ప్రజావాక్కు

School Fees
School Fees

ఫీజులు తగ్గించాలి: -కామిడి సతీస్‌రెడ్డి, జడలపేట, భూపాలపల్లిజిల్లా

ఈనెల 12వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ,ప్రైవేట్‌ పాఠశాలలు తెరుచుకోనున్నాయి. నూతన విద్యాసంవత్సరం ప్రారంభమవ్ఞతుంది. ఫీజుల విషయానికి వస్తే బి.టెక్‌ కోర్సు చదవడం సులువ్ఞకానీ ఎల్‌.కె.జి నుండి పదవ తరగతి వరకు గల ఫీజుల ఛార్ట్‌ చూస్తే గుండె ఆగిపోవడం ఖాయం. అడ్మి షన్‌ ఫీజు, పరీక్షల ఫీజు, వ్యాన్‌ఛార్జీ, పుస్తకాల కోసం అద నంగావసూలు చేస్తున్నారు. ఒకటవ తరగతి పూర్వయ్యే వరకు సగటున ఒక విద్యార్థి చెల్లించాల్సిన ఫీజుసుమారు నలభైవేల పైననేఉంటుందని తెలుస్తుంది. తమపిల్లలు తమలా కష్టపడ కూడదని తల్లిదండ్రులు కష్టపడిచదివిస్తున్నారు.ఫీజుల నియం త్రణ కమిటీలేకపోవడం,విద్యాధికారులులంచాలకు ఆశపడటం, పర్యవేక్షణ లోపం మూలంగా ప్రైవేట్‌ పాఠశాలల్లో యాజమా న్యం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంది.

ఆరోగ్య బీమా ప్రీమియం తగ్గించాలి: -బి.ఎన్‌.సత్యనారాయణ, హైదరాబాద్‌

సమర్థవంతమైన పాలనఅందించాల్సిన ప్రభుత్వం సంకుచితం గా,నిరంకుశంగా సాగడం దురదృష్టకరం.ఓట్లు రాబట్టుకోవడం కోసంఉనికిని కాపాడుకోవడం కోసం కాకుండా ప్రభుత్వం నిజా యితీతో ప్రజలకు సేవలందించడం కోసం తొందరపడాలి. అం తేకానిసమాజాన్ని బలహీనపరిచేరుణాలరద్దు, నిరుద్యోగభృతి, రెండు రూపాయాలకే కిలో బియ్యం వంటి అనేకమైన వాటిని సంక్షేమ పథకాల పేరుతో ఉచితంగా అందిస్తూ ప్రజాధనాన్ని వెదజల్లుతూ ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తూ తద్వారా లబ్ధిని పొందాలనుకోవడం ఆందోళనకరమే. అదే విద్య,వైద్యం వంటి అతి ముఖ్యమైన, ప్రాధాన్యతగల సేవల్ని ఉచితంగా అందించడానికి విముఖత ప్రదర్శిస్తూ వాటినే ప్రధాన వ్యాపార వనరులుగా చేసుకొని ప్రభుత్వం ప్రజల్ని దోచుకోవాలనుకో వడం దురదృష్టకరం. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్యబీమా పథకం అందని ద్రాక్షలా తయారైంది.

ఆదర్శపాఠశాలలపై విధాన నిర్ణయం:-బి.సురేష్‌, శ్రీకాకుళం

ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఆదర్శపాఠశాలలపై ప్రభుత్వం విధాన నిర్ణయం ప్రకటించాలి. ఈ పాఠశాలల నిర్వహణకు సంబం ధించి పటిష్టమైన వ్యవస్థ లేకపోవడం వలన ఉపాధ్యాయులకు సంబంధించిన సర్వీసు నిబంధనలు అమలు కావడం లేదు. సర్వీసు నిబంధనలు లేకపోవడంతో అనేక సమస్యలు రోజు రోజుకి పెరుగుతున్నాయి.

ప్రత్యేకహోదాతోనే ఉద్యోగాలు:-గరిమెళ్ల రామకృష్ణ, ఏటూరు, పశ్చిమగోదావరి జిల్లా

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి పోరాడింది వైస్సార్‌సిపినే. ప్రత్యేక హోదా లేకుంటే రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ప్రత్యేకహోదా ముగిసిన అంశం అని రాష్ట్రబిజెపి అధ్యక్షులు అనడం సబబుకాదు. జగన్‌ మోహన్‌ రెడ్డి నాయకత్వంలోని కొత్త ప్రభుత్వం ఈవిషయంలో రాజీలేని పోరాటంచేయాలి.యువతకు ఉద్యోగాలు రావాలన్నా, రాష్ట్ర ఆదాయ వనరులు పెరగాలన్నా ప్రత్యేక హోదాతోనే సాధ్యం.అవసరమైతే అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకు వెళ్లి కేంద్రంపై ఒత్తిడి పెంచాలి. ఆపై కేంద్రం దిగిరాకుంటే రాష్ట్ర ఎంపిలు రాజీనామాలు ఇచ్చి తమ నిరసనను తెలియచేయాలి. వారినే ప్రజలు మరల ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. ఈ విషయంలో ఎటువంటి అలసత్వం, రాజీధోరణి లేకుండా పోరాడాలి.

విలక్షణమైన తీర్పు: -ఎం.శ్రీనివాస్‌, హైదరాబాద్‌

ఈ మధ్యనే జరిగిన లోక్‌సభ ఎన్నికలలో తెలంగాణ ప్రజలు మూడు ప్రధాన పార్టీలను ఆదరించారు. ఓట్లేసి గెలిపించారు. ఎ.పి ప్రజలు మాత్రం ఏకపక్షంగా తీర్పునిచ్చారు.ఐదేళ్ల తెలుగు దేశం పార్టీ పాలనకు చరమగీతం పాడేశారు. గత సంవత్సరం డిసెంబరు నెలలో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికలలో అధికార టి.ఆర్‌.ఎస్‌కి గంపగుత్తగా ఓట్లేసేసి ఆ పార్టీకి ఘన విజయాన్ని అందించారు. తెలంగాణాలో పోటీ జరిగిన మూడు ఉత్తరాది రాష్ట్రాలలో మాత్రం పాలక పక్షాలను దించేసి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న పార్టీకి అధికార పగ్గాలను అందించారు. ఈ విధంగా సమయం సందర్భం వచ్చినప్పుడల్లా ప్రజలు తమ విజ్ఞతను ప్రదర్శిస్తున్నారు. విలక్షణమైన తీర్పు ఇస్తున్నారు. ఓటుకు ఉన్న పవర్‌ ఏమిటో రుచి చూపిస్తున్నారు.

బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలి:-సయ్యద్‌ షఫీ, హన్మకొండ

నేటి బాలలే రేపటి పౌరులు నినాదం వినసొంపుగా ఉంది. చల్లని నీడలోచదువ్ఞకోవాల్సిన పిల్లలు తమ పరిస్థితి ప్రభావం వల్లనో, విధిరాత వల్లనో నేడు పిల్లలు బాలకార్మికులుగా మారు తున్నారు. పంట పొలాల్లో నుంచి చెత్త ఏరుకోవడం వరకు మనకు కనిపిస్తున్నారు. బాలకార్మిక పిల్లలకు విద్య, ఆరోగ్యం, ప్రాథమిక స్వేచ్ఛ లేకుండాపోయింది.మరీ ముఖ్యంగా శారీరక మానసిక ఎదుగుదలపోతుంది. ప్రతి బాలకార్మికున్ని పాఠశాల ల్లో చేర్పి నేటి బాలలే రేపటి పౌరులు నినాదం నిజం చేయాలి.