వేద విజ్ఞానాన్ని అందుబాటులోకి తేవాలి


వేదకాలంలో జ్ఞానసముపార్జనకు వాదం, తర్కం, ప్రశ్న ప్రధాన మార్గాలుగా చెప్పుకోవచ్చు. ప్రపంచానికి విశ్వం పట్ల అవగాహన లేని రోజులలోనే అంతరిక్షాన్ని గురించి, సౌర కుటుంబ రహస్యాలను ఛేదించిన జ్ఞానం భారతదేశ శాస్త్రజ్ఞులది. అంటే ఆనాటి రుషులది. ఒక శాస్త్రవేత్త తన ఆలోచనలను ప్రయోగరూపంలో చేసి, తాను అనుకొన్న ఫలితాలను సాధించి ప్రజలకు తెలియచేస్తాడు. అంటే గతంలో లేని, లేదా తెలియని శక్తిని కొనుగొని ప్రపంచానికి తెలపడమే ఆవిష్కరణ, కనుగొనడం అంటున్నాం.

పంచంలోకెల్లా అత్యంత పురాతనమైన గొప్ప సంస్కృతి, నాగరికత కలిగిన జాతి భారత జాతి. భారతదేశ సంస్కృతి అత్యున్నత స్థాయిలో పరఢవిల్లిన రోజున ప్రపంచంలోని ఏ ప్రాంతం లో కూడా ఆ స్థాయి నాగరికత, విజ్ఞానాభివృద్ధి లేదు. చారిత్రకాధా రాలే కాకుండా సాహిత్య ఆధారాల ను తీసుకొన్నా ప్రపంచంలో భారతజాతి గౌరవం ఇనుమడింప చేస్తుంది. నాగరికతలోనే కాకుండా వర్తక వాణిజ్య రంగాలలో పాశ్చాత్య దేశాలకు ఎన్నో రకాల వస్తువ్ఞలను, సుగంధద్రవ్యాలను, సాంకేతికతను ఎగుమతి చేస్తూ సముద్రమార్గాల ద్వారా కూడా వరక్తం చేసిన గొప్ప చరిత్ర ఉంది. ప్రపంచ దేశాలు కళ్లు తెరవక ముందే అంతరిక్షంలోని రహస్యాలను కనుగొని, ప్రపంచానికే మార్గనిర్దేశనం చేసిన భారతదేశ శాస్త్రజ్ఞుల అపార అనుభవం ఇతరులకు ఎంతగానో ఉపయోగపడింది. భారతదేశంలోని అపార జ్ఞానసంపదను చూసి ఆశ్చర్యపోయిన చైనా, గ్రీకు దేశస్తులు ఇక్కడి విశ్వవిద్యాలయాల్లో చేరి ఆ జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేశారు. ఇక్కడి సహజ వనరులను, పంటలను, సువిశాలమైన మైదానాలను, నీటి వసతులను, అందమైన కొండ ప్రదేశాలను చూసి అసూయపడ్డారు. అంతటి సంపద, జ్ఞానాన్ని కలిగిన భారతజాతి తరువాతి కాలంలో ప్రపంచంలోని పేద దేశాల్లో ఒకటిగా, విజ్ఞాన సాంకేతికరంగాల్లో అట్టడుగు దేశంగా మిగిలి పోవడానికి ఇప్పటి మేధావ్ఞలు తలా ఒక కారణం వెతుకుతు న్నారు. గత రెండు మూడు వందల సంవత్సరాల చరిత్రను తీసుకొన్నా భారతజాతి ఆర్థికంగా రోజురోజుకూ దిగజారిపోయిం ది. కానీ ఏమాత్రం ఎదగలేదు. సముద్ర గుప్తుని కాలం స్వర్ణ యుగం అని, శ్రీకృష్ణదేవరాయుల కాలంలో అంగట్లోనే అన్నీరకాల రత్నాలను రాశులుగాపోసి అమ్మిన చరిత్ర మనది. కాని ఎందువల్ల ఈ రోజు మనదేశం ఆర్థింగా దివాలా తీసింది. ఎందుకు ఎదగకలేకపోతున్నది? ప్రపంచంలోని ఏ ప్రాంతంలోనైనా ఆనాటి రాజులు, చక్రవర్తులు తమది కానీ, లేదా తాము వ్యతిరేకించే వారి విజ్ఞాన భాండాగారాలు అయిన గ్రంథాలయాలను నాశనం చేయ డం పరిపాటిఅయింది. ప్రజలను వివేకవంతులను చేసేది మేధా వ్ఞల తాత్వికుల రచనలు, వారి ఆలోచనలు అని, అవి ఎప్పుడూ ప్రజావ్యతిరేకులను, నియంతలను ప్రశ్నిస్తూనే ఉంటాయని,ప్రజలు మేలుకొంటే రాజ్యానికి, రాజ్యాధికారానికి చెడని భావించడమే ఈ దుశ్చర్యలకు కారణం. నాటికీ, నేటికీ విజ్ఞాన కేంద్రాలను గ్రంథాల యాలను, ప్రశ్నించడం నేర్పే మేధావ్ఞలను, ప్రశ్నించగలిగే సాహ సం చేసే సామాన్యులను రాజ్యం భరించలేదు. ప్రశ్నించడం అంటే జ్ఞానాన్ని పొందడం, కొత్త జ్ఞానాన్ని వెలుగులోకి తేవడం అని మన వేదాలు చెపుతున్నాయి. వేదకాలంలో జ్ఞానసముపార్జనకు వాదం, తర్కం, ప్రశ్న ప్రధాన మార్గాలుగా చెప్పుకోవచ్చు. ప్రపం చానికి విశ్వం పట్ల అవగాహన లేని రోజులలోనే అంతరిక్షాన్ని గురించి, సౌర కుటుంబ రహస్యాలను ఛేదించిన జ్ఞానం భారతదేశ శాస్త్రజ్ఞులది. అంటే ఆనాటి రుషులది. ఒక శాస్త్రవేత్త తన ఆలోచ నలను ప్రయోగరూపంలో చేసి, తాను అనుకొన్న ఫలితాలను సాధించి ప్రజలకు తెలియచేస్తాడు. అంటే గతంలో లేని, లేదా తెలియని శక్తిని కొనుగొని ప్రపంచానికి తెలపడమే ఆవిష్కరణ, కనుగొనడం అంటున్నాం. ప్రకృతి ఆధారంగా జరిగిన ప్రయోగాల వల్లనే ఈ ప్రకృతిలోని అనేక విషయాల రహస్యాలను కొనుగొనే ప్రయత్నాలు జరిగాయి. సనాతన ధర్మాన్ని రక్షించాలని ఘోషించే సంస్థలు కానీ, వేదాలలోని కర్మకాండలను నమ్ముకొని జీవించాల నుకొనేవారు కానీ, ప్రభుత్వం కానీ స్వాతంత్య్రం వచ్చిన ఈ 70 ఏళ్లలో చేసింది ఏమిటా అని వెనక్కి తిరిగి చూసుకొంటే మనకు కనిపించేది శూన్యమే. అంటే శూన్యం నుండే అన్నీ ఉద్భవించాయ ని చెప్పినట్లు ఇంకా మనం ఆ శూన్యంలోకే చూస్తున్నామేమో అని పిస్తుంది. నేటికీ వేదాల్లో ఏముందో సామాన్యులకు అందనీయక ుండా వేదాల్లో ఉన్నదే మన భారతీయ సనాతన ధర్మం అని అంటున్నారు. వేదాల్లో నిజంగా శాస్త్రసాంకేతికత విజ్ఞానమే ఉంటే చంద్రయాన్‌ కోసం లక్షల కోట్లు ఖర్చు చేసే ప్రభుత్వాలు ఎందుకు వీటిపై ప్రయోగాలు చేయడానికి ప్రయత్నాలు చేయడంలేదో విజ్ఞులు ఆలోచించాలి. దేశ రక్షణ కోసం అనేక రకాలైన విధ్వంసకర క్షిపణులను, విమానాలను ఇతర ఆయుధాలను లక్షలకోట్ల రూపా యలను విదేశాల నుండి కొనుగోలు చేయడానికి, సామాన్య ప్రజల కష్టార్జితంతో సంపాదించిన డబ్బుల నుండి చెల్లించే పన్నుల రాబ డిని ఖర్చు చేయాలనుకొంటున్న ప్రభుత్వాలు మాత్రం వేదవిజ్ఞానం పట్ల,అందులో ఉన్నదని చెప్పే శాస్త్రసాంకేతికతపట్ల శ్రద్ధ వహించ కపోవడతోనే సామాన్యులలో వేదాల పట్ల నిర్లక్ష్యభావనకు కార ణం. ధర్మం ధర్మంగా తనదారిలో తాను నడుస్తూ ప్రజలను వివే కవంతులను చేసినన్ని రోజులు వేదంలోని అన్నీ శాఖలు తమ తమ పరిధిలో సక్రమంగా పనిచేసి ఉంటాయి. కానీ ఆ జ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని కొన్ని వర్గాలు తమ ఆధిపత్యాన్ని నిలుపుకో వడానికి చేసిన ప్రయత్నాలలో భాగమే వాటిలోని అసలు జ్ఞానం తెరమరుగైపోయింది. దాని స్థానాన రాజ్యధర్మ వెలికి వచ్చింది. అది భారత కాలం నాటికి భారతదేశమంతా వేళ్లూనుకొని, రాజ్యా ధికారం కోసం ధర్మాన్ని అధినేతలు మాటకు అనుకూలంగా మలు చుకోవచ్చనే రాజనీతి విలువలు సమాజంలో గౌరవాన్ని, ఆధిపత్యా న్ని సంపాదించాయి. నేటికీ అదే ధోరణిలో సనాతన ధర్మ రాజకీయాలు కొనసాగుతున్నాయి.

  • సిహెచ్‌వి ప్రభాకర్‌ రావ్ఞ
    సీనియర్‌ జర్నలిస్టు

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/