స్థానిక సంస్థలకు ఇకనైనా మోక్షం లభించేనా?

మహాత్ముడు ప్రవచించిన గ్రామస్వరాజ్యం లక్ష్యంలో స్థానికసంస్థల పటిష్టత అన్నది ఒక ముఖ్యాంశం.భారత రాజ్యాంగంలోకూడా స్థానికసంస్థలకు అవసరమైన అధికారాలు, విధులు ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సుస్పష్టంగా పేర్కొన్నారు. ఈ మేరకు పంచాయతీరాజ్‌ వ్యవస్థకు సం బంధించి అనేక మార్పులు చేర్పులు,సవరణలు చేశారు. స్థానిక సంస్థలు పటిష్టంగా ఉంటేనే పల్లెలు, నగరాలలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు స్థానికంగా గుర్తించి పరి ష్కరించే అవకాశం ఏర్పడుతుందని పెద్దలు ఏనాడో వక్కా ణించారు. కానీ అవన్నీ దశాబ్దాలు దాటిపోయినా కాగితాలకే పరిమితమవ్ఞతున్నాయి.నిధులు,విధులను స్థానిక సంస్థలకు అప్పగించడంలో ఈ పార్టీ, ఆ పార్టీ అని కాదు. ఎవరు అధికారంలో ఉన్నా మోకాలడ్డుతున్నారనే చెప్పొచ్చు. తెలం గాణ ప్రభుత్వం గత ఏడాది స్థానిక సంస్థలకు అధికారులు ఇచ్చేవిధంగా ప్రవేశపెట్టిన బిల్లుకు ఆమోదించారు. ఆ సంద ర్భంగా ముఖ్యమంత్రి అసెంబ్లీలో చేసిన ప్రసంగం పలువ్ఞ రిని ఆకట్టుకున్నది.

స్థానిక సంస్థలకు రాజ్యాంగం కల్పించిన అధికారాలన్నీ అప్పగిస్తారని భావించారు. ఎన్నికలు కూడా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లో స్థానికసంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. వచ్చేనెల రెండోవారంతో పూర్తి చేయ బోతున్నారు.అయితే రాజ్యాంగం ప్రకారం ఆ స్థానిక సంస్థ లకు ఇవ్వాల్సిన అధికారాలు ఇస్తారా?లేదా?అనేది అనుమా నాలు రేకెత్తుతున్నాయి. అసలు ఇప్పటివరకు ఈ పంచా యతీరాజ్‌ వ్యవస్థ అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటున్నది. వాస్తవంగా స్థానిక సంస్థలకు తొలినాళ్లల్లో ఎన్నో అధికా రాలు, విధులు ఉండేవి.

సర్పంచ్‌ అంటే ఆ గ్రామాలకు సంబంధించినంత వరకు పూర్తి అధికారాలతో విధులు నిర్వహించేవారు.కానీ రానురాను ఒక వ్యూహం ప్రకారం ఆ సంస్థలను నిర్వీర్యం చేశారనే చెప్పొచ్చు. అధికారంలో పార్టీ లు మారినప్పుడు, చివరకు ముఖ్యమంత్రులు మారినప్పుడు కూడా పంచా యతీరాజ్‌ వ్యవస్థలో మార్పులు చేయడం ఆనవాయితీగా మారిపోయింది. పంచాయతీరాజ్‌ వ్యవస్థను మరింత పటిష్టంగా చేసేందుకు తాము శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు ఎప్పటికప్పుడు అధికారంలో ఉన్న పెద్దలు పదేపదే చెప్పుకుంటూనే ఉంటారు.ఎన్నో కమిటీలు వేశారు. ఆ కమిటీలు దేశవ్యాప్తంగా పర్యటించి, క్షేత్రస్థాయిలో అధ్య యనం చేసి స్థానిక సంస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం గురించి స్పష్టమైన సిఫారసులు చేశారు.

అవన్నీ అటకెక్కించారనే చెప్పొచ్చు.ఈ వాస్తవ పరిస్థితులను పరిశీ లిస్తే పార్టీలతో ప్రమేయంలేకుండా పంచాయతీరాజ్‌ వ్యవస్థ ను అందరూ అంతోఇంతో పాడుపెట్టినవారే. తమ ప్రాబ ల్యానికి దెబ్బతగులుతుందనే భయమే ఇందుకు ప్రధాన కారణం.అందువల్లనే పంచాయతీరాజ్‌ వ్యవస్థను బలపడ కుండా ఎప్పటికప్పుడు మోకాలడ్డుతూనే ఉన్నారు. అన్నింటి కంటే బాధాకరమైన విషయమేమిటంటే ఈ పంచాయతీరాజ్‌ వ్యవస్థ ద్వారా రాజకీయ ప్రవేశంచేసి ఉన్నతస్థాయికి చేరిన కొందరు నాయకులు కూడా స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసేందు కు ప్రయత్నించడం.వాస్తవానికి దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ సమర్థవంతులుగా పేరు తెచ్చుకున్న నాయ కులు ఎందరో పంచాయతీరాజ్‌ వ్యవస్థను పైకి వచ్చినవారే. సర్పంచులుగా,సమితి అధ్యక్షులుగా జిల్లాపరిషత్‌ అధ్యక్షులు గా పనిచేసినవారికి ప్రజాసమస్యలు ముఖ్యంగా గ్రామీణ సమస్యల పట్ల మంచి అవగాహన ఉంటుంది.

