సురభిని మించిన ‘మహా నాటకం!


Thackeray
Thackeray

అది రాజకీయం కాదు- ఆరితేరిన నటీనటులతో ఒక నెల రోజులపాటు ప్రదర్శించిన ‘సురభి కంపెనీ నాటకం లాంటిది! ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ? అన్న ‘లవకుశ చిత్రంలోని పాటలాంటిది!
ఈ ‘మూడంకాలనాటకంలో ప్రధాన పాత్రధారులు చాలా మంది వ్ఞన్నారు. అన్నట్టు- సురభి నాటక కంపెనీ జన్మస్థానం కూడా మహారాష్ట్రే! ఈ ‘మహా నాటకంలో ముఖ్యపాత్రధారులు- బిజెపికి చెందిన మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన శరద్‌పవార్‌, శివసేనకు చెందిన ఉద్ధవ్‌ఠాక్రే! ఇంకా శరద్‌పవార్‌ అన్న కుమారుడు అజిత్‌ పవార్‌, శరద్‌ సతీమణి రష్మి, శరద్‌పవార్‌ దంపతుల కుమారుడు ఆదిత్య పవార్‌ (ఎప్పటికైనా మహారాష్ట్ర ముఖ్యమంత్రి..)
ఇంత ఆసక్తిగా ఏ రోజు ఎవరు రాజు అవ్ఞతారా? అన్న ఉత్కంఠతో యావద్భారతం చెవ్ఞలు రిక్కించి, విస్మయ విస్ఫారిత నేత్రాలతో వీక్షించిన రాజకీయనాటకం- ఆధునిక రాజకీయ నాటకాలలో వ్ఞండదేమో!
నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ, శివసేనల పట్టుదల -బిజెపిని అధికారంలోకి రానివ్వకూడదనే! అందువల్లనే, బద్ధశత్రువ్ఞలైన ఆరెండు పార్టీలు జతకట్టాయి.
నిజానికి, ఎప్పుడో 1966లో బాల్‌ఠాక్రే అనే మరాఠా చిత్రకారుడు ‘మహారాష్ట్ర మహారాష్ట్రులకే అన్న నినాదంతో శివసేనను స్థాపించాడు. అది సంకుచిత ప్రాంతీయవాదం. అందువల్ల, శివసేనను చాలా కాలం మహారాష్ట్రలోని పార్టీలు కాని, మహారాష్ట్రేతర పార్టీలుకాని ‘నన్ను ముట్టుకోకు నా… అన్న సామెతలో వలె దూరంగానే వ్ఞంచాయి!
అయితే, ఎంతకాలం అలా దూరంగా వ్ఞంచడం? కాని, ‘శివసేనానులందరూ పదవ్ఞలకు దూరంగా వ్ఞంటూ వచ్చారు. బాల్‌ఠాక్రేకాని, ఆయన సోదరుని కుమారుడు రాజ్‌ఠాక్రే కాని, కుమారుడు ఉద్ధవ్‌ఠాక్రేకాని ఏ ఎన్నికలలోను శాసనసభకు పోటీ చేయలేదు. అయితే, శివసేన పార్టీకి చెందిన నారాయణ రాణే, మనోహర్‌ జోషీలు అవకాశం వచ్చినప్పుడు మహారాష్ట్రకు ముఖ్యమంత్రులైనారు. వీరిలో మనోహర్‌ జోషీ ఒకసారి లోక్‌సభ స్పీకర్‌ కూడా అయినట్టు జ్ఞాపకం.
ధృతరాష్ట్రుని’తమ్ముని కొడుకు
ఇక్కడ ఒక విషయాన్ని పేర్కొనాలి. బాల్‌ఠాక్రే సోదరపుత్రుడు రాజ్‌ఠాక్రేయే చాలా కాలం వరకు తన పినతండ్రికి వారసుడని లోకమే భావిస్తూ వచ్చింది. ఆయన తన పినతండ్రి వలె ఆవేశపరుడు. మంచివక్త. భావోద్వేగి. సంస్థానిర్మాణదక్షుడు. ఆయన తండ్రి చిన్నప్పుడే గతించడం వల్ల చిన్నాన్న వద్దనే పెరిగాడు. అన్నీ చిన్నాన్న లక్షణాలే!
అయితే, తీరా వారసత్వం ప్రసక్తి వచ్చేసరికి ఎవరి దారి వారిదే! బాబాయి సొంత అబ్బాయికే పట్టం కట్టాడు! బాల్‌ఠాక్రే వారసుడు రాజ్‌ఠాక్రే కాదు. ఉద్ధవ్‌ ఠాక్రే అన్నారు. పాపం! ఇంతకాలం పినతండ్రినే నమ్ముకున్న రాజ్‌ఠాక్రే శివసేన నుంచి వైదొలగి, మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సమితి అనే నూతన పార్టీని స్థాపించాడు! అయితే, ఉద్ధవ్‌ఠాక్రే పట్టాభిషేకానికి మొన్న రాజ్‌స్వయంగా హాజరైనాడు. అది ఆయన హుందాతనం.
మూడు పార్టీల ముఖ్యమంత్రులాట!
ఇక, మొన్న మూడు పార్టీల ముఖ్యమంత్రులాట ‘ముచ్చటను యావత్ప్రాపంచమే ముచ్చటగా వీక్షించింది! తెల్లవారితే, ఉద్ధవ్‌ఠాక్రేకు ముఖ్యమంత్రి పట్టాభిషేకమనగా, రాత్రికి రాత్రే నేషనలిస్ట్‌ కాంగ్రెసు నాయకుడు శరద్‌పవార్‌ సోదరపుత్రుడు అజిత్‌పవార్‌ పిల్లిమొగ్గవేసి, రాత్రికిరాత్రే సొంత పార్టీకి ‘కిక్‌ ఇచ్చి, ప్రత్యర్థి శిబిరంలో చేరగా, ఇంకా ముంబాయి ప్రజలు నిద్ర కళ్లతో వ్ఞండగానే బిజెపి నాయకుడు ఫడ్నవీస్‌ ముఖ్యమంత్రి ఎన్‌.సి.పి నాయకుడు అజిత్‌ పవార్‌ ఉపముఖ్యమంత్రిగా గవర్నర్‌ భగత్‌సింగ్‌ ప్రమాణ స్వీకారం చేయించి ‘భగత్‌సింగ్‌ అనే పేరుకే కళంకం తెచ్చాడు!
కాని, పదవీబంధం కంటె రక్తబంధమే మిన్న అని ఎన్‌.సి.పి నాయకుడు అజిత్‌పవార్‌ నిరూపించాడు. అటు పినతల్లి రష్మి (శరద్‌పవార్‌ సతీమణి) ఇటు బాబాయి కుమార్తె, ఎమ్‌.పి అయిన సుప్రియ సూలే అభ్యర్థనలు ఆలకించి, తిరిగి రాత్రికిరాత్రే ‘మకాం మార్చాడు!
కథసుఖాంతం!
ఫడ్నవీస్‌ కంచికి, అజిత్‌పవార్‌ ఇంటికి! ‘మహా రాజకీయం! ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ! ఉద్ధవ్‌ఠాక్రే వయస్సు 59 సంవత్సరాలు.

  • డాక్టర్‌ తుర్లపాటి కుటుంబ రావు
    (”పద్మశ్రీ అవార్డు గ్రహీత)
  • తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/