాలి. వాహన రంగంలో ఇప్పటికే 100 శాతం ఎఫ్‌డిఐలు అనుమతించబడ్డాయి. ఇలాగే విడిభాగాలు దిగుమతి సుంకాలను తగ్గించడం ద్వారా తయారీ వ్యయాన్ని తగ్గించవచ్చు. వ్యవసాయ రంగంపై అధికంగా ఆధారపడిన మనదేశంలో వ్యవసాయ ఉత్పత్తి పరికరాలపై రాయితీ, వడ్డీలేని రుణాలు పెట్టుబడిని పెంచి అధికశాతం గ్రామీణులకు ఉపాధిని కల్పిస్తాయి. శ్రమసాంద్రత పారిశ్రామిక రంగాన్ని(ఎమ్‌ఎస్‌ఎమ్‌ఇఎస్‌)ప్రోత్సహించడం ద్వారా ఆదాయపంపిణీ అనేక మంది మధ్య జరిగి ప్రజల వినిమయ సామర్థ్యాన్ని పెంచవచ్చు.

ఎగుమతులకు ఉన్న ఆటంకాలను తొలగించి విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించడానికి అవకాశాలు పెంచుకోవాలి. దీనివల్ల ఉత్పత్తి, ఉద్యోగితలను తగ్గకుండా కొనసాగించవచ్చు. పెట్టుబడిదారులు నిరుత్సాహపడకుండా తగిన భద్రతాచర్యలు తీసుకోవడం ద్వారా వారిలో ఓపిక, ధైర్యం పెంచవచ్చు. స్వయం సహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జి)లకు అధిక మొత్తాలలో రుణాలు అందించడం ద్వారా చిన్న వ్యాపారుల, వ్యవసాయదారుల, పేదవారి లావాదేవీలను తగ్గకుండా చూడవచ్చు. మొత్తానికి ఆర్థిక మాంద్యం విషయంలో కూడా ‘గుడ్‌ లీడ్‌ టు గుడ్‌ అనే సామెత నిజం అవ్ఞతుంది. అంటే ఒక రంగంలో ఉత్సాహం మరో రంగాన్ని కదిలిస్తుంది. ఈ విధంగా ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. ఆర్థిక వ్యవస్థను కాపాడుతుంది. కాబట్టి ప్రస్తుతం ఉన్న అనుకూల వర్షపాతం, రిజర్వాయర్ల నిండానీరు ఉన్న దృష్ట్యా వ్యవసాయరంగంపై బాగా దృష్టిపెడితే అక్కడ ఉన్న అనుకూలత ఇతర రంగాలలో అనుకూలత నింపడానికి తోడ్పడుతుంది.

-పి.వి. శేషశయన రెడ్డి, (రచయిత: ఆర్థికశాస్త్ర అధ్యాపకుడు)