బిజెపికి ఎదురుగాలి!

BJP
BJP

బిజెపికి ఎదురుగాలి! 

దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలు అటు భారతీయ జనతాపార్టీ ని దెబ్బతీసాయనే చెప్పాలి. మొత్తం ఐదు రాష్ట్రాల్లో ఎక్కడా బిజెపి అధికారం చేజిక్కించుకోలేక పోయింది. రాజస్థాన్‌, ఛత్తీస్‌ఘడ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ తన హవాను కొనసాగించింది. ఉత్తర, మధ్య భారతంలో ఎక్కువగా బిజెపికి ప్రధాని మోడీపై ఉన్న వ్యతిరేకతకంటే ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వ వ్యతిరే కత కాంగ్రెస్‌కు కలిసొచ్చింది.

ముందునుంచి వ్యూహాత్మ కంగా వేసిన అడుగులు కాంగ్రెస్‌పార్టీ మిత్రపక్షాలతోపాటు కలుపుకుని ముందుకువెళ్లినా తెలంగాణలోమాత్రం కూట మికి ఘోరపరాభవం ఎదురయింది. కూటమి నేతలు చేసిన ప్రచారానికి తెలంగాణ ఓటర్లు ఎక్కడాప్రాధాన్యత నివ్వలేదనే చెప్పాలి. అతిరధ మహారధులందరూ వచ్చి ప్రచారంచేసినా టిఆర్‌ఎస్‌ ప్రభంజనాన్ని అడ్డుకోలేకపో యాయి. ఇక మిగిలిన రాష్ట్రాల్లోచూస్తే ఎక్కువగా స్థానికం గా ఉన్న సమస్యలు, పార్టీలో నెలకొంటున్న అంతర్యు ద్ధాలు కొంతమేర కారణం అయ్యాయనే చెప్పాలి.

అలాగే ముందుగా సిఎం అభ్యర్ధులనుప్రకటించకుండా ముందు విజయంపైనే లక్ష్యంగాచేసుకుని కాంగ్రెస్‌ పార్టీ ఈ రాష్ట్రా ల్లో ముందుకువెళ్లింది. ఇక రాజస్థాన్‌పరంగా చూస్తే సి ఎం వసుంధరరాజే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతనెలకొం ది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లోసైతం అక్కడ కాంగ్రెస్‌ అభ్యర్ధులే గెలుపొందారు. మొత్తం 199 స్థానాల్లో పోటీ చేసిన బిజెపి అక్కడ మెజార్టీ మార్కుసాధించలేకపోయిం ది. 72 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. 102 స్థానాలతో కాంగ్రెస్‌ పార్టీ అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమౌతోంది.

అదేవిధంగా మధ్యప్రదేశ్‌లో ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌చౌహాన్‌ ధీమా మొత్తం ఆవిరై పోయింది. ఐదోసారి కూడా ముఖ్యమంత్రి కావచ్చన్న లక్ష్యంతో ముందుకువచ్చిన చౌహాన్‌ తన విజయంపై ఎం తో ధీమా ప్రదర్శించారు. 230 స్థానాలకు పోటీచేసినా కేవలం 106కు మించి రాబట్టుకోలేకపోయారు. కాంగ్రెస్‌ పార్టీ 115 స్థానాలకు ఎగబాకింది. ఇతరులు 7 బిఎస్పీ రెండు స్థానాలు గెలుచుకున్నాయి. అదేవిధంగా చావల్‌ బాబాగ ాపేరుపొందిన ఛత్తీస్‌ఘడ్‌ ముఖ్యమంత్రికి ఈసారి అనూహ్యపరిణామాలు ఎదురయ్యాయి.

మెజార్టీస్థానాలు దక్కించుకోవడంలో విఫలమయ్యారు. మొత్తం 90 స్థానా లకుగాను 63స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిం చడం బిజెపి కేవలం 18స్థానాలు, బిఎస్‌పి ఎనిమిది స్థా నాలు ఇతరులు ఒకే ఒక్కస్థానానికి మాత్రమే పరిమితం అయ్యారు. ఎన్నిక ల్లో ప్రధానంగా తెలంగాణ మినహాయించి అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్‌పార్టీ రాఫెల్‌డీల్‌, పెద్దనోట్ల రద్దు, జిఎస్‌టి చట్టా లనే ప్రచారాస్త్రాలుగా మలుచుకుంది. ఎక్కువగా రాఫెల్‌ డీల్‌, ఇటీవల ఎగిసి పడిన సిబిఐలో అంతర్గత వివాదాలువంటివి కొంతమేర ప్రచారాస్త్రాలుగా లభించాయి.

