మరో సంక్షోభం

దేశం: ఇటలీ

Matteo
Matteo

మరో సంక్షోభం

ఇటలీలో కొత్త సంక్షోభం తొంగిచూసింది. పాలక వర్గం ఒకటనుకొంటే మరొకటి జరిగింది. రాజ్యాంగ సంస్కరణలపై జరిగిన రిఫరెండాన్ని ప్రజలు తిరస్కరించడంతో ప్రధాని మాటియోరెంజీ రాజీనామా చేయడం రాజకీయ సంక్షోభానికి కూడా దారి తీసింది. ఇలాంటి రాజకీయ సంక్షో భాలు ఇటలీకి కొత్తవి కాకపోయినా, రిఫరెండం వీగిపోయిన కారణంగా ప్రధాని రాజీనామా చేయడం ఇదే మొదటిసారి. రాజ్యాంగాన్ని సవరించి కొన్ని విప్లవా త్మక సంస్కరణలు చేయాలని ఏడాదిగా రెంజీ భావి స్తున్నప్పటికి గత ఆదివారం(4,డిసెంబరు) ముందుగా ప్రజాభిప్రాయం తెలుసుకొనడానికి రిఫరెండం నిర్వ హించారు. దానిలోని అంశాలకు ప్రజలలో 59.5 శాతం మంది ‘నో చెప్పడంతో రెంజీవర్గం ఓడిపోయి నట్లయింది. దీనితో తనకు ఇక అధికారంలో కొనసాగే అవసరం లేదంటూ రెంజీ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. దేశం ప్రస్తుతం ఆర్థిక సంక్షోభాన్ని కూడా ఎదుర్కొంటూండడంతో దానికితోడు రాజకీయ సంక్షోభం కూడా నెత్తినపడడంతో దేశభవిష్యత్తు ప్రజలకు అగమ్యగోచరంలా కనిపిస్తోంది. రెంజీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలే గడిచాయి.ఆయన పదవిలోకి వచ్చింది కూడా ఒబామా మాదిరిగా ‘మార్పు నినాదంతోనే.

దేశంలో రాజకీయ సంస్కరణలు జరగాలనే ఆలోచన మేధావివర్గంలో చాలాకాలం నుంచి ఉన్నా, రాజకీయరంగా నేతలలో దృఢసంకల్పం లేకపోవడంతో ఆ ప్రతిపాదనలు ప్రకటనలకే పరిమితమవ్ఞతూ వచ్చాయి. అధికార డెమొక్రటిక్‌ పార్టీలో అతివాద నాయకునిగా పేరున్న రెంజీ ప్రధాని పదవిని అధిష్టించడమే ఒక పెద్ద ‘మార్పు అనుకొంటే ఆయన జరిపించిన రిఫరెండం అంతకంటె పెద్ద ‘మార్పుగా భావించాలి. యువతలో ఆశలు పెంచే అనేకానేక కార్యక్రమాలను గత రెండేళ్లుగా అనేకం ప్రవేశపెట్టిన రెంజీ గత అయిదారు దశాబ్దాలుగా రాజకీయ అధికార విభాగాలలో రాని మార్పులు కొత్తగా ప్రతిపాదించగానే మిశ్రమ స్పందన వెలువడడంతో ఏకపక్షంగా నిర్ణయం తీసుకొనకుండా రిఫరెండం జరిపించారు. ఇటలీ పార్లమెంటులోని దిగువ సభకు అధికారాలు పెంచి ఎగువ సభను లాంఛనప్రాయం చేయాలనే రెంజీ ఆలోచనకు రాజకీయవర్గాలు తొలుత స్వాగతం పలికినా, ప్రజలు తగిన మద్దతు ఇవ్వలేకపోయారు. ఇప్పటిదాకా సమానఅధికారాలు ఉన్నపార్లమెంటు ఉభయసభలలో దిగువసభకు ఎక్కువ ప్రాధాన్యం కలిగించాలన్నది రెంజీ ప్రతిపాదన.

దిగువసభలో ఏ పార్టీకైనా ఎక్కువ ఓట్లు లభిస్తే దానిని మెజా రిటీ ఉన్న పార్టీగా ప్రకటిం చడానికి 54 శాతం సీట్లు ఇచ్చే విధంగా రాజ్యాంగా న్ని సవరించాలన్నది రెంజీ ప్రతిపాదనల్లో ముఖ్యంగా ఉంది. ఇప్పటి దాకా వివిధ ప్రాంతాలకు చెందిన సభ్యులు ఎగువ సభలోఎక్కువ ప్రాధాన్యం కలిగి ఉన్నారు. దానిని దిగువ సభకు మార్చాలన్నది రెంజీ సంకల్పం.అందుకు తగినట్లుగా అనేక రాజ్యాంగ సంస్కరణలను రెంజీ ప్రతిపాదించారు. సెనెట్‌గా పిలిచే ఎగువ సభ సీట్లను 100కు తగ్గించాలనీ, ఆ మేరకు దిగువ సభకు సీట్లు పెంచి ప్రధానిని ఆ సభ నుంచే ఎన్నుకోవాలనీ రెంజీ ప్రతిపాదించారు.

