మహిళల్లో పోరాట పటిమ పెరగాలి

harassment
harassment

దే శానికి తల్లిగా(భరతమాత), అండనిచ్చే ఆదెరువ్ఞగా (భూ మాత),దాహం తీర్చేతల్లిగా (గంగా దేవి), విద్యాబుద్ధులు ప్రసాదించే దేవతగా (సరస్వతీ దేవి), అష్టైశ్వ ర్యాలు ప్రసాదించే దేవతగా (మహా లక్ష్మి) భారతదేశంలో స్త్రీ మూర్తికి పురాతన కాలం నుండి ఎనలేని ప్రాముఖ్యత కలిగి ఉంది. తల్లిగా, తోటి సోదరిగా, భార్యగా మగాడు పుట్టి బుద్దెరిగిన నాటి నుండి చచ్చేవరకు అన్నీ తానై మగాడి జీవితానికి అండగా నిలిచి, కష్ట సుఖాలలో పాలుపంచుకోవడమేకాక మగాడు సాధించే విజయం వెనుక కానరాని వ్యక్తిగా నిలుస్తూ మగాడి మనుగడలో అతిముఖ్య మైన భూమిక పోషిస్తున్న మహిళ ప్రస్తుతం మనదేశంలో మనిషి రూపంలో ఉండే చిత్తకార్తెకుక్కలను మించిన మానవమృగాల వికృత చేష్టలకు బలవ్ఞతూ, సజీవ దహనాలతో అతి కిరాతక హత్యగా గావింపబడుతున్నది. ఆరునెలల పసికందు నుండి అరవై ఏళ్లు వృద్ధురాలి వరకు కామాంధుల వికృతచేష్టలకు బలవ్ఞతూఅతి కిరాతక చావ్ఞలు చావాల్సివస్తోంది.నిర్భయ చట్టం,ఇంకో చట్టం, చట్టాలు ఎన్ని అమలు జరుగుతున్నప్పటికీ కోరికలతో రగిలిపోతు న్న మానవ మృగాలలో మాత్రం ఎలాంటి భయం కనిపించడం లేదు. పైపెచ్చు మరిన్ని ఆకృత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడుతున్న అత్యధిక శాతం ముద్దాయిల వయస్సు యుక్తవయస్సు నుండి30సంవత్సరాల లోపు ఉండటం గమనార్హం.ఇలాంటి ఆకృత్యాలు జరగకుండా నిలువరించాలంటే అత్యాచారాలకు పాల్పడినవారిని సౌదీ అరేబియా లాంటి ముస్లిం దేశాలలో అమలు జరుగుతున్న తక్షణ కఠిన శిక్షలను మనదేశంలో కూడా అమలు జరిగేలా ప్రభుత్వాలు స్పందించి కొత్త చట్టాలను తీసుకురావాలని అత్యధిక శాతం ప్రజలు, సెలబ్రిటీలు అభిప్రాయ పడుతున్నారు.అయితే కఠినమైన చట్టాలను అమలు చేసే ప్రక్రియ వేగవంతంగా అమలు జరపడం మూలంగా ఒకవేళనిర్దోషిని శిక్షించ డం జరిగి,అసలు ముద్దాయికి శిక్షపడకుండా ఉండే అవకాశాలు కూడా లేకపోలేదు. అలాగే ఇలాంటి అత్యాచార కేసులను ఏళ్ల తరబడి నాన్చుతూపోవడం మూలంగా అత్యాచారాలకు పాల్పడే మానవ మృగాలకు భయమనేది కూడా ఉండదని గమనించాల్సిన అవసరముంది. ఆడవారిని అత్యాచారం చేసి నిర్దాక్షిణ్యంగా తగల బెట్టి చంపేస్తున్నముద్దాయిలను ఎంతకఠినంగా శిక్షించినా అలాంటి నిర్ణయాలను స్వాగతించాల్సిందే.ఈ క్రమంలోనే వై.ఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం హయాంలో వరంగల్‌లో కాలేజీ యువతులపై జరిగిన యాసిడ్‌ దాడిలోని నిందితులను గుర్తించి కోర్టులు, కేసులు అంటూ కాలా న్ని వృధా చేయకుండా కేవలం వారంగడవక ముందే ఎన్‌కౌంటర్‌ చేసి లేపేయడం జరిగింది. ముద్దాయిలు వారే అని ఖచ్చితమైన నిర్ధారణకు వచ్చిన తర్వాత మాత్రమే ప్రభుత్వం అలాంటి నిర్ణ యాలు చేయగలదు. ఆడవారిపై ఆకృత్యాల విషయంలో ప్రభు త్వాలు అలా స్పందించినప్పుడు అటు స్త్రీలకు, ఆడపిల్లలను కన్నవారికి ప్రభుత్వంపై విశ్వాసం ఏర్పడుతుంది. అలాగే ఇటు స్త్రీలపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి గుణపాఠంలా ప్రభుత్వ చర్యలు అవగతమవ్ఞతాయి. అలాగని కఠిన చర్యల మూలంగా అత్యాచారాలకు పాల్పడేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని కూడా భావించలేం. ఎందుకంటే కామంతో కళ్లు మూసుకుపోయిన వాడికి భయం కానీ, సిగ్గు, ఎగ్గూ కానీ ఉండవని గమనించాలి. తాము చేసే పని మూలంగా తమకు మరణదండన పడుతుందనే భయం కామంతో కళ్లుమూసుకుపోయినవాడు క్షణకాలం గ్రహించే అవకాశాలు అంతగా లేవనే చెప్పాలి. అయితే వయస్సుతో సంబం ధంలేకుండా అత్యాచారానికి పాల్పడి వికృతంగా స్త్రీలను చంపేవా రిన ఎంత కఠినంగానైనా శిక్షించాల్సిందే అందులో బేధాభిప్రా యమే లేదు. అలాగే ముద్దాయిలను ఎంత కఠినంగా శిక్షించాల్సిన అవసరముందో,వారు అలా మానవ మృగాలుగా మారడానికి పురి గొల్పిన పరిస్థితులపై కూడా అంతకంటే కఠినంగా వ్యవహరించిన నాడే స్త్రీలపై జరిగే ఆకృత్యాలను సరైన రీతిలో అరికట్టగలం. ప్రపంచం గుప్పిట్లోకి వచ్చేసి అన్ని అవసరాలను తీర్చేసే స్మార్ట్‌ ఫోన్‌, ఇంటర్నెట్‌ సేవలు మానవాళి రోజువారీ తప్పనిసరి పనుల లో ఇతరులతో సమాచారం అనుసంధానంలో, క్షణాల్లో ఏ విష యాన్ని తెలుసుకోవాలన్నా సహకారం అందించడంలో, విజ్ఞానం పొందడం, తెలియని విషయాన్ని గూర్చి నేర్చుకోవడంలో అన్నిం టికీ ఉపయోగపడుతూ వస్తున్న స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుత సమాజంలో తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట లేకపోయినప్పటికీ చేతిలో ఇంటర్నెట్‌ కలిగిన స్మార్ట్‌ఫోన్‌ మాత్రం తప్పనిసరైంది. అయితే చవకైన స్మార్ట్‌ఫోన్లవల్ల మానవాళికి ఎంతలాభం ఉంటుందో అంత కంటే ఎక్కువ నష్టాలుకూడా ఉన్నాయనడంలో సందేహం లేదు. ప్రపంచాన్ని గుప్పిట్లోఉంచే స్మార్ట్‌ఫోన్‌ పోర్న్‌(బూతు)వీడియోలను కూడా అరచేతిలోనే అందిస్తుంది. గతంలో ఒక బూతు వీడియో (బ్లూఫిలిం)ను చూసేవారు చట్టందృష్టిలో నేరస్తులుగా పరిగణించి అరెస్టులుకూడా జరిగేవి.కానీ కాలంమారి చవకైన ఇంటర్నెట్‌ బాలె న్స్‌తో అరచేతిలో స్మార్ట్‌ఫోన్‌ వచ్చేసరికి బూతువీడియోలు కూడా అరచేతిలోకి వచ్చేసి చిన్న,పెద్ద తేడా లేకుండా బూతు వీడియోల ను వీక్షించి ఆ ప్రభావంతో బయటి సమాజంలో కనిపించే స్త్రీలను అదే ధోరణిలో చూడడం మరిన్ని అనర్థాలకు తావిస్తోంది.
