భగ్గుమంటున్న బంగారం ధరలు

Gold Price

అమెరికా, ఇరాన్‌ మధ్య ప్రతిజ్ఞలు, పర స్పర సవాళ్లు కొనసాగుతూ యుద్ధ మేఘాలు కమ్ముకుంటుండటంతో ఒక్కసారి గా ముడిసరుకు ధరలు ఎగబాకాయి. భారత్‌ మార్కెట్‌తోసహా ప్రపంచవ్యాప్తంగా సోమవారం స్టాక్‌ మార్కెట్‌లు కుదేలయ్యాయి.గతంలో ఎన్నడూలేని విధంగా బంగారం పది గ్రాములు 42వేల రూపాయలకు అధిగమించింది. వెండి కిలో రూ.49,200లపైకి చేరుకు న్నది. మరొకపక్క వరుసగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతూనే ఉన్నాయి.

ఈ నెల 26 నుండి పెళ్లిళ్లు తదితర శుభకార్యాలకు మంచి ముహూర్తాలు ఉండటంతో బంగారం, వెండి కొనుగోలుదారులు బెంబేలెత్తిపోతున్నా రు. డీజిల్‌ పెంపు వ్యవసాయరంగంపై తీవ్రప్రభావం చూపింది. భారత్‌ కరెన్సీ కూడా క్షీణించింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 72 రూపాయల స్థాయికి బలహీనపడింది. ముడిచమురు ధర బ్యారల్‌కు 70 డాలర్లకు దాటిపోయింది. ఇరాన్‌ అగ్రశ్రేణి సైనిక జనరల్‌ ఖాసిం సులేమానీని గత శుక్రవారం బాగ్దాద్‌లో అమెరికా డ్రోన్‌ దాడిలో హతమార్చిన తర్వాత పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారితీసింది.

దీనికి తగిన ప్రతీకారం తీర్చు కుంటామని ఇరాన్‌ హెచ్చరించింది. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తలకు వెలకట్టింది. ట్రంప్‌ను చంపి తల తెచ్చి ఇస్తే 80 మిలియన్‌ డాలర్లు (575.44 కోట్లు) నజరానా ఇస్తామని బహిరంగంగానే ప్రకటించింది. ఇరాన్‌ పౌరులు ప్రతిఒక్కరూ తమ వాటాగా ఒకడాలర్‌ను ట్రంప్‌ హత్యచేసిన వారికి అందచేస్తారని,ఇది తమదేశం తీసుకున్న ప్రతిన అని ఆ దేశ అధికారి ఒకరు ప్రకటించా రు. లక్షల మందితో టెహ్రాన్‌ వీధులన్నీ నిండిపోయాయి. నల్లటి దుస్తులు ధరించి తమ అభిమాననేత సులేమానీ చిత్రపటాన్ని చేతపట్టుకొని అమెరికాకు చావ్ఞతప్పదు, ట్రంప్‌ను చంపుతాం అంటూ ప్రజలు పెద్దఎత్తున నిన దించారు

. అమెరికా, ఇజ్రాయిల్‌ జెండాలను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఎంతో సమన్వయంతో మరెంతో హుందాగా ఎంతటి విపత్కర పరిస్థితుల్లోనైనా నిగ్రహం కోల్పోని పేరు తెచ్చుకున్న నాయకుడు ఆ దేశాధినేత అయతుల్లా ఖొమైనీ కూడా సార్వత్రిక ప్రార్థనలో ఒక దశలో కన్నీరు ఆపుకోలేక ఏడ్చేశారు. ఇక 2015 నాటి అణ్వస్త్ర ఒప్పందం నుండి వైదొలుగుతు న్నట్లు ప్రకటించారు.అంతేకాదు ఇరాన్‌లో ఉన్న అమెరికా దళాలను తక్షణం ఉపసంహరించాలని ఇరాన్‌ పార్లమెంట్‌ తీర్మానాన్ని ఆమోదించింది. మరొకపక్క ప్రతీకార దాడు లకు దిగితే అంతకుమించిన దాడులు చవిచూడాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్‌ హెచ్చ రించారు.

దానికితోడు ఇరాన్‌పై కఠినమైన ఆంక్షలు విధిస్తామని ఆయన ప్రకటించారు.తమ దేశం నుంచి వెళ్లిపోవాలని ఇరాక్‌ పార్లమెంట్‌ అమెరికా దళాలను కోరడంపై ట్రంప్‌ తీవ్రంగా స్పందించారు. ఇరాక్‌లో స్థావ రాలకు ఇరాకీయుల రక్షణకు కోట్లాది డాలర్లు చెల్లిస్తేనే తాము వెళ్లిపోతామని ట్రంప్‌ ప్రతిస్పందించారు.ఇప్పటికే అమెరికా వల్ల తమదేశం ఎంతో ధ్వంసమైందని, ఇంకా అమెరికా ఆధిపత్యాన్ని అంగీకరించలేమని పార్లమెంటు సభ్యులు స్పష్టం చేశారు. ఈ పరిణామాలపై చర్చించేం దుకు నాటో కూటమిలోని 29 దేశాలు అత్యవసరంగా సమావేశమయ్యాయి.

ఇలా రెండు దేశాల మధ్య పరస్పర ప్రతిజ్ఞలు, హెచ్చరికలతో అంతర్జాతీయంగా మార్కెట్లపై తీవ్ర ప్రభావం కన్పిస్తున్నది. ఈ ఉద్రిక్తతలు మరింతగా పెరిగే అవకాశాలున్నాయని ప్రపంచ మార్కెట్లు భయపడు తున్నాయని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీస్‌ సంస్థ విశ్లే షకులు వినోద్‌ నాయర్‌ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇతర వర్ధమాన దేశాల కంటే భారత్‌పై అధికంగా ప్రభావం చూపే అవకాశాలు న్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రపంచంలో నే మూడో అతిపెద్ద చమురు వినియోగ దేశమైనప్పటికీ మన అవసరాలకు 75శాతంపైగా ఇతర దేశాల నుంచి దిగుమతులపై ఆధారపడ్డాం. చమురు ధరలు పెరిగితే ఇది మన ఆర్థికవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. గత రెండు ట్రేడింగ్‌ సెషన్లలో భారత్‌ మార్కెట్‌ భారీగా నష్టపోయింది.శుక్రవారం 162 పాయింట్లు, సోమవారం 788 పాయింట్ల చొప్పున సెన్సెక్స్‌ పతనమైంది. కేవలం ఈ రెండు రోజుల్లో జరిగిన నష్టమే 3.36 లక్షల కోట్లు ఇన్వెస్టర్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఇంకొకపక్క ఆర్థికవ్యవస్థ మందగ మనం నేపథ్యంలో వ్యాపార దిగ్గజాలతో ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలో సమావేశమయ్యారు. వాణిజ్యపరంగా ఎదు ర్కొంటున్న సవాళ్లు,వృద్ధి,ఉపాధి కల్పనకు మరిన్ని అవ కాశాలు ఇచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించా రు. తయారీ రంగం బలహీనత తదితర అంశాల కార ణంగా జులై, సెప్టెంబర్‌ త్రైమాసికంలో స్థూలదేశీయోత్ప త్తి జిడిపి మరింత తగ్గి ఆరేళ్ల కనిష్టమైన 4.5 శాతానికి పడిపోయింది. వృద్ధికి ఊతం ఇచ్చేందుకు రిజర్వుబ్యాంకు వడ్డీ రేట్లను గత ఏడాది గణనీయంగా తగ్గించుకుంటూ వచ్చింది.

అటు కేంద్రప్రభుత్వం కూడా బ్యాంకులకు మరింత మూలధనం ఇవ్వడం, పలు బ్యాంకులను విలీ నం చేయడంతోపాటు కార్పొరేట్‌ టాక్స్‌రేటును 30శాతం నుంచి 22 శాతానికి తగ్గించడం వంటి సంస్కరణలు చేపట్టినా ఆశించిన లక్ష్యాలు నెరవేరలేదు.

ఇప్పటికే ఆర్థికవ్యవస్థ మందగమనంతో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో మరింత దిగజారే అవకా శాలు కన్పిస్తున్నట్లు ఆర్థికరంగ నిపుణులే అభిప్రాయపడు తున్నారు. ఉద్రిక్తతలు తీవ్రమైతే ఈ రేట్లు మరింతగా పెరిగే అవకాశాలులేకపోలేదు.

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com/