అభివృద్ధిలో పోటీ సరే, మరి పచ్చదనంలో!

Greenary
రెండు తెలుగు రాష్ట్రాలు సైతందేశ ఆహారభద్రతలో భాగంగా వరి,పాలు, కోడి గుడ్లు, చేపలు,గొర్రెలు,మేకల ఉత్ప త్తిలో ముందున్నాయి.అలాగే పత్తి, పండ్లతోటలలో కూడా ముందు ఉన్నప్పటికీ వర్షపాతాన్ని, వాతావ రణంలో సమతుల్యతను, జీవ వైవి ధ్యాన్ని పెంచే చెట్లువేగంగా అభి వృద్ధి పేరుతో నశించేపోయేలా చేస్తుండటం విచారకరం. అడవ్ఞల విస్తీర్ణం తగ్గిపోతుండడంతో కోతులు,చింపాజీలు, ఏనుగులు జనా వాసాలలోకి వచ్చి పంట దిగుబడులను తగ్గిస్తున్నాయి.

రహ దారులు, పరిశ్రమలు అవసరమే. అయితే ముందస్తు ప్రణాళిక, వివిధ ప్రభుత్వశాఖల మధ్యసమన్వయంలోపంతో ఆకుపచ్చదనం నానాటికి కనుమరుగైపోతుంది. మహావృక్షాలను సైతం 2012 సంవత్సరంలోనే మహావృక్షాలని కాపాడేందుకు వాతా వరణంలో సంభవిస్తున్న పెనుమార్పులని అరికట్టి ప్రకృతి సమ తుల్యతని కాపాడాలని 50 సంవత్సరాల వయస్సు దాటిన రాగి, మర్రి, వేప చెట్లని తొలగించరాదని అప్పటి ఉమ్మడి రాష్ట్రం జీవ వైవిధ్య పరిరక్షణ చట్టాన్ని చేసింది.

అయినప్పటికి నేడు ఈ తెలుగురాష్ట్రాలు అభివృద్ధిపేరుతో ప్రకృతిని సంరక్షించుకోవడంలో విఫలం అవ్ఞతున్నాయి. ఉదాహరణకి సూర్యాపేట నుండి జన గాం, సిరిసిల్ల వైపు రహదారుల విస్తీర్ణంలో 2018 జనవరి, ఫిబ్ర వరి నెలలోనే సుమారు 80 నుండి 100 సంవత్సరాలు గల మహావృక్షాలు 200పైగానే ఉన్నాయి. అలాగే 20 నుండి 60 సంవత్సరాల వయసుగల వృక్షాలు 1200పైగానే ఉన్నాయి. వీటిని పూర్తిగా తొలగించే ముందు ప్రణాళికా బద్ధంగా ముందుగా కొత్త మొక్కలని రహదారుల ఇరువైపులా నాటాల్సి ఉంది. ఇక జాతీయ రహదారి 365 నెంబర్‌ మహారాష్ట్రలోని గర్బిరోతి జిల్లా సిరివంచ మండలం నుంచినూతనంగా ప్రారంభించారు. ఇప్పటికి రెండు సంవత్సరాలు పూర్తి అయింది.ఈ 365 నెంబర్‌ జాతీయ రహదారి తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం, వరంగల్‌, నల్గొండ జిల్లాల గుండా వేగంగా నిర్మిస్తున్నారు. ఈ రహదారి మార్గంలో కూడా కొన్ని వేల సంఖ్యలో చెట్లు నేలకొరిగాయి. అంతేకాదు సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్స్‌ పేరుతో కొన్ని వందల ఎకరాల పంట భూములని నిర్వీర్యం చేస్తుండడం చాలా బాధ కలిగించింది.

ఒక మెగావాట్‌ సోలార్‌ ప్లాంట్‌కి ఐదు ఎకరాల స్థలం అవసరం. ఇలా ఒక మెగావాట్‌ సామర్థ్యంపైగల వాటికి 75 ఎకరాల పంట భూమిని వినియోగిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ పరిస్థితి అధికమైంది.ఇక ఆంధ్రప్రాంతంలో రాజధానిపేరుతో అధికమైంది. అంతేగాక ఈ ఫిబ్రవరి రెండవ వారంలో చిత్తూర్‌లో ఒక ఇంటికి వాస్తుపేరుతో రహదారి పక్కన ఉన్న 12 సంవత్సరాల వయస్సు గల మహావృక్షాన్ని తగలబెట్టడం శోచనీయం. సాధారణంగా ఒక చెట్టు ఒక కిలో కలపని తయారు చేసుకోడానికి 0.47 కిలోల కార్బన్‌డై ఆక్సైడ్‌ని పీల్చుకొని 1.07కిలోల ఆక్సిజన్‌ని అందిస్తుం ది.

