సైన్యం వేదన అరణ్యరోదనేనా?

Food
Food

సైన్యం వేదన అరణ్యరోదనేనా?

ఎముకలు కొరికే చలిలో కాశ్మీర్‌ మంచుగడ్డలపై రోజు కు 12 గంటలపాటు నిల్చొని నిముషమైనా రెప్ప వాల్చకుండా దేశ సరిహద్దుల వద్ద కాపలాకాయడం చిన్న విషయం కాదు. కుటుంబ మమతానురాగాలకు దూరంగా దేశభక్తే శక్తిగా సత్తువ కూడదీసుకుని కాపలా కాస్తున్న వీరసైనికులు ఎటువంటి తిండి తింటున్నారో ఎంతటి దుర్భర పరిస్థితుల్లో విధుల ను నిర్వర్తిస్తున్నారో తేజ్‌బహుదూర్‌ అనే జవాన్‌ విడుదల చేసిన వీడియో కొన్ని లక్షల మందికి ప్రత్యక్ష సాక్ష్యాలతో సంచలనం కలి గించింది. కొద్ది సమయంలోనే కొన్ని లక్షల మంది అంటే దాదాపు 60 లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు. తేజ్‌బహుదూర్‌ యాదవ్‌దిఒక్కటే కాదు మరో మూడు వీడియోలు విడుదల అయ్యా యి.

సిఆర్‌పిఎఫ్‌ కానిస్టేబుల్‌ జీత్‌సింగ్‌, మరో జవాన్‌ లాన్స్‌ నాయక్‌ యజ్ఞప్రతాప్‌సింగ్‌, వీడియోలు ఆమూడింటిలో ఉన్నాయి. ఇదే సమయంలో బిఎస్‌ఎఫ్‌ (సరిహద్దు భద్రతా దళం)కు చెందిన మరో జవాన్‌ తమ విధుల తీరుతెన్నులు ఎలా ఉన్నాయో వివరిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు నేరుగా లేఖ రాశారు. బీహర్‌లోని ఔరంగాబాద్‌లో పారిశ్రామిక భద్రతాదళం (సిటిఎస్‌ఎఫ్‌) కు చెందిన బల్వీర్‌ సింగ్‌ అనే కానిస్టేబుల్‌ తనకు సెలవ్ఞ దొరక లేదన్న ఆగ్రహావేశాలతో అధికారులపై తిరుగుబాటు చేసి జనవరి 12 (గురువారం)న నలుగురు సీనియర్‌ అధికారులను కాల్చి చంపా డు. ఈ సంఘటలన్నీ విశ్లేషిస్తే జవాన్ల కేటగిరిస్థాయిలు, విధులు పరిధులు కాస్త వేర్వేరుగా ఉన్నా ప్రధాన విధి రక్షణ కల్పించడం. ఈ రక్షణ వ్యవస్థలోని లోపాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ బయట పడుతూ సంచలనం కలిగిస్తున్నాయి.

రక్షణ వ్యవస్థలోని ఆయుధాలు,విమానాల నుంచి ఎన్నో కావల సిన సామాగ్రి కొనుగోలు వరకు అవినీతి, లంచగొండితనం చాప కింద నీరులా సాగుతూ కొన్ని కోట్ల రూపాయలకు గండికొడుతు న్నాయి. ఇప్పుడు సరిహద్దును కాపలా కాసే వీరసైనికులకు తిండి పెట్టే విషయంలోనూ ఎంతో ‘కక్కుర్తి జరగడం సిగ్గుచేటు. తిండి కలిగితె కండ గలదో§్‌ు, కండగలవాడె మనిషోయే అని ఏనాడో మహాకవి గురజాడ ప్రబోధించారు. కనీసం తిండి లేకుంటే జవాన్లు అన్ని గంటలు ఎలా నిల్చొని సరిహద్దులను భరించలేని వాతావర ణంలో కాపలా కాయగలరో ఆలోచించాలి. నాణ్యత లేని ఆహారం ఇస్తున్నారని, కొన్ని సందర్భాలలో పస్తులతోనే నిద్రపోతు న్నామని, పొద్దున్నే ఒకరోటీ,కాస్తంతటీ,మధ్యాహ్నభోజనంగా కాస్తంత ఉప్పు, పసుపు వేసి ఉడకబెట్టిన నీళ్లపప్పు ఇస్తున్నారని తేజ్‌బహుదూర్‌ యాదవ్‌ తన వీడియోద్వారా వివరించారు.దీనికి సాక్ష్యంగా వండిన పదార్థాలను కూడా వీడియోలో చిత్రీకరించాడు. తేజ్‌బహుదూర్‌ ఈ తప్పుప్రభుత్వంపై నెట్టలేదు.ప్రభుత్వం తమకు కావలసినంత ఆహా రం సరఫరా చేస్తోందని, అయితే కొందరు ఉన్నతాధికారులు కక్కుర్తి పడి సరుకులు అమ్ముకంటున్నందునే తమకు తిండిలోటు ఏర్పడిం దని ఆరోపించాడు.