ఆయన ఈ సంస్కరణలు ప్రతిపాదించడానికి ఆర్థిక కారణాలు కూడా కొన్ని ఉన్నాయి. ఇటలీ బ్యాంకింగ్‌ వ్యవస్థ దివాలా తీసేస్థితికి దిగజారడం వాటిలో ముఖ్య కార ణం. ప్రభుత్వరుణాలు ఇటీవల అనేక రెట్లు పెరిగి పోవడం కూడా మరో ప్రధాన కారణం. ప్రభుత్వ రుణం స్థూల జాతీయ ఉత్పత్తి (జిడిపి)లో 133 శాతా నికి పెరిగిపోవడంతో యూరోజోన్‌ దేశాల్లో ఇటలీ అతిపెద్ద రుణపీడిత దేశంలా మారిపోయింది. యూరో పియన్‌ యూనియన్‌ ఆరంభించిన పొదుపు చర్యలు, ద్రవ్యనియంత్రణ ఫలితంగా బ్యాంకులు సైతం నగదు లేక సంక్షోభంలో చిక్కుకొన్నాయి. ఫలితంగా మొత్తం ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తుండడంతో కొన్ని స్థిరమైన నిర్ణ యాలు తీసుకొనడానికి వీలుగా రెంజీ ఎన్నికల సంస్క రణలను ప్రతిపాదించారు. దాదాపు నాలుగు వేలకోట్ల యూరోలను బ్యాంకులకు బెయిలవ్ఞట్‌గా ప్రకటించి ఆర్థిక వ్యవస్థను ఆదుకోవాలని భావించిన రెంజీ ప్రభు త్వం దిగువసభ ప్రాధాన్యాన్ని పెంచడానికి చర్యలు ఆరంభించింది. ఎగువసభ నుంచి ఈ ప్రతిపాదనలకు తగిన మద్దతు లభించకపోవడంతో దిగువసభ ప్రా ధాన్యాన్ని పెంచితద్వారా తన ప్రతిపాదనలను అమలు చేయాలని రెంజీ భావించారు.అయితే అది రిఫరెండం దశలోనే వీగిపోవడంతో ఆర్థికసంక్షోభంతో పాటు రాజకీయ సంక్షోభం కూడా ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఈ కారణంగా రెంజీ ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో అదే పార్టీకి చెందిన మరొకరిని ప్రధానిని చేయడమో, లేక తాజాగా ఎన్నికలు జరిపించడమో చేయవలసి ఉంది. అయితే తర్వాతైనా ఇవే సమస్యలు కొత్త ప్రభుత్వం మెడకు చుట్టుకొంటాయి
గనుక అధ్య క్షుడు ఆచితూచి వ్యవహరించవలసి ఉంది. ప్రస్తుత రిఫరెండం ప్రకారం చూస్తే ఎన్నికలు జరిగిన పక్షంలో డెమొక్రటిక్‌ పార్టీ తిరిగి విజయం సాధించదనే అని పిస్తుంది. రిఫరెండంలోని అంశాలను వ్యతిరేకించిన గ్రిల్లె నాయకత్వంలోని ఫైవ్‌స్టార్‌ పార్టీకి అనుకూల ఫలితం లభిస్తే మొత్తం వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చే ప్రమాదం ఉంది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్ల వ్యవధి ఉన్నందున అప్పటి దాకా డెమొక్రటిక్‌ పార్టీకి చెందిన మరోనేతకు అధికారం అప్పగించినా, అతడు కూడా, సంస్కరణలు చేపట్టే అవకాశం లేకపో వడంతో వ్యవస్థలో ‘మార్పునకు ఇప్పట్లో పరిస్థితులు అనుకూలించవనే అనిపిస్తుంది. ఈ స్థితిలో ఇటలీలో ఆర్థిక, రాజకీయ సంక్షోభాలు మరికొంత కాలం కొన సాగే సూచనలే కనిపిస్తున్నాయి. దేశ ప్రయోజనాల దృష్ట్యా అధ్యక్షుడు మటరెల్లా సరైన నిర్ణయం తీసు కొంటేనే సంక్షోభం సద్దుమణుగుతుంది.

-ఎ.వి.వి. ప్రసాద్‌