సముద్రాలు వేడెక్కితే అనర్థాలే

IAMGES2
Sea

సముద్రాలు వేడెక్కితే అనర్థాలే

సముద్రాలు వేడెక్కితే పర్యావరణ ప్రపంచంలో ఎన్నో మార్పులు, ఫలితంగా అనర్థాలు దాపు రిస్తాయి. తుపానులు వంటి ప్రకృతి వైపరీత్యాలు పెరగడానికి ఇదే ముఖ్యకారణం. భూమి ఉష్ణోగ్రత కన్నా సాగర ఉష్ణోగ్రతలు పెరిగే వేగం 1 నుంచి అయిదురెట్లు ఎక్కువగా ఉం టుంది. భూ ఉష్ణోగ్రతలు వేగంగా చల్లారతాయి కానీ సాగర ఉష్ణో గ్రతలు ఒకంతట చల్లబడక చాలా కాలం పడుతుంది. సాగర జలాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కారణంగా కొన్ని రకాలైన జెల్లీ చేపలు, సముద్రపక్షులు, నాచు ధ్రువప్రాంతాలకు తరలిపోతున్నా యి. భూ ఉపరితలం మీదకంటే ఒకటిన్నర రెట్లు వేగంగా సముద్ర జీవజలాలలో మార్పులు జరుగుతున్నాయి.
విశ్వానికి కావలసిన ప్రాణవాయువ్ఞ 70 శాతం సముద్రంలో ఉండే నాచు, ఇతర మొక్క ల ద్వారానే లభిస్తోంది. అందువల్ల ఈ మార్పులు మనుషులు, జంతువ్ఞల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంటాయి. రోగాలకు దోహదం చేస్తుంటాయి. అందుకనే సముద్రాలు ఆరోగ్యంగా ఉంటనే సమస్త ప్రాణకోటి ఆరోగ్యంగా మనుగడ సాధించగలుగుతుంది. ప్రస్తుతం సముద్ర జలాల్లో ఒకరకమైన నాచు, విషపదార్థాలు వంటివి వేగంగా విస్తరిస్తున్నాయి. 1970నుంచి భూ ఉపరితలంపై నీరు వేడెక్కి జీవరాశి జీవనశైలి దెబ్బతింటోంది. 1970 నుంచి 2000 సంవత్సరాల మధ్యకాలంతో పోలిస్తే 2050 నాటికి ఆగ్నేయాసియాలో సముద్రతీరంలోని మత్స్య సంపద 10 నుంచి 30 శాతం తగ్గిపోయే పరిస్థితి ఏర్పడింది. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే జలాల్లో పుట్టే తాబేళ్లలో ఆడవి మాత్రమే బతికే అవకాశం ఉంది. మగవాటి సంఖ్య తగ్గిపోతుంది. అధిక తీరప్రాంతం కలిగిన భారత్‌, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా తదితర దేశాల్లో రుతుపవనాలతో మార్పులువస్తాయి. వర్షాలు విప రీతంగా కురుస్తాయి.వ్యవసాయానికి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి.మొక్కజొన్న, గోధుమ పంటల సాగుకు ఇబ్బందులు ఏర్ప డతాయి. అలాగే అధిక ప్రోటీన్లు ఉండే చేపలు, సముద్ర ఆహారం దెబ్బతింటాయి. జెల్లీ చేపలు, పీతలు, తాబేళ్లు, సముద్రపక్షులు కనుమరుగై నీలి పరిశ్రమలకు నష్టం వాటిల్లుతుంది. సముద్రంలోని మంచు కరిగి నీటి మట్టం అమాంతంగా పెరిగి దీవ్ఞలు మునిగిపో తాయి. ఇవన్నీ హవాయిలో ఇటీవల జరిగిన అంతర్జాతీయ సద స్సులో 12 దేశాలకు చెందిన 80 మంది శాస్త్రవేత్తలు, నిపుణులు సాగరాల ఆరోగ్యంపై తమ అధ్యయనాలను వెల్లడించారు.
వాతా వరణ కాలుష్యం వీటన్నిటికీ కారణంగా పేర్కొన్నారు. వాతావర ణంలో కర్బన ఉద్గారాలను తగ్గించగలిగితే సమస్యలు చాలా వరకు పరిష్కారమవ్ఞతాయని స్పష్టంచేశారు. లేకుంటే ఆస్ట్రేలియా, శ్రీలంక వంటి దేశాల్లో అపురూపమైన పగడాల దిబ్బలు నాశనమవ్ఞతాయ ని, కలరావంటి భయంకర అంటు రోగాల వ్యాప్తికి కారణమయ్యే క్రిములు మరింత వేగంగా విస్తరిస్తాయని, చేపల ఆవాసాలు చెెదిరి పోతే మనిషికి ఆహార భద్రత సమస్య తప్పదని హెచ్చరించారు.్పు మస్య తప్పదని హెచ్చరించారు.

– పివిఆర్‌ మూర్తి