జయలలిత వారసులెవరో?

రాష్ట్రం: తమిళనాడు

 

This slideshow requires JavaScript.

జయలలిత వారసులెవరో?

దక్షిణాదిన అతిపెద్ద రాష్ట్ర మైన తమిళనాడులో ప్రస్తుతం పరిస్థితి ప్ర శాంతంగానే ఉన్నా ము న్ముందు ఎలాంటిరాజకీయ సంక్షోభా లు తలెత్తుతాయో చెప్పలేని పరిస్థితి నెలకొన్నది. తమిళప్రజల ఆరాధ్యదై వంగా అమ్మగా దేశంలోఎవరూ పొం దని ఆదరణ పొందిన జయలలిత 74రోజులపాటు మృత్యువ్ఞతో పోరా డి చివరకు డిసెంబరు ఐదో తేదీన తుదిశ్వాస విడిచిన తర్వాతరాజకీయ అనిశ్చితి ఏర్పడి నా దాన్ని కన్పించకుండా చేయడంలో ప్రస్తుతానికి ఎఐడిఎంకె నేతలు కృతకృతులయ్యారు. జయలలిత మరణ అంపశయ్యపై ఉండగానే ఆమె వారసత్వం కోసం తెరవెనుక తీవ్రపోరు సాగింది. చివరకు ఎఐడి ఎంకె ఎమ్మెల్యేలు ఆపోలో ఆస్పత్రినేరాజకీయ మంత నాలకు కేంద్రంగా చేసుకొన్నారు. ఆమె నెచ్చెలి, అమ్మ కోసం నిరంతరం నీడగా ఉన్న వికె శశికళ జయలలిత అసలైన వారసురాలిగా చనిపోగానే తెరపైకి వస్తారని అంతాఊహించారు.కానీ జయలలిత మరణం తదనం తరం ప్రజలంతా శోకసంద్రంలో ఉన్నప్పుడు ఆమె చనిపోయిన వెంటనే ముఖ్యమంత్రి పదవిని తీసుకో వడానికి శశికళ నిరాకరించారు.పైగా జయలలితతో పాటు శశికళపై కూడా సుప్రీంకోర్టులో కేసు ఉంది.

ఈకేసు తుదితీర్పు వస్తే తప్ప న్యాయపరంగా శశి కళ కు చిక్కులుతొలగవ్ఞ.మరోవైపు పార్టీఎమ్మెల్యేల నుంచి తిరుగుబాటు రాకుండా ఉండడానికి శశికళ వెంటనే వారసురాలిగా తెరపైకి రావడానికి ముందుకురాలేదు. కొంతకాలం పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతాన నిఆమె ఎమ్మెల్యేలసమావేశంలో చెప్పారు.దీనికి మెజా రిటీ ఎమ్మెల్యేలు అంగీకరించారు.మధ్యేమార్గంగా ప న్నీరు సెల్వమ్‌ను ముఖ్యమంత్రిగా మూడోసారి నియ మించడానికి అందరిమధ్య ఏకాభిప్రాయం కుదిరింది. అమ్మ బతికి ఉన్నప్పుడు ఆమె సంక్షోభసమయం లో రెండుసార్లు సెల్వమ్‌నే ముఖ్యమంత్రిగా కొనసా గారు.సెల్వం జయలలితకు అత్యంతవిధేయుడు. ఇంకా చెప్పాలంటే నమ్మినబంటు.అలాంటి సెల్వంను పక్కన పెడితే జయలలిత మనోభావాలను దెబ్బతీసి నట్లే. ఇదిప్రజల్లో వ్యతిరేకతకు దారితీస్తుంది. అట్లా గని జయలలిత తనవారసులెవరో బహిరంగంగా ప్రక టించలేదు.దీంతో సెల్వమ్‌ ముఖ్యమంత్రిగా అర్థరాత్రి పదవీబాధ్యతలు స్వీకరించారు. కానీ రెండు రోజులకే శశికళ శిబిరంలో సీన్‌ మారింది. ముందుగా ప్రధాన కార్యదర్శి పదవికి అంగీకరించి తెరవెనుకనే ఉండడా నికిసై చెప్పిన శశికళ ప్రస్తుతం జయలలిత వారసు రాలిగా ఆమె నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ముందుకు రావడంతో తిరిగివారసత్వపు పోరు తెర పైకి వచ్చింది. జయలలిత నియోజకవర్గం నుంచి గెలి చిన తర్వాత తిరిగి శశికళ ముఖ్యమంత్రి పదవిని చేప డతారనే ప్రచారం సాగుతున్నది.

