అయోమయంలో స్వయం సహాయక సంఘాలు

IMG

అయోమయంలో స్వయం సహాయక సంఘాలు

స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలకు బ్యాం కుల నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి సహాయం ఆందడం లేదనే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలు బ్యాంకు రుణాలు పొందినప్పుడు ఆ రుణాలను తిరిగి వడ్డీతో సహా సకాలంలో చెల్లిస్తే ఆ తరువాత వారి ఖాతాల్లో ఆయా వడ్డీ మొత్తా లను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి తప్పనిసరిగా జమ చేయాల్సి ఉంటుం ది. అలా చేస్తేనే అది వడ్డీ లేని రుణాల పథకం కిందకు వస్తుంది.

అయితే గత మూడేళ్లుగా ఈ విధానం సజావ్ఞగా సాగడం లేదు. గత మూడేళ్లలో మహిళలు బ్యాంకులకు చెల్లించిన వడ్డీల్లో రూ. 937 కోట్లను ప్రభుత్వం తిరిగి మహిళలకు చెల్లించాల్సి ఉంది. కానీ ఇంకా చెల్లింపు కాలేదు. అలాగే స్త్రీనిధి సంస్థ నుంచి పొందిన రుణా లను తిరిగి చెల్లించినప్పటికీ ఆయా మహిళలకు ప్రభుత్వం నుంచి రూ. 300 కోట్లు తిరిగి రావలసి ఉంది. ఈ రెండు రకాల రుణప్రక్రి యలో స్వయం సహాయక సంఘాల మహిళలకు రావలసిన బకా యిలురాకపోవడం చర్చనీయాంశం అవ్ఞతోంది. స్వయం సహాయక సంఘాల్లోని మహిళల నుంచి బ్యాంకులతోపాటు రాష్ట్ర స్త్రీ నిధి సంస్థ అధికవడ్డీలను వసూలు చేస్తున్నాయి.

స్త్రీనిధి సంస్థ 13 శాతం వరకూ స్వయం సహాయక సంఘాల మహిళల నుంచి వడ్డీని రాబడుతోంది. ఈ విధంగా వసూలయ్యే వడ్డీ మొత్తాల నుంచే స్త్రీ నిధి సంస్థ ఏటా లాభాలను ఆర్జిస్తోంది. 2016-17లో ఈ సంస్థకు అన్ని ఖర్చులుపోగా రూ.50 కోట్లమేర లాభం వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి బకాయిలన్నీ కలిపి రూ.1237 కోట్ల వరకు పేరుకుపోయాయి. ఆర్థికశాఖ అప్పుడప్పుడు మొక్కుబడిగా వడ్డీ మొత్తాలను విడుదల చేస్తోంది. ఇదే విధంగా అభయహస్తం పింఛ ను పథకంలో ఉన్న స్వయం సహాయక సంఘాలకు చెందిన 96 వేల మందికి ఏడాది కాలంగా పింఛను అందడంలేదు.

నెలకు రూ. 500 వంతున వీరికి పింఛను ఇవ్వాల్సి ఉంది. ఈ లెక్కన ఇప్పటికి రూ. 45 కోట్లు చెల్లించాల్సి ఉంది.అయితే గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు మాత్రం అభయహస్తం పథకంలో మార్పులు తెస్తున్నా మని, అందువల్లనే పింఛన్లు నిలుపుదల చేశామని చెబుతున్నారు. గ్రామీణప్రాంతాల్లోని పేదకుటుంబాల మహిళలకు ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నట్టు ప్రకటిస్తున్నా వాస్తవానికి క్షేత్ర స్థాయిలో అవి అర్హులకు అందడం లేదన్న ఆరోపణలు బాగా వస్తు న్నాయి. ఈ పథకాలకు కావలసిన ఆర్థిక సాయం అందించేందుకు రుణాలు బ్యాంకుల ద్వారా ఇచ్చే మార్గాలు ఉన్నా ఎంతమందికి ఆమేరకు రుణాలు అందుతున్నాయో చెప్పలేం.

దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలకు తక్కువ పెట్టుబడితో ఏర్పాటుకు వీలున్న పౌల్ట్రీ యూనిట్లను ప్రోత్సహించడానికి ప్రభు త్వం నిర్ణయించింది. పశుసంవర్థక శాఖ గిరిరాజా, వనరాజా, రెయి న్‌ బో వంటి కోళ్ల రకాలను ప్రోత్సహిస్తోంది. ఈ రకాలు ఏడాదికి కనీసం 150 నుంచి 170 వరకు గుడ్లను ఉత్పత్తి చేస్తాయి. ఒక్కో కోడి ఒకటి నుంచి ఒక టిన్నర కిలోలవరకు మాంసం బరువ్ఞ కలిగి ఉంటాయి. బంధువ్ఞలు ఇళ్లకు అతిధులుగా వచ్చేటప్పుడు నాటుకోళ్ల మాంసంతో వంట కాలు తయారు చేయడం కొన్ని కుటుంబాలలో సంప్రదాయం. గ్రామాల్లో ఎవరైనా ఇళ్లవద్దనే కోళ్లను పెంచేవారు. ఇప్పుడు ప్రతిగ్రా మంలో చికెన్‌ సెంటర్లు వచ్చేశాయి. ఈ సెంటర్లు బ్రాయిలర్‌ చికెన్‌ సరఫరా చేస్తుంటాయి.చికెన్‌సెంటర్ల ఏర్పాటుకన్నా ఆయా కుటుంబాలు తమ పెరటిలోనే కోళ్లను పెంచుకుని ఆదాయం పొందేలా పథకాలు రూపొందాయి. ఈ విధంగా ఇళ్ల వద్దనే ఈ పెంపకాన్ని చాలా తక్కువ వ్యయంతో చేపట్టవచ్చు.

అందుకని దేశ వాళీకోడి పిల్లలను లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం నిర్ణ యించింది. ఈ దేశవాళీ పౌల్ట్రీ యూనిట్లు పేదకుటుంబాలకు మాత్ర మే మంజూరు చేస్తారు.ఇంతవరకు బాగానే ఉన్నా దీనికి ఆహార భద్రత కార్డు, ఆధార్‌కార్డు ఉన్నవారికే ఇవి అందచేస్తామని ప్రభు త్వం ఆంక్షలు విధించడంతో చాలామందికి ఈ పథకం వర్తించ కుండాపోతోంది.

దీనికి ఉదాహరణగా కరీంనగర్‌ జిల్లాలో తక్కువ పెట్టుబడి సరిపోయే 240 యూనిట్లను మంజూరు చేశారు.ప్రతి యూనిట్‌లో 45కోడిపిల్లలు ఉంటాయి. ఒక్కొక్క దాని ఖరీదు రూ. 68. మొత్తం యూనిట్‌ విలువ రూ.4500 వరకు ఉంటుంది. లబ్ధి దారులు ఎస్సీ,ఎస్టీలయితే 75శాతం సబ్సిడీ, వెనుకబడిన వర్గాల కయితే 50 శాతం సబ్సిడీ అందిస్తారు. షెడ్ల ఏర్పాటుకు 1500 రూపాయలు ఉచితంగా అందచేస్తారు. ఇంటి ఆవరణలో పెంచుకునే ఈ యూనిట్లకు కావలసిన కోళ్ల దాణాకు పెట్టుబడి అంతగా అవ సరం ఉండదని తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వస్తుందని పశువైద్య విభాగం అధికారులు వివరించారు.

