ఆచరణ లేని అభ్యాసం నిష్ప్రయోజనం

Kashmir University Students
Kashmir University Students (file)

ఆచరణ లేని అభ్యాసం నిష్ప్రయోజనం

మనదేశంలో విద్యాభ్యా సానికి, పశ్చిమదేశాల లో విద్యాభ్యాసానికి చాలా తేడాఉంది. మనదేశంలో విద్యాభ్యాసం మొత్తం పేరుకు తగ్గ ట్టు కేవలం అభ్యసించడం, వల్లె వేయడం, బట్టీపట్టడంతోనే సరిపో తోంది.చదివిన దాన్ని విశ్లేషించడం, ఆచరణాత్మక విధానంలో పరిశీలిం చడం, పరిశోధించడం లోపిస్తున్నాయి. పశ్చిమ దేశాలలో అభ్యాసం కన్నా, ఆచరణకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టే ఎన్నో విలు వైన పరిశోధనలు వెలుగు చూస్తున్నాయి. అటువంటి నూతన ఆవి ష్కరణలు మనదేశంలో కూడా పురుడుపోసుకోవాలి అంటే చదివిన దాన్ని ఆచరణలో పెట్టడానికి విద్యావ్యవస్థలోని ప్రతి ఒక్క భాగస్వా మి నడుంబిగించాలి. కేవలం విద్యారంగమేకాదు.

ఏ రంగంలోనైనా అది వ్యవసాయమైనా, వ్యాపారమైనా కొత్త కొత్త వస్తువ్ఞలు తయా రు చేయడమే కాక, వాటిని సామాన్య ప్రజలకు అందుబాటులోకి తేగలిగితే ఆరంగం అభివృద్ధి చెందుతుంది.ముఖ్యంగా విద్యావేత్తలు వ్యవసాయం, సామాజిక సమస్యలపై తమ పరిశోధనా దృష్టిని సారించాల్సి ఉంది. ఒక్కసారి చరిత్రను తిరగేస్తే ఆర్యభట్టు, భాస్క రుడు (ఖగోశశాస్త్రం,చరకుడు, శుశ్రుతుడు (వైద్యశాస్త్రం) పింగళుడు, విరహంకుడు (గణితశాస్త్రం) కనౌదుడు (భౌతికశాస్త్రం వంటి వారి దగ్గర నుంచి నిన్న మొన్నటి సుబ్రహ్మణ్య చంద్రశేఖర్‌ (భౌతిక శాస్త్రం) వంటి వారు తమ పరిశోధనా పాటవాలతో భారతదేశ కీర్తి పతాకాలను అంతర్జాతీయ యవనికపై ఎగురవేయటమేకాక ఆయా రంగాల్లో తమ ముద్రలు ఎవ్వరు చెరుపలేనంతగా చరిత్రలో నిలి చిపోయారు. ఒకనాడు తక్షశిల, నలంద వంటి విశ్వవిద్యాలయాలు అంతర్జాతీయంగా ఎంతోమంది విద్యార్థులకు విద్యాదానం చేయడ మేకాక అత్యున్నత పరిశోధనా కేంద్రాలుగా భాసిల్లాయి. కాని రాను రాను వారి వారసత్వాన్ని నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమ య్యాయి మన ముందుతరాలు.

అమెరికా, జపాన్‌, జర్మనీ వంటి దేశాల్లో తారసపడే చలనాత్మక పర్యావరణ వ్యవస్థలకు మూలం విద్యావ్యవస్థను పరిశ్రమలతో అనుసంధానం చేయడమే. చైనా వంటి కమ్యూనిస్టు దేశం కూడా తన ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెంద డానికి విద్యావ్యవస్థ చేసిన పరిశోధనల పాత్ర కూడా మరిచిపోలేనిది అని గుర్తించింది. ప్రస్తుతం మనదేశం ముందున్న అతిపెద్ద సవాలు యువ విద్యావేత్తలను ఉత్తేజపరిచి, పరిశ్రమలు, వ్యవసాయానికి తగ్గట్టు నూతన ఆవిష్కరణలకు నాంది పలకటం. నడుస్తున్న నూ తన యుగపు ఆర్థికవ్యవస్థలన్నీ కూడా డిజిటలైజేషన్‌ వంటి సాంకే తిక అంశాలతో కూడిన వేగవంతమైన పరివర్తన చెందుతున్నాయి. ఈ పరివర్తనకు పరిశ్రమలు – విద్యావ్యవస్థల అనుసంధానం అతి ముఖ్యమైన పునాది. పరిజ్ఞానంకల మేధావ్ఞలకు ప్రాధాన్యత పెరగ డంతో, ఇంక్యుబేటర్లకు, ఎక్జిలరేటర్లకు ఆదరణ పెరుగుతోంది. ప్రతి పరిశ్రమ తమస్వంత ఇంక్యుబేటర్లను స్థాపించి యువతకు శిక్షణనిస్తున్నాయి.

ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ‘సిఐఐఇ అనే సంస్థ ను (సెంటర్‌ ఫర్‌ ఇన్నోవేషన్‌, ఎంట్రప్రెన్యూన్షిప్‌) విద్యార్థులను నూ తన ఆవిష్కర్తలుగా, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దటా నికి స్థాపించడం జరిగింది.కేంద్రప్రభుత్వం మొదలుపెట్టిన ‘జాతీయ శిక్షణాభివృద్ధి ప్రణాళిక ద్వారా కూడా ఎక్కువ మంది విద్యార్థులకు చదువ్ఞ పూర్తికాక ముందే శిక్షణనిచ్చి వారిని ఉద్యోగాలకు ఎంపిక య్యేటట్లు చూసే లక్ష్యంతో సాగుతోంది. కాని మనదేశంలో ఉన్న యువజనాభాతో పోలిస్తే ఈ వేగం సరిపోదనే విషయం అవగతమ వ్ఞతోంది. ఐఐఎస్‌సి, ఐఐటీలు, ఎన్‌ఐటీలు వంటి కొన్ని సంస్థలు మినహాయిస్తే మనదేశంలోని విద్యాసంస్థల్లో జరుగుతున్న పరిశోధ నలకు ప్రభుత్వం నుంచి కాని పరిశ్రమల నుంచికాని ప్రోత్సాహం ఏమాత్రం లేదనే చెప్పాలి. ఐఐటిలలో కూడా పరిశోధనలకు పరిశ్రమలందిస్తున్న ఆర్థిక సహాయం 10-15 శాతంకన్నా ఎక్కువలేదు. అంతర్జాతీయ ప్రమా ణాలతో పోలిస్తే ఇది చాలాతక్కువ. విద్యాలయాల్లో ఎన్నో నూతన ఆలోచనలు, నూతన ఆవిష్కరణలు పురుడుపోసుకుంటూ వ్ఞంటా యి.ఇవి పురిటిలోనే మృత్యువాకిట పడకుండా పరిశ్రమలకు తగ్గట్టు మార్చుకోవాలంటే పరిశ్రమల అనుసంధానం తప్పనిసరి. అంతర్జా తీయ విజ్ఞాన ఆర్థికవ్యవస్థలో మనదేశం కూడా భాగస్వామ్యం కా వాలన్నా, అంతర్జాతీయ సవాళ్లను దీటుగా ఎదుర్కోవాలన్నా పరిశ్ర మలను విశ్వవిద్యాలయాల బాట పట్టించక తప్పదు. పరిశ్రమలు- విద్యాసంస్థల అనుసంధానం ఆ విద్యాసంస్థ పరిపాలనాధికారుల దూరదృష్టిపై కూడా ఆధారపడి ఉంటుంది.

కాని నేడు విశ్వవిద్యా లయంలోని కీలక పదవ్ఞలన్నీ రాజకీయ ప్రమేయంతో అనర్హులతో నింపటం వల్ల వారికి భవిష్యత్‌ దార్శినికత లేకపోవడం వల్ల ఇటు వంటి విన్నూత్నమైన కార్యక్రమాలు వేగం పుంజుకోవట్లేదు. అందు వల్ల విశ్వవిద్యాలయాల్లో పాలక మండళ్లను, కులపతులను అంతర్జా తీయ ప్రమాణాలకు అనుగుణంగా నియమకాలు జరిపినట్లయితే కొంతైనా ఇవి వేగం పుంజుకుంటాయి.

విశ్వవిద్యాలయ కులపతుల కు ఆర్థిక స్వేచ్ఛనిచ్చినట్లయితే క్రియాత్మకమైన వాతావరణం పరిశో ధనా రంగంలో ఏర్పడుతుంది.విద్యార్థులలో చిరుప్రాయంలో అంకు రించే ఔత్సాహిక శక్తిని సామాజిక ఆర్థిక సమస్యలకు పరిష్కారాలు కనుగొనే స్థాయికి పెంపొందించాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టు కుని మరిన్ని పరిశ్రమలతో ఒప్పందాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కనీసం దేశంలోని వందపై చిలుకు విద్యాసంస్థలతో పరిశ్ర మలు కలిసి పరిశోధనలు చేయడానికి సహకారం అందించడం, ఆర్థిక సహకారం అందించే నియమాన్ని పక్కన పెట్టి, ప్రతిభకల ప్రైవేట్‌ విద్యాసంస్థలకు కూడా సహాయ సహకారాలు అందించా ల్సిన అవసరం ఉంది. ప్రతిభకు, పరిశోధనకు, ప్రభుత్వ, ప్రైవేట్‌ అనే తారతమ్యాలు ఉండవ్ఞ. కేవలం కేంద్ర ప్రభుత్వ సంస్థల ఆర్థిక సహకారంపై ఆధారపడకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ బడ్జెట్‌లో నిధులు కేటాయించాల్సిన అవసరంఉంది. రాష్ట్ర విశ్వవి ద్యాలయాలు రాజకీయాలకు నెలవై పరిశోధనలు అడుగంటుతు న్నాయి.వీటిలో పరిశోధనలను ప్రోత్సహించి, ఒక్కొక్క విశ్వవిద్యాల యాన్ని ఒక్కొక్క రంగంలో నైపుణ్య కేంద్రంగా తీర్చిదిద్దడానికి దీర్ఘ కాలిక ప్రణాళికలు రూపొందించాలి.

