రాజకీయ అనిశ్చితి!

ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో రాష్ట్రపతిపాలననను రద్దు చేస్తూ ఆరాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టేఉత్తర్వులు జారీచేయడంతో ఆ రాష్ట్రంలో రోజు రోజుకూ కొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో స్టేవిధించి 27వ తేదీవరకూ యధాతథస్థితిని కొనసాగించాలని సుప్రీంఆదేశాలు జారీచేసింది. కేంద్రం, రాష్ట్రాల అధికారాల్లోనూ, పాలనల్లోనూ జోక్యం చేసుకోవడంపై ముందురోజు ప్రశ్నించిన ఆ రాష్ట్ర హైకోర్టు రాష్ట్రపతిపాలన విధింపు తొందరపాటుచర్యగానే పేర్కొంది. ద్రవ్యవినిమయబిల్లు ఆమోదంకాకపోవడం, ఆపై ప్ర భుత్వంపై ఎమ్మెల్యేల తిరుగుబాటుతో ముఖ్యమంత్రి హరీష్‌రావత్‌ మైనార్టీలో పడిపోవడం దరిమిలా బిజెపి ఎమ్మెల్యేలతో కలిసి కొత్తప్రభుత్వం ఏర్పాటుకు సమాలో చనలు శరవేగంగా జరిగిపోయాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వాలను పడదోసి అధికారాలను చేజిక్కించుకుంటున్నదన్న అభియోగాలపై ఆరాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా హైకోర్టు ను ఆశ్రయించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పాటైన ప్ర భుత్వాలను కేంద్రం కూలదోస్తోందంటూ విమర్శించారు. దీనిపై రాష్ట్రంలో ఉన్న అనిశ్చితి కారణంగా రాష్ట్రపతి పాలనను విధించాల్సి వచ్చిందంటూ కేంద్రం గత నెల 27వ తేదీ రాష్ట్రపతి పాలన విధించినట్లు తనవాదనను సమర్ధించుకుంటూ వచ్చింది. కేంద్రంవాదన ఆరాష్ట్ర హై కోర్టుకుఆగ్రహం రప్పించిందనే చెప్పాలి. రాజ్యాంగంలోని 356 అధికరణం విధించేందుకు సరైనకారణాలు కేంద్రం చెప్పలేకపోయిందని అభిశంసించింది. కేంద్రం చెపుతు న్న వాదనలను అనుమతిస్తే దేశసమాఖ్యవ్యవస్థకే విఘా తమని హైకోర్టు హెచ్చరించింది. భారతదేశం రాష్ట్రాల సమూహమని, ఒక సమాఖ్యని గుర్తుచేసింది. కేంద్రం, రాష్ట్రాలు తమతమపరిధిలో సార్వభౌమాధికారాలు కలిగి ఉంటాయని, రాజ్యాంగంప్రకారం నడవనిపరిస్థితిఉంటేనే రాష్ట్రపతి పాలనకు అవకాశం ఉంటుందంటూ చురకలు వేసింది. 29న అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకోవాలని కూడా ముఖ్యమంత్రికి సూచించింది. రాష్ట్రపతి పాలనను తొలగించాలని ఆ రాష్ట్రముఖ్యమంత్రి రావత్‌ తదితరులు దాఖలుచేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు 356 అధికరణం ప్రకారం రాష్ట్రపతి పాలన విధింపు సుప్రీం మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉందని అభిప్రాయపడింది. పైగా  తొమ్మిదిమంది కాంగ్రెస్‌ తిరుగుబాటు ఎమ్మెల్యేల అనర్హతను కూడా ఆమోదించడం అక్కడి ముఖ్యమంత్రికి పెద్ద ఊరటనిచ్చింది. కేంద్రం అమలుచేస్తున్న చర్యలు అందుకు దారితీసిన పరిణామాలతో ప్రజాస్వామ్య ప్రభుత్వం కూలిపోయిందన్నది మాత్రం వాస్తవమని హైకోర్టు చురకలువేసింది. రాష్ట్రపతిపాలనకు కేంద్రం పరిగణనలోకి తీసుకున్న కారణాలు బలంగాలేవని, ద్రవ్యవిని మయ బిల్లు ఆమోదం తర్వాత ఓటింగ్‌ జరపాలన్న డిమాండ్‌ను అంగీకరించలేదన్న ఏకైక కారణంతో పిటిషనర్‌ విజ్ఞప్తిని తిరస్కరించలేమని సైతం స్పష్టం చేసింది. ప్రభుత్వాల కూల్చివేతకు సంబంధించి కాంగ్రెస్‌ పార్టీని కూడా వదల్లేదు. ఏళ్లతరబడి అధికరణం 356 దుర్వినియోగం అవుతూనే ఉందని, ముఖ్యమంత్రి రావత్‌పార్టీ రికార్డుకూడా గొప్పగాఏమీలేదని వ్యాఖ్యానించింది.  