ఆచరణ సాధ్యం కాని ట్రాఫిక్‌ జరిమానాలు!

పెరిగిన అపరాధ రుసుముల మూలంగా ప్రమాదాలు, నిబంధనల అతిక్రమణ తగ్గుముఖం పడుతుందా అంటే చెప్పుకోదగినంతగా తగ్గుముఖం పట్టే అవకాశాలు లేవనే చెప్పాలి. అన్ని పక్కాగా ఉన్న వాహనదారులు అరుదుగా ఉంటారు. కాబట్టి ట్రాఫిక్‌ సిబ్బంది తల్చుకుంటే వాహనదారుని వద్ద ఏదో ఒక రూపంలో అపరాధ రుసుము వసూలు చేయగలరు. ఎలాగూ అపరాధ రుసుములు 1500 రూపాయలకు తగ్గి లేవ్ఞకాబట్టి ట్రాఫిక్‌ సిబ్బందికి అంతో ఇంతో అప్పచెప్పాలన్నా కూడా వెయ్యి పైమాటే.పదివేలు జరిమానా కట్టాల్సి వస్తే అందులో సగం అయినా జరిమానా పడకుండా అనధికారికంగా లాలూచీలు జరిగే అవకాశం లేకపోలేదు. తదనుగుణంగా పెరిగిన అపరాధరుసుములు ప్రభుత్వానికి, ట్రాఫిక్‌ సిబ్బందికి వరంగా మారి సామాన్యుని పాలిట శాపంగా మారే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయనేది విశ్లేషకుల అభిప్రాయాలుగా తెలియవస్తున్నాయి.

తెలంగాణ ష్ట్ర ఖజానా లోటుకు గురైతే అందుకు దిద్దు బాటు చర్యలు చేపట్టాల్సింది పోయి ఎక్కడైతే ఫ్రీపథకాల అమ లుతో పోగొట్టుకున్నామో అక్కడే నిబంధనల పేరుతోఅంతకుమించి సొమ్మును రాబట్టుకోవాలనే తెలి వితేటలు ప్రస్తుత ప్రభుత్వాలకే చెల్లుతాయి. అయినా ప్రజలకు ప్రభుత్వాలు చేసే ఉచిత పథకా లతో ఎంతలబ్ధి చేకూరింది అనేదే ముఖ్యం. తప్పులు చేయడా నికి సదుపాయాలు ఏర్పరిచి మరీ తప్పు చేసావంటూ నిబంధ నల పేరుతో సామాన్యునిపై అధికారిక వసూళ్లకు పాల్పడటం దానికి ‘ప్రాణరక్షణ అనే టాగ్‌లైన్‌ ఒకటి తగిలించడం నిజంగా ప్రభుత్వాలు అవలంభిస్తున్న అనైతిక విధానాలుగాచెప్పుకోవచ్చు. వైన్‌ షాపుల పేరుతో బ్రాందీ, విస్కీ, రమ్ము,జిన్ను అన్ని అమ్ము కునే సౌకర్యం.లైసెన్స్‌ లేని బెల్ట్‌షాపులలో అనధికారికంగా ఎంత మందైనా ఇష్టమొచ్చిన రేటుకు అమ్ముకునే సౌకర్యం. తాగడానికి, తాగి ఊగడానికి బార్లు, రెస్లారెంట్లలో సిట్టింగ్‌లు ఏర్పరచడం, వాటికి రాత్రి పది గంటల వరకు అనుమతులు ఇవ్వడం, తీరా తాగేసి తమ ఇంటికి తాము వెళదామంటే మాత్రం ఎక్కడలేని నిబంధనలు. పౌరుల ప్రాణరక్షణ అనే టాగ్‌లైన్‌తో సామాన్యుని జేబు లూటీ. ఆపై జైలుశిక్ష కూడా. అంతగా సామాన్య పౌరుల ప్రాణరక్షణ పట్ల ప్రభుత్వాలకు బాధ్యత ఉన్నట్లయితే బార్లు, రెస్టారెంట్లకు ఇబ్బడి ముబ్బడిగా అనుమతులెందుకు ఇవ్వాలి? వాటికి రాత్రి పది గంటల వరకు ఎందుకు సిట్టింగ్‌ అనుమతులు ఇవ్వాలి?అసలు సిట్టింగ్‌ అనుమతులు ఇవ్వకుంటే తాగి వాహనా లు నడిపేవాడిని దోషిగా పరిగణించడానికి అవకాశం ఉంటుంది. కానీ ఒక పౌరుడు తప్పు చేయడానికి ప్రభుత్వమే ప్రోత్సహించి, ఆ తప్పు చేసినందుకు ప్రభుత్వమే శిక్ష విధించడం బహుశా బ్రిటిష్‌ ప్రభుత్వంలో కూడా జరగలేదేమో. మద్యం ఆరోగ్యానికి హానికరం. మద్యపానం సేవించి వాహనం నడపడం ప్రాణానికి ప్రమాదకరం. అలాంటప్పుడు మద్యపాన నిషేధం చేసి పౌరుల ప్రాణాల పట్ల ప్రభుత్వాలకు ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకోవచ్చు గా!అలా నిరూపించుకుంటే అదే సామాన్యుల జేబునుండి రెండు విధాలుగా (తాగడం వల్ల వచ్చే డబ్బు..తాగి వాహనం నడపడం వల్ల నిబంధనల పేరుతో ఫైన్‌ల రూపంలో వచ్చే డబ్బు)ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుందని భయం. ఇదీ ప్రభుత్వాలు బార్లు, రెస్టారెంట్లు, బెల్ట్‌షాపుల పేరుతో ఒకపక్క డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పెనాల్టీలతో మరోపక్క సామాన్యుల బలహీనతలను సొమ్ము చేసుకుంటున్న తీరు. తాగడం, తాగి వాహనం నడపడాన్ని ఎవరూ ప్రోత్సహించకూడదు. అలాగని అలా జరగడానికి ప్రభు త్వమే ప్రోత్సహించి ప్రభుత్వమే అపరాధ రుసుముల పేరుతో వసూళ్లు చేయడం ఎంతవరకు సమంజసం? ఇక ట్రాఫిక్‌ నిబంధనల అపరాధ రుసుముల పెంపుదల విష యానికొస్తేనిబంధనల న్నీకూడా సక్రమంగా అమలు జరగాలి. అందుకు పౌరులు కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకరు నిబంధనలను అతిక్రమించి అధిక వేగంతోనో, రాంగ్‌రూట్‌లో వాహనం నడపడం మూలాన్నో ప్రమాదాలు జరిగి అతనితోపాటు మరికొందరి ప్రాణాలు నష్టపరిచే అవకాశ ముంది కాబట్టి. ముఖ్యంగా మైనర్లు వాహనంనడిపే తీరు ట్రాఫి క్‌లో ఎన్నో ప్రమాదాలను తెచ్చిపెడుతున్నాయి. లైసెన్సు లేని వాహనాలు, డ్రైవింగ్‌ లైసెన్సులేని పౌరుల మూలంగా ప్రభుత్వా నికి ఖజానా నష్టపోవడమే కాకుండా ప్రమాదాలు జరిగినప్పుడు అవశ్యకంగా అవసరమొచ్చే లైసెన్సులు ప్రతి పౌరుడు విధిగా పొందాల్సిన అవసరం ఉంది. కానీ ఈ నిబంధనలను పాటించాల్సిన అవసరం పౌరులకెంత మేర ఉందో పౌరుల రోడ్‌ రవాణాకు మెరుగైన సౌకర్యాలను ఏర్పరచాల్సిన అవసరం ప్రభుత్వాలకు కూడా అంతే ఉందనే విషయాన్ని ప్రభుత్వాలు వందకు 10 శాతం కూడా బాధ్యత తీసుకుంటున్నాయా? అంటే లేదనే చెప్పాలి. ప్రధాన రహదారులపై తెరిచి ఉంచిన మ్యాన్‌ హోల్‌ నుండి బురదమయం అయ్యి ఎక్కడ మ్యాన్‌హోల్‌ ఉందో,ఎక్కడ గుంత ఉందో తెలియని రోడ్లు పౌరుల ప్రాణాలకు ప్రమాదకరం కాదా?మరి అలాంటి అవాంతరాలను నిర్మూలించి మెరుగైన రవాణా ఏర్పరచాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేకదా. అలా మెరుగైన రవాణా ఏర్పరచని ప్రభుత్వాలకు పౌరులు ఎంతమేర అపరాధ రుసుము విధించాలో కూడా ప్రభుత్వాలు నిర్ణయిస్తే బాధ్యతాయుతమైన నిబంధనలను అమలు చేసినవార వ్ఞతారు. ట్రాఫిక్‌ నిబంధనల అతిక్రమణ విషయంలో ఇదివరలో రూ.100 నుండి రూ. 