ప్రజారోగ్యాన్ని కాటేస్తున్న కాలుష్యం!

Pollution affecting public health!

కాలుష్య నివారణకై ప్రభుత్వాలు ఆచరణ యోగ్యం కాని విధానాలతో ప్రయో గాలు చేస్తూ సమస్యను రోజురోజుకు జటి లం చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా రాజధాని ఢిల్లీతో సహా అనేక నగరాలు పర్యావరణం విషతుల్యంగా మారి పోతున్నది. లక్షలాది మంది పౌరులు అనేక వ్యాధులకు లోనవ్ఞతున్నారు. ఎందరో అసువ్ఞలు బాస్తున్నారు. తాజాగా దేశరాజధాని ఢిల్లీని వాయువ్ఞ కాలుష్యం నాలుగు రోజులుగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది.

గాలి నాణ్యత అత్యంత ప్రతికూల పరిస్థితులకు పడిపోవడంతో ఆ ప్రాంతంలో ప్రజారోగ్య అత్యయిక పరిస్థితి ప్రకటిం చారు. శనివారం నుండి మంగళవారం వరకు పాఠ శాలలకు సెలవ్ఞలు ప్రకటించారు.37 విమాన సర్వీసు లను దారి మళ్లించారు. మరికొన్ని విమాన సర్వీసులను నిలిపివేశారు. మరొకపక్క ఢిల్లీ ముఖ్యమంత్రి ఈ విషయంలో కేంద్రజోక్యం తీసుకొని తక్షణ చర్యలు తీసుకోవాలని ఉత్తరభారతంలో కాలుష్యం భరించలేని పరిస్థితికి చేరిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఢిల్లీ పరిసరప్రాంతాల్లో నిర్మాణ కార్యక్రమాలు తాత్కాలికంగా నిలిపివేయకపోతే పరిస్థితి అదుపు తప్పు తుందని ముఖ్యమంత్రి హెచ్చరించారు.

ఇంకొకపక్క దేశరాజధాని ఢిల్లీలో శ్వాసకోశ హృదయ సంబంధిత సమస్యలతో ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య బాగా పెరిగి పోయింది. ఇక శుక్ర,శనివారాలు గాలి నాణ్యత మరింత వేగంగా క్షీణించడంతో పరిస్థితిపట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పరిస్థితి తీవ్రతను గుర్తించిన పర్యా వరణ కాలుష్య నివారణ, నియంత్రణ ప్రాధికార సంస్థ జోక్యం చేసుకొని శీతాకాలం ముగిసేంతవరకు ఢిల్లీలో బాణాసంచా కాల్చకుండా నిషేధం ప్రకటించింది. ఫరీదాబాద్‌, ఢిల్లీ, గజియాబాద్‌, నోయిడా తదితర ప్రాంతాల్లో నిర్మాణపనులు తాత్కాలికంగా మంగళవారం వరకు నిలిపివేసింది. అంతేకాదు కాలుష్యం నుంచి రక్షణ పొందేలా పాఠశాల విద్యార్థులకు అత్యాధునిక ‘ఎన్‌-95 మాస్క్‌లను ఢిల్లీ ప్రభుత్వమే పంపిణీ చేసింది. ఢిల్లీకి ఈ పరిస్థితి రావడానికి ముఖ్యంగా చుట్టూ ఉన్న రాష్ట్రాల్లో పంటవ్యర్థపదార్థాలు దహనం చేయడం వల్ల వెలువడు తున్న పొగకారణంగా ఢిల్లీ పరిస్థితి ఆందోళనకరంగా తయారైంది.

గత శుక్రవారం పరిస్థితిని పరిశీలిస్తే ప్రపంచవ్యాప్తంగా అత్యంత కాలుష్యపూరిత నగరంగా ఢిల్లీ నమోదైందని పర్యావరణ శాస్త్రవేత్తలు వెల్లడిస్తు న్నారు.ఢిల్లీకి ఈ పరిస్థితి రావడం ఇది మొదటిసారికాదు. దీపావళి పండుగ తర్వాత తరుచుగా ఢిల్లీప్రజలుఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. ఒక్క దేశరాజధాని నగర మేకాదు అనేక నగరాలతోపాటు పట్టణాలు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కోవడం తీవ్ర ఆందోళన కలిగించే విష యం.