తద్వారా ఆరంగంలో పరిశోధ నలు ఊపందుకుంటాయి. వాటి అనుబంధ పరిశ్రమలు ఆ ప్రాంతం లో పెరిగి పారిశ్రామిక వాడలుగా రూపాంతరం చెందుతాయి. జర్మనీలో రెండు లక్షల పైచిలుకు సంస్థలు విద్యార్థులకు అప్రంటిస్‌ అవకాశాలు కల్పిస్తుంటే మనదేశంలో కేవలం 30వేల సంస్థలు మాత్రమే అవకాశమిస్తున్నాయి. విద్యాపారిశ్రామిక అనుసంధానానికి అప్రంటిస్‌ శిక్షణ ఒక వారధిలాగా ఉపయోగపడుతుంది. పాఠశాల స్థాయినుండే నూతన ఆవిష్కరణల అవసరాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించాలి. అటల్‌ ఇన్నోవేషన్‌ ప్రోగ్రామ్‌ ద్వారా వెయ్యి పాఠశాలలో ‘టింకరింగ్‌ ల్యాబ్‌లు ప్రారంభించబోతున్నారు. ప్రైవే ట్‌పరంగా ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది విద్యార్థులు రేపటి పరిశోధకులుగా మారుతారనడంలోఎటువంటి సందేహంలేదు. ఇటు వంటి కార్యక్రమాలు వందల సంఖ్యలో ప్రారంభిస్తే తప్ప మనదేశ జనాభాకు సరిపోవ్ఞ. చైనాలో ప్రతి పాఠశాలలో 3డి ప్రింటర్లను స్థాపనచేసి వాటి ద్వారాపిల్లల్లో సృజనాత్మకతను పెంపొందిస్తోంది.

మనదేశంలో 3డి ప్రింటర్లు తరువాత, అసలు విద్చుచ్ఛక్తి లేని పాఠశాలలు కోకొల్లలు. పాలకులు ఇకనైనా ఇటువైపు దృష్టిపెట్టి ప్రతి పాఠశాలలో కనీసం ఒక సైన్స్‌ ల్యాబ్‌ను పూర్తి మౌలిక సదుపా యాలతో ఆధునీకరించినట్లయితే ఎన్నో వైజ్ఞానిక విచిత్రాలను చూడవచ్చు. అమెరికా, జపాన్‌, చైనా, జర్మనీ దేశాలు తమ జిడిపి లో 2 నుంచి 3శాతం వరకు పరిశోధనలపై ఖర్చుపెడుతుంటే మన దేశంలో మాత్రం 0.8శాతం నిధులు వెచ్చిస్తున్నారు. ఈ మొత్తాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. ఇటీవల దేశంలోని అత్యున్నత 20 విద్యాసంస్థలకు రూ.1000 కోట్లను వెచ్చిస్తున్నట్లు ప్రధాని ప్రకటించడం చాలా హర్షణీయం.

రానున్న ఐదు సంవత్సరాలలో ఈ విద్యాసంస్థలను పరిశోధనా రంగంలోఅత్యున్నత అంతర్జాతీయ ప్రమాణాలు నెలకొల్పేలా చూడ టమే లక్ష్యంగా ఈ నిధులు కేటాయించారు. జర్మన్‌, అమెరికా, చైనా దేశాలలోని విద్యాసంస్థలతో పోల్చినప్పుడు మనదేశంలోని పరిశ్రమలు కనీసం నాలుగోవంతు కూడా ఆర్థికసహాయం అందించ డం లేదు. విద్యాసంస్థలకు ఆర్థిక సహాయం అందించే పరిశ్రమలకు పన్ను మినహాయింపులు, ప్రోత్సాహకాలు అందించినట్లయితే కొంతై నా ఈ పరిస్థితి మెరుగుపడే అవకాశంఉంది. డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి విద్యా-పారిశ్రామిక బంధాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. వివిధ విద్యా, సామాజిక, ఆర్థికసమస్యలకు ఈ అనుబంధాల ద్వారా పరిష్కార మార్గాలు చూపొచ్చు. కొత్త ఆలోచనలు విద్యార్థులలో ఉద్భవించాలన్నా, సృజనాత్మకంగా ఈ తరం ఆలోచించాలన్నా, నూతన పరిశోధనలు విస్తృతంగా జరగాలన్నా పరిశ్రమలుపాఠశాల బాటపట్టక తప్పదు.

— ఈదర శ్రీనివాసరెడ్డి