1000 వరకు ఉన్న అపరాధ రుసుము లు ప్రస్తుతం రూ.500 నుండి రూ.10వేల వరకు పెంచడం, ఇక తప్పనిసరిగా వెంట ఉంచుకోవాల్సిన వాహన డాక్యుమెంట్ల విషయంలో ఇదివరలో రూ.50 నుండి రూ.1500 వరకు ఉన్న అపరాధ రుసుములు అమాంతం వెయ్యి నుండి 40వేల వరకు పెంచడం, ఈ అపరాధ రుసుములు పెంపుదలకు సామాన్యుని ప్రాణరక్షణ అనే ట్యాగ్‌లైన్‌ను తగిలించుకోవడం గమనార్హం. పోనీ ఇలాంటి ప్రాణరక్షణకు సంబంధించి నిబంధనలను ఎమ్మెల్యేలు, ఎంపిలు పాటిస్తారా? అంటే ఎమ్మెల్యేలు, ఎంపిలే కాదుకదా కనీసం కొంత మంది వార్డ్‌కౌన్సిలర్లు సైతం పాటించరు. అలాంటివారిని నిబంధనలతో శిక్షించిన దాఖలాలు సైతం ఎక్కడా కనిపించవ్ఞ, వినిపించవ్ఞ. ఎటొచ్చి ఈ నిబంధనలన్నీ సామాన్యుని జేబుకే చిల్లు. ఓ రకంగా అంతేసి అపరాధ రుసుములు ఉండటం కూడా కొందరు జడుసుకొని నిబంధనలను అతిక్రమించకపోవడా నికి దోహదపడుతుందేమో కానీ కావాలని నిబంధనలను అతిక్రమించడం అనేది కొన్ని అత్యవసర పరిస్థితులలో మాత్రమే జరిగే అవకాశాలు ఉన్నాయి. పెరిగిన అపరాధ రుసుముల మూలంగా ప్రమాదాలు, నిబంధ నల అతిక్రమణ తగ్గుముఖం పడుతుందా అంటే చెప్పుకోదగినం తగా తగ్గుముఖం పట్టే అవకాశాలు లేవనే చెప్పాలి. అన్ని పక్కాగా ఉన్న వాహనదారులు అరుదుగా ఉంటాలు. కాబట్టి ట్రాఫిక్‌ సిబ్బంది తల్చుకుంటే వాహనదారుని వద్ద ఏదో ఒక రూపంలో అపరాధ రుసుము వసూలు చేయగలరు. ఎలాగూ అపరాధ రుసుములు 1500 రూపాయలకు తగ్గి లేవ్ఞకాబట్టి ట్రాఫిక్‌ సిబ్బందికి అంతో ఇంతో అప్పచెప్పాలన్నా కూడా వెయ్యి పైమాటే.పదివేలు జరిమానా కట్టాల్సి వస్తే అందులో సగం అయినా జరిమానా పడకుండా అనధికారికంగా లాలూచీలు జరిగే అవకాశం లేకపోలేదు. తదను గుణంగా పెరిగిన అపరాధరుసుములు ప్రభుత్వానికి, ట్రాఫిక్‌ సిబ్బందికి వరంగా మారి సామాన్యుని పాలిట శాపంగా మారే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయనేది విశ్లేషకుల అభిప్రాయాలుగా తెలియవస్తున్నాయి. సరే సామాన్యుని బతుకుపై ప్రభుత్వాలకు అంత బాధ్యత ఉన్నప్పుడు ఒక్క ట్రాఫిక్‌ మాత్రమే సామాన్యుని ప్రాణానికి నష్టం చేకూర్చేదిలా ఉందా? నిత్యావసరాల సరుకుల ధరలు ఆకాశాన్నంటుతుండటం మాటేంటి? అపరాధ రుసుములను పెంచడంలో ఉన్న అత్యుత్సాహం సామాన్యుని ప్రాణాలను తోడేస్తూ అప్పులపాలు చేస్తున్న అధికధరల నిర్మూలనపై ఉండదా? సంవత్సరమంతా రెక్కలు ముక్కలయ్యేలా శ్రమించి తీరా పండించిన సరుకుమార్కెట్‌కు సరైన మద్దతు ధర లభించక అప్పులపాలు అయిపోయి తనువ్ఞలు చాలిస్తున్న రైతులకు కనీస మద్దతుధరల పెంపకంపై ఎందుకు అంత అత్యుత్సాహం ప్రద ర్శించరు? అని సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిబంధనలు అనేవి ప్రజలు ఆచరించే విధంగా, భరించే విధంగా ఉండాలి. తప్పా సాధ్యాసాధ్యాలను పక్కనబెట్టి ఏదో ఓ సినిమాలో ఆచరణకు ఆమడదూరంలో ఆలోచించిన డైరెక్టర్‌ ఊహాజనిత మైన సన్నివేశాన్ని బేస్‌ చేసుకొని అమలు చేసేవిధంగా ఉండకూడదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ్ద

  • శ్రీనివాస గుండోజు