సినిమా ప్రభావం సమాజంలో ప్రతి మనిషి జీవన గమనాన్ని ప్రభావితం చేయగలిగే ప్రభావవంతమైన వినోదాత్మక సాధనం సినిమా అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమ అభిమాన హీరో, హీరోయిన్‌ల హావభావాలు, డ్రెస్సింగ్‌ స్టయిల్‌, నడక, నడత అన్నీ కూడా యువతపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆ ప్రభావం ఆనాటి ఎన్టీఆర్‌ కాలం నుండి ఇప్పటి తరం సినిమాతారల వరకు కొనసాగుతూనే వస్తోంది. అయితే పాత సినిమాలలో పాటించిన విలువలు ప్రస్తుత తరం దర్శకులు కానీ, హీరోలు కానీ పాటించ డం లేదనేది కాదనలేని వాస్తవం. అట్టడుగు స్థాయి ప్రేక్షకులు ముఖ్యంగా యువత సినిమా ప్రభావంతో ఒంటరి మహిళలపై అత్యాచారాలకు పాల్పడే స్థాయికి దిగజారేలా పురిగొల్పుతున్నాయి నేటితరం సినిమాలు. ఫలితంగా శిక్షార్హులవ్ఞతూ తమను కన్న తల్లిదండ్రులు సిగ్గుతో తలదించుకునే విధంగా, మరణశిక్షల పాల వ్ఞతున్నారు. సమాజానికి మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు చేయకూడదు. వీలైతే సినిమా ద్వారా ప్రేక్షకులకు ఆరోగ్యక రమైన వినోదాన్ని అందిస్తూనే సమాజానికి మంచి చేసే విధంగా సినిమాలు రావాలి. సినిమా ద్వారా సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలపై సమరం చేసిన దర్శకుల లోటు ప్రస్తుత తరం సిని మా పరిశ్రమలో ఎక్కువగా కనిపిస్తోంది. ఒక సాధారణ పౌరుని కంటే కూడా ఒక సినిమా ద్వారా లక్షల మంది యువతను ప్రభా వితం చేసే సినిమా దర్శకులకు, హీరోలకు సామాజిక బాధ్యత అధికంగా ఉందని గమనించి సినిమాలు తీస్తే సమాజానికి ఉపయోగకరంగా ఉంటుంది.
విచ్చలవిడిగా లభిస్తున్న మద్యం యువత మార్గాన్ని పెడదోవ పట్టించే మరో అంశం లిక్కర్‌, డ్రగ్స్‌.ముఖ్యమైన కొన్ని జిల్లా కేంద్రాల్లో తినడానికి తిండి, కట్టడా నికి బట్టలోటు ఉంది.కానీ తాగడానికి లిక్కర్‌కు మాత్రం కొదవ లేదు.లిక్కర్‌ షాపులలో మైనర్‌ బాలురుకు సైతం లిక్కర్‌ అమ్మ కాలు జరుగుతూనే ఉన్నాయి.ఇక డ్రగ్స్‌ విషయానికొస్తే బహిరంగ రహస్యంగా డ్రగ్స్‌అమ్మకాలు జరుగుతూనే ఉన్నాయి. డ్రగ్స్‌ కొను క్కోలేని లోక్లాస్‌ యువత డ్రగ్స్‌ సంబంధిత వైట్‌నర్‌లను పీలుస్తూ డ్రగ్స్‌ మాదిరి ప్రభావానికి లోనవ్ఞతున్నారు. సమాజంలో జరిగే విపరీత ఆకృత్యాలకు నగరాలలో విరివిగా లభించే డ్రగ్స్‌, లిక్కర్‌ లు కూడా ప్రధానమైన కారణాలలో ఒకటిగా నిలుస్తున్నాయి.
పోరాడేతత్వం పైకి చూస్తే మగాళ్లతో మేము సమానమే నినాదాలు చేస్తున్నా రు కానీ సమయం వస్తే మానవ మృగాళ్లతో పోరాడి గెలిచే పోరా టతత్వాన్ని, ధైర్యాన్ని పెంపొందించుకుని, ఒంటరి సమయాలలో ధైర్యంగా తిరిగే తత్వాన్ని స్త్రీలు ఒంటబట్టించుకున్నట్టు లేరు. మగాళ్లతో సమానం అనే భావన మాటలకే పరిమితం కాకుండా కీచకుల నుండి రక్షణకోసం శ్రీకృష్ణుని సహాయాన్ని అర్థించే ద్రౌప తిలా కాకుండా తమకు ఆపదవస్తే తమను తామే రక్షించుకోవడా నికి తమవద్ద ఆయుధాలను కలిగిఉండి పోరాడేతత్వాన్ని, మానవ మృగాలకు బుద్ధి చెప్పేపోరాట పటిమను నేటిస్త్రీలు కలిగి ఉండ డం తప్పనిసరి.అర్థరాత్రి ఒంటరి మహిళ స్వేచ్ఛగా తిరిగిన రోజే ఈ దేశానికి నిజమైన స్వాతంత్య్రం లభించినట్టని మహాత్మాగాంధీ చెప్పిన మాటలను నిజంచేసే బాధ్యత స్త్రీలపై, ఎన్నిఅఘాయిత్యా లు జరిగిన సరైనరీతిలో స్పందించని ప్రభుత్వాల మీద,పోలీసుల మీద ఉంది.అలాగే ఆడపిల్లలకు పాఠశాలల్లో సెల్ఫ్‌ కాన్ఫిడెన్స్‌, సెల్ఫ్‌ డిఫెన్స్‌లలో తర్ఫీదు తప్పనిసరి చేయాల్సిన అవసరం ఉంది. ఏదైన ఆపద వస్తే ఇతరులను చేతులు జోడించి మొక్కడం కాదు పిడికిలి బిగించి కొట్టడం నేర్చుకోవాలి నేటితరం స్త్రీలు. -శ్రీనివాస్‌ గుండోజు

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: