కర్షకులను వదలని బాధలు

Farmer

భూమిని నమ్ముకున్నవారు ఎన్నటికీ చెడిపోరు అనేది పాతకాలపు నమ్మకంగా మారిపోయింది. గ్రామాలో ఉంటూ భూమిపైనే ఆధారపడుతూ వ్యవసాయమే జీవనాధారంగా బతకడం ఒక శాపంగా పరిణమిస్తున్న దురదృష్టపు రోజులు దాపురించాయి. ఒకపక్క ప్రకృతి బీభత్సాలు, మరొకపక్క తోటిమానవ్ఞడు చేస్తున్న మోసాలతో రైతులు రోజురోజుకు కుదేలైపోతున్నారు. ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది.విత్తే దగ్గర నుండి పంటలు అమ్మేవరకు రైతులు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీకావ్ఞ. ప్రకృతి కూడా అయితే అతివృష్టి లేకుంటే అనావృష్టి అన్నట్టుగా వ్యవహరిస్తున్నది. గత రెండు నెలలుగా కురుస్తున్న వర్షాలతో పంటలకు భారీగానే నష్టం జరిగింది.

మొన్నటివరకు ఖరీఫ్‌ పంటలను ఎలా కాపాడుకోవాలని అల్లాడిన రైతులు ఇప్పుడు కురుస్తున్న వర్షాలతో తమ పంటలను ఎలా రక్షించుకోవాలని మదన పడుతున్నారు.ఇప్పటికే తెలుగురాష్ట్రాల్లో అనేకప్రాంతాల్లో లక్షలాది ఎకరాలు మెట్టపంటలు దెబ్బతిన్నాయి. మిర్చి, మొక్కజొన్న, వేరుశనగ లాంటి పంటలు నీట మునిగి రోజుల తరబడి ఉండటంతో ఇక అవి చేతికి వచ్చే అవకాశం లేదని రైతులు వాపోతున్నారు. వరి పంటపై కొంత ఆశ ఉన్నా ఈ వర్షాలు ఇకనైనా ఆగితే కొంతలో కొంత చేతికి అందుతుందని రైతులు ఆశపడుతున్నారు. మొన్నటిదాకా వర్షాల కోసం తపించిన రైతులు నేడు వర్షాలు ఇక చాలనే పరిస్థితికి చేరుకున్నారు.

అయితే తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి అంతా ఇలానే ఉందని చెప్పడం లేదు. ఇప్పటికీ ఎన్నో ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నా ఆయా ప్రాంతాల్లోనూ చిన్ననీటి వనరులకు నీరు చేరుకోలేదు. భూమి తడిసిందే తప్ప కుంటల్లోకి, చెరువ్ఞల్లోకి నీరు వచ్చే వర్షాలు రాలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. మరొకపక్క రైతు సంక్షేమమే తమ ధ్యేయమని, వారి అభ్యున్నతికి ఏమి చేయడానికి అయినా వెనుకాడమని రాజకీయ పార్టీలు, నేతలు ఇంతగా చెప్తున్నా మరెన్ని కార్యక్రమాలు చేపడుతున్నా దేశవ్యాప్తంగా లక్షలాది కోట్ల రూపాయలు ఖర్చుపెడు తున్నా రైతుల పరిస్థితి ఏమాత్రం మారడం లేదు. రోజురోజుకు దిగజారిపోతున్నది. వేలకువేలు అప్పులు తెచ్చి సాగు చేసిన పంటలు కళ్లముందే పాడైపోతుంటే దిక్కుతోచని రైతులు పడుతున్న బాధలు వర్ణనాతీతం.

వ్యవసాయం తప్ప మరో జీవనాధారం లేక, రాక గ్రామాన్ని, ఆ పరిసరాలను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్లాలో తెలియక వారు పడుతున్న వేదన గుండెలను పిండే స్తున్నది.బతుకుతెరువ్ఞ కోసం కన్నబిడ్డలు వలసపోతుంటే వెక్కివెక్కి ఏడుస్తున్న పల్లెతల్లి ఆక్రందనలు పెద్దలకు వినిపించడం లేదు. జీవం నిలపాల్సిన జలాలే ప్రాణాం తకాలు అవ్ఞతున్నాయి. గ్రామాల్లో స్వచ్ఛమైన గాలి, నీరు లభిస్తుందనే ఆలోచనలకు, ఆశలకు స్వస్తిచెప్తూ తాగునీటి వనరులు కలుషిత కేంద్రాలు అయ్యాయి.ఇనుము,ఫ్లోరైడ్‌, నైట్రేట్‌ తదితరాలతోపాటు పలురోగాలకు కారణాలైన బ్యాక్టీరియాలు వీటితో కలిసిపోతున్నాయి.