భారతదేశంలోని నగరాల్లో 80శాతం మంది ప్రజలు కాలుష్యకారణంగా అనారోగ్య సమస్యలు ఎదు ర్కొంటున్నారని అనేక అధ్యయన సంస్థలువెల్లడించాయి. ప్రపంచంలో వాయుకాలుష్యస్థాయి అత్యధికంగా ఉన్న12 నగరాల జాబితాలో భారత్‌లోనే 11 ఉన్నాయంటే పరి స్థితి ఏస్థాయిలో ఉందో అర్థంచేసుకోవచ్చు. ఈజాబితాలో వారణాసి, కాన్పూర్‌, ఫరీదాబాద్‌ నగరాలు తొలిమూడు స్థానాల్లో ఉన్నాయి. భారత్‌ భౌగోళికంగా కొండలు, పర్వ తాలతో చుట్టుముట్టిన ప్రాంతం కావడంతో ఆవరించిన విషమేఘాలు కొన్ని సందర్భాల్లో ఎక్కడికక్కడ నిలిచిపోవ డం సమస్యను పెంచుతున్నాయని పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

ప్రపంచ జనాభాలో దాదాపు సగం ప్రస్తుతం నగరాల్లోనే నివసిస్తున్నారు. 2050 నాటికి ప్రపంచంలోని నగరజనాభాకు మరో మూడువంద ల కోట్లు అదనంగా వచ్చిచేరుతుందని అంచనా వేస్తున్నా రు. భూభాగంపై నగరాల వైశాల్యం కేవలంరెండు శాతం అయినప్పటికీ ఆదాయపరంగా చూస్తే కావలసిన ఆదా యం అధికశాతం అక్కడి నుంచే అందుతున్నది. ప్రపంచ వ్యాప్తంగా స్థూలదేశీయ ఉత్పత్తిలో దాదాపు అరవై శాతం ఆరువందల పట్టణ కేంద్రాల నుంచే అందుతున్నది. అదే సమయంలో 60 నుంచి 80శాతంవరకు ఇంధన వనరు లను వినియోగించడంతోపాటు కార్బన ఉద్గారాల్లో 70 శాతందాకా నగరాలే వెలువరిస్తున్నాయి.

అందుకే వాటికి ఊపిరి అందని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. భారత్‌లో కూడా పట్టణీకరణవేగం ఊహకందనంతగా పెరిగిపోతు న్నది.నగరాలు పట్టపగ్గాలు లేకుండా విస్తరిస్తున్నాయి. 2001 పట్టణప్రాంత జనాభా28.5కోట్లు కాగా ఇప్పుడది దాదాపు45 కోట్లకుపైగా చేరుకున్నది. పల్లెలు పెద్దస్థాయి లో వలస వస్తూ పట్టణాలు, నగరాల ప్రాంతాలపై ఒత్తిడి పెంచుతున్నాయి. గృహనిర్మాణం, పారిశ్రామీకరణ వాహ నాల విషయంలో ఒకపద్ధతి, ప్రణాళిక లేకుండాపోవడం తో పరిస్థితి అదుపుతప్పి వాతావరణం విషకలుషితమై స్వచ్ఛమైన నీరు,గాలి అందకుండాపోతున్నాయి. కాలుష్య భరితవాయువ్ఞలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నా జనాభా పెరుగుతున్న,అభివృద్ధిచెందుతున్న దేశాలలో సమస్య రోజురోజుకు పెరిగిపోతున్నది.

కాలుష్య నియంత్రణకు రూపొందించిన చట్టాలు, నిబంధనలుఎంత కట్టుదిట్టంగా ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయ గలిగిన పాలనాయంత్రాంగం లేదనేచెప్పాలి. వాయుకాలు ష్యం మనిషికేకాదు దేశసుసంపన్న చరిత్ర సంస్కృతులకు ప్రతీకలుగా భాసిల్లుతున్న వారసత్వ కట్టడాలకు ముప్పు తెస్తున్నది.

ఈ విషయం ప్రభుత్వమే స్వయంగా దాదాపు 39 నగరాల్లో వారసత్వకట్టడాలను పరిశీలిస్తే విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.వాతావరణకాలుష్యం విషయంలో కేంద్ర,రాష్ట్ర పాలకులు ప్రత్యేక శ్రద్ధతీసుకొని ఆచరణయోగ్యమైన నిర్దిష్టమైన కార్యాచరణకు శ్రీకారం చుట్టకపోతే పరిస్థితి చేయిదాటిపోతుంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/