ఇదిసహజంగానే సె ల్వంవర్గానికి ఇరకాటంగా మారింది.జయలలిత ఉన్న ప్పుడు ఆమె కనుచూపుల్లోనే పార్టీ ప్రభుత్వం నడి చింది.ఆమెను కాదని ఏఒక్కరూ ముందుకు వెళ్లేవారు కాదు. కానీ జయలలిత తర్వాత కూడా అంతటిపట్టు చిన్నమ్మగా పేరుపొందిన శశికళకు ఉంటుందా? అమ్మ కు ఇచ్చిన గౌరవం చిన్నమ్మకుఇస్తారా?సెల్వం ముఖ్య మంత్రిగా సాగుతారా?పార్టీలో ఏమైనా చీలికలు వస్తా యా? అన్నదే ఇప్పుడు తమిళనాట హాట్‌ టాపిక్‌గా మారింది. మరోవైపు జయలలిత మిగిల్చిన రాజకీయ శూన్యాన్ని భర్తీ చేయడానికి బిజెపి ఆరాటపడుతు న్నది. ఇంకోవైపు జయలలిత లేని ప్రస్తుత పరిస్థితు ల్లో మరోసారి అధి కారం చేపట్టడానికి ఆమె చిరకాల ప్రత్యర్థిపార్టీ డిఎంకె తెరవెనుక సన్నాహాలు చేస్తున్న ది. తమిళనాడులో ప్రస్తుతానికి ఏఐడిఎంకెకు స్పష్ట మైన మెజారిటీనే ఉన్నది. మొత్తం 234 స్థానాలకు 2016లో ఎన్నికలు జరిగితే 1984 తర్వాత ఒకేపార్టీ అదీ ఎఐడిఎంకె రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. ఇది తమిళనాట రికార్డే. జయలలిత తన అమ్మ పథ కాల ద్వారా రెండోసారి విజయవంతంగా అధికారం లోకి రాగలిగారు. కానీ మునుపటిలా రికార్డుస్థాయి మెజారిటీరాలేదు. మొత్తం 234 స్థానాల్లో రావలసిన మెజారిటీ 118 అయితే ఏఐడిఎంకెకి 136 స్థానాలు వచ్చాయి. డిఎంకెకు 98స్థానాలొచ్చాయి. కాంగ్రెస్‌కు ఎనిమిదిసీట్లే దక్కాయి. డిఎంకెకు ఏఐడిఎంకెకు సీట్ల తేడా 38 ఉన్నా ఓట్ల శాతం మాత్రం ఒక్కశాతమే.

ఈ ఒక్కశాతమే జయలలి తను అధికారంలోకి తీసుకురా గలిగింది.లోక్‌సభఎన్నికల్లో జయలలిత మొత్తం 39 సీట్లకు 37 సీట్లను గెలుచుకొని రికార్డు సృష్టించారు. దీంతో జయలలితకు ఇక తిరుగులేదని అంతా భావిం చారు. కానీ ఆకస్మాత్తుగా ఆమె అనారోగ్యానికి గురికా వడం అది చివరకు చావ్ఞకు దారితీయడంతో ఇప్పుడు ఆమెకు ప్రత్యామ్నాయం లేదా అసలైన వారసులెవరు అనేదే చర్చనీయాంశంగా మిగిలింది.పార్టీలో చీలిక తీసుకు వచ్చి అధికారంలోకి డిఎంకె రావాలంటే 20 మంది ఎమ్మెల్యేలు ఫిరాయింపు చేయాలి. అది ఇప్ప ట్లో జరగదు. వారసత్వంకోసం పోరుతీవ్రమై పార్టీల్లో సహ జంగా చీలిక వస్తే అప్పుడు డిఎంకె రంగంలోకి దిగవచ్చు.లేదా తమిళనాడుపైపట్టుకోసం బిజెపి రాష్ట్ర పతి,గవర్నర్‌, స్పీకర్లతో రాజకీయ గేమ్‌ను ఆడవచ్చు. అయితే మున్ముందుపరిస్థితులెలా ఉంటాయి.?సెల్వం ఎంతకాలం కొనసాగుతారో?పార్టీ ఎంతకాలం పటిష్టం గాఉంటుందన్న దానిపైనే తమిళనాడు రాజకీయాలు ఇతరపార్టీల భవిష్యత్తు ఆధారపడిఉంది. ఇప్పటిదాకా తమిళనాడుపై ద్రవిడపార్టీల పట్టునేఉంది.ఇకపై బిజె పి, కాంగ్రెస్‌, అక్కడి ప్రాంతీయ పార్టీలు జయలలిత మిగిల్చిన శూన్యంతో ప్రధానపార్టీలుగా అధికారం చేప ట్టేందుకు తెరవెనుక సన్నాహాలు చేస్తున్నాయి.

మిట్టపల్లి శ్రీనివాస్‌