దీనిపై దర్యాప్తు జరపాలని డిమాండ్‌ చేశాడు. మరో బిఎస్‌ఎఫ్‌ జవాన్‌ కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు రాసిన 9పేజీల లేఖలో ఎన్ని గంటలు ఎక్కువ పని చేయిస్తున్నారో, ఎలాంటి దుస్తులు తొడిగిస్తున్నారో, ఎలాంటి వసతి కల్పిస్తున్నారో కళ్లకు కట్టినట్టు వివరించాడు. మొత్తంమీద వెట్టిచాకిరీ చేసే బాని సలుగా చూస్తున్నట్టు తన ఆవేదన వెలిబుచ్చాడు.ఈ సంఘటనలకు కేంద్రహోంశాఖ సహాయమంత్రి రిలిజు మొదలుకొని ప్రధాని వరకూ అనిస్థాయిల్లో స్పందన కనిపించింది కానీ భద్రతా,రక్షణ వ్యవస్థలకు చెందిన బాధ్యులైన ఉన్నతాధికారులు మాత్రం వ్యవస్థలోని లోపాల కు పశ్చాత్తాపం పడడంలేదు.పైగావీడియోలు బయటపెట్టిన జవాన్ల వ్యక్తిగత లోపాలను తెరమీదకు తెచ్చి వాస్తవాలకు లొసుగుల ము సుగులు కప్పుతున్నారు. బిఎస్‌ఎఫ్‌ ఐజి ఉపాధ్యయ మీడియాకు ఇచ్చిన వివరణలో తేజ్‌ బహుదూర్‌ అవలక్షణాలను వెల్లడించారు. అధికా రుల్లో ఎక్కడా అవినీతి లేదని కితాబు ఇస్తున్నారు.ఎక్కడా ఎలాంటి అవినీతి జరగనప్పుడు నాసిరకం తిండి ఎందుకు పెడుతు న్నారంటే శీతాకాలం కావడంతో ఆహారంలో రుచి ఉండదని సాకు చూపిస్తున్నారు.పైగా ఫిర్యాదుదారుడు క్రమశిక్షణలేని వ్యక్తిగా ముద్ర వేశారు.

సైనికులకు దేశభక్తి, క్రమశిక్షణ ఈ రెండూ కళ్లువంటివి. దాన్నెవరూ కాదనలేరు.అయినంత మాత్రాన జరుగుతున్న అన్యా యాలు,అవకతవకలు మౌనంగా ఎన్నాళ్లు భరిస్తారు? దేశభక్తి ఉండ బట్టే గతకొన్నేళ్లుగా తేజ్‌ బహుదూర్‌ యాదవ్‌ సరిహద్దు కాపలా కాస్తున్నారు. క్రమశిక్షణ ఉండబట్టే పస్తులుంటున్నా ఎవరిపై తిరుగు బాటు చేయలేదు. ఈ వాస్తవాలను సైనిక యంత్రాంగం విస్మ రిస్తోంది. బెటాలియన్‌లో మిగతా వారంతా ఆనందంగానే ఉన్నా రని, వారం క్రితమే కొందరు ఉన్నతాధికారులు ఆ బెటాలియన్‌ దగ్గరకు వెళ్లి పరిశీలించినప్పుడు తిండి ఇలా ఉందని ఎవరూ ఫిర్యాదు చేయలేదని ఐజి వంక చూపెడుతున్నారు. మిగతా వారు ఫిర్యాదు చేయడానికి భయపడి ఉండవచ్చు.

అంతమాత్రాన అంతా సుభిక్షంగా ఉందని సమర్థించుకోవడం హాస్యాస్పదం. ఫిర్యాదు చేసిన వ్యక్తులపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నంత మాత్రాన వ్యవస్థ ప్రక్షాళనకాదు. ప్రభుత్వ యంత్రాంగం దీనిపై ఆత్మపరిశీలన చేసు కోవాలి. వీరజవాన్లకు నాసిరకం తిండి ఎందుకు పెట్టాల్సివచ్చిందో పరిశీలించాలి. సరిహద్దు కాపలా విధులేకాక ఇతర పనులు ఉన్నతా ధికారులు చేయిస్తూ వెట్టిచాకిరీ చేయించడం ఎంతవరకు సబబు? దీనికి జవాబు ఎక్కడ? మావోయిస్టుల ప్రాంతాల్లోకి వెళ్లి మావోయి స్టులపై దాడులకు సహకరించడానికి గత కొన్నేళ్లుగా కేంద్ర బలగా లను ప్రత్యేకించి పంపించడం పరిపాటిగా వస్తోంది. అప్పటి నుంచి కేంద్ర సైనిక బలగాల నుంచి ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. ఆ ఫిర్యాదులను ఉన్నతాధికార యంత్రాంగం బయటకు రాకుండా కప్పివేస్తున్నా అవి ఎలాగోలా పొరుగున ఉన్న పాకిస్థాన్‌ వంటి శత్రు దేశాలకు చేరుతున్నాయి. మనదేశంలోని రక్షణశాఖలో బలహీన తలను ఆయా దేశాలు అవసరం వచ్చినప్పుడే వాడుకొంటున్నాయి.

