సుస్థిరతకోసం ముందడుగు

Kashmir
Kashmir

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సమాచారహక్కు చట్టం 2005, చదువ్ఞకునే హక్కు చట్టం 2009 లాంటి మంచి చట్టాలు ఇప్పటివరకూ జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రంలో అమలులో లేవ్ఞ. ఇకనుండి ఆ చట్టాలు అమలులోకి రావడం వలన ప్రతి పిల్లవాడు చదువ్ఞకొని మంచి మార్గాన్ని ఎన్నుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. 370 అధికరణ వలన బాగుపడింది రాజకీయ నాయకులు, వేర్పాటువాదులు తప్ప సగటు సామాన్యుడు అభివృద్ధికి బాహ్యప్రపంచానికి దూరంగా ఉన్నాడు. కాశ్మీర్‌ ప్రాంతానికి చెప్పుకోదగ్గ పెట్టుబడులు గత 70సంవత్సరాలలో ఒకటి కూడా రాలేదు. 370వ అధికరణ తీసివేత వలన ఇకనుండి భారతీయులు ఎవరైనా కాశ్మీర్‌కి వెళ్లి అక్కడ వ్యాపారం, స్థలం కొనుక్కోవడం, అక్కడే స్థిరపడిపోవడం లాంటివి చేయవచ్చు. దానివలన సగటు కాశ్మీరికి చాలా ఉపయోగాలుంటాయి. అలాగే వ్యాపారసంస్థలు అక్కడికివెళ్లి స్థలాలుకొని కంపెనీలు,పెట్టుబడులు పెట్టడంవల్ల స్థలాల ధరలుపెరిగి రైతులకు ఆస్తులు పెరుగుతాయి.అక్కడివారికి ఆ కంపెనీల్లో ఉద్యోగాలు రావడంవల్ల నిరుద్యోగం తగ్గుతుంది.
ఆ ర్టికల్‌ 370వ అధికారణా న్ని రద్దుచేసి కాశ్మీర్‌కి ఉన్న ప్రత్యేక అధికారాలను ప్రభుత్వం తొలగించింది. స్వాతంత్య్రం నుండి దేశం ఎదుర్కొంటున్న కాశ్మీర్‌ సమ స్య తొలిగిపోయింది అనుకోవడానికి లేదు. కానీ ఇదొక ముందడుగు అని చెప్పవచ్చు. 370వ అధికరణాన్ని తొలగించడం ద్వారా కాశ్మీర్‌ సమస్య అనేది భారత్‌ అంతర్భాగంలోనిది అని ప్రపంచానికి చెప్పకనే చెప్పింది. 370వ అధికరణం తొలించిన వెంటనే పి-5 దేశాలకి ఆ అధికరణం తొలగించడానికి గల కారణాలను చెప్పి భారత్‌కి వ్యతిరేకంగా ఆ దేశాల నుండి ఒక్కమాట కూడా రాకుండా జాగ్రత్తపడింది. ఇకనుండి రెండు పౌరసత్వాలు, రెండు జెండాలు, రెండు రాజ్యాంగాలు పోయి ఒకటే పౌరసత్వం, ఒకటే జెండా, ఒకటే రాజ్యాంగం ఉంటాయి. జమ్మూకాశ్మీర్‌ పునర్వ్యస్థీకరణ చట్టం 2019 ప్రకారం ఇక నుండి జమ్మూకాశ్మీర్‌ ప్రాంతం విధాన సభతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం. లండక్‌ ప్రాంతం కేవలం కేంద్రపాలిత ప్రాంతంగా ఉండబోతుంది. కాశ్మీర్‌లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం వాళ్లని సరిగ్గా పట్టించుకోవడం లేదు అనే కారణంతో లడఖ్‌ ప్రాంత ప్రజలు ఎప్పటి నుంచో వాళ్ల ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ల కల నెరవేరింది. ఇకపోతే జమ్మూకాశ్మీర్‌లో కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వానికి ఇంతకుముందున్న అధికారాలు కాదుకదా మిగతా రాష్ట్రాలకు ఉండే అధికారాలు కూడా ఉండవ్ఞ. ఇప్పుడు లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ అధికారాలు ఉంటాయి. కొత్తగా ఏర్పడే ప్రభుత్వానికి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌కి ఏదయినా సమస్య తలెత్తితే లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌దే ఆఖరి నిర్ణయం. దీని వలన కాశ్మీర్‌లో కేంద్ర ప్రభుత్వం పాత్ర పెరిగి పోతుంది. ఇది మంచి పరిణామమే. ఇంతకుముందున్న రాష్ట్ర ప్రభుత్వాలు యువత, స్థానికులు పాకిస్థాన్‌ నుండి వచ్చే ఉగ్రవాదులకు సహాయం చేస్తున్నారు అని చెప్పి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చూసిచూడనట్టు వదిలేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సమాచారహక్కుచట్టం 2005, చదువ్ఞకునే హక్కు చట్టం 2009 లాంటి మంచి చట్టాలు ఇప్పటివరకూ జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రంలో అమలులో లేవ్ఞ. ఇక నుండి ఆ చట్టాలు అమలులోకి రావడం వలన ప్రతి పిల్లవాడు చదువ్ఞకొని మంచి మార్గాన్ని ఎన్నుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. 370 అధికరణ వలన బాగుపడింది రాజకీయనాయకులు, వేర్పాటువాదులు తప్ప సగటు సామాన్యుడు అభివృద్ధికి బాహ్యప్రపంచానికి దూరంగా ఉన్నాడు. కాశ్మీర్‌ ప్రాంతానికి చెప్పుకోదగ్గ పెట్టుబడులు గత 70 సంవత్సరాలలో ఒకటి కూడా రాలేదు. 370వ అధికరణ తీసివేత వలన ఇక నుండి భారతీయులు ఎవరైనా కాశ్మీర్‌కి వెళ్లి అక్కడ వ్యాపారం, స్థలం కొనుక్కోవడం, అక్కడే స్థిరపడిపోవడం లాంటివి చేయవచ్చు. దానివలన సగటు కాశ్మీరికి చాలా ఉపయోగాలుం టాయి. ఇక నుండి వ్యాపార సంస్థలు అక్కడికి వెళ్లి స్థలాలు కొని కంపెనీలు, పెట్టుబడులు పెట్టడం వల్ల స్థలాల ధరలు పెరిగి రైతులకు ఆస్తులు పెరుగుతాయి. దానితోపాటుగా అక్కడివారికి ఆ కంపెనీల్లో ఉద్యోగాలు రావడం వల్ల నిరుద్యోగం తగ్గుతుంది. కాశ్మీర్‌ మహిళలు వేరే రాష్ట్ర అబ్బాయిని పెళ్లి చేసుకుంటే అక్కడ పౌరసత్వంతోపాటు అక్కడున్న ఆస్తులను వదులుకోవడం లాంటి వివక్షను ఎప్పటి నుంచో ఎదుర్కొంటున్నారు. దానితోపాటుగా 50 సంవత్సరాల క్రితం నుండి జమ్మూకాశ్మీర్‌లో స్థిరపడిన లక్షల మంది ఇన్ని రోజులు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎటువంటి పథకాలు, ప్రభుత్వ ఉద్యోగులకి అర్హత లేకపోవడం, లాంటి వివక్షతని ఎదుర్కొన్నారు. ఈ అధికరణను తొలగించడం ద్వారా వారికి ఇప్పటి నుంచి న్యాయం జరగడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఇప్పుడున్న పరిస్థితులు వలన స్థానికంగా ఉన్న యువతకి ఉద్యోగాలు లేక వేర్పాటు వాదులు ఇచ్చే వంద, రెండొందలకి ఆర్మీ మీదకి రాళ్లు విసరడం లేదా ఉగ్రవాదుల్లా మారడం లాంటివి జరుగుతుండేవి. ఇక నుండి ఈ పరిణామాలు మారడానికి ఆస్కారం ఏర్పడింది. కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం ఎన్నో సవాళ్లను ఎదుర్కొవాలి. ఎప్పటి నుంచో