నకిలీ మందులతో పెరుగుతున్న వ్యాధులు!

Fake Drugs

ఆరోగ్యమే మహాభాగ్యమంటారు. ప్రజా రోగ్యం కోసం కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు ఏటా వేలాది కోట్ల రూపాయలు ఖర్చుపెడు తున్నాయి. అత్యాధునిక మందులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని కనుగొంటున్నారు. వైద్యసేవలు ఏడాదికేడాది విస్తరిస్తూ మారుమూల గ్రామాల్లోని నిరుపేదలకు కూడా అందించేందుకు నిర్విరామకృషి జరుగుతూనే ఉంది. మన రాజ్యాంగంలో కూడా దేశ ప్రజలందరికీ వైద్యసదుపాయం అందించాలనే నిబంధనలను పెద్దలు విధించారు.

ఎంతటి కార్యక్రమాలు పెడుతున్నా, ఎన్ని లక్షలకోట్లు వెచ్చిస్తున్నా లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నాం. అయితే మానవ్ఞడి విజ్ఞానానికి సవాల్‌ విసురుతూ కొత్త కొత్త జబ్బులువిస్తరిస్తూనే ఉన్నాయి. సీజన్‌ మారినప్పుడల్లా రకరకాల విషజ్వరాలు ప్రజారోగ్యంపై దాడిచేస్తూనే ఉన్నాయి.డెంగ్యూ,స్వైన్‌ఫ్లూ, చికెన్‌గున్యా లాంటి వ్యాధులు దోమల ద్వారా వ్యాపిస్తూ ప్రజారోగ్యాన్ని కబళిస్తున్నాయి. ప్రతిసారి ఈ వ్యాధులు సోకినప్పుడల్లా దేశవ్యాప్తంగా వేలాది మంది ఆస్పత్రుల పాలవ్ఞతుండగా కొందరు అసువ్ఞలుబాస్తున్నారు.

పాలకులు ఎప్పటికప్పుడు ఈ వ్యాధుల బారినుండి కాపా డేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్తున్నారు. కానీ ఈ వ్యాధులు రాకుండా ముందుగా తీసుకోవలసిన చర్యల గూర్చి విస్మరిస్తున్నారేమోననిపిస్తున్నది. ఆరోగ్యానికి సమ తులాహారం, రక్షిత మంచినీరు, పరిశుభ్రమైన వాతావర ణం వీటన్నింటిని మించి దోమలను నియంత్రించడంలో ఘోరంగా విఫలంకావడంతో వ్యాధులు ప్రబలిపోతు న్నాయి.మందుల వాడకంకూడా అదుపులేకుండా పోతున్నది.

కానీ ఈ మందుల్లో నకిలీలు, నాసిరకం తయార వ్ఞతున్నాయి. వీటివాడకం వల్ల జబ్బులు తగ్గకపోగా అవి మరింత పెంచుతూ కొత్త వ్యాధులకు కారణాలవ్ఞతున్నా యని డాక్టర్లే చెబుతున్నారు. నాసిరకం, నకిలీ మందులు దేశవ్యాప్తంగా సరఫరా అవ్ఞతుండటంపట్ల వైద్యనిపుణులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా సామాన్యంగా వచ్చే వ్యాధులకు దాదాపు నాలుగువందల రకాల మందు లు అవసరం అవ్ఞతాయి.

కానీ దేశంలో దాదాపు 25వేల రకాలకుపైగా మందులు నమోదై ఉన్నాయి. మరో నలభై వేలకుపైగా మందులు అనధికారికంగా చెలామణిలో ఉన్న ట్లు వైద్యవర్గాలే అంచనా వేస్తున్నాయి. ఔషధ నియంత్ర ణకు స్పష్టమైన, నిర్దిష్టమైన విధానాలు రూపొందించక పోవడంవల్ల కూడా ఈ నకిలీ నాసిరకంమందులు మార్కె ట్లో పెరిగిపోతున్నాయి. దేశంలో ఈ నకిలీ, నాసిరకం ఒక్కశాతంకూడా ఉండవని పాలకపెద్దలు చెప్తుంటే ముప్ఫై శాతంపైగా మార్కెట్లో ఉన్నట్లు సమాచారం. స్వాతంత్య్రం వచ్చిన తర్వాతనే ఈ నకిలీ, నాసిరకం మందుల వ్యాపా రం పెరిగిందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

దేశ ఆరోగ్య విధానాలకు దిశానిర్దేశనం చేసిన బోర్‌ కమిటీ ‘జనరిక్‌ మందులనే ప్రోత్సహించాలని ప్రతిపాదించింది. కానీ ఆ ప్రతిపాద నలు నేటికీ అమలు జరగడం లేదు. భారత పరిశ్రమల సమాఖ్య అంచనా ప్రకారం దేశంలో ఈ నకిలీ, నాసిరకం మందుల విలువ పదివేల కోట్లకు పైగా ఉంటుందని చెప్తున్నారు.గతంలో ఇలాంటి మందుల వ్యాపారులపై దాడులు జరిగినప్పుడు విస్తుపోయే విష యాలు వెలుగుచూశాయి.బెంగళూరు,హైదరాబాద్‌, పాండి చేరి, తదితర ప్రాంతాల్లో పెద్దఎత్తున నకిలీ మందులు పట్టుబడ్డాయి.

