భయమే ప్రమాదం!

ప్రపంచవ్యాప్తంగా 7 లక్షల కేసులు

coronavirus

కరోనా వైరస్‌ ప్రపంచ జనాభాను ఇంకా వణికిస్తూనే ఉన్నది. కోట్లాది మంది గడగడలాడుతూనే ఉన్నారు.

కరోనా పుట్టిన చైనాలోని వూహన్‌లో కొంత శాంతించినట్లు కన్పించినా అమెరికా, ఇటలీ లాంటి దేశాల్లో మరణ మృందంగాన్ని మోగిస్తూనే ఉంది.

అమెరికాలో ప్రపంచం లోని అత్యధిక కేసులు నమోదు అయ్యాయి. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు ఏడు లక్షల కేసులకుపైగా నమోదయ్యాయి.

మరో 32వేల మంది మృత్యువాతపడ్డారు. స్పెయిన్‌లో రికార్డుస్థాయిలో ఆది వారం ఒక్కరోజు 830 మరణాలు నమోదు అయ్యాయి.

దీంతో ఆ దేశంలో మృతుల సంఖ్య 6500లకుపైగా చేరుకున్నది. స్పెయిన్‌ దేశ యువరాణి మెరీ థెరేసా ఈ వైరస్‌బారినపడి మరణించింది.

యూరప్‌లో రాజ కుటుం బానికి చెందిన వ్యక్తి మరణించడం చరిత్రలోనే మొదటి సారి. ఇక అగ్రరాజ్యం అమెరికా చిగురుటాకులా వణికి పోతున్నది.

న్యూయార్క్‌, కాలిఫోర్నియా, న్యూజెర్సీ తదితర నగరాల్లో తన విశ్వరూపాన్ని చూపిన కరోనా ఇప్పుడు టెట్రాయిడ్‌, న్యూఓర్లీన్స్‌,చికాగోలో కూడా విస్తరించింది.అమెరికాలో లక్షాఇరవైల కేసులు నమోదు కాగా మృతుల సంఖ్య రెండువేలు దాటిపోయింది.

మొత్తం మీద అన్ని ప్రపంచ దేశాలకు చాపకిందనీరులా విస్తరిస్తూనే ఉంది. భారత్‌లో మాత్రం అంత ప్రతాపాన్ని చూపలేకపోతున్నది.

కేవలం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగానే స్పందించి జాగ్రత్త చర్యలకు శ్రీకారం చుట్టడం వల్లనే ఈ వైరస్‌ ఉధృతికి కొంతవరకు అయినా కళ్లెం వేయగలిగారని వైద్యరంగ నిపుణులే చెప్తున్నారు.

జనతాకర్ఫ్యూ, ఆ తర్వాత లాక్‌డౌన్‌ లాంటి చర్యలు చేపట్టడం వల్ల చాలావరకు అదుపు చేయగలిగారు. ఈ వ్యాధికి మందు లేదనేది తెలిసిన విషయమే. ఉన్నది ఒక్కటే.

వ్యాధి సోకకుండా నివారణ చర్యలే. అది తీసు కోవడంలో విఫలమైతే పరిస్థితి చేతిలో ఉండదు. అందుకే ఇటలీ, అంతకంటే ముందు చైనా, ఇప్పుడు అమెరికా, భారీ మూల్యం చెల్లిస్తున్నాయి.

భారతదేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య ఆదివారం వరకు 1024కు చేరు కున్నది.అందులో మృతిచెందింది 27మంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయంలో ప్రధానంగా తెలంగాణముఖ్యమంత్రి ముందుగా ఈ వైరస్‌ గురించి పెద్దగా పట్టించుకోకపోయి నా ఆ తర్వాత రాబోవ్ఞ ఉపధ్రవాన్ని అంచనా వేయడం లో సఫలీకృతమయ్యారని చెప్పొచ్చు.

రాత్రిపూట కర్ఫ్యూ ప్రకటించడంతోపాటు లాక్‌డౌన్‌ను కొనసాగించడం, ఎప్ప టికప్పుడు పర్యవేక్షిస్తూ ఆదేశాలు ఇవ్వడంతో వైరస్‌ రక్క సికి చాలావరకు సంకెళ్లు వేశారని చెప్పొచ్చు.

