రాజధానిని మార్చక తప్పదా?

Amaravati
Amaravati

నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని ఎక్కడ నిర్మించాలి అన్న అంశంమీద లోతైన విచారణ జరిపిన జస్టిస్‌ శివరామకృష్ణన్‌ ప్రస్తుత తుళ్లూరు ప్రాంతం రాజధాని నిర్మాణానికి ఏమాత్రం అనువ్ఞగా లేదని, అక్కడి భూమి పటిష్టమైన కట్టడాలకు వీలుగా లేదని, రాజధానిని మెట్టప్రాంతమైన దొనకొండలో నిర్మించడమే శ్రేయస్కరమని తన నివేదికలో స్పష్టం చేశారు. అయినప్పటికీ చంద్రబాబు ఆ కమిటీ సూచనలను పెడచెవిన పెట్టి అప్పటి విపక్షం వైఎస్సార్‌సిపిని కానీ, ఇతర రాజకీయ పార్టీలను కానీ ఏమాత్రం స్పందించకుండా మంగళగిరి సమీపంలో అమరావతిని రాజధానిగా ప్రకటించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో చంద్రబాబు సామాజికవర్గం వారు అధికంగా ఉన్నారని, వారికి ప్రయోజనం కలిగించడానికి మాత్రమే ఆ ప్రాంతాన్ని ఎంపిక చేసారని వైఎస్సార్‌సిపి విమర్శలు చేసింది. అయినప్పటికీ చంద్రబాబు పట్టించుకోలేదు. అమరావతికి పార్లమెంటు ఆమోదం లేకపోయినప్పటికీ నాడు కేంద్ర ప్రభుత్వంతో గల సంబంధాలను పురస్కరించుకుని అమరావతికి శంకుస్థాపన చేశారు. ప్రధానమంత్రిని ఆహ్వానించారు. ఆయన అప్పటికప్పుడు కొంత మొత్తం నిధులు ఇచ్చే ప్రకటన చేస్తారని బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. అయితే అందరి ఆశల మీద నీళ్లుచల్లుతూ ఒక ముంతతో మట్టి, మరొక ముంతతో నీళ్లు ఇచ్చి వెళ్లిపోయారు. ప్రధాని వైఖరిని చూసినవారికి చంద్రబాబు ప్రతిపాదిత అమరావతి పట్ల ఆయన సుముఖంగా లేరని ఆనాడే పసిగట్టారు ఒక్క చంద్రబాబు తప్ప. చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయి జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతి నిర్మాణ కార్యకలాపాలు మొత్తం ఆపేయడంతో అమరావతి ప్రగతి మీద పలు సందేహాలు కలిగాయి. ఆంధ్రప్రదేశ్‌ వంటి లోటు రాష్ట్రానికి చంద్రబాబు చెప్పే సింగపూర్‌ తరహా రాజధాని అవసరం లేదని వైఎస్సార్‌సిపి అనేకసార్లు చెప్పడంతో అమరావతి ఆగిపోయే సూచనలు కనిపించాయి. మొన్న కృష్ణ, గుంటూరుజిల్లాల్లో సంభవించిన వరదలు, ఆ రెండు జిల్లాల్లో అనేక గ్రామాలు వరదముంపునకు గురికావడం, చివరకు చంద్రబాబు నివసిస్తున్న లింగమనేని అతిథిగృహం కూడా ముంపునకు గురై చంద్రబాబు ఆ నివాసాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవడం జగన్‌ ప్రభుత్వానికి అయాచితవరంగా మారింది. మొన్న వచ్చిన వరదల పుణ్యమా అని, అమరావతి ప్రాంతం ఏమాత్రం సురక్షితం కాదని తేలిపోయింది. రాజధాని అంటే అత్యున్నతమైన రహదారులు, ఫ్ల§్‌ుఓవర్లు, ఎతైన భవనాలు అవసరం అవ్ఞతాయి. కానీ అక్కడి నల్లరేగడి నేల పటిష్టమైన నిర్మాణాలకు అనుకూలం కాదని జస్టిస్‌ శివరామకృష్ణన్‌ కమిటీ ఏనాడో తేల్చి చెప్పడంతో ఇప్పుడు రాజధాని మారే అవకాశం ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దేశంలోని పెద్ద రాజధాని నగరాలైన ఢిల్లీ, ముంబైలకు కూడా వరద ముప్పు దోబుచులాడుతూనే ఉన్నది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రకృతి విపత్తులను తట్టుకుని నిలిచే రాజధానిని నిర్మించుకోవాల్సిన ఆగత్యం ఉన్నది. రాజధాని నగరం తడవకోసారి మునిగిపోతుంది అనే చెడ్డపేరు వస్తే ఇక పరిశ్రమలు ఎలా వస్తాయి?


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/