మొబైల్‌ వినియోగంతో పిల్లలపై దుష్ప్రభావాలు

CHILDREN WITH MOBILE
CHILDREN WITH MOBILE

నే డు రోజంతా మొబైల్‌ వీడియో గేమ్స్‌లో చిన్నపిల్లలు మునిగితేలుతున్నారు. తద్వారా మినీ ఆటస్థలాలుగా క్రీడాప్రాంగణాలుగా మొబైల్‌ఫోన్లు మారుతున్నాయి. పిల్లలు ఆరు బయట ఆడటం లేదు. ఇంట్లో పెద్దలతో మాట్లాడటం తగ్గిపోవ డం జరుగుతోంది. మితిమీరిన విధంగా ఈ ఎలక్ట్రానిక్‌ ఉప కరణాలను ఉపయోగించడం వల్ల పిల్లలపై దుష్ప్రభావం క్రమేణ పెరుగుతున్నది. దీనివల్ల చిన్నపిల్లలు చిన్నతనం నుంచే స్థూల కాయంతో బాధపడవలసి వస్తోంది. అదేవిధంగా చిన్నతనంలోనే మధుమేహం వ్యాధికి గురవ్ఞతున్నారు. నిపుణులు వైద్యులు మొబైల్‌ వినియోగం గంటకు మించి వాడటం మంచిదికాదు. ఆరోగ్యానికి హానికరమని చెబుతున్నారు.

మొబైల్‌ వినియోగం గురించి ఇటీవల కాలంలో నూతన మార్గదర్శకాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసింది. పిల్లలకు సెలువ్ఞలు వచ్చాయంటే ఒకప్పుడు పిల్లలంతా ఆరుబయట ఆట స్థలాలలో ఆడుతూ కనిపించేవారు. నేడు ఆటస్థలాలే తగ్గిపోవడం ఇళ్లల్లో ఖాళీ స్థలం లేకపోవడం అపార్టుమెంట్స్‌ పెరగడం వల్ల ఆరు బయట ఖాళీ స్థలాలు లేకపోవడం పిల్లలు బయట ఆడటం క్రమేపీ తగ్గిపోతున్నది. ఇది గ్రామాలకు కూడా విస్తరిస్తోంది. పిల్లలు మొబైల్‌ ఫోన్లకు టీవీలకు అలవాటుపడిపోయి ఆటలాడటం మరిచిపోతున్నారు. ఒకప్పుడు పాఠశాలలకుపోయే రోజుల్లో సాయంత్రం పూట అదే విధంగా వేసవి సెలవ్ఞల్లో రోజంతా ఆటలాడి శారీరకంగా అలసి పిల్లలందరూ ఇళ్లకు చేరేవారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి దాదాపు నేడు కనిపించడం లేదు. స్మార్ట్‌ఫోన్లు చేతికి వచ్చాక పిల్లలంతా గంటల తరబడి వాటితోనే గడిపేస్తున్నారు.

మొబైల్‌ఫోన్లు, ట్యాబ్‌లు, వీడియోగేమ్స్‌ వంటి ఇతర ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు చిన్నపిల్లలపై తీవ్ర దుష్ప్రభావాలు చూపిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అయితే వీటి వాడకం పెరిగితే చిన్నప్పటి నుంచే పిల్లల్లో ఉబకాయం, కంటి సమస్యలు, మున్ముందు మధుమేహం వంటి అనారోగ్యాలు దరిచేరే ప్రమాదముందని హెచ్చరిస్తోంది. రెండు నుంచి ఐదేళ్ల వయసున్న పిల్లలు రోజుకు గంట కంటే ఎక్కువగా ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు ఉపయోగించకూడదని, అంతకంటే చిన్నపిల్లలు అసలే వాడకూడదని తాజాగా నూతన మార్గదర్శకాలు జారీ చేసింది.

ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలను అధికంగా వినియోగించడం వల్ల పిల్లల్లో మానసిక ఎదుగుదల కూడా ఉండటం లేదు. అలాగే సెల్‌ఫోన్లకు, ట్యాబ్‌లకు అతుక్కుపోయే పిల్లలు సామాజిక సంబంధాలకు దూరమవ్ఞతున్నారు. ఇతరులతో ఎలా మాట్లాడాలో కూడా గ్రహించడంలేదు. యూట్యూబ్‌ను ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మంది చూస్తున్నారని, అందులోపిల్లలు కూడా న్నారని తేల్చింది. ఇది పిల్లల మెదళ్లపై చెడు ప్రభావం చూపిస్తుందని పేర్కొంది.ప్రపంచంలో ఎనిమిదేళ్లలోపు పిల్లల్లో 24 శాతం మంది ట్యాబ్‌లను వినియోగిస్తున్నారని తేలింది.

  • వాసిలి సురేష్‌