సామాజిక తెలంగాణవైపు కెసిఆర్‌ ముందడుగు

KCR
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌

సామాజిక తెలంగాణవైపు కెసిఆర్‌ ముందడుగు

సమాజంలో అత్యంత అట్టడుగుకులాలకు చెందిన రజక, నాయీబ్రాహ్మణ, మాదిగ తదితర కులాలకు చెందిన వారికి ఎమ్మెల్యే టికెట్లిచ్చి బహుజన సమాజ్‌ పార్టీ తరపున గెలిపించి వారిని ఉత్తరప్రదేశ్‌ సెక్రటేరియట్‌కు తీసు కువస్తాడు కాన్షీరాం. అప్పుడే ఎర్రబస్సు దిగిన పల్లెటూరి మను షుల్లా ప్రవర్తిస్తున్న ప్రజా ప్రతినిదుల మీద ఆనాటి మీడియా చిత్ర విచిత్రంగా వార్తా కథనా లు ప్రసారం చేసింది.

తిరిగి అదే పరిస్థితి తెలంగాణ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో కన్పిస్తున్నది. తమకు అనుకూలంగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని సంతోషిస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను అభినం దించడానికి యాదవ గొల్ల కురుమ బెస్త ముదిరాజ్‌ రజక, నాయీబ్రాహ్మణ తదితర బీసీ ఎంబీసీ కులాలకు చెందిన సామాన్యులు ప్రగతిభవన్‌ కు బయలుదేరిన ఫొటోలు, అభినందిస్తున్న వీడియోలు నేటి తాజా వార్తలుగా నిలిచి పోతున్నాయి.
అలా ఉత్పత్తి కులాలకు చేయూత నివ్వడమే ధ్యేయంగా ముందడుగు వేస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్‌ కులం మతం అనే విషయంలో ఏనాడు బేషజాలకు గానీ హిపోక్ర సీకి గాని గురికాలేదు. తాను హిందూమతస్తున్ని కనుక ఇతర మతాలను తక్కువ చేయాలని చూడడమో ఇతర మతాల మీద ద్వేషాన్ని కక్కడమో ఏనాడూ చేయలేదు. మతం తర్వాత ఈ దేశంలో రెండో సామాజిక వాస్తవం కులం. కులం వాస్తవమని విశ్వశించి ఆ పేరు తోనే బడ్జెట్‌ కేటాయించిన భారతదేశ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్‌. తెలంగాణ సమాజమంటేనే తొంభై శాతం జనాభా కలిగిన దళిత బహుజన సమాజం అని పలుమార్లు ప్రకటించిన ముఖ్యమంత్రి ఆదర్శవంతమైన పాలనతో సబ్బండ కులాలకు స్వయంపాలన ఫలాలను పంచుతున్నారు.