చత్తీస్‌గఢ్‌లో ఇటీవలనే ఒక సంఘటన జరిగింది. డిప్యూటీ కమాండెంట్‌తోసహా ముగ్గురు సిఆర్‌పిఎఫ్‌ జవాన్లు నెత్తుటి గాయా లతో సహాయం కోసం ఎంత మొత్తుకున్నా మిగతా సైనిక బృందా లు వారిని ఆదుకోకుండానే విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఈ రోదన మూడు వీడియోలుగా బయటకు వచ్చాయి. మామూలు బస్సులో తరలిస్తున్న ఆ డిప్యూటీ కమాండెంటు సహాయం కోసం బిగ్గరగా అరుస్తూ తనకు ఇద్దరు పిల్లలున్నారని తాను చనిపోతే తన పిల్లలకు దిక్కెవరని ప్రశ్నించాడు.ఈ వీడియో కల్పితమో,వాస్తవమో నిర్ధా రించే ముందు వాస్తవంగా కొన్ని పరిస్థితులు అలాగే కొనసాగుతు న్నాయి.సిఎపిఎఫ్‌ బలగాలకు వైద్యసదుపాయాలు అదనుకు మరీ ముఖ్యంగా ఆపదల్లో సమ కూరడం లేదు. పారామిలిటరీ దళాలు సైన్యంలాగా అన్ని పనులూ చేయవలసి వస్తోంది. మావోయిస్టులతో ప్రాణాలకు తెగించి పోరా డవలసి వస్తోంది. సైన్యానికి ఉండే వైద్య సదుపాయాలు పారా మిలిటరీ దళాలకు ఉండడం లేదు. గత రెండు దశాబ్దాల్లో సిఆర్‌పిఎఫ్‌ బలగాలు భారీ ఎత్తున విస్తరించాయి.

సిఆర్‌పిఎఫ్‌,బిఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎస్‌బి (సశస్త్రసీమాచల్‌), ఐటిబిపి (ఇండో టిబెటక్‌ బోర్డర్‌ పోలీస్‌), సిఐఎస్‌ఎఫ్‌ ఇవన్నీ కలిపి 10 లక్షలకు పైగా పెరిగాయి. విమానాశ్రయాలతో సహా పారిశ్రామి కసంస్థలకు కాపలా ఉండేది సిఐఎస్‌ఎఫ్‌లే. ఈ సాయుధ బల గాలు రక్షణశాఖ కిందగాక, హోంశాఖ పరిధిలో ఉన్నాయి. సైనికుల తో పాటు ఈ బలగాలన్నిటినీ సమానంగా అజమాయిషీ చేసేలా సంస్కరణలు ప్రవేశపెట్టడం అవసరం.వేతనాల్లో విధుల అప్పగింత ల్లో హోదాల కల్పనలో పక్షపాతంలేకుండా సమానత్వం చూపించా లి.అందరికీ భోజన వసతి సౌకర్యాలు, ఇతర రాయితీలు సమానం గా కల్పిస్తే ఎలాంటి అసంతృప్తి ఉండదు. ఫిర్యాదులు రావ్ఞ. బిఎస్‌ ఎఫ్‌లో పన్నెండేళ్ల క్రితం 2 లక్షల మంది ఉండేవారు. ఇప్పుడు 2.5 లక్షలమంది వరకు ఉన్నారు. సిఆర్‌పిఎఫ్‌లో ఇదివరకు 2,30,000 మంది ఉంటే ఇప్పుడు మూడు లక్షలకు మించి ఉన్నా రు. ఈ రెండు బలగాల్లో విధులు ఒకేలా ఉన్నా వెసులుబాట్లలో తేడా కనిపిస్తోంది. ఏడాదికోసారి నిర్దిష్టకాల పరిమితిలో కొత్తచోటుకు తరలించడం,

సుదీర్ఘకాలం సెలవువంటి వెసులుబాటు ఆర్మీలో ఉంటాయి. కానీ బిఎస్‌ఎఫ్‌, సిఆర్‌పిఎఫ్‌లో అలాంటి వెసులుబాట్లు ఉండవ్ఞ. అందువల్లనే బలగాల్లో తీరనిఅసంతృప్తి పేరుకుపోతోంది. ఈ పరిస్థితి కొనసాగకుండా ప్రభుత్వం తక్షణం పరిష్కారమార్గాలను చేపట్టడం అవసరం. అంతేకాని ఫిర్యాదులు చేసిన వారిని క్రమశిక్షణ పేరుతో అణగతొక్కడానికి ప్రయత్నించకూడదు. దేశానికి రక్షణ కల్పించేది వీరజవాన్లే. వారిలో విశ్వాసాన్ని పాదుకొల్పకపోతే దేశరక్షణే ప్రమా దంలో పడుతుంది. తస్మాత్‌ జాగ్రత్త.

– పెట్ల వెంకటేశం