తాగునీటి వనరులలో ఫ్లోరైడ్‌ సమస్య అత్యధికంగా ఉందని, మోతాదుకు మించి ఇనుము ఉన్నట్లు అనేక నివేదికల్లో వెల్లడైంది. అన్నింటికంటే భూగర్భజలాల్లో కెమికల్స్‌ పెరిగిపోతున్నాయి. మరొకపక్క బోరుబావ్ఞలు ఏటా వేలసంఖ్యలో పుట్టుకొస్తున్నాయి. వినియోగం నానాటికీ పెరిగిపోతున్నది. అయితే బోరుబావ్ఞల్లోని నీరు తాగడం వల్ల కిడ్నీవ్యాధులు సంభవిస్తున్నాయనే వార్తలు పల్లెల్లో ఆందోళనలు కలిగిస్తున్నాయి. ఏటా వేలాది మంది బోరు బావ్ఞల నీరు తాగి కిడ్నీవ్యాధులతో ఆస్పత్రిపాలవ్ఞతున్నా రనే నివేదికలు గ్రామాల్లో కలకలం రేపుతున్నాయి.

దేశ వ్యాప్తంగా చూసినా బోరుబావ్ఞల నీటి వాడకం అంత కంతకు పెరిగిపోతున్నది. ప్రపంచంలో ఎక్కడాలేనంతగా ఏటా 250 ఘనపు కిలోమీటర్ల భూగర్భజలాలను భారత్‌ లో వినియోగిస్తున్నారు. దేశంలో 6572 భూగర్భజలాల బ్లాక్‌లుండగా వాటిలో 70శాతంపైగా బ్లాక్‌ల్లో అవసరానికి మించి భూగర్భజలాలు తోడేస్తున్నారు. ఇదే పరిస్థితి కొన సాగితే మిగితా బ్లాక్‌లు ఆ పరిధిలోకి చేరుకొని దేశంలోని భూగర్భజలాలు పూర్తిగా అడుగంటిపోయే ప్రమాదం కన్పి స్తుంది. దేశంలో బోరుబావ్ఞల సంఖ్య గత యాభై ఏళ్లల్లో 130 రెట్లకుపైగా పెరిగి దాదాపు మూడున్నర కోట్లకు చేరుకున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వీటివల్ల పేద రైతులకు కొంత లాభం చేకూర్చినా నీటి సంరక్షణ పద్ధతు లు పాటించకుండా బోరుబావ్ఞల మీదనే ఆధారపడే పరి స్థితి అనేక అనర్థాలకు దారితీస్తున్నది.

కానీ రైతులకు అది తప్పడం లేదు. ఉపాధిహామీ పథకం గ్రామీణ ప్రాం తంలోని నిరుపేదలకు కొంతమేరకు ఉపాధి కల్పించిన మాట వాస్తమే కావచ్చు. కానీ అది వ్యవసాయరంగంపై తీవ్రప్రభావం చూపుతున్నది. కూలీలు దొరక్క ఎందరో రైతులు వ్యవసాయాన్నే వదులుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. పాడిపశువ్ఞల పోషణ భారంగా మారడంతో పాల ఉత్పత్తి కూడా గణనీయంగా తగ్గిపోతుంది. చిన్న కారు, సన్నకారు రైతులకు ప్రధాన జీవనోపాధి పశు సంపదే. కానీ ప్రభుత్వం ఎన్ని ప్రోత్సాహకాలు ఇచ్చినా పశుసంపద తగ్గిపోతున్నది.

ఇలాంటి తరుణంలో రైతు లకు చేయూతనివ్వాల్సిన పాలకులు మాటలతో, సమీక్ష లతో కాలం గడుపుతున్నారు.అలాని ఏమీచేయడం లేదని చెప్పడంలేదు.కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారు. తెలం గాణ ప్రభుత్వం ఒకఅడుగు ముందుకేసి రైతులను ఆదు కునేందుకు ఎన్నోపథకాలు ప్రవేశపెట్టింది.అయినాఆశించిన లక్ష్యాన్ని చేర్చలేకపోతున్నది. రైతులు సేద్యాన్ని వదిలిపెట్ట కుండా వారికి దానిపై ఆదాయాన్ని పెంచి సాగులో నష్టం రాకుండా చూడాల్సిన బాధ్యత పాలకులపై ఉంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/