వీటన్నింటి కంటే మించి యంత్రాంగాన్ని సమయాత్తం చేయడం ముఖ్యంగా వైద్యసిబ్బందిని అందుబాటులో ఉంచడం కూడా తెలంగాణ ప్రభుత్వం చాలావరకు విజయం సాధించిందని చెప్పొచ్చు

. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 70 కేసులు నమోదుకాగా సోమవారం అందులో 11 మంది చికిత్స పొంది కరోనాబారి నుండి బయటపడి ఆస్పత్రుల నుంచి ఇళ్లకు వెళ్లిపోతున్నట్లు ముఖ్యమంత్రే స్వయంగా ప్రకటించారు.

ఆదివారం వరకు కరోనా వ్యాధి గ్రస్తుల్లో కేవలం ఒక్కరే మరణించారు. అదికూడా ఆ రోగి మరణించిన తర్వాత చేసిన పరీక్షలో ఆయనకు కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది.

ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారు కూడా మరో వారం, పది రోజుల్లో పూర్తిగా కరోనా బారి నుండి బయటపడతారని ముఖ్యమంత్రి విశ్వాసం వ్యక్తంచేశారు.

ఇక తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 25వేల మందికిపైగా ప్రభుత్వ వైద్య టీమ్‌ల పర్యవేక్షణలో ఉన్నారని, ఇప్పటివరకు వారికి కూడా ఎలాంటి రోగలక్షణాలు ఉన్నట్లు బయటపడలేదని ముఖ్యమంత్రి చెప్పారు.

మొత్తం మీద ఏప్రిల్‌ ఏడో తేదీ నాటికి కొత్తకేసులు రాకపోతే తెలంగాణ కరోనా లేని రాష్ట్రం అయ్యే అవకాశాలున్నాయన్నారు.

ఈ వ్యాధి రాకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవడం ఒక్కటైతే ఒక వేళ సోకిన సకాలంలో వైద్యులను సంప్రదించి చికిత్స పొందే అవకాశాలున్నట్లు కూడా స్పష్టమవ్ఞతున్నాయి.

కానీ ప్రజలు ఈ వ్యాధి పేరు చెబితేనే గడగడలాడిపో తున్నారు.వ్యాధి వచ్చిందంటే జీవించడం కష్టమనేభయాం దోళనలో మునిగి తేలుతున్నారు. బయటకు చెప్పుకోవడం లేదు.

క్వారంటైన్‌ అంటేనే అదొక జైలుగా భయపడుతు న్నారు.వాస్తవంగా అంత భయపడాల్సిన అవసరం లేదు.

జాగ్రత్తలు తీసుకోవడానికి, భయపడటానికి చాలా తేడా ఉంది.రోగలక్షణాలు కన్పించిన వెంటనే నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి.

ఆ లక్షణాలు కన్పించిన వారు జనంతో కలవకుండా తమకై తాము ఇంట్లోనే క్వారంటైన్‌ విధిం చుకోవచ్చు. లేదంటే ప్రభుత్వానికి తెలిపి ప్రభుత్వ క్వారంటైన్‌లో చేరవచ్చు.

అంతేకానీ భయపడుతూ, బయ టకు చెప్పుకోకుండా వ్యాధి పెరిగితే వారికే కాదు వారి కుటుంబ సభ్యులకు, ఆ చుట్టుపక్కల ఉన్నవారికి ఆ వైరస్‌ విస్తరించే అవకాశం ఉంది.

ఒకే ఒక వ్యక్తి ద్వారా వేలాది మందికి సోకిన దాఖలాలు కూడా ఉన్నాయి.

భయాందోళనలతో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతు న్నట్లు కూడా వార్తలు రావడం ఆందోళన కలిగిస్తున్నది.

దేశంలో అక్కడక్కడ ఈ వ్యాధి సోకిందనే భయాందోళన తో ఆత్మహత్యలు చేసుకున్నారు.

మనదేశంలోనే కాదు జర్మనీలోని హస్సేరాష్ట్ర ఆర్థికమంత్రిథామస్‌ షెఫర్‌ రాబో యే ఆర్థికసంక్షోభాన్ని ఊహించుకోని ఆందోళన చెంది ఆత్మహత్య చేసుకున్నారు.

ఇక కరోనావైరస్‌ పట్ల కొన్ని సామాజిక మాధ్యమాల్లో భయాలు కల్పించే ప్రచారం జరుగుతున్నది.

ఈవైరస్‌పట్ల అంతగా భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదు.

కానీ సోషల్‌ డిస్టెంట్స్‌తో పాటు మరికొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది .

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/health1/