అంతేకాదు ఏ సమస్య వచ్చినా తమ తరపున మాట్లాడటానికి తమ నాయకుడు (సర్పంచ్‌) ఉన్నాడనే ధైర్యం ఆయా గ్రామప్రజ ల్లో ఉండేది. ఆ సర్పంచులకు కానీ, సమితి అధ్యక్షులకు కానీ విశేషమైన అధికారులు ఉండేవి. రోడ్లు, విద్య,వైద్య ఒకటేమిటి గ్రామీణాభివృద్ధికి సంబంధించి అన్ని కార్యక్రమా లు వారి పర్యవేక్షణలోనే జరిగేవి.ఆ శాఖలకు సంబంధిం చిన ఉద్యోగాలు, జీతభత్యాలు, బదిలీలు సర్వం సమితి అధ్యక్షుల పరిధిలోఉండేది.సమితి అధ్యక్షుడు అంటే ఆయన పరిధిలోని గ్రామాలకు సర్వం ఆయనే అన్నట్లుగా ఉండేది.

శాసనసభ్యుడున్నా సమితి అధ్యక్షుడికి ఉన్న విలువ, ప్రాబ ల్యం ఆనాడు ఉండేది కాదు. అందుకే కొందరు నాయకులు తమకు ఎలాంటి పదవ్ఞలు ఇస్తామనిఆశ చూపినా చివరకు శాసనసభ్యులుగా ఎన్నికయ్యే అవకాశాలిచ్చినా అప్పుడున్న సమితి అధ్యక్ష పదవిని వదిలిపెట్టడా నికి ఇష్టపడే వారు కాదు.స్థానికసంస్థలు అనేవి ఇప్పటికిప్పు డు పుట్టుకొచ్చినవి కావ్ఞ.దాదాపు రెండువేలసంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. చంద్రగుప్తుడికంటే ముందే గ్రామాలు,గ్రామవ్యవస్థఅమలులో ఉన్నప్పుడు ఆధారాలున్నాయి. గ్రామసమస్యలపై నిర్ణయాధి కారం గ్రామసభలకే ఉండేది. సాధారణంగా ఆనాటి ప్రభు వ్ఞలుకూడా ఆ గ్రామసభల నిర్ణయాలనే అమలు చేసేవారు.

వాటి నిర్ణయాలకు ఆ రాజరికపు వ్యవస్థఎంతో ప్రాముఖ్యత ఇచ్చేది. 1882లో బ్రిటిష్‌ ప్రభుత్వ ప్రతినిధి లార్డ్‌రిప్పన్‌ స్థానికసంస్థలకు ఒక ప్రతిపత్తిని కూడా కల్పించారు. 1952 లో మొదటి పంచవర్షప్రణాళికలోనే కేంద్రప్రభుత్వం కమ్యూ నిటీ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాలను ప్రారంభించింది.ఆ తర్వాత ఎన్నోకమిటీలు,సూచనలు ప్రతిపాదనలు, అధ్యయ నాలు,సుదీర్ఘకాలంగా జరిగాయి. ఎన్నోమార్పులు చేర్పులు జరిగాయి.

ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కరకంగా ఉండటంతో దేశవ్యాప్తంగా ఒకేతరహా పంచాయతీరాజ్‌వ్యవస్థ అమలులో ఉండాలన్న 73వ రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటు ఆమోదించింది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి 1994 మే30న ఈచట్టంఅమలులోకి వచ్చింది. ఐదంచెలవిధానాన్ని ప్రవేశపెట్టి గందరగోళం చేశారు. 1958లో బల్వంతరా§్‌ు కమిటీ రూపొందించిన విధానమే సుదీర్ఘచరిత్ర కలిగిన పం చాయతీరాజ్‌వ్యవస్థ సరైందనే విషయం పాలకులకు స్పష్టం గా తెలిసినా అందుకు అనుగుణంగాఅడుగులు వేయలేకపో తున్నారు.విద్యాకమిటీలు,సాగునీటి సంఘాలంటూ సమాం తరంగా ఏర్పాటుచేసి సర్పంచులను ఉత్సవవిగ్రహాలుగా మార్చారు.పంచాయతీరాజ్‌ చట్టాన్ని త్రికరణశుద్ధిగా అమలు చేసి విధులు,నిధులు స్థానికసంస్థల ప్రతినిధులకు అప్పగిం చగలిగితే గ్రామస్వరాజ్యం బాటపట్టినట్టే. గాంధీజీ ఆశించిన గ్రామస్వరాజ్యంకొంతమేరకైనా సాధించగలుగుతాం.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/