మరో అంచనా ప్రకారం ఒక ఎకరం విస్తీర్ణం గల చెట్ల నుండి సుమారు 20 మందికి జీవిత కాలం సరిపడా ఆక్సిజన్‌ లభిస్తుం ది. ఆరోగ్యకర గాలిలో ఇరవై వేల పిపిఎమ్‌ (పార్ట్స్‌పర్‌ మిలియ న్‌) మేర ఆక్సిజన్‌ ఉండటానికి బదులు నేడు ఏడు శాతం తక్కు వగా లభిస్తుండడంతో శ్వాసకోశ వ్యాధులు పెరుగుతున్నాయి. వెదురు మొక్కలు వాస్తవానికి ఓ గడ్డి జాతి మొక్కే అయినప్పటికీ ఒక మహావృక్షం ఇచ్చేన్ని ప్రయోజనాలు మనకి అందిస్తాయి.

అందుకే భారత ప్రభుత్వం సుమారు 20 సంవత్సరాల క్రితమే ‘నేషనల్‌బ్యాంబు మిషన్‌ని ప్రారంభించింది. అయినప్పటికీ ఇంకా అనేక రాష్ట్ర ప్రజలకి అవగాహన కరువైంది. సుమారు 20 సంవ త్సరాలు జీవించే వెదురు మొక్కలు ఒకసంవత్సరం వయస్సుగల ఒకమొక్క సంవత్సరకాలంలో 500 కిలోల కార్బన్‌ డైఆక్సైడ్‌ని పీల్చుకొని సుమారు 350 కిలోల ఆక్సిజన్‌ని అందిస్తుంది. అందుకే ప్రతి పట్టణం, నగరాలలో విస్తృతంగా పెంచాల్సిఉంది. ఇక వ్యవసాయ సేద్యపరంగా కూడా ఎంతో ఆదాయాన్ని రైతులకి అందిస్తుంది.ఈ మొక్కలు నాటిన ఐదు సంII నుండి ప్రతి యేటా 10 నుండి 12 వెదురుకర్రలని ఇస్తాయి.

పొడవునా 15 మీటర్ల ఎత్తుపెరిగే ఇవి ఫర్నిచర్‌,హస్తకళావృత్తులకి ఎంతో ఉపయోగప డుతున్నాయి.మాంగా, భీమ,బర్మా జాతిరకం వెదురుని అధికంగా నార్త్‌ ఈస్ట్‌ స్టేట్స్‌, మహారాష్ట్రలోని నాందేడ్‌, సింద్‌దుర్గ్‌ ప్రాంతా లలో ఎక్కువగా సాగు చేస్తూ ఎకరానికి 80వేల నుండి ఒక లక్ష రూపాయల ఆదాయాన్ని రైతులు ప్రతి యేటా ఒక సంవవత్సరం పాటు పొందగలుగుతున్నారు.ఈ మొక్కలకి నీరు అవసరం తక్కు వే. అలాగే దుర్బిక్ష పరిస్థితులని సైతం తట్టుకుంటాయి.

అయితే కొత్త పిలకలు వచ్చినప్పుడు ఒక మూడు నెలల పాటు అడవి పం దులు, కోతులు రాకుండా కాపాడుకోవాలి. మరో విషయం ఏమి టంటే ఈ పిలకలని ఇండోనేషియా, చైనా, బర్మా, నేపాల్‌, జపా న్‌, మలేషియా వంటి దేశాలు వంట పదార్థాలలో వినియోగిస్తా రు. అలాగే వీటి ఆకులతో ‘టీని తయారుచేస్తారు. ఇకనైనా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వెదురుని, కుంకుడు చెట్లని, వేప, తుమ్మ, చెట్లని పెంచుకోవడానికి రాయితీలు ఇవ్వాల్సి ఉంది.

– కనుకుల యాదగిరి రెడ్డి