ఆయా కుల సమూహాలను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసి కులాల నడుమనున్న ఆధిపత్య భావనను నిర్మూలించి తద్వారా వర్ణ నిర్మూలనకు బాటలు వేస్తున్నారు. ఇది నిజంగా అంబేద్కర్‌ ఆశయ సాధనే. దళితులం బహుజనులం అని చెప్పుకునే ఆయా కుల సంఘాల నాయకత్వం చేయాల్సిన అసలు పనిని డీ కాస్టిఫై అయిన అగ్రకులానికి చెందిన పాలకుడుగా కెసిఆర్‌ చేపట్టడమంటే వర్ణ నిర్మూలన పోరాటం దిశగా ఒక చారిత్రాత్మక పరిమాణం అని చెప్ప వచ్చు. అందులో భాగమే 2017-18 బడ్జెట్‌. ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కుల వృత్తులకు చేయూత అనే సామాజికాంశం వర్తమాన రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కులాల వారిగా సమా జాన్ని విభజించి వృత్తులను ప్రోత్సహించ డం సరికాదనే వాదనను కొంత మంది మేధావ్ఞలు ముందుకు తెస్తున్నారు. కానీ అది అవగాహనారాహిత్యమనే విషయం పైన చెప్పిన విశ్లేషణ ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో బిసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీల కోసం కేసిఆర్‌ అనుసరిస్తున్న పరిపాలనా పరమైన కార్యాచరణ అభివృద్ధి సంక్షేమ పథకాల్లో అమలుపరుస్తున్న విధానాలు భారత రాజకీయచరిత్రలో విప్లవాత్మకంగామారి సువర్ణాధ్యాయాన్ని లిఖించ నున్నాయి. కులం ఈ దేశంలో ఇంకా కొనసాగాలా అన్న ప్రశ్నకు సైద్ధాంతిక చర్చ జరగాలి. కుల వృత్తులు పోకుండా కులం పోదు కాబట్టి కుల నిర్మూలన జరగాలంటే కుల వృత్తులు కనుమరుగుయి పోవాలనే ఒక అభ్యుదయవాద చర్చ ముందుకు వచ్చింది.
ఈ చర్చ కూడా సరిగ్గా ఆర్థిక సరళీకృత విధానాలు దేశంలోకి అమలులోకి వచ్చిన 90లల్లో ఊపందుకోవడం యాధృచ్ఛికం కాదా అనే విశ్లేషించాలి. అసలు జరగాల్సింది కుల నిర్మూలనా? లేక కులాల నడుమ అంత రాలను వివక్షను చిన్న పెద్ద తేడాలను తెలిపే వర్ణ నిర్మూలనా? అనే అంశం మీద బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ చాలా స్పష్టమైన వివరణ ఇచ్చారు. అంబేద్కర్‌ రాసిన ఆన్‌హిలేషన్‌ ఆఫ్‌ క్యాస్ట్‌ అనే గ్రంధాన్ని తెలుగులోకి కుల నిర్మూలన పేరుతో అనువాదం చేసిన బోయి భీమన్న అంబేద్కర్‌ ఆత్మను పట్టలేకపోయారనే వాదనకు బలమైన ఆధారాలున్నాయి. క్యాస్ట్‌ అనే పదానికి వర్ణం అనే అర్థం అని కులం అనే పదాన్ని జాతి అనే పేరుతో వాడకంలో ఉన్నదనే వాస్తవమే నిజమని తేలింది. కులాల నడుమ అంతరాలను అసమానతలను పెంచే వర్ణ ధర్మాన్ని నిర్మూలించాలని చెప్పారు. వర్ణసిద్ధాంతాన్ని ప్రతిపాదించిన బ్రాహ్మణీయ మనువాదం బ్రహ్మ వివిధ అంగాల నుంచి చాతుర్వర్ణాలు ఆవిర్భవించాయని చెప్పివాటికి పవిత్రత అపవిత్రతను అంటగట్టింది.ఈ వర్గీకరణను వాటికున్న పవిత్రత అపవిత్రత ను డా. బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ తోసిపుచ్చారు. తన అన్నిహలేష న్‌ ఆఫ్‌ కాస్ట్‌ అనే గ్రంధం ద్వారా కాని దాన్ని సరిగ్గా అర్థం చేసు కోని దళిత బహుజన మేధావ్ఞలు కులనిర్మూలన అనే అసంబద్ధ వాదాన్ని నెత్తికెత్తుకున్నారు. వర్ణ నిర్మూలన జరగకుండా జరిగే కుల నిర్మూలనద్వారా నష్టపోయేతి దళిత బహుజనవర్గాలే. ఎందు కంటే ప్రజల సామూహిక తత్వానికి వాళ్లను ఒక్క తాటి మీదకి తీసుకువచ్చే ఒక భావన అవసరం ఉంటుంది. అది మతం ప్రాంతం జాతి దేశం ఏదైనా కావచ్చు.అలా కులం అనే పారామీటర్‌ కూడా ప్రజా సమూహాలను సంఘటిత పరిచే సాధనం.
సమాచారం ధనంసహజవనరుల మీద ఆధిపత్యం అనే మూడు అంశాలు ఒక వ్యక్తిని గానీ ఒక సమూహాన్ని కాని ఇతరుల మీద ఆధిపతాయనికి మార్గం సుగమం చేస్తుంది. ఈ దేశంలో అగ్రకులాలుగా చెప్పుకునే అతి తక్కువ జనాభా కలిగిన కులాలు తొంభై శాతం జనాభా మీద ఆధిపత్యాన్ని కొనసాగించడానికి గల కారణంపైన తెలిపిన మూడు కారణాలే. అందువల్ల సమాచారాన్ని సహజవనరులు సంపద మీద ఆధిపత్యాన్ని వికేంద్రీకరణ చేయకుండా వాటిని అగ్రకులాలు వర్గాల ఆధిపత్యంలోనే వ్ఞంచి కుల నిర్మూలన అనే నినాదాన్ని ఎత్తుకోవడం అంటే దళిత బహుజనులు తమ రాజకీయ అధికార అవకాశాన్ని తామే స్వయంగా జారవిడుచుకోవడమే. మూడువేల ఏళ్ల భారత సామాజిక నిర్మాణం చరిత్రలో ఏనాడు ఈఆధిపత్య కులాలు కుల నిర్మూలన జరగాలని అనలేదు. పైగా కులాలు లేవ్ఞ. అని చెప్పు కుంటూ వస్తున్నారు. అలా చెప్పుకుంటూనే అగ్రకుల రాజకీయాలు చేస్తున్న ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారు. అగ్రకులాలు కులముంది అని ఒప్పుకోవడం అంటే వాళ్లనెత్తిన వాళ్లు చెయ్యిపెట్టుకోవడమే.
దేశంలోని అతి తక్కువ సంఖ్యలోని అగ్రకుల ఆధిపత్యవాదులు. ఆన్‌ ద రికార్డు కులం లేదంటూనే ఆఫ్‌ దరికార్డు కులం పేరుతోనే రాజకీయాలు ఓట్ల ఎన్నికల నిర్వహణను కొనసాగిస్తున్న ద్వంద్వ విధానం భారత పార్లమెంటరీ వ్యవస్థకుఅలవాటుగా మారింది. ఈ నేపథ్యంంలో మొదటిసారి కులంపేరుతో రాజకీయాలు చేసింది మాన్యశ్రీ కాన్షీరాం.ఓట్‌ హమారా సీట్‌ తుమ్మారా నహీ చలేగా అనే తన నినాదం సభ్యభారత సమాజాన్ని ఆలోచింప చేసింది. జనా భాలో 90 శాతంగా ఉన్న పాలిత వర్గాలు ఆ పిలుపు ద్వారా చైత న్యంపొంది ఉత్తరప్రదేశ్‌ రాజ్యాధికారంలో భాగస్వామ్యమయ్యాయి. స్వతంత్ర భారతావనిలో కాన్షీరాం వ్యవహారం సామాజిక న్యాయం కోణంలో సువర్ణాధ్యాయంగా చెప్పవచ్చు.అదేదిశగా భౌగోళిక తెలం గాణను సామాజిక తెలంగాణ దిశగా అడుగులు వేయిస్తున్న ముఖ్య మంత్రి కేసిఆర్‌ పాలనా కాలంలోనే బంగారు తెలంగాణ నిర్మితమై దేశచరిత్రలోనే ఒకక సువర్ణాధ్యాయాన్ని లిఖించనున్నది.

– రమేష్‌ హజారి