మద్యపాన నిషేధంతోనే సుస్థిర ప్రగతి

Liquor
Liquor

ఆనాడు బ్రిటిష్‌ వారు ఆదాయాన్ని పెంచుకొనే మార్గాలలో మద్యం విక్రయం పెద్దమొత్తంలోకి చేపట్టాలని 1878లోనే మద్యం తయారీ, సరఫరాకి ఒక చట్టాన్ని తెచ్చారు. 1902 నుండి దీన్ని అమలు చేశారు. అయితే ప్రజలు మత్తులోకి జారిపోతూ స్వాతంత్య్రోద్యమం కుంటుపడుతుంది అని గ్రహించి ఆనాడు 1920-22 వరకు జరిగిన సహాయనిరాకరణోద్యమంలో భాగంగా దశలవారీగా మద్యం విక్రయంపై ప్రొహిబిషన్‌ ఉండేలా ఒక పాలసీ వచ్చేలా చేశారు. దీని ఫలితంగానే భారత రాజ్యాంగంలో 47 అధికరణంలో ఈ ప్రొహిబిషన్‌ని పొందుపరిచి చక్కటి ఆదేశం ఇచ్చారు. ప్రజల జీవన ప్రమాణాలు పౌష్టికాహారస్థాయి, ప్రజారోగ్యమెరుగుదల ప్రభుత్వాల ప్రాథమిక విధుల్లో భాగమని స్పష్టీకరించింది. మద్యపాన వినియోగం క్రమేణా తగ్గిపోయేలా చేస్తూ అంతిమంగా నిషేధం లాంటి పరిస్థితులు నెలకొనేలా చేయడం ప్రభుత్వాల విధిగా పేర్కొంది.

  • ఈ ఏడాది గత జులై నెలలో ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సమావేశాలలో దశలవారీగా మద్యనిషేధంలో భాగంగామద్యం నియంత్రణ చట్ట సవరణ బిల్లును అసెంబ్లీ ఆమోదించడం శుభపరి ణామం. ఈ మద్యం విక్రయాల ద్వారా ప్రభుత్వానికి ఏటా సుమా రు 18 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని కాదని ప్రజారోగ్యమే శ్రేయస్సుగా తద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడి రాష్ట్ర ప్రగతి వేగాన్ని పెంచవచ్చు అనేదే ప్రభుత్వ ఉన్నత ఆలో చన. మద్యం షాపులు ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లో ఉన్నందున అధిక లాభాల కోసం బెల్టుషాపులని నిర్వహించేవారు. రాష్ట్రంలో ఉన్న 4380 మద్యం షాపులు, 802 బార్‌ షాపులు ఉన్నాయి. ఒక్కో మద్యం షాపుకి అనుబంధంగా 10 బెల్ట్‌షాపుల చొప్పున రాష్ట్రంలో 43,800 బెల్ట్‌షాపులు ఈ మద్యం నియంత్రణ చట్టంలో రద్దు అయ్యాయి. గతంలో వీరంతా రాజకీయ చందాలు, పోలీసులకి, ఎక్సైజ్‌ శాఖకి మామూళ్లు ఇస్తూ కల్తీ మద్యాన్ని కూడా అధిక ధరలకి సుమారు 40 నుండి 50 శాతం అదనంగా ఆదాయాన్ని రాబట్టేవారు.అంటే 2018-19 ఆర్థిక సంవత్సర కాలంలో సుమారు 30వేల కోట్ల రూపాయలు మద్యం విక్రయానికి ప్రజలు వెచ్చించారు అన్నమాట.

ఇందులో చీప్‌ లిక్కర్‌ వాటా 40 శాతం. అంటే 12వేల కోట్ల రూపాయ లు కేవలం కష్టజీవ్ఞలైన కార్మికులు, రైతు కూలీలు, అడ్డాకూలీలు ఖర్చు చేశారు. ఇదే సంవత్సర కాలంలో మరోపక్క గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్రభుత్వం కూలీలకి చెల్లించిన సొమ్ము 4,800 కోట్లు. అంటే వీరంతా మద్యపానం కోసం మూడు రెట్లు తమ కష్టార్జితాన్ని వృధా చేశారన్న మాట. ఆదాయాన్ని పొదుపు చేయటంలో ఆంధ్ర ప్రజలు వెనుకబడే ఉన్నారు. సొంత వ్యవసాయ భూమి లేని వారు ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ. రోజువారి పనికి వెళ్లేవారే అధికం. మూడు, నాల్గవ తరగతి ఉద్యోగులే ఎక్కువ. వీరి ఆలోచనా ధోరణి ఎంతసేప టికీ, ఈ రోజు 400 రూపాయల కూలీ డబ్బు వస్తే దీనిలో మద్యానికి, సిగరెట్‌, బీడి, చిరుతిండికే సుమారు 150 నుండి 200 రూపాయలు ఖర్చు చేస్తూ తమ అభిరుచిని వదులుకో లేకపోతూ తరచూ అనారోగ్యానికి గురై పనిదినాలని కోల్పోయి ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నారు. కుటుంబ కలహాలు, ఆత్మహత్యలు,పిల్లలు అనాథలుగా మారటం,రోడ్డు ప్రమాదాలు, అనారోగ్యంపాలై పనిదినాలు తగ్గిపోతుండటం ఇలాంటి అనర్థాల మూలంగా రాష్ట్రం ప్రతి యేటా 30 నుంచి 35వేల కోట్ల ఆదాయాన్ని అదనంగా కోల్పోతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ బ్యాంకు అనేక మార్లు హెచ్చరిస్తూ వస్తున్నా కూడా మద్యనిషేధంపై ఇప్పటి వరకు దృష్టిపెట్టకపోవడం శోచనీయం.

ఇక ఇప్పటినుండైనా 2024 నాటికి పూర్తిగా మద్యనిషేధాన్ని దశలవారీగా అమలుపరిచే బాధ్యత ప్రభుత్వంపైన ఉంది. 2018-19 నాటికి రాష్ట్రానికి ఉన్న అప్పులు 2,49,435 కోట్లకి వడ్డీ రూపంలో 15,077 కోట్లు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రజారోగ్యమే రాష్ట్ర ఆదాయ రాబడికి చక్కటి మార్గం అని గ్రహించి ప్రభుత్వానికి మనవంతు సహ కారం అందిస్తేనే ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక ప్రగతి వేగం పుంజుకుంటుం ది.ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖలో ఉండే ప్రొహిబిషన్‌ (మద్యనిషేధం) కూడా ప్రభుత్వ విధుల్లో భాగమే.ఆనాడు బ్రిటిష్‌ వారు ఆదాయాన్ని పెంచుకొనే మార్గాలలో మద్యం విక్రయం పెద్దమొత్తంలోకి చేపట్టాలని 1878లోనే మద్యం తయారీ, సరఫరాకి ఒక చట్టాన్ని తెచ్చారు.

1902 నుండి దీన్ని అమలు చేశారు. అయితే ప్రజలు మత్తులోకి జారిపోతూ స్వాతంత్య్రోద్యమం కుంటుపడుతుంది అని గ్రహించి ఆనాడు 1920-22 వరకు జరిగిన సహాయనిరాకరణోద్యమంలో భాగంగా దశలవారీగా మద్యం విక్రయంపై ప్రొహిబిషన్‌ ఉండేలా ఒక పాలసీ వచ్చేలా చేశారు. దీని ఫలితంగానే భారత రాజ్యాం గంలో 47 అధికరణంలో ఈ ప్రొహిబిషన్‌ని పొందుపరిచి చక్కటి ఆదేశం ఇచ్చారు. ప్రజల జీవన ప్రమాణాలు పౌష్టి కాహారస్థాయి, ప్రజారోగ్య మెరుగుదల ప్రభుత్వాల ప్రాథమిక విధుల్లో భాగమని స్పష్టీకరించింది. మద్యపాన వినియోగం క్రమేణ తగ్గిపోయేలా చేస్తూ అంతిమంగా నిషేధం లాంటి పరిస్థితులు నెలకొనేలా చేయడం ప్రభుత్వాల విధిగా పేర్కొంది.

నేటికీ మనదేశం అంతగా మద్యనిషేధంపై దృష్టిసారించలేదు. కాబట్టే ప్రసుత్తం కేవలం నాలుగు రాష్ట్రాలలోనే మద్యనిషేధం అమలు అవ్ఞతుంది. గుజరాత్‌, నాగాలాండ్‌, మిజోరం, మణిపూర్‌లో విజయవంతం చేశారు అక్కడి ప్రజలు, ప్రభుత్వాలు. అయితే మిగతా రాష్ట్రాలలో ప్రొహిబిషన్‌ అనే ప్రాథమిక సూత్రాన్ని ప్రభుత్వాలు మరిచారు కావ్ఞన 2005 సంవత్సరంలో లిక్కర్‌ తలసరి వినియోగం 2.4 లీటర్లు ఉంటే 2010లో 4.3 లీటర్లకి 2019నాటికి వార్షిక తలసరి వినియో గం ఆరులీటర్లకి చేరుతుందని 2018 సంవత్సరంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తొలిసారి ఆల్కాహాల్‌ రుచిచూసే వయస్సు 13ఏళ్లకి పడిపో యింది. అందుకే ప్రతియేటా మూడు కోట్ల 50 లక్షల కేసుల బీర్‌ వినియోగం అవ్ఞతుంది. ఇదిగాక విస్కీ, బ్రాండీ, రమ్‌, చీప్‌ లిక్కర్‌ కొన్ని కోట్ల లీటర్లు వినియోగిస్తూ పర్యావరణానికి విఘాతం కల్గిస్తూ భావితరాలకి నష్టంవాటిల్లేలా చేస్తున్నారు.

మద్యం నియంత్రణతోనే పర్యావరణానికి మనుగడ

నీరు, విద్యుత్‌, ఆయిల్‌ మొదలగు ఇంధనాలని బీర్‌ తయా రీకి పెద్దమొత్తంలో వినియోగిస్తున్నారు.ఇంగ్లాండ్‌ దేశం బీర్‌ తయారీకంపెనీ ఎస్‌ఎబి మిల్లర్‌ డబ్ల్యుడబ్ల్యుఎఫ్‌తో కలిసి పరి శోధనాత్మక నివేదిక ప్రకారం వెయ్యి లీటర్ల బీర్‌ తయారీ 1,50,000 లీటర్ల నీరు, 150 యూనిట్ల విద్యుత్‌, 50 కిలోల ఫర్నేస్‌ ఆయిల్‌ అవసరం అవ్ఞతాయి. బీర్‌ తయారీలో జరిగే వివిధ ప్రక్రియలతో కూడిన విభాగాలైన ఫెర్మెంటేషన్‌, హీటింగ్‌, పాశ్చరైజేషన్‌, కూలింగ్‌, క్లీనింగ్‌, ప్యాకేజింగ్‌లలో ఈ ఇంధనాలు వినిమయం అవ్ఞతాయి. ఒక ఉదాహరణతో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వినియోగం అవ్ఞతున్న బీర్‌ మూడు కోట్ల 50 లక్షల కేసులు (27 కోట్ల 30 లక్షల లీటర్ల బీర్‌) తయారీకి అవసరం అయ్యే నీటితో సుమారు 6,800 ఎకరాల వరి పంట సాగు చేయవచ్చు అని ఒకఅంచనా.ఇక ఫ్యాక్టరీలో నుండి వెలు వడే వ్యర్థజలాలతో కెమికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ (సిఒడి) 1250 ఎమ్‌జి ఉండటంతో ఆ నదులు, చెరువ్ఞలు కాలుష్యం అవ్ఞతు న్నాయి.అలాగే ఈ బీర్‌ఫ్యాక్టరీల నుండి కార్బన్‌డైఆక్సైడ్‌, మిథేన్‌ కూడా వెలువడి గ్లోబల్‌వార్మింగ్‌ని మరింత పెరిగేలా చేస్తుంది.

– కనుకుల యాదగిరిరెడ్డి