గగనతలంలో ‘ఇస్రో’ మరో విజయం!

Isro Another Success
Isro Another Success

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో విజయం సాధించింది. ఇస్రో ఘనతను చెప్పుకోవడం, రాసుకోవడం ఇప్పు డు చాలా సాధారణ విషయం అయిపోయింది. ఎందుకంటే ఆ సంస్థ సాధించిన విజయాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికీ పిఎస్‌ఎల్‌వి రాకెట్‌ సిరీస్‌లో ఇది 47వ ప్రయోగం కాగా, షార్‌ కేంద్రం నుంచి 71వ ప్రయోగం. అందుకే ఏ ప్రయోగంతో దేశానికి ఎంత ప్రయోజనమో అన్నదాన్ని తెలుసుకోవాల్సిందే తప్ప ఇస్రో విజయాల గురించి ప్రత్యే కంగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. శ్రీహరికోటలో ని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ ఇస్రో పిఎస్‌ఎల్‌విసి 45 రాకెట్‌ను విజయవంతంగా సోమ వారం ఉదయం నింగి లోకి పంపింది. సతీష్‌ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి ఇమిశాట్‌తో పాటు 28 విదేశీ ఉపగ్రహాలను వాటికక్ష్యలో ప్రవేశపెట్టింది. నాలుగుస్టపాన్‌ బూస్టర్ల సాయంతో చేపట్టిన ప్రయోగం కావడంతో దీనికి పిఎస్‌ఎల్‌వి క్యూ ఎల్‌ అని పేరు పెట్టారు. ఇస్రో చరిత్ర లో ఈ తరహా రాకెట్‌ ప్రయోగం ఇదే మొట్టమొదటిది కావడం విశేషం.

ఈ వాహన నౌక డిర్‌డివోకు చెందిన ఎలక్ట్రానిక్‌ ఇంటిలి జెన్స్‌ శాటిలైట్‌ ఇమిశాట్‌ను నిర్ణీత కక్ష్యలో విజయవం తంగా ప్రవేశ పెట్టింది. దీంతో పాటు తొలిసారిగా ఒకే ప్రయోగంలో మూడు వేర్వేరు కక్ష్యల్లోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టడం జరిగింది. రాడార్‌ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు చేపట్టిన ఈ ప్రయోగం కొద్ది గంటల్లోనే పూర్తయింది.పిఎస్‌ఎల్‌విసి 45ప్రయోగం నాలుగుదశల్లో జరిగింది. భారత్‌కు చెందిన ఇమిశాట్‌తో పాటు అమెరికాకు చెందిన 24, లిథువేనియాకు చెందిన రెండు, స్పెయిన్‌, స్విట్జర్ల్యాండ్‌కు సంబంధించి ఒక శాటి లైట్‌తో కలుపుకుని మొత్తం 28విదేశీ నానో ఉపగ్రహాల ను ఒకదాని తర్వాత ఒకటి కక్ష్యలోకి చేర్చారు.ఈ 28 బుల్లి ఉపగ్రహాలను ఈపిఎస్‌ఎల్‌వి నింగిలోకి మోసు కెళ్లింది. 746కిలోమీటర్ల ఎత్తున కక్ష్యలో ఇమిశాట్‌ను ప్రవేశపెట్టిన సైంటిస్టులు, విదేశీ ఉపగ్రహాలను 504 కిలోమీటర్ల భూకక్ష్యలో నిలిపింది. ఇక నాలుగవ దశలో మైక్రో గ్రావిటీని సృష్టించి పరిశోధనలు చేపట్టనున్నారు. డిఆర్‌డిఒ రూపొందించిన ఇమిశాట్‌ శత్రు దేశాల రాడార్ల జాడ గుర్తించడంలో దిట్ట.

436కిలోల బరువున్న ఈ శాటిలైట్‌ తక్కువ ఎత్తుకక్ష్యలో తిరిగే ఈ ఉపగ్రహం రక్షణశాఖకు ఎంతో ఉపయోగపడుతుంది.కక్ష్యలో తిరుగు తూ రక్షణ శాఖకు అవసరమైన సమాచారాన్ని అంది స్తుంది. ముఖ్యంగా శత్రుదేశాల రాడార్లకు సంబంధించిన సమాచా రాన్ని ఇది సేకరిస్తుంది. ఇప్పటివరకు ఇలాంటి సమాచారం సేకరణ కోసం భారత్‌ విమానాలపై ఆధార పడుతోంది. ఇమిశాట్‌ రాకతో ఇక అంతరిక్షం నుంచి శత్రువుల కదలికలపై కన్నేసే అవకాశం లభిస్తుంది. ఇస్రో పర్యవేక్షణలో జరిగిన ఈ ప్రయోగానికి చాలా ప్రాధాన్యం ఉంది. ఈ ‘ఇమిశాట్‌ను ముద్దుగా ‘రాడార్‌ కిల్లర్‌ అని కూడా పిలుస్తారు. ఇక భారత్‌ ప్రవేశపెట్టిన ఇమిశాట్‌ను హైదరాబాద్‌లోని డిఆర్‌డిఒ ల్యాబ్‌లో అభివృద్ది చేయడం జరిగింది. ఇజ్రాయిల్‌కు చెందిన నిఘా ఉపగ్రహం ఎస్‌ ఎ ఆర్‌ఎఎల్‌ ప్రేరణతో దీనిని రూపొందించారు. అత్యంత పదునైన ఎలక్ట్రానిక్‌ నిఘా వ్యవస్థ దీనికి ఉంది. ఇది శత్రుదేశాల రాడార్లపై నిఘా పెడుతుంది. ప్రాజెక్టు కౌటిల్య కింద అభివృద్ధి చేసి ఐఎంఎస్‌ ప్లాట్‌ఫామ్‌పై దీనిని సిద్ధం చేశారు.

ఇది 436 కిలోల బరువున్న ఈపిఎస్‌ఎల్‌విసిలో డిఆర్‌డిఒ అభివృద్ధి చేసిన ఎలక్ట్రానిక్‌ స్పెక్ట్రమ్‌ పరికరాన్ని అమర్చారు. ఈ ప్రాజెక్టుకోసం దాదాపు రూ.432 కోట్లు వెచ్చించినట్లు సమాచారం. 749 కిలోమీటర్ల పైన సన్‌సింక్రోనస్‌ ఆర్బిట్‌లోకి చేర్చిన ఈశాటిలైట్‌ 8ఏళ్ల పాటు పనిచేస్తుంది. రక్షణరంగంలోకి ఉపయోగించే ఉపగ్రహాల సమాచారాన్ని పూర్తిస్థాయిలో వెల్లడించారు. కానీ దీనికి ఉన్న ప్రాథమిక లక్షణాలను బట్టి ఈశాటిలైట్‌ రేడియో సంకేతాలను పసిగట్టగలదు. ఇది రాడార్‌ నెట్‌వర్క్‌పై ఓ కన్నేసి పెడుతుంది. శత్రు దేశాలు ఎక్కడెక్కడా రాడార్లను అమర్చారో గుర్తించి సమాచారం అందజేస్తుంది. గతంలో ఈ పనిచేయడానికి డ్రోన్లు, బెలూన్లను ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు ఇమిశాట్‌ రాకతో 24గంటలు నిఘావేసే అవకాశం దక్కు తుంది. యుద్ధ సమయంలో ఏ దేశమైన తొలుత శత్రు దేశాల కమ్యూనికేషన్‌ స్థావరాలను, వ్యవస్థలను దెబ్బ తీస్తుంది. అప్పుడు శత్రువు చుట్టూ అంధకారం నెలకొం టుంది.

సరైన లక్ష్యాలు తెలియకుండా దాడి చేయడానికి శత్రువుకు అవకాశం ఉండదు. అందుకే ముందుగా శత్రు వుల కమ్యూనికేషన్‌ స్థావరాలు రాడార్‌ వ్యవస్థలను గుర్తించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇమిశాట్‌ చేసేది అదే. శత్రుదేశాలు ఎక్కడెక్కడ రాడార్లను అమర్చారో గుర్తించి సమాచారం అందజేస్తుంది. శత్రుదేశాల భౌగోళిక పరిస్థితు లకు సంబంధించి పూర్తి సమాచారం, చిత్రాలను అందజే స్తుంది. గతంలో ఈ పని చేయడానికి డ్రోన్లు బెలూన్లను ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు ఇమిశాట్‌ రాకతో 24 గంటలు నిఘావేసే అవకాశం దక్కుతుంది.

ఇక నుంచి శత్రుదేశాల రాడార్లకు సంబంధించిన సమాచారాన్ని కని పెట్టడం మన రక్షణ శాఖకు చాలా తేలిక కానుంది. ఒక్క మాటలో చెప్పాలంటే సొంతంగా అంతరిక్ష ఫ్లాట్‌ఫామ్‌ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఆత్మాహుతి’హరూప్‌ డ్రోన్లను భారత్‌ కొనుగోలు చేసింది. యుద్ధరంగంలో కీలకమైన మొబైల్‌ రాడార్‌ కేంద్రాలు, రాడార్లు అమర్చిన యుద్ధ నౌకలు,కీలకమైన క్షిపణి ప్రయోగవేదికలను,ప్రత్య ర్థుల గగనతల రక్షణ వ్యవస్థలను గుర్తించి దాడి చేయ డానికి ఈ డ్రోన్లను ఎక్కువగా వినియోగిస్తారు.కొన్నిరకాల ప్రత్యేక లక్షణాల కోసమే ఈ డ్రోన్లు వేటకు బయిల్దేరతా యి. తమ లక్ష్యాలను వెతుక్కుంటూ దాదాపు 1000కిలో మీటర్ల దూరం వరకు ప్రయాణించగలవు.ఈ డ్రోన్లువిమా నాల కంటే చాలా చిన్నవి ఉంటాయి. ఈ ప్రయోగం నిఘా విభాగానికి కొత్త అస్త్రం వచ్చి, ఇస్రో రికార్డుల్లో మరో చరిత్రాత్మక విజయంగానే పేర్కొనక తప్పదు.

  • దామెర్ల సాయిబాబ, ఎడిటర్‌, హైదరాబాద్‌