లబ్ధిదారులు ఈ కోళ్ల నుంచి వచ్చే గుడ్లను,మాంసాన్ని అమ్ముకోవచ్చని అలాగే ఆహారంగా వినియోగించుకోవచ్చని తెలిపారు.అయితే గ్రామసభ ద్వారా లబ్ధిదా రులను గుర్తిస్తారు. అదే విధంగా గుర్తించిన ప్రయివేట్‌, ప్రభుత్వ హేచరీల ద్వారా కోడిపిల్లలను సరఫరా చేస్తారు. ఇక రుణాల విధా నం కూడా సరిగ్గా అమలు కావడం లేదు. ముఖ్యంగా వ్యవసాయ కుటుంబాలకు అందించే రుణాలవ్యవహారం చివరకు ఎవరికీ ప్రయో జనం లేనివిధంగా తయారవ్ఞతోంది.

రుణమాఫీకి ప్రభుత్వం అంది స్తున్న నిధులు లక్ష్యాలకు భిన్నంగా ఇష్టంవచ్చినట్లు వినియోగమ వ్ఞతున్నాయి.మాఫీకి ఏ రైతులు అర్హులో ఆ రైతుల జాబితాలు వ్యవసాయ అధికారులవద్ద లేకపోవడంతో నిధులవిడుదల, ఖర్చుల కు సంబంధించి అధికార యంత్రాంగం కానీ బ్యాంకులు సరిగ్గా నిర్ధారించలేని సంక్లిష్ట పరిస్థితిఏర్పడుతోంది. అలాగే బ్యాంకులు మధ్య సమన్వయం లోపిస్తోంది. ఒక జిల్లాలోని బ్యాంకులు ఇతర జిల్లాల్లోని రైతుల అప్పులను కూడా మాఫీ చేసే ఉదంతాలు జరు గుతుండడం విశేషం.

రుణమాఫీ కోసమని ప్రభుత్వం విడుదల చేసి న నిధులు నేరుగా రైతుల ఖాతాల్లో వేయగా కొంత మొత్తం మిగి లింది.ఆమొత్తాన్ని తిరిగి జిల్లా వ్యవసాయాధికారులకు ఇవ్వగా వారి సొంత పొదుపు ఖాతాల్లో వేసుకోవడం, నెలల తరబడి ప్రభుత్వా నికి జమ చేయక పోవడం తరచుగా జరుగుతోంది. ఈ మొత్తాలపై వచ్చిన వడ్డీని ఇతర పథకాలకు మళ్లించి దుర్వినియోగం చేస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

దీన్నిబట్టి చూస్తే కొన్ని వేల కోట్ల రూపాయలు రైతురుణమాఫీ కింద వెచ్చించామని గొప్పలు చెప్పుకో వడం పాలకవర్గాలకు పరిపాటి అయింది. కానీ ఇచ్చే చేతికి పుచ్చు కునే చేతికి మధ్య ఏ తతంగం జరుగుతుందో పరిశీలించే సరైన వ్యవస్థ లేకపోవడం, ఒకవేళ ఉన్నా బాధ్యతలు మరిచి రాజకీయ నేతలకు,బడా రైతులకు అడుగులు మడుగులొత్తే పరిస్థితి కొనసాగు తుండడంతో రుణమాఫీ రైతులకుచేరని ఎండమావిగా మారుతోంది.

కాగ్‌ పరిశీలించిన మహబూబ్‌నగర్‌, నల్గొండ, వరంగల్‌ జిల్లాల్లోని 13 బ్యాంకులు ఈ విధంగా వడ్డీ కలపకపోవడంతో రైతులపై 66. 16 కోట్ల రూపాయల వడ్డీ భారం పడింది. ఇవే జిల్లాల్లోని 26 బ్యాంకులు 2014 మార్చి నుంచి ఆగస్టు వరకు వడ్డీని చాలా ఎక్కు వగా లెక్కించి దాదాపు 183.98 కోట్ల రూపాయలను అధికంగా తీసుకున్నట్టు కాగ్‌పరిశీలనలో వెల్లడయింది. ఈ మూడు జిల్లాల్లో నిధులవిడుదలపై ఎన్నో అవకతవకలు బయటపడ్డాయి.

– పి.వి.ఆర్‌మూర్తి