అంతర్జాలమా? అసత్యాల నిలయమా?

                 అంతర్జాలమా? అసత్యాల నిలయమా?

INTERNET USAGE
INTERNET USAGE

సామాజిక మాధ్య మాల పుణ్యమా అని ప్రపంచంలో ఏ మూల ఏమి జరిగిన క్షణాల్లో సమాచారాన్ని మన ముంగిట్లో, ఇంకా చెప్పాలంటే మన అరచేతిలో అంజనం వేసినట్టు, కళ్లకు కట్టినట్టు చూడగలుగు తున్నాం. ఎంత వేగంగా వార్తలు వండి వారుస్తున్నారంటే వాటిలో నిజమెంతో అబద్ద మెంతో కూడా గుర్తించలేనంతగా వ్ఞంటున్నాయి. అసలు వార్తలకన్నా, నకిలీ వార్తలే ఎక్కువగా అంతర్జాలం నిండా చక్కర్లు కొడుతున్నాయి. ఈ నకిలీ వార్తల వల్ల ప్రజల్లో ఆందోళనలు కూడా అంతకంతకూ పెరిగి పోతున్నాయి. ఒకప్పుడు ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మర్నాటి ఉదయం వచ్చే వార్తా పత్రిక కోసం ఎదురు చూసేవాళ్లు. పోనుపోను ప్రజల్లో సామాజిక సృహ తగ్గిపోవటంతో. పక్కవాడి విషయం మనకెందుకు అని వార్తా పత్రికలు కొనేవారి సంఖ్య గణనీయంగా తగ్గి పోయింది.
అం తర్జాల ఆవిష్కరణతో మన జీవితాల్లో కూడా అత్యంత వేగవంతమైన మార్పులు చోటు చేసుకోవటమే కాక జీవనం కూడా వేగవంతమై పోయింది. సామాజిక మాధ్య మాల పుణ్యమా అని ప్రపంచంలో ఏ మూల ఏమి జరిగిన క్షణాల్లో సమాచారాన్ని మన ముంగిట్లో, ఇంకా చెప్పాలంటే మన అరచేతిలో అంజనం వేసినట్టు, కళ్లకు కట్టినట్టు చూడగలుగు తున్నాం. ఎంత వేగంగా వార్తలు వండి వారుస్తున్నారంటే వాటిలో నిజమెంతో అబద్ద మెంతో కూడా గుర్తించలేనంతగా వ్ఞంటున్నాయి. అసలు వార్తలకన్నా, నకిలీ వార్తలే ఎక్కువగా అంతర్జాలం నిండా చక్కర్లు కొడుతున్నాయి. ఈ నకిలీ వార్తల వల్ల ప్రజల్లో ఆందోళనలు కూడా అంతకంతకూ పెరిగి పోతున్నాయి. ఒకప్పుడు ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మర్నాటి ఉదయం వచ్చే వార్తా పత్రిక కోసం ఎదురు చూసేవాళ్లు. పోనుపోను ప్రజల్లో సామాజిక సృహ తగ్గిపోవటంతో. పక్కవాడి విషయం మనకెం దుకు అని వార్తా పత్రికలు కొనేవారి సంఖ్య గణనీయంగా తగ్గి పోయింది.

వార్తా పత్రికలు కూడా ఎదో ఒక రాజకీయ పార్టీని భుజాన మోస్తుండటంతో, నిష్పాక్షిమైన వార్తలు కరువ్ఞకావటంతో, ప్రజలకు వీటిని చదివే సమయం కూడా కరువ్ఞకావటంతో వీటి నుండి జనం దృష్టి బుల్లితెర న్యూస్‌ఛానల్స్‌ వైపు మళ్లింది. ముల్లుపోయే కత్తి వచ్చే ఢాం ఢాం, కత్తిపోయే డోలు వచ్చే ఢాం ఢాం, అన్న చందంగా ఈ న్యూస్‌ ఛానల్స్‌ కూడా ఎదో ఒక రాజకీయ పార్టీకి గొడుగుపడుతూ ఒక వైపునే సమాచారాన్ని ప్రసారం చెయ్యటంతో ప్రజలు ముఖ్యంగా యువత సామాజిక మధ్యమాల ఛానళ్లపై ఆధారపడటం మొదలు పెట్టారు.అంతర్జాల బాలారిష్టాల్లో వ్ఞన్న రోజుల్లో ‘అమెరికా ఆన్‌లైన్‌ అనే సంస్థ వార్తా ప్రసారాలు చేసేది. ఎన్నో సామాజిక సైట్లు వెలసిన ఇవి ఎక్కువ కాలం నిలబడలేకపోయాయి. ఎప్పుడైతే ఫెస్‌ బుక్‌ మొదలయ్యిందో అప్పటి నుండి అంతర్జాలంలో అసభ్యకర సమా చారం కనపడటం మొదలయ్యింది. ట్విట్టర్‌, వాట్సాప్‌, ఇనీస్టో గ్రాం వంటి వాటిల్లో అసత్యాలు, నిందారోపణలు, నకిలీవార్తలు, రుమార్ల వంటి విపరీతంగా పెరిగిపోయాయి. వీటివల్ల ప్రజల్లో విపరీతమైన భయాందోళనలు పెరిగిపోతున్నాయి. ఇటీవల వాట్సప్‌లో చిన్న పిల్లలను అపహాస్తున్నారనే వార్తలు హల్‌చల్‌ చెయ్యటంతో, మహారాష్ట్రాలో ఏడుగుర్ని, అస్సామ్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాల్లో ఇద్దరిద్దర్ని, త్రిపురలో నలుగుర్ని అనుమానించి చితకబాదటంతో అసువ్ఞలు బాసారు.

ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఆగ్రహావేశాలకు లోనవ్ఞతున్నా అల్లరి మూకలు నిజానిజాలు తెలుసుకోకుండా దాడులకు పాల్పడుతున్నారు. ఇటువంటి చిన్న పిల్లల కిడ్నాప్‌ ఉదంతాలు వాట్సప్‌లో ప్రత్యక్షమవ్వటంవల్ల దేశ వ్యాప్తంగా 29 మంది హత్యకు గురయ్యారు. ఇటువంటి సంఘటనలకు కేవలం మీడియానే తప్పపట్టలేం. సమాజంలో నానాటికి ఒకరి మీద ఒకరి నమ్మకం సన్న గిల్లటమే ప్రధాన కారణం. వివిధ సందర్భాల్లో అనాలోచితంగా ఆవేశంతో చేసే వ్యాఖ్యల వల్ల వివిధ వర్గాల్లో ద్వేషబీజాలు నాటుకుని చిన్నగా ఎదిగి ఇటు సంఘటనలు జరిగి నప్పుడు యుద్ధ్దక్షేత్రాలుగా మారటానికి తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. అంతర్జాలం పుణ్యమాని ప్రపంచం అరచేతిలోకి రావటంతో పుకార్లు క్షణాల్లో వ్యాపిస్తున్నాయి. ‘బ్రేకింగ్‌ న్యూస్‌ అంటూ అన్ని ఛానల్స్‌ కన్నా ముందు తమే ప్రసారం చేయాలనే తాపత్రయపడుతున్నారు తప్ప, అసలు ఆ వార్త నిజమైనదేనా అని ఒక్కసారికూడా ఆలోచించకపోవటం శోచనీయం ట్విటర్ల ఉండి, వాట్సప్‌ల నుండి వార్తలను దిగుమతి చేసుకునేవారు కొందరైతే, తమసొంత ఊహలతో వార్తలను వండి వార్చేవారు మరి కొందరు అసలు ఏ వార్తను ప్రసారం చెయ్యాలి, ఏది చెయ్యకూడదు అనే జ్ఞానం కూడా మీడియాకు లేకపోవటం శోచనీయం.

1980లో అంతర్జాలాన్ని అభివృద్ధి చేసినప్పుడు, ప్రజల మధ్య, సంస్థల మధ్య, వాణిజ్య సంస్థల మధ్య, ప్రభుత్వల మధ్య సమాచార మార్పిడి, పరస్పర సహకారం కోసం వరల్డ్‌ వైడ్‌వెబ్‌ ఉపయోగపడుతుందని భావించారు. 1996 సైబర్‌ ప్రపంచంలో స్వేచ్ఛా స్వాతంత్య్రాలపై ఒక ప్రకటన చేసిననప్పుడు కూడా ఎంత ఆశాజనకమైన మార్పులను ఊహించారు. ఏవైనా నూతన ఆవిష్కరణల పురుడు పోసుకున్నప్పుడు ఎన్ని గొప్ప ఆలోచనలతో ఎంతో గొప్ప ఆశయంతో మొదలౌతాయి. కాని వాటిని ఎవరు వాడుతున్నారు. వీటి సేవలను ఎవరు వినియో గించుకుంటున్నారనే దాని మీద ఆధారపడి అనుకున్న ఆశయా లు, విలువలు ఒనగూరుతాయి అనేది వ్ఞంటుంది. ‘కత్తిని ఆరు చేసేవాడిది తప్పుకాదు, దాన్ని ఎలా వినియోగించుకుంటాం అనే దాని మీద ఆధారపడి ఉంది. కత్తితో కాయలుకాసుకోవచ్చు, పీకలు కోయవచ్చు. అంతర్జాలానికి కూడా ఇదే విషయం వర్తి స్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఒకరి కొకరు సమాచారాన్ని చేరవేసు కోటానికి వలసిన మౌలిక సదుపాయాలు కల్పించటం, ప్రతి ఒక్క రి జీవితాల్లో మమేకమై పోయింది. నేటి అంతర్జాలం ఆకలి నీరు మనిషికి ఎంత అవసరమో అంతర్జాలంకూడా నేడు అంతే అవసరంగా మారిపోయింది.

అమెరికా ప్రజాస్వామ్యానికి తీరని ద్రోహం చేసి దోషిని కోర్టుముందు ఫేస్‌బుక్‌ నిలబడగా, మన దేశానికి అంతే స్థాయిలో నేడు ‘వాట్సప్‌ పుకార్లను, రుమార్లను పుట్టిస్తూ తద్వారా అలజడులు సృష్టిస్తూ, దేశ సమగ్రతకే ముప్పు వాటిల్లే ప్రమాదమేర్పడనుంది. మన దేశంలో 20 కోట్ల మంది వాట్సప్‌ వినియోగదారులున్నారు. మనదేశం వాట్సప్‌కు పెద్ద వాణిజ్య మార్కెట్‌ ఫేస్‌బుక్‌లో కూడా 25 కోట్ల మంది అకౌంట్లు కలిగివ్ఞన్నారు. వీరందరినీ తప్పుదారి పట్టిస్తూ తప్పు డు సమాచారాన్ని చేరవేస్తోంది. సామాజిక మధ్యమాల్లోని సమా చారం మొత్తం అసత్యపూరితమని అందరికి తెలిసినా, ఏది సత్య మో, ఏది అసత్యమో తెలుసుకోలేని పరిస్థితిలో వీటిని వినియో గించే వారున్నారు. ఆందోళనలతో, ఆవేశాలతో వేడెక్కిన వాతావ రణంలో, ఆలోచనలు మందగిస్తాయి. అటువంటి పరిస్థితులో ఎవ్వరూ తమ ముందున్న సమాచారం ఒక్క విశ్వసనీయత గురించి ఆలోచించరు. మనస్తతత్వ శాస్త్రజ్ఞులు, ఇటువంటి పుకార్లు రుమార్లను ప్రజల్లో ఒక రకమైన (మాస్‌ హిస్టిరేయా) సామూహిక ఉద్వేగాన్ని కలిగిస్తుందని పెద్దలంటున్నారు.

ఒకప్పుడు ఈ ఉద్వేగాలు చిన్న సమూహాలకే పరిమితమయ్యేవి కాని నేటి సమాజం మొత్తాన్ని ఆక్రమించు కుంటున్నాయి. సున్నితమై విష యాలు తెరపై కొచ్చినప్పుడు ఇవి మరింతగా బలపడి సమాజం లో అవాంఛనీయ సంఘటనలకు దారి తీస్తాయి. చట్టాలపై, ప్రభుత్వలపై నమ్మకంపోయి సమాజంలో వివక్షతకు గురౌతున్న వర్గాలవారి ఆగ్రహావేశాలకు ఈ ఉద్వేగాలు ఊతమిస్తాయనటం లో సందే హంలేదు. నేడు ఈ ఉద్వేగాల వల్ల,ఆందోళనల వల్ల పెరుగుతున్న సామూహిక హత్యలు, భారతీయ శిక్షాస్మ్పతిలో ఏ సెక్షన్లలో పేర్కొనకపోవటంతో నిందితులు తెలికగా చట్టాలనుంచి తప్పించుకుంటున్నారు. నేరాలను నమోదు చేస్తున్నా వాటిని ఏ సెక్షన్ల కింద కోర్టు ముందుంచాలో తెలియని అయోమ యంలో మన పోలీసులున్నారు. కాబట్టి మన సైబర్‌ నేరాల చట్టాన్ని తక్షణం పదునుపెట్టాల్సిన అవసరం వ్ఞంది. అంతేకాక సామాజిక మధ్యమాల మీద కూడా కొంత మేర నియంత్రణ ఎంతైనా అవసరం. దీని కోసం చట్టాలను రూపొం దించాల్సి వ్ఞంది.
– ఈదర శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్‌