ఈ నకిలీ మందులు కొన్నిచోట్ల పెద్దఎత్తున తయారు చేస్తుండగా మరికొన్ని ప్రాంతాల్లో కుటీర పరిశ్ర మగా ఏర్పాటుచేసుకొని తయారు చేస్తున్నారు. ఇక ప్రజా రోగ్యంపై తీవ్రప్రభావం చూపుతున్న ఈ నకిలీ మందులు మార్కెట్లో ఒక నిర్దిష్టవ్యూహం ప్రకారం ప్రవేశపెడుతు న్నారు.వ్యవస్థీకృత నేరముఠాలు నకిలీ మందుల తయారీ గ్రూపులు కలిసి ఈ వ్యాపారాన్ని ఒక వ్యూహం ప్రకారం నడుపుకుంటున్నారు. మందుల్లో ప్రామాణికత దెబ్బతిన డం వల్ల చోటుచేసుకుంటున్న దారుణాలు అన్నీఇన్నీకావ్ఞ. గతంలో ఒకసారి ముంబాయిలో ‘మానిటాల్‌అనే మెదడు వాపునకు వాడే మందులో డైథిలిన్‌గ్లైకేల్‌ అనే ద్రావకం కల్తీ జరిగింది.దాని ప్రభావంతో ఒకేసారి పధ్నాలుగు మంది మరణించారు. తయారీ నిర్లక్ష్యమే ఈ కల్తీకి కార ణమని ఆ సందర్భంగా ఔషధ కంపెనీల తయారీ వ్యవ హారంపై పెద్దఎత్తున నిరసనలు, ఉద్యమాలు పెల్లుబుకాయి.

ఆనాటి ప్రభుత్వం జస్టిస్‌ లెంటిన్‌ కమిషన్‌ను నియమించింది. ఆ కమిషన్‌ విచారణ అనంతరం అనేక వైఫల్యాలను ఎత్తిచూపుతూ తీసుకోవాల్సిన జాగ్రత్తల గూర్చి కూడా ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. కానీ ఆ నివేదికను పట్టించుకున్న దాఖలాలు లేవ్ఞ. ఢిల్లీలో కూడా ఆ తర్వాత ఈ కల్తీ మందుల వల్ల 33 మంది పసిపిల్లలు మరణించారు. మొత్తం మీద కల్తీ, నాసిరకం మందులతో జరుగుతున్న ఘోరాలను నియంత్రించేందుకు శాస్త్రపారిశ్రామిక పరిశోధనా మండలి డైరెక్టర్‌ మషేల్కర్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు అయిన కమిటీ ఔషధ రంగంలోని వైఫల్యాలపై ప్రభుత్వానికి సమగ్రమైన నివేదిక సమర్పిం చింది.కానీ అలాంటి నివేదికలను కూడా అమలు చేసి నట్లు కన్పించదు.

ఇదే కాదు దేశంలో ఔషధపరిశ్రమలకు సంబంధించి విధి విధానాలను ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో విధంగా రూపొందిస్తున్నారు.ఆయా రాష్ట్రాల పరిస్థితులు, వస్తున్న వ్యాధులను బట్టి రూపొందిస్తున్న విధానాలతో నిబంధ నలు తయారు చేస్తున్న మందులు కొన్ని ప్రాంతాల్లో వికటిస్తున్నాయి. దీనికితోడు కాలం చెల్లిన మందులను కూడా బహిరంగంగానే అమ్ముకుంటున్నారు.

హైదరాబాద్‌ లో మొన్న ఇఎస్‌ఐ ఆస్పత్రిపై ఎసిబి జరిపిన దాడుల్లో మందుల కొనుగోళ్లలో జరిగిన అక్రమాలు, అవినీతి పరాకాష్ఠగా చెప్పొచ్చు. ఈ కొనుగోళ్లలో నాసిరకం,నకిలీ మందులు కూడా పెద్దఎత్తున చేరుకున్నాయి. అవి ఎంత మంది ప్రాణాలు తీసాయో, ఎందరిని అనారోగ్యపాలు చేసాయో అంచనాలకే అందవ్ఞ. పాలకులు నకిలీ, నాసిరకంతోపాటు కాలం చెల్లిన మందుల అమ్మకాలపై పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com