అవినీతిపైనే తమ పోరాటం అని చెపు తూ మహాకూటమి ప్రధాన పార్టీగా రాహుల్‌ముందుకు వెళ్లారు. ఇదే అటు ఛత్తీస్‌ఘడ్‌, ఇటు రాజస్థాన్‌,మధ్యప్ర దేశ్‌ రాష్ట్రాల్లోప్రతిబింబించిందనే చెప్పా లి. తిరుగులేని నాయకులుగా మూడురాష్ట్రాల్లో చెలా మణి అయిన ముఖ్యమంత్రులు ఓటమిని అంగీకరించక తప్పలేదు. ప్రత్యేకించి రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లలో ప్రభు త్వ వ్యతిరేకత జోరుగా కొనసాగిందనే భావించాలి.

ఈ మూడు రాష్ట్రాల్లోను కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలకు ఓటర్లు సానుకూలంగా స్పందిం చారనే చెప్పాలి. అధి కారంలోకి వచ్చిన పది రోజుల్లోనే రైతు రుణమాఫీ భారీ ఓటుబ్యాంకును తెచ్చిందనే చెప్పా లి. ఖాళీల భర్తీ, నిరు ద్యోగులకు ఉపాధి హామీతోపాటు, నిరుద్యోగభృతివంటివి ఆకర్షణీయంగా మారాయి. వీటిలో ఒక్క రైతు రుణమాఫీ మినహా ఇతర అన్ని హామీలను బిజెపికూడా గుప్పించిం ది. వాస్తవానికి ఈ ఐదురాష్ట్రాల ఎన్నికలను అటుప్రతి పక్షం ఇటు అధికారపక్షాలు వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సెమిఫైనల్స్‌గా భావించాయి.

ఇపుడు ఈ ఎన్నికల తీర్పు తో సార్వత్రిక ఎన్నికలకు ప్రజల నిర్ణయం ఏమిటో స్ప ష్టత వచ్చిందన్న రాజకీయ పార్టీల్లో వ్యక్తం అవుతున్నది. అధికారంలో ఉన్న బిజెపి ఓటమికి అనేక కారణాలు న్నాయి. ప్రభుత్వ సంస్థలను దుర్వినియో గం చేయడం, ఏకపక్షంగా నిర్ణయాలు, ప్రభుత్వసంస్థల్లో స్వయంప్రతి పత్తిని హరించే వ్యూహాలు అమలుచేయడం వంటివి కొంత కారణం అయ్యాయన్న రాజకీయ పరిశీలకుల అం చనాలకు వాస్తవాలు దగ్గరగా ఉన్నాయి.

ఇక ఛత్తీస్‌ఘడ్‌ పరంగాచూస్తే బిజెపిని గద్దెదించేందుకు బిఎస్పీతో జత కట్టిన జనతాకాంగ్రెస్‌ ఛత్తీస్‌ఘడ్‌ అధినేత అజిత్‌ జోగి వ్యూహాలు ఎక్కడా ఫలించలేదు. అధికారంలోకి రావా లన్న లక్ష్యం నీరుగారినట్లే చెప్పాలి. అదే మధ్యప్రదేశ్‌లో 15ఏళ్లపాటు అధికారంలో ఉన్న బిజెపికి ఈసారి కోలుకో లేని నష్టమే జరిగింది.

మూడురాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీతో ముఖాముఖి పోటీని బిజెపి ఎదుర్కొన్నది. ఇక రాజస్థాన్‌ లో చూస్తే కాంగ్రెస్‌ పార్టీ మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌, పిసిసి అధ్యక్షుడు సచిన్‌పైలట్ల వ్యూహంతోనే ముందుకువెళ్లింది. ఫలితాలు సానుకూలంగా సాధించుకో గలిగింది.

ఇక ఈ కీలక ఎన్నికల్లో మహామహులుసైతం పరాజయం పాలయ్యారు. మిజోరమ్‌పరంగా మాజీ ముఖ్యమంత్రి లాల్‌తన్హవాలా ఓటమి చవిచూసారు. రాజ స్థాన్‌లోచూస్తే లోక్‌సభ బార్మర్‌ ఎంపి కల్నల్‌ సోనారామ్‌ చౌదరి, పచ్‌పద్రా నియోజకవర్గంలో పోటీకి దిగిన రెవె న్యూ మంత్రులుసైతం ఘోరంగా ఓడిపోయారు.

పార్టీల బలాబలాలకంటే ఆయారాష్ట్రాల్లో ఉన్న స్థానికసమస్యలు, అంతర్గత కుమ్ములాటలు, ప్రభుత్వాలపై ఉన్న వ్యతిరేకత లతోపాటు కేంద్రం పరంగా తెచ్చిన కొంత అనిశ్చితిసైతం ఐదు రాష్ట్రాల ఎన్నికలకు కీలకమయ్యాయి.

– దామెర్ల సాయిబాబ, ఎడిటర్‌, హైదరాబాద్‌

 

======