మానవ మృగాలకు జీవిత ఖైదు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జమ్మూకాశ్మీర్‌లోని కథువా జిల్లాలో బక ర్వాల్‌ సమజానికి చెందిన ఎనిమిదేళ్ల చిన్నారిపై హత్యాచార ఘటనలో పఠాన్‌కోట్‌ న్యాయ స్థానం తీర్పు వెల్లడించింది. ఈకేసులో ప్రధాన నింది తుడైన సాంజీ రామ్‌,పర్వేష్‌ దోషి, దీపక్‌ ఖజూరియాలకు జీవిత ఖైదు విధించింది. హెడ్‌ కానిస్టేబుల్‌ తిలక్‌రాజు, అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆనంద్‌ దత్తా, స్పెషల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ సురేంద్ర వర్మకు ఐదు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.50వేల జరిమానా విధించింది. సాంజీ రామ్‌ కుమారుడు విశాల్‌ను నిర్ధోషిగా చెబుతూ న్యాయస్థానం తీర్పు చెప్పింది.


Kathua Rape, Murder Case

గతేడాది జనవరిలో జమ్మూకాశ్మీర్‌లోని కథువాలోని రసానా గ్రామానికి చెందిన ఎనిమిదేళ్ల చిన్నారి 2018 జనవరి 10న గుర్రాలను మేపడానికి వెళ్లి అదృశ్యమైంది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే సరిగ్గా వారం రోజుల తర్వాత జనవరి 17న గ్రామానికి సమీపంలోని ఓ అటవీ ప్రాం తంలో బాలిక మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం నిర్వహించగా…బాలికను అతి దారుణంగా సామూహిక అత్యాచారం చేసి హత్య చేసినట్లు తేలింది. చిన్న భూవివాదం కారణంగా ఏర్పడిన విద్వేషంతో అభం శుభం తెలియని చిన్నారిపై కొందరు వ్యక్తులు అఘాయిత్యా నికి పాల్పడ్డారు. రసానా గ్రామంలో బక్రవాల్‌అనే సంచార తెగవాసులు గుర్రాలను మేపుకుంటూ ఉంటారు. భూముల వ్యవహారం, పొలాల్లో గుర్రాలను మేపే అంశంపై ఈ తెగవారికి, గ్రామస్థులకు మధ్య విభేదాలు తలెత్తాయి. ఈనేపథ్యంలో రెవిన్యూశాఖ మాజీ ఉద్యోగి అయిన సాంజీ రామ్‌…బక్రవాల్‌ తెగపై కక్ష పెంచుకున్నాడు. ఆ సంచార తెగను ఆ ప్రాంతం నుంచి తరిమేయాలనుకున్నాడు.
ఇందుకోసం ఓ పథకం రచించాడు. గుర్రాలు మేపేందుకు వెళ్లిన బాలికను ఎత్తుకెళ్లి సమీపంలోని ఓగుడిలో బంధిం చారు. వారం పాటు సామూహిక అత్యాచారం చేశారు. బాలికకు మత్తుమందు ఇచ్చి పాశవికంగా హత్య చేశారు. సాంజీరామ్‌, ఇతర వ్యక్తులు వంతులవారీగా అత్యాచారం చేశారు. ఆ తర్వాత బాలికను రాయితోకొట్టి చంపి అడవిలో పడేశారు.నాలుగురోజుల తర్వాత అత్యంత దారుణ పరిస్థి తిలో బాలిక మృతదేహం బయిటపడింది. ఈఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు, నిరసనలు హోరెత్తాయి. అక్కడితో ఆగకుండా ఈఘోరాన్ని కప్పిపుచ్చేందుకు సాంజీరామ్‌ స్థానిక పోలీసులకు పెద్ద మొత్తంలో లంచాలు ఇచ్చారు. ఆతర్వాత హత్య ఉదంతం వెలుగులోకి రావ డంతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. ఈకేసు గురించి దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి.
బాదితురాలికి న్యాయం చేయాలనే డిమాండ్‌ అంతర్జాతీయ స్థాయిలో కూడా వ్యక్తమైంది. ఈఘటనపై ఐక్యరాజ్య సమితి కూడా స్పందించింది.

దీనిని భయానక ఘటనగా అభివర్ణించిన ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటో నియో గుటెర్రెస్‌ ఘాతుకానికి పాల్పడ్డవారిని ఉరితీయాలని నాడు భారత ప్రభుత్వాన్ని కోరారు. 2018 జనవరి 23న జమ్మూకాశ్మీర్‌ ప్రభుత్వం ఈకేసు దర్యాప్తు బాధ్యతలను రాష్ట్ర క్రైం బ్రాంచ్‌ పోలీసులకు అప్పగించింది. ఫిబ్రవరి 10న క్రైం బ్రాంచ్‌ పోలీసులు విచారణ చేసి బాలికకు మత్తుమందిచ్చి, వారం రోజులపాటు హత్యాచారం సామూ హిక హత్యచారం చేశారని నిర్ధారించారు.

ఈకేసులో గ్రామ పెద్ద సాంజిరామ్‌, అతనికొడుకు విశాల్‌, మైనర్‌ మేన ల్లుడితోపాటు ఇద్దరు స్పెషల్‌ ఆఫీసర్లు దీపక్‌ ఖజురియా, సురేందర్‌ వర్మలను క్రైం బ్రాంచ్‌ పోలీసులు అరెస్టుచేశారు. అలాగే సాంజీరామ్‌ నుంచి నాలుగు లక్షలు లంచం తీసు కుని ఆధారాలను ధ్వంసంచేశారనే ఆరోపణలపై కానిస్టే బుల్‌ తిలకరాజ్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆనంద్‌ దత్తా కూడా అరెస్టయ్యారు. చార్జ్‌షీట్‌ దాఖలు సమయంలో కథువా న్యాయవాదులు న్యాయస్థానం బయిట ఆందోళనకు దిగారు. చార్జ్‌షీట్‌ దాఖలు చేయకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించారు.
కేసు విచారణను జమ్మూకాశ్మీర్‌లో చేపట్టరాదని, ఇతర రాష్ట్రంలో విచారణ జరగాలని బాదితµ కుటుంబీకులు డిమాండ్‌ చేశారు. అయితే జమ్మూకాశ్మీర్‌లో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో సుప్రీంకోర్టు ఈ కేసును పఠాన్‌కోట్‌ కోర్టుకు బదిలీ చేసింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం సోమవారం తీర్పు వెల్లడించింది.
దీంతో మానవ మృగాలకు శిక్ష పడింది. అయితే కథువాలాంటి ఘటనలు దేశంలో ఎక్కడో ఒకచోట నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల యూపి, మధ్య ప్రదేశ్‌లో చిన్నారులపై లైంగిక దాడులు ఎక్కువయ్యాయి. పసిమొగ్గలను కాటేస్తూ…తర్వాత గొంతునులిమి హత మార్చిన ఘటనలు కళ్లముందే కదలాడుతున్నాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన పాలకులు, పోలీసులు ఘటన జరిగిన కొద్దిరోజులు హడావుడి చేసి ఆతర్వాత ఆకేసులపట్ల నిర్లక్ష్యంవహిస్తూ తాత్సారం చేస్తు న్నారు. మానవ మృగాల నేరాల నియంత్రణ చేసేందుకు నిర్భయలాంటి చట్టాలువచ్చినా పెద్దగాఉపయోగం లేకుండా పోయింది. కోర్టులకు వెళ్లినా ఈకేసుల్లో తీర్పులు వెలు వడటానికి సంవత్సరాలు పడుతున్నాయి.
కింది కోర్టులో శిక్షలు పడ్డా కేసులను అప్పీల్‌ చేసుకుంటూ నేరస్తులు శిక్షలను అనుభవించకుండా కొందరు తప్పించుకుంటు న్నారు. ఈనేపథ్యంలో కథువాలాంటి మళ్లీ మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలంటే…ఇలాంటి కేసుల్లో సత్వర విచారణ, సత్వర తీర్పులు వెలువరించడంతో పాటు నేరస్థులకు కఠినమైన శిక్షలు పడేలా చూడాల్సిన అవసరం ఉందని మహిళా సంఘాలు, ప్రజాస్వామ్య వాదులు కోరుతున్నారు. అలా జరిగినప్పుడే కథువా లాంటి ఘటనలు పునరావృతం కాకుండా కొంతమేరకు నియం త్రించే అవకాశం కలుగుతుంది.

– దామెర్ల సాయిబాబ, ఎడిటర్‌, హైదరాబాద్‌