విద్యావిధానంలో విలువల ప్రాధాన్యత


దే శ భవిష్యత్తు పాఠశాల విద్యతోనే నిర్మాణం అవ్ఞతుంది. ఈ రోజు పాఠశాలలో విద్యార్థుల మనస్సులో ఏయే విలు వలతో విత్తనాలు నాటుతారో రేపు అవే వారు పెద్దవారు అయ్యాక సమాజంలో వృక్షాలుగా మారి మనకు కనిపిస్తారు. అందుకే పాఠ శాలలపాత్ర చాలా ముఖ్యమైనది. పిల్లలో మంచి విలువలు అనేవి పాఠశాలలో విద్యనేర్చుకొనే రోజులలోనే అలవాటవ్వాలి. ఎందు కంటే లేత వయస్సులో నేర్చుకున్న లేక నాటుకున్న చక్కటి విలు వలు ఎప్పటికీ చెరిగిపోవ్ఞ.పెరిగి పెద్దయ్యాక కూడా ఉపయో గపడతాయి.మనం ఎప్పుడూ చాలా సులభంగా మంచి విలువలు అంటూ ఉంటాం. కానీ అవి ఏమిటో చెప్పడమే కొద్దిగా ఆలోచి స్తాం. విలువలు అనేది తొందరగా అంతుచిక్కని పదమే. అందులో ప్రాథమిక పాఠశాలలో చదివే పిల్లలకు చెప్పే విలువలు ఏమి ఉం టాయి? అనే ప్రశ్న వస్తుంది.

చాలా మటుకు విలువలు, నైతికత (నీతిగా ఉండటం) పర్యాయపదాలు (అంటే ఒక దానికి బదులు మరొకటి)గా వాడలేం. వాస్తవానికి విలువ అనేది నైతికత కన్నా ఎక్కువ. అందరూ నీతులు చెప్పేవారు విలువలు కలిగి ఉంటారు అనలేం. కానీ విలువలను పాటించేవారు నీతిని కూడా కలిగి ఉం టారు. నీతిగా ఉండటం ఒక వ్యక్తికి సంబంధించినది. విలువలు కలిగి ఉండటం సమాజ అభివృద్ధికి ఉపయోగపడే విషయాలు. పాఠశాల దశలో పిల్లలకు చెప్పే విలువలలో మొదటిది అందరితో కలిసి మెలసి సోదర భావంతో ఉండటం.కుల,మత, జాతి,ప్రాంత, భాషా విచక్షణ లేకుండా అందరిని సమాన భావంతో చూడటం. తమ తరగతి గదిలోని వారినే కాదు, మొత్తం పాఠశాలలోని విద్యార్థులందరినీ ఇదే సమాన, సౌభ్రాతృత్వ భావంతో చూడటం నేర్పాలి. పెద్దలను గౌరవించడం, ప్రతివారి పట్ల మర్యాదగా మెల గడం, అసభ్యకరమైన మాటలకు, నడవడికకు దూరంగా ఉండి మంచి అలవాట్లు నేర్చుకోవడం కూడా విలువలలోకే వస్తాయి.

విద్యార్థులు సామాజిక స్పృహ అంటే తమ చుట్టూ వ్ఞండే సమాజంలోని ప్రజలు లేదా పాఠశాలలో తమ తోటి వయస్సు వారి మీద ప్రేమ, కష్టలలో ఉన్నవారి మీద జాలి, సహాయపడా లనే ఆలోచన కూడా విద్య కలుగచేయాలి. ‘భూతదయ అని మనం ఎక్కువగా వాడుతాం. అంటే చిన్నతనం నుంచి విద్యార్థు లకు తమ చుట్టూ వ్ఞండే పరిసరాలలోని మొక్కలు, చెట్లు, చిన్నచిన్న జీవ్ఞలైన పిల్లులు, కుక్కలు, మేకలు పక్షులు వాటిపై జాలి, ఆదరణ చూపటం నేర్పాలి. దీనివల్ల వాళ్లమనస్సు పెద్ద య్యాక కూడా సున్నితంగా ఉంటుంది. ఈ దేశ సంస్కృతిని గౌరవవించడం కూడా విలువలలో ఒక భాగమే. ఈ విలువల విషయాలలో పాఠశాలలోని ఉపాధ్యాయులే కాదు ఇంటిలోని తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలి. తల్లిదండ్రులు పిల్లలను తీర్చిదిద్దడంలో సగానికి సగం బాధ్యులు. తమ పిల్లలకు ఇతర విద్యార్థులతో మంచి సంబంధం ఉండాలి అని వారు బోధించాలి.

పిల్లల్లో అప్పుడప్పుడు కలిగే వ్యతిరేక భావాలను తల్లిదండ్రులు ఖండిచాలే కానీ ఏదో చిన్న పిల్లవాడు, ఆకతాయిగా చేస్తున్నాడు అని ‘ఊరుకోవటం లేక నవ్ఞ్వలాటగా వదిలివేయడం చేయకూ డదు. అలా వదలివేస్తే ఆ వ్యతిరేక భావాలు వారితోనే పెరిగి పెద్దయ్యాక వాళ్ల మనస్సును పాడుచేస్తాయి. పిల్లలు బడి నుంచి వచ్చాక వారి చదువ్ఞ సంగతే కాకుండా వారు ఆ రోజు బడిలో ఎలా గడిపారో కూడా సున్నితంగా అడిగి తెలుసుకోవాలి. దానివల్ల వాళ్ల చిన్న మనస్సులో ఏర్పడ్డ చికాకులు, ఇతర విద్యార్థులలో ఉండే ఒత్తిళ్లు, మనస్పర్థలు వాటిని సమాధానపరచాలి. తల్లిదండ్రు లు పిల్లలకు మంచి నడవడికను నేర్పటం అంటే వారి భవిష్యత్తుకు బంగారు బాట వేయటమే. ముఖ్యంగా మాధ్యమిక (6,7,8 తరగతుల), ఉన్నత (9,10 తరగతుల) విద్యార్థులకు సంబంధించిన విలువలలో మొదటిదిగా ప్రజాస్వామిక దేశాలలోని స్వేచ్ఛ సమానత్వం గురించి తెలియచేయాలి. ఇవి పాఠ్యాంశాలలో భాగమే. ఈ విషయాలలో చర్చలు, నివేదికల మీద ఏర్పాటు చేసి ఉపాధ్యాయులు, యాజమాన్యం విద్యార్థులచే వాళ్ల అభిప్రాయాలు చెబుతూ మాట్లాడేటట్లు చేయాలి. ఇలా ఏర్పాటు చేసిన చర్చావేదికలలో విద్యార్థులను వారి వాక్‌ స్వేచ్ఛకు వదిలివేయాలి. ఈ విలువలు అనేవి ఉపాధ్యాయుడు విద్యార్థుల పాఠ్యాంశాలలోని వివరించే టప్పుడు అర్థవంతంగానూ, హేతుబద్ధంగానూ వివరించాలి. అప్పుడే అది అవగాహనలోనికి వస్తాయి.

సమాజంలో తాను సొంతంగానూ, నలుగురితో కలిసి ఆలోచించి పనిచేసే విధానం నేర్పాలి. ముఖ్యంగా తెలుగు, ఇంగ్లీషు, హిందీ మొదలైన భాషాపరమైన పాఠ్యాంశాలలో మన కుటుంబ వ్యవస్థను బలపరిచే అంశాలను చేర్చాలి. అంటే ఆత్మీయత అనురాగాలను పెంచే విధంగా అనాదిగా వస్తున్న మన కుటుంబ వ్యవస్థను ఉదాహరణగా చూపుతూ పాఠ్యాంశాలు ఉండాలి. అలాగే మతపరమైనవి పూర్తిగా పాఠ్యాంశాలలో తొలగిస్తామంటూ సమాజంలో డొల్లతనాన్ని తేకూడదు. మనదేశంలోని అన్ని మతాలలో ఉండే మంచి లక్షణాలను పిల్లలు నేర్చుకొనేలా పాఠ్యాంశాలను అందించాలి. ఒక విద్యార్థి పూర్తిగా ఎదగాలి అంటే మానసికంగా మంచి లక్షణాలు అంటే విలువల ఆధారిత లక్షణాలు ఎక్కువగా అందించాలి. ఇవి ఏవీ ఒక హితబోధ లాగా చేయకూడదు. అలా చేస్తే పిల్లలకు వ్యతిరేకత వస్తుంది. అంతకంటే ఏ అంశమైన వివరంగా, విమర్శనాత్మకంగా చెప్పివదలివేయాలి. అది తప్పకుండా ఏదో ఒకరోజు ఏదో ఒక రూపంలో వాళ్లకి అర్థం అవ్ఞతుంది. కాబట్టి విలువలతో కూడిన సమాజానికి, ఉపాధ్యాయుడు, తల్లిదండ్రులు, పుస్తకాలలోని పాఠ్యాంశాలు మూడు ముఖ్యమేనవని గుర్తించాలి.

– జి.ఇందిర