స్వా తంత్య్రానంతరం తొలి 40 ఏళ్లకాలంలో కేంద్ర ప్రభుత్వం సుమారుగా 100 రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసిందని హై కోర్టు గుర్తుచేసింది.  అంతేకాకుండా రాష్ట్రపతి పాలనకు కేబినెట్‌ సిఫారసు చేసిన పత్రం రహస్యంగా ఉంచాల్సిన అవసరమేమీలేదని, ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్నిపత్రాలు బహిరంగపరచాలని కోర్టు సూచించింది. అనుబంధ పద్దులబిల్లులు ఆమోదం పొందకపోతే ప్రభుత్వం అధికారం నుంచి వైదొలగడం సాంప్రదాయమే అయినా ప్రభుత్వం ఆవిధంగా చేయకపోతే బలపరీక్షను ఎదుర్కొన డం ఏకైకమార్గంగా వెల్లడించింది. ఆరాష్ట్ర గవర్నర్‌ ఇదే విధంగా భావించినట్లు ధర్మాసనం అభిప్రాయపడింది. రాష్ట్రపతిపాలన విధింపును అంగీకరిస్తే రాష్ట్ర వ్యవహారాల్లో కేంద్రం జోక్యాన్ని ఆమోదించినట్లవుతుందని, దేశం లోని సమాఖ్య వ్యవస్థకు తీవ్రవిఘాతం కలుగుతుందని హెచ్చరించడం కేంద్రానికి పరిధులుతెలుసుకోవాలని సూచించినట్లే భావించాలి. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్రం సుప్రీంలో అప్పీలుచేయడం దరిమిలా 27వ తేదీవరకూ హైకోర్టు ఉత్తర్వులునిలుపుదలచేసి విచారణకు స్వీకరించింది. అంతేకాకుండా ఈకేసులోపార్టీలైన అటుఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి, ఇటు కేంద్ర ప్రభుత్వం తరపు ప్రతి నిధులకు తీర్పు కాపీలు రెండు అందించాలని సూచిస్తూ అప్పటి వరకూ రాష్ట్రపతి పాలనను రద్దుచేయ కూడదనికూడా సుప్రీం స్పష్టంచేయడంతో కేంద్రంపైవచ్చిన విమర్శలను అధిగమిం చినట్లయింది. బిజెపి అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకుకూడా వీలులేదని స్పష్టమైంది. తీర్పుకాపీలులేకుండా ఎలా స్టేఉత్త ర్వులు జారీచేస్తారని ప్రశ్నించిన న్యాయవాదులకుకూడా సుప్రీం తనవివరణఇస్తూ కేవలం ఉత్తరాఖండ్‌ హైకోర్టు తీర్పుకాపీలు వచ్చేంతవరకూ తీర్పు అమలుసాధ్యంకాదని మాత్రమే చెప్పామని న్యాయమూర్తి స్పష్టంచేయడంతో ఉత్త రాఖండ్‌పై సుప్రీం విచారణ తర్వాతనే ఒకనిర్ణయంఉంటుం దని స్పష్టం మౌతోంది. మొత్తంమీదపార్టీల ఆధిపత్యంతో ప్రభుత్వాలు కుప్పకూలుతున్నాయి. గతంలోకూడా అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో ఇదేపరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. అక్కడికాంగ్రెస్‌ప్రభుత్వాన్ని కూలదోసేందుకుకేంద్రం ప్రయత్నించిందంటూ హైకోర్టు, సుప్రీంకోర్టులనుసైతం అక్కడి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వాలు కోర్టులను ఆశ్రయించారు. సరిగ్గా అదేతీరులో ఇపుడు ఉత్తరాఖండ్‌ రాష్ట్రం లో పరిణామాలు చోటుచేసుకోవడం రాజకీయ అనిశ్చితిని స్పస్టంచేస్తోందని చెప్పకతప్పదు.