ఉన్న స్థానికులు ఇక నుండి కొత్తగా వచ్చి స్థిరపడే వారితో సఖ్యత పెంచుకోవడం, ప్రభుత్వ ఉద్యోగాలలో కొత్తవారితో పోటీపడటం, ప్రభుత్వ పథకాలు కొత్తగా స్థిరపడే వారికి కూడా పంచడం లాంటి విషయాలలో ఎప్పటి నుంచో ఉన్న స్థానికులకు కొంత ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఈ ఇబ్బందులను పోగొట్టాల్సిన బాధ్యత కొత్తగా ఏర్పడే ప్రభుత్వం మీద ఉంటుంది. కాశ్మీర్‌ ప్రాంతానికి 46, జమ్మూప్రాంతానికి 37, లడఖ్‌ ప్రాంతానికి 4, పాకిస్థాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌కి 24 కలిపి జమ్మూకాశ్మీర్‌ అసెంబ్లీకి 111 సీట్లు ఉన్నాయి. లడఖ్‌ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేయడం వలన అక్కడ ఉన్న నాలుగు అసెంబ్లీ సీట్లను జమ్మూకాశ్మీర్‌ ప్రాంతానికి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా చట్టం వలన లడఖ్‌ ప్రాంతం 4 సీట్లు, ఇంకో మూడు కొత్త సీట్లు మొత్తం కలిపి జమ్మూకాశ్మీర్‌ అసెంబ్లీ 114 సీట్లకు పెరిగిపోతుంది. 114 సీట్లలో ఏ ప్రాంతానికి ఎన్ని ఇవ్వాలో జమ్మూకాశ్మీర్‌ పునర్వ్యస్థీకరణ చట్టం 2019 ప్రకారం ఎన్నికల సంఘం నిర్ణయిస్తుంది. జాతీయ పార్టీలు జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేలా చేయాలి. కొన్ని రోజుల వరకు జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల హవా ఉండటం మంచిదికాదు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు ఆ ప్రాంత ప్రజల మనోభావాలకి ఎక్కువ విలువ ఇస్తాయి. కనుక జాతీయపార్టీల నాయకత్వం జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రానికి అవసరం. ఇప్పటి నుండి వేర్పాటువాదులు, ఐఎస్‌ఐ, పాకిస్థాన్‌ ఆర్మీకి కష్టకాలం రాబో తుంది. వేర్పాటు వాదులు ఇన్ని రోజులు పాకిస్థాన్‌ నుండి డబ్బులు తీసుకొని జాతి వ్యతిరేక కార్యకలాపాలు చేసేవారు. ఇక నుండి అలా జరగడం దాదాపు అసాధ్యం. ఎందుకంటే రాష్ట్ర ఇంటెలిజెన్స్‌, రాష్ట్ర పోలీసు వ్యవస్థ మీద కూడా కేంద్ర ప్రభుత్వం పెత్తనం ఎక్కువగా ఉండబోతోంది. ఇక నుండి పాకిస్థాన్‌ అంత సులువ్ఞగా ఉగ్రవాదులను కాశ్మీర్‌కి పంపలేదు. అందువలనే పాకిస్థాన్‌ ప్రతి ఒక్కరి కాళ్లుపట్టుకుంటోంది. కానీ ప్రపంచంలో ఏ దేశం కూడా పాకిస్థాన్‌ మాట వినే పరిస్థితి లేదు. పాకిస్థాన్‌ ఇప్పటికే ఆర్థిక మాంద్యంతో, పేదరికంతో, నిరుద్యోగ సమస్యతో అల్లాడిపోతోంది. ఇప్పటికైనా పాకిస్థాన్‌ బుద్ధి తెచ్చుకొని ఉగ్రవాదాన్ని ఆపాలని ఆశిద్దాం. కాశ్మీర్‌లో పేదరికం, నిరుద్యోగం, ఉగ్రవాదం పోయి సగటు మనిషి అక్షరాస్యత పెరగడం, ఆరోగ్యం, జీవన విధానంలో ప్రమాణాలు పెరిగి భారతీయులతోపాటుగా అధునాతన ప్రపంచంతో పోటీపడిన రోజున కాశ్మీర్‌ సమస్య తీరిపోతుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/