పసిపిల్లల మరణాలపై సుప్రీం దిగ్భ్రాంతి

Muzaffapur Children Death incident
Muzaffapur Children Death incident

పెద్దసంఖ్యలో చిన్నారులు మృత్యువాత పడటంపై దేశ అత్యున్నత న్యాయ స్థానం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయడమేకాక సమగ్ర నివేదిక వారం రోజుల్లోగా ఇవ్వాలని కోరుతూ బీహార్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాలకు సోమవారం ఆదేశాలు ఇచ్చింది. బీహార్‌లోని ముజఫర్‌ పూర్‌లో మెదడువాపువ్యాది µకారణంగా 150 మందికిపైగా చిన్నారులు మృత్యువాతపడిన సంఘటనపై సుప్రీంకోర్టు తీవ్రవిచారం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో వైద్యసదుపాయాలు, పోష్ఠికాహారం, పారిశుద్ధ్యం, పరి శుభ్రత పరిస్థితులు ఎలా ఉన్నాయో చెబుతూ వారంలోగా అఫిడవిట్‌ దాఖలు చేయాలని బీహార్‌ ప్రభుత్వంతోపాటు కేంద్రాన్ని కూడా సుప్రీం ఆదేశించింది. బీహార్‌లో మెదడువాపు వ్యాధికారణంగా పెద్దసంఖ్యలో చిన్నారులు మృత్యువాతపడటంపై సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. రాష్ట్రంలో వైద్య సదుపాయాలు, పౌష్ఠికాహారం, పారిశుద్ధ్యం వంటివాటిపై ఆందోళన వ్యక్తం చేస్తూ తక్షణమే ఈ సదు పాయాలను ఏర్పాటు చేయాల్సిందిగా ఆ ప్రజా ప్రయోజనవ్యాజ్యంలో పిటిషనర్లు కోరారు. అయితే వాదనల సందర్భంగా ఇలాంటి మరణాలే గతంలో ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసు కున్నాయని పిటిషనర్లు ప్రస్తావించగా దీనిపై కూడా వివరణ ఇవ్వాల్సిందిగా ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఈ మరణాలకు సంబంధించి రాష్ట్ర ప్రభు త్వాలతోపాటు కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా కారణ మని ఇలాంటి మరణాలు ప్రతిఏటా సంభవిస్తున్నా నిర్ది ష్టమైన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని పిటిషనర్లు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. చిన్నారులు మరణించిన ప్రాంతాలకు నిపుణులతో కూడా ప్యానెల్‌ను ఏర్పాటు చేయాలని పిటిషనర్లు కోరారు. దీనిపై వాదోపవాదనలు విన్న సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేస్తూ విచారణను పది రోజులకు వాయిదా వేసింది. ఇలా చిన్నారులు చనిపోవడం ఇది కొత్తకాదు. మొదలు కూడా కాదు. అభంశుభం తెలియని పసిమొగ్గలు దేశంలో అర్థాంతరంగా రాలిపోతున్నాయి. 2015లో భారత్‌లో రెండు కోట్ల యాభైఒక లక్షల మంది శిశువ్ఞలు జన్మించగా వీరిలో ఐదేళ్లలోపు చిన్నారులు పన్నెండు లక్షల మంది వివిధ కారణాలతో మరణించినట్లు అధికార రికార్డులే వెల్లడిస్తున్నాయి. ప్రతి వెయ్యి ప్రసవాలకు సగటున 47.81 శాతం మంది ఐదేళ్లలోపు చిన్నారులు మరణిస్తు న్నట్లు అనేక అధ్యయనాలు వెల్లడించాయి. ప్రపంచ దేశాలన్నింటిలోనూ భారత్‌లో ఈ శిశుమరణాల సంఖ్య అత్యధికంగా ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఐదేళ్లలోపు చిన్నారుల మరణాల సంఖ్య ప్రతి వెయ్యి జనాభాకు 39.68 శాతం నమోదైంది. చిన్నారుల మరణాలకు నిమోనియా, డయేరియాలతో పాటు దోమకాటుతో వ్యాపిస్తున్న మరికొన్ని విషజ్వరాలు కూడా కారణమని చెప్తున్నారు. 2030 లక్ష్యంగా చిన్నారుల మరణ నియంత్రణపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను దేశమంతా అమలు చేయాల్సిన అవశ్యకత గురించి వైద్యనిపుణులు పదేపదే చెప్తున్నారు. పాలకులు ఎన్ని చర్యలు తీసుకున్నా మరెన్ని వేలకోట్లు ఖర్చుపెడు తున్నా ఆధునిక వైద్యం కొత్త పుంతలు తొక్కుతున్నా నిరక్షరాస్యత, అవగాహనలోపం కారణంగా ఏటా శిశుమరణాలు అంతకంతకు పెరుగుతున్నాయి. దేశంలో ఐదేళ్లలోపు చిన్నారుల మరణాలను అరికట్టడంపై పది ప్రధాన రాష్ట్రాలు మరింత దృష్టిపెట్టి చర్యలు చేపట్టా ల్సిన అవసరం ఉందని కూడా అభిప్రాయపడుతున్నారు. అన్నింటికంటే చిన్నారుల ఆరోగ్యవిషయంలో ముఖ్యంగా గ్రామీణులకు అవగాహన కల్పించడంలో యంత్రాంగం విఫలమవ్ఞతుందనే ఆరోపణలను కొట్టిపారేయలేం. ఈ లోపాల కారణంగా 22 శాతం మంది పిల్లలు నెలలు నిండకముందే పుట్టడం వల్ల చనిపోతున్నారని, ఆలాగే ప్రసవసమయంలో ఎదురయ్యే సమస్యలతో 14శాతం, మెదడువాపు, రక్తం ఇన్ఫెక్షన్‌తో తొమ్మిది శాతం, పుట్టుకతోనే సంభవిస్తున్న అనర్థాలతో 9.4శాతం, నిమోనియా, ధనుర్వాతం, డయేరియా 3.7శాతం మరణాలకు కారణాలవ్ఞతున్నాయి. సకాలంలో పౌష్టికా హారం, టీకాలు, వ్యాధులు, లోపాలను నియంత్రించే చికిత్ససేవలు అందితే చాలా వరకు ఈ మరణాలను అదుపులోకి తేవచ్చుననే నిపుణుల అభిప్రాయం. అందు కోసం అందరూ ఆరోగ్యక్రమశిక్షణను, జీవనవిధానంగా మలుచుకోవాల్సిన పరిస్థితుల పట్ల అవగాహన పెంచుకోక పోవడం వల్లనే ఈ పరిస్థితులు దాపురిస్తున్నాయి. మూఢ నమ్మకాలు, శాస్త్రీయ అవగాహన లోపం, పేదరికం, తదితర సమస్యలతో అనారోగ్యాన్ని తమకర్మఫలంగా అంగీకరిస్తున్నారే తప్ప అవసరమైన జాగ్రత్తలు తీసుకో వడానికి సిద్ధపడటం లేదు. ఇప్పటికీ భారత్‌లో టీకాలు అందని చిన్నారులు లక్షల సంఖ్యలో ఉన్నారు. ముఖ్యంగా గ్రామీణులకు టీకాల ప్రాముఖ్యత తెలియక, ఎప్పుడు టీకాలు ఇప్పించాలో అవగాహన లేక, ప్రభుత్వ సేవల ద్వారా అన్ని టీకాలు సకాలంలో లభ్యంకాక పోవడంతో ప్రైవేట్‌ వైద్యశాలలు డిమాండ్‌ చేసే డబ్బులు చెల్లించలేక పిల్లలు టీకాలు ఇప్పించకుండానే వదిలివేస్తు న్నారు. ఈ విషయంలో పాలకులు ముఖ్యంగా గ్రామీణు లకు పసిపిల్లల ఆరోగ్యంపరిరక్షణపై అవగాహన కల్పిం చేందుకు నిర్దిష్టమైన కార్యక్రమాలు చేపట్టాలి. అలాగే ప్రభుత్వవ వైద్యంపై విశ్వాసం కలిగించేలా అటు మందు లు, ఇటు పౌష్టికాహారం వీటన్నింటిని మించి వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలి. ప్రభుత్వ వైద్య సేవలను పటిష్టం చేస్తే తప్ప ఈ మరణాలను కొంతవరకైనా నియంత్రించడం సాధ్యంకాదు.

– దామెర్ల సాయిబాబ, ఎడిటర్